Telugu govt jobs   »   State GK   »   Telangana Movement
Top Performing

Telangana Movement- Political and Ideological Efforts, Download PDF | రాజకీయ మరియు సిద్ధాంతపరమైన ప్రయత్నాలు

తెలంగాణ ఉద్యమం – రాజకీయ మరియు సిద్ధాంతపరమైన ప్రయత్నాలు

తెలంగాణ ఉద్యమం భారతదేశంలో ముందుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాన్ని సూచిస్తుంది. కొన్ని సంవత్సరాల శాంతియుత మరియు ప్రభావవంతమైన నిరసనల తరువాత, యుపిఎ ప్రభుత్వం జూలై 2013లో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది మరియు ఫిబ్రవరి 2014లో పార్లమెంటు ఉభయ సభలలో రాష్ట్ర హోదా బిల్లును ఆమోదించడం ద్వారా ప్రక్రియను ముగించింది. 2014 ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 119 స్థానాలకు గానూ 63 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న  అవతరించింది.

TS Police SI Mains Answer Key 2023 Out, Download Answer Key PDF_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

రాజకీయ మరియు సిద్ధాంతపరమైన ప్రయత్నాలు

తెలంగాణా పార్టీ:

  • 1984 సంవత్సరంలో దేవానంద స్వామి అనే ప్రత్యేక తెలంగాణా వాది వరంగల్ లో తెలంగాణ పార్టీని స్థాపించారు
  • 1984 నుండి కొంతకాలం వరకు ప్రత్యేక తెలంగాణవాదంను ప్రచారంలో ఉంచగలిగారు.

తెలంగాణ పోరాట (సంఘర్పణ) సమితి: 

  • ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు 1989లో తెలంగాణ పోరాట సమితిని ఏర్పరచినవారు- మేచినేని కిషన్‌రావ్, కోహెడ ప్రభాకర రెడ్డి, కె.ఆర్. ఆమోస్
  • తెలంగాణ పోరాట సమితి ద్వారా కొంతకాలం పాటు ప్రత్యేక తెలంగాణ కోసం వీరు కార్యక్రమాలను నిర్వహించారు.

తెలంగాణ ఫోరం

  • 1991-92లలో వెలిచాల జగపతిరావు వెల్లడించిన నివేదిక వలన తెలంగాణవాదులలో కొంత స్పందన వచ్చింది.
  • దాంతో అప్పుడప్పుడే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన జానారెడ్డి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు.
  • దీంతో తెలంగాణలోని వివిధ పార్టీల శాసనసభ్యులు కలిసి తెలంగాణ ఫోరం ఏర్పరచుకొని దానికి కన్వీనర్‌గా జానారెడ్డిని ఎన్నుకున్నారు.
  • ఈ ఫోరం ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి వర్గం తెలంగాణకు జరిగిన అన్యాయాలపై 1992 సెప్టెంబర్ లో ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్ధనరెడ్డికు వినతి పత్రాలు సమర్పించారు.
  • కానీ ఇంతలో నేదురమల్లి జనార్ధనరెడ్డిని ముఖ్యమంత్రిగా తప్పించి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టాన వర్గం నియమించింది.
  • ఈ కొత్త ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మంత్రిపదవి లభించడంతో జానారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం నుంచి తప్పుకున్నారు.

జై తెలంగాణ పార్టీ 

  • 1996 వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి తరువాతి కాలంలో ఎన్.టి.ఆర్ తెలుగుదేశం (లక్ష్మీపార్వతి పార్టీ) పార్టీ లో చేరిన నాయకుడు – పటోళ్ళ ఇంద్రారెడ్డి
  • ఇతను 1997లో జై తెలంగాణా పార్టీని ఏర్పాటు చేశారు.
  • ఈ పార్టీ తరపున తెలంగాణలో విజయయాత్రలు నిర్వహించి ప్రజలలో చైతన్యం తేవడంలో ఇతనికి సహకరించిన మేధావి వర్గం  కొండా మాధవరెడ్డి (రిటైర్డ్ న్యాయమూర్తి), జయశంకర్ సారు
  • ఇతను ఎవరిమాటలు వినకుండా తన అనుచరులనే అన్ని పదవులలో నియమించడం వల్ల ఇతనికి, సహకరించిన వారందరూ దూరమయ్యారు.
  • దాంతో అప్పటి పి.సి.సి అధ్యక్షుడు డాక్టర్ వై. యస్.ఆర్ ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు

రాష్ట్ర శాసనసభలో తెలంగాణపై సుదీర్ఘ చర్చ

  • 1997 ఫిబ్రవరిలో తెలంగాణ అంశంపై శాసనసభ సుదీర్ఘ చర్చ చేసింది.
  • ఈ చర్చలో తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను శాసనసభ్యులు జీవన్‌రెడ్డి గణాంకాలతో సహా వివరించి ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది.
  • ఇతనితో పాటు ఇతర ప్రతిపక్షాల శాసనసభ్యులు తెలంగాణకు జరిగిన అన్యాయాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
  • వీరందరి ప్రసంగం అనంతరం వీరడిగిన ప్రశ్నలకు చంద్రబాబునాయుడు పొంతన కుదరని సమాధానాలిచ్చి తన ప్రసంగం చివరిలో జై తెలుగుదేశం, జై హింద్ అంటూ ముగించారు

ప్రధాని దేవేగౌడ ప్రకటన:

  • సంకీర్ణ రాజకీయాల యుగం కాలంలో 1996 లోకసభ ఎన్నికల అనంతరం అనేక సంకీర్ణ పార్టీలతో కలిసి కేంద్రంలో దేవేగౌడ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.
  • ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి దేవేగౌడ ఉత్తరప్రదేశ్ ను విభజించి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచడానికి కేంద్రప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని చిన్న రాష్ట్రాల ఏర్పాటు పట్ల తన సానుకూల ధోరణిని ప్రకటించారు

ప్రణయ్ భాస్కర్ రాజీనామా

  • 1996-97 నుండి ప్రత్యేక తెలంగాణ నినాదం విస్తృతం కావడంలో తెలంగాణ యువకులు ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారు అనడంలో ఎవరికీ అనుమానం లేదు.
  • ఇటువంటి సమయంలో శాసనసభలో తెలుగుదేశ శాసనసభ్యుడు అయిన ప్రణయభాస్కర్ (వరంగల్) తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రస్తావించారు .
  • ఈ శాసనసభలో స్పీకర్‌గా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడు తెలంగాణ అనే పదం వాడకూడదు దాని స్థానంలో వెనుకబడిన ప్రాంతం అని పేర్కొనాలని రూలింగ్ ఇచ్చారు
  • దీంతో మనస్తాపానికి గురైన ప్రణయ్ భాస్కర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉపసంహరించుకున్నారు.
  • దాంతో తమకు జరిగిన నష్టం గురించి తోటివారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఎంతో పరిశోధన చేసి అన్యాయాలను వెలికితీసి వాటిని ముద్రించడం జరిగింది.
  • ఆవిధంగా ముద్రించబడిన వాటిలో గాదె ఇన్నయ్య నాయకత్వంలో ముద్రించబడిన దగాపడ్డ తెలంగాణ సంక్షిప్త వివరాలు అనే గ్రంథం ఎంతో ముఖ్యమైనది.

తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం – చిన్నారెడ్డి

  • చిన్నారెడ్డి తెలంగాణ పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను ఒక్కతాటిపైకి తెచ్చారు. 
  • చిన్నారెడ్డి కన్వీనర్‌గా “తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం” ఏర్పాటు అయ్యింది.
  • 2000 ఆగస్టు 11న సోనియాగాంధీ హైదరాబాదు వచ్చారు. చిన్నారెడ్డి నాయకత్వంలో 41 మంది ఎమ్మెల్యేలు (38 మంది ఎమ్.ఎల్.ఏల సంతకాలతో) తెలంగాణకు అనుకూలంగా సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారు.
  • 2004 ఎన్నికలలో వనపర్తి నియోజకవర్గం నుండి ఎన్నికలలో గెలిచిన చిన్నారెడ్డి వై.ఎస్.ఆర్. మంత్రివర్గంలో చేరాడు. దాంతో తెలంగాణ ఉద్యమానికి దూరమయ్యారు.

Political and Ideological Efforts PDF

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్ 

adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana Movement- Political and Ideological Efforts, Download PDF_5.1

FAQs

When is Telangana formation day?

Telangana is Formation on June 2, 2014

Who fought for Telangana formation?

Chenna Reddy, founded the Telangana Praja Samithi(TPS) political party in 1969 which intensified the movement.

What was the reason for the separate Telangana state movement?

Non-implementation of Gentlemen's Agreement and continued discrimination to Telangana region in government jobs, education and public spending resulted in the 1969 statehood agitation. In January 1969, students intensified the protests for a separate state.

What is the Telangana movement?

The Telangana movement refers to the prolonged agitation and demand for a separate state of Telangana within the larger state of Andhra Pradesh in India.