భారతదేశంలో పేదరికం
భారత దేశంలో పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం ప్రధాన ఆర్థిక, సాంఘిక సమస్యలు. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. 20వ శతాబ్దపు మధ్య కాలం నుంచి ఈ సమస్యలు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారాయి. అన్నింటిలోకెల్లా పేదరికం తీవ్రమైన సమస్య. గత కొన్ని దశాబ్దాలుగా పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ అనేక ప్రణాళికలు రూపొందిస్తూ చర్యలు చేపడుతున్నాయి
సమాజంలోని ప్రజలు తమ మనుగడకు అవసరమైన కనీస అవసరాల (ఆహారం, వస్త్రాలు, గృహవసతి) ను పొందలేని స్థితిలో ఉంటే, ఆ స్థితిని పేదరికం అంటారు. ఆ భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పేదరికమే ముఖ్యమైంది. ఇందులో భారత్ లాంటి దేశాల్లో కనిపించేది నిరపేక్ష పేదరికం. రెండు రకాల భావనలను పరిశీలిస్తే:
పేదరికంలోని రకాలు
నిరపేక్ష పేదరికం
కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. ప్రజలకు కావలసిన కనీస అవసర వస్తువుల పరిమాణాన్ని నిర్ణయించి, దాన్ని కనీస ద్రవ్యరూప తలసరి వినియోగం నిర్ణయిస్తారు. ఈ తలసరి కనీస ద్రవ్య రూప వినియోగ స్థాయి కంటే తక్కువ ఉన్న జనాభాను నిరపేక్ష పేదవారు అంటారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపించే పేదరికం నిరపేక్ష పేదరికం. పేదరికపు సమస్యను పరిశీలించేటప్పుడు నిరపేక్ష పేదరికాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
సాపేక్ష పేదరికం (రిలేటివ్ పావర్టీ)
జనాభాను వివిధ ఆదాయ వర్గాలుగా విభజించి అత్యధిక ఆదాయం పొందే 5% నుంచి 10% ప్రజల జీవనస్థాయితో అతి తక్కువ ఆదాయం పొందే అట్టడుగు 5% నుంచి 10% ప్రజల స్థాయిని పోల్చి పేదరికాన్ని నిర్ణయిస్తారు. సాపేక్ష పేదరికం ద్వారా ఆర్థిక అసమానతలను లెక్కించవచ్చు. ఈ భావనను సంపన్న దేశాల్లో అధికంగా ఉపయోగిస్తారు.
దారిద్ర్య రేఖ (పావర్టీ లైస్)
కనీస వినియోగ స్థాయి లేదా తలసరి నెలసరి కనీస వినియోగ వ్యయాన్ని చేయగల ఆదాయస్థాయిని తెలిపే రేఖను దారిద్య్ర రేఖ లేదా పేదరికపు రేఖ అంటారు. ప్రణాళికా సంఘం ప్రకారం ఆహార వస్తు వినియోగాన్ని క్యాలరీల రూపంలో లెక్కిస్తారు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు ప్రతి వ్యక్తికి సగటున అవసరమయ్యే క్యాలరీలు 2400. పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు.
Adda247 APP
పేదరికాన్ని కొలిచే పద్ధతులు
తలల లెక్కింపు పద్ధతి (హెచ్సీఆర్ – హెడ్ కౌంట్ రేషియో)
భారతదేశంలో పేదరికంలో ఉన్న జనాభాను లెక్కించడానికి సాధారణంగా తలల లెక్కింపు పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా మొత్తం జనాభాలో పేద ప్రజల శాతం ఎంత అనే విషయం తెలుస్తుంది. దీన్ని కింది సమీకరణం ద్వారా తెలుసుకోవచ్చు.
- H=q/n100
- H- తలల లెక్కింపు
- q- పేదరికంలో ఉన్న ప్రజలు
- n- మొత్తం జనాభా
పేదరిక వ్యత్యాస సూచి
- పేదరిక తీవ్రతను, పేదల్లో ఉండే అంతరాలను తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు.
- పేదరికం వ్యత్యాసం = పేదరికపు రేఖ – పేదవాడి సగటు వినియోగ వ్యయం / పేదరికపు రేఖ
సేన్స్ పేదరిక సూచి
సంక్షేమ ఆర్థికవేత్త అమర్త్యకుమార్ సేన్ దీన్ని అభివృద్ధి చేశారు. పేదరిక రేఖకు దగ్గరగా ఉన్న వారిని పైకి తీసుకొచ్చేకంటే, పేదరిక రేఖకు దూరంగా ఉన్న వారిని పైకి తీసుకురావడం వల్ల సమాజ సంక్షేమం ఎక్కువగా పెరుగుతుందని సేన్ అభిప్రాయ పడ్డారు.
బహు పార్శ్వపు పేదరిక సూచి (ఎంపీఐ- మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్)
బహు పార్శ్వపు పేదరిక సూచి (ఎంపీఐ- మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్) 2010 మానవ అభివృద్ధి నివేదిక, మానవ పేదరిక సూచి (హెచీపీఐ-1997) స్థానంలో ఎంపీఐను ప్రవేశపెట్టింది. ఈ సూచి మూడు అంశాలతో ఉంటుంది. అవి:
1. ఆయుర్దాయం
2. అక్షరాస్యత
3. జీవన ప్రమాణం
భారత్లో పేదరికం అంచనాలు
మన దేశంలో నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఎ) ప్రతి 5 ఏళ్లకోసారి పేదరికాన్ని అంచనా వేస్తుంది. ఈ అంచనాలను ప్రణాళిక సంఘం (దీని స్థానంలో కొత్తగా నీతి ఆయోగ్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అధికారికంగా ప్రకటిస్తుంది). భారత్ లో స్వాతంత్ర్యానికి పూర్వం పేదరికాన్ని అంచనా వేసింది దాదాభాయ్ నౌరోజీ.
SSO పేదరికపు అంచనాలు
2011-12 ఏడాది పేదరిక అంచనాలను ఎన్ఎస్ఎస్వో (68వ రౌండ్) 2013, జులై 22న ప్రకటించింది. దీని ప్రకారం 2011-12లో మొత్తం జనాభాలో 21.9 శాతం ప్రజలు దారిద్య రేఖకు దిగువన ఉన్నారు. ఇందులో గ్రామీణ పేదల శాతం 25.7, పట్టణ పేదల శాతం 13.7.
పేదరిక నిర్మూలన చర్యలు
- స్వల్పకాలిక చర్యలు: వివిధ పేదరిక నిర్మూలన పథకాల అమలు.
- మధ్యకాలిక చర్యలు: స్వయం సహాయక బృందాల ద్వారా పేదరికాన్ని తగ్గించడం.
- దీర్ఘకాలిక చర్యలు: జనాభా తగ్గించడం, వృద్ధి వేగవంతం చేయడం, ఆదాయ అసమానతలు తగ్గించడం, భూసంస్కరణల అమలు, గ్రామీణ పారిశ్రామికీకరణ.
పేదరికం పెరగడానికి కారణాలు
- తక్కువ తలసరి ఆదాయం
- అల్పోద్యోగిత
- నిరుద్యోగిత
- ప్రచ్ఛన్న నిరుద్యోగిత
- అధిక జనాభా
- వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ
- ఆర్థిక అసమానతలు
- వనరుల అల్ప వినియోగం
- అల్ప వేతనాలు
- శ్రామిక వర్గానికి వనరులపై యాజమాన్యం లేకపోవడం.
RBI యొక్క ఆర్థిక స్థిరత్వ నివేదిక
ట్రికిల్ డౌస్ సిద్ధాంతం
ప్రపంచవ్యాప్తంగా 1970కు పూర్వం ఆర్థికవేత్తలు ‘ట్రికిల్ డౌన్ సిద్ధాంతం’ను విశ్వసించారు. వృద్ధి జరిగితే తలసరి ఆదాయం పెరిగి అది కింది స్థాయికి ప్రవహించి పేదరికం దానంతట అదే తగ్గుతుందని తెలిపేదే ట్రికిల్ డౌన్ సిద్ధాంతం. 1970 నాటికి వృద్ధి జరిగింది కాని పేదరికం తగ్గలేదు. అంటే పేదరికాన్ని తగ్గించడంలో ఈ సిద్ధాంతం ఉపయోగపడలేదు. అందువల్ల పేదరికాన్ని తగ్గించేందుకు ప్రత్యక్షంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు భావించారు.
ఫలితంగా 1970 దశకం నుంచి భారతదేశంలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ఇవన్నీ పేదరిక నిర్మూలనకు ఉద్దేశించినప్పటికీ వీటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు.
Steps to Eliminate Poverty |పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు
- ఇంటిగ్రేటెడ్ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం (IRDP) 2. జవహర్ రోజ్‌గర్ యోజన/జవహర్ గ్రామ సమృద్ధి యోజన
- గ్రామీణ హౌసింగ్ – ఇందిరా ఆవాస్ యోజన
- పని కోసం ఆహారం కార్యక్రమం
- జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (NOAPS)
- అన్నపూర్ణ పథకం
- సంపూర్ణ గ్రామీణ రోజ్‌గర్ యోజన (SGRY)
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) 2005
- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్: ఆజీవిక (2011)
- జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్
- ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన
- ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
భారతదేశంలో ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ కార్యక్రమాలు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఉపాధి కల్పన కోసం భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు:
- నెహ్రూ రోజ్‌గర్ యోజన
- పని కోసం జాతీయ ఆహారం
- స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణ
- జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం
- గ్రామీణ భూమిలేని వారికీ ఉపాధి హామీ కార్యక్రమం
- జవహర్ రోజ్‌గర్ యోజన
- గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం
- చదువుకున్న నిరుద్యోగ యువత కోసం ప్రధాన మంత్రి రోజ్‌గర్ యోజన
- స్వర్ణ జయంతి షహరి రోజ్‌గర్ యోజన
- స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గర్ యోజన
- సంపూర్ణ గ్రామీణ రోజ్‌గర్ యోజన
- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
- ఉపాధి హామీ పథకం
- దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన
- దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (DAY -NULM)
- ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY)