Prakasam Barrage gets global recognition | ప్రకాశం బ్యారేజ్ కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది
నవంబర్ 2 నుండి 8 వరకు విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ICID కాంగ్రెస్ 25వ సదస్సు లో ప్రకాశం బ్యారేజీ కి ప్రతిష్టాత్మక WHIS అవార్డు దక్కింది. ఈ అవార్డు విషయం ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (IN CID) డైరెక్టర్ అవంతి వర్మ శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి తెలిపారు.
ప్రకాశం బ్యారేజి కి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది, అంతటి ఈ చారిత్రక కట్టడానికి అంతర్జాతీయ నీటిపారుదల, డ్రైనేజీ కమిషన్ (ICID) వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ (WHIS)గా ప్రకటించడం ఎంతో గర్వకారణం. 2023 సంవత్సరానికి ICID గుర్తించిన ప్రపంచవ్యాప్తంగా 19 నిర్మాణాలకు ఈ అవార్డు అందించింది అందులో ప్రకాశం బ్యారేజీ దీనినే పాత కృష్ణా ఆనకట్ట అని కూడా అంటారు నిలిచింది.
ప్రకాశం బ్యారేజి గురించి
NTR జిల్లాలోని విజయవాడ మరియు గుంటూరు జిల్లాలోని మంగళగిరిని కలుపుతూ కృష్ణా నదిపై 1223.5 మీటర్లు విస్తరించి ఉంది. రహదారి వంతెనగా కూడా పనిచేస్తోంది, బ్యారేజీ నిర్మాణం 1957లో పూర్తయింది మరియు ఇది 1.2 మిలియన్ ఎకరాల భూమికి సాగునీరు అందించడంలో సహాయపడుతుంది. ఇది ప్రారంభంలో ఇన్‌ల్యాండ్ నావిగేషన్ కెనాల్‌గా నిర్మించిన బకింగ్‌హామ్ కెనాల్‌కు కూడా నీటిని సరఫరా చేస్తుంది.
WHIS అవార్డుల గురించి
ICID 1950 జూన్ 24న ఏర్పాటైంది, ఇది పురాతన కాలం లో నిర్మించి ఇప్పటి వినియోగం లో ఉన్న ఆనకట్టాలను గుర్తించి వాటికి WHIS అవార్డు లను ప్రధానం చేస్తుంది. 2022 వరకు, భారతదేశం మొత్తం 14 WHIS అవార్డులను అందుకుంది, వీటిలో ఆంధ్రప్రదేశ్ కు నాలుగు అవార్డులు లభించగా వాటిలో కంబమ్ ట్యాంక్ (2020), KC కెనాల్ (2020), పోరుమామిళ్ల ట్యాంక్ (2020), మరియు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ (2022) ఉన్నాయి.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |