కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల కోసం రూ.10 లక్షల PM కేర్స్ ఫండ్ ను ప్రకటించిన ప్రధాని మోడీ
కోవిడ్-19 కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ చర్యలను ప్రకటించారు. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు లేదా జీవించి ఉన్న తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలందరికీ PM-కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద మద్దతు ఇవ్వబడుతుంది. సంక్షేమ పథకం వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
పిల్లల పేరిట ఫిక్సిడ్ డిపాజిట్
- ప్రభుత్వం “పిఎం-కేర్స్ ఫర్ చిల్డ్రన్” పథకాన్ని ప్రకటించింది, దీని కింద పి.ఎం-కేర్స్ ఫండ్ నుండి అటువంటి పిల్లల పేర్లలో ఫిక్సిడ్ డిపాజిట్లు తెరవబడతాయి.
- ఫండ్ యొక్క మొత్తం కార్పస్ ప్రతి పిల్లలకు రూ.10 లక్షలు.
- పిల్లల వయస్సు 18 ఏళ్ళకు చేరుకున్నప్పుడు నెలవారీ ఆర్థిక మద్దతు/స్టైపెండ్ ఇవ్వడానికి, తరువాత ఐదు సంవత్సరాలపాటు అతడి లేదా ఆమె వ్యక్తిగత అవసరాలను చూసుకోవడానికి ఈ కార్పస్ ఉపయోగ పడుతుంది.
- 23 సంవత్సరాల వయస్సుకు చేరుకున్న తరువాత, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ఉపయోగం కొరకు పిల్లలు కార్పస్ మొత్తాన్ని ఒకేసారి పొందుతారు.
విద్య
- 10 సంవత్సరాల లోపు పిల్లలకు సమీప కేంద్రీయ విద్యాలయలలో లేదా ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశం ఇవ్వబడుతుంది.
- 11-18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు సైనిక్ స్కూల్ మరియు నవోదయ విద్యాలయ వంటి ఏదైనా కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశం కల్పించబడుతుంది.
- ఉన్నత విద్య కొరకు, ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం భారతదేశంలో ప్రొఫెషనల్ కోర్సులు లేదా ఉన్నత విద్య కొరకు విద్యా రుణాన్ని పొందడంలో పిల్లలకు సాయం అందించబడుతుంది. ఈ రుణంపై వడ్డీని పి.ఎమ్-కేర్స్ ఫండ్ నుంచి చెల్లిస్తారు.
ఆరోగ్య బీమా
- ప్రతి పిల్లలని ఆయుష్మాన్ భారత్ పథకం (PM-JAY) కింద రూ .5 లక్షల ఆరోగ్య బీమాతో లబ్ధిదారునిగా నమోదు చేస్తారు.
- ఈ పిల్లలకు ప్రీమియం మొత్తాన్ని 18 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు PM CARES చెల్లిస్తుంది.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
29 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి