Telugu govt jobs   »   Preparation Tips for Government Exams
Top Performing

Preparation Tips for Government Exams | పోటీ పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి మెలకువలు

ఇటీవల TSPSC TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ & మెయిన్స్, TSPSC గ్రూప్ 2, TSPSC గ్రూప్ 3, DAO, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, TS DSC 2024 కోసం పరీక్ష తేదీలను విడుదల చేసింది మరియు RRB ALP, SSC GD,  గ్రామ సచివాలయం, APPSC గ్రూప్ 2 మెయిన్స్, APPSC గ్రూప్ 1, EMRS, RRB అసిస్టెంట్, IBPS, SBI, UPSC EPFO, ESCI మరియు  ఇతర రాష్ట్ర మరియు సెంట్రల్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్ధులు ఒక పరీక్షలో విజయం సాధించాలి అంటే ఒక విద్యార్ధి ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిపై కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం పరీక్ష జరుగుతున్నపుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవడం.  ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు పరీక్షల ముందు ఉండే సమయం ఎంతో విలువైంది. సబ్జెక్టులవారీగా టైమ్‌టేబుల్‌ వేసుకోవడం, మునపటి సంవత్సరం ప్రశ్నపత్రం విషయంలో అవగాహన పెంచుకోవడం, ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను రాయడం లాంటివి చేస్తూ అభ్యర్థులు సమయాన్ని సద్వినియోగ పరచుకుంటారు. అలాగే పరీక్షలు జరుగుతున్నప్పుడు సమయం వృథా కాకుండా ఉండటానికి ఏమి చేయాలో ఈ కథనంలో చదవండి.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

పోటీ పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి మెలకువలు

  • ముందుగా పరీక్ష హాలులో ప్రశ్నపత్రం తీసుకోగానే మొత్తం ప్రశ్నలన్నింటినీ ఒకసారి చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల మార్కులపరంగా వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ ప్రశ్న కు ఎంత సమయం కేటాయించాలి అనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది.
  • పరీక్ష మొదలైన మొదటి 5 నుంచి 10 నిమిషాల సమయాన్ని ప్రశ్నపత్రం క్షుణ్ణంగా చదవడానికీ, ఏయే ప్రశ్నలకు సమాధానాలు రాయాలో నిర్ణయించుకోవడానికీ వినియోగించాలి.
  • గతంలో జరిగిన TSPSC Group 1 Prelims, APPSC Group 2 Prelims పరీక్ష పేపర్లను గమనిస్తే కొన్ని ప్రశ్నలు క్లుప్తంగా ఉన్నాయి, మరికొన్ని పెద్దగా నేరుగా ప్రశ్నించకుండా  పెద్ద పెద్ద పేరాలతో ఉన్నాయి. ఇలాంటి వాటిని అర్థం చేసుకోవాలంటే ప్రశ్నను పూర్తిగా ఒకటికి రెండుసార్లు చదవాలి. సగం వరకే చదివి మీకు తెలిసిన సమాధానం రాసేయాలని తొందరపడకూడదు.
  • కొందరు అభ్యర్థులు క్లిష్టంగా ఉండే ప్రశ్నలకు మొదట్లోనే సమాధానాలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఇది అంత సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ విధానంలో ప్రశ్నలను క్షుణ్ణంగా చదవడానికీ ఎక్కువ సమయం సమయం పడుతుంది. ముందుగా బాగా తెలిసిన ప్రశ్నలను సమాధానాలు రాయాడం ప్రారంభిస్తే సమయం ఆదా అవుతుంది మరియు  ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.  అదే ఆత్మవిశ్వాసంతో క్లిష్టంగా  ఉండే ప్రశ్నలకు సమాధానాలను రాయవచ్చు.
  • పరీక్ష పూర్తయిన తర్వాత వెంటనే పరీక్ష హాలు నుంచి బయటికి వెళ్లిపోవాలని అనుకోకూడదు. ఒకటికి రెండుసార్లు అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. సమయం మించి పోతుందనే తొందరలో కొన్ని ప్రశ్నలను వదిలివేసే అవకాశం ఉంటుంది కాబట్టి, చివరిలో అన్నీ ప్రశ్నలకు సమాధానం రాశారో లేదో తనిఖీ చేయాలి. అప్పుడు ఏమైనా పొరపాట్లు దొర్లినా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.
  •  OMR ఆధారిత పరీక్షలో ఒక్కసారి తప్పుగా ఆన్సర్ చేస్తే.. మళ్ళీ సరిచేసే అవకాశం ఉండదు కాబట్టి చాలా జాగ్రతగా సమాధానం రాయాలి. CBRTఆధారిత పరీక్షలో, మీరు ప్రశ్నను తప్పుగా అర్థంచేసుకుని వేరే సమాధానం గుర్తించారు అనుకుందాం, అప్పుడు కంగారు పడకుండా జాగ్రతగా ప్రశ్న చదివి పరీక్ష పూర్తి అయ్యేలోపు తిరిగి ప్రయతించవచ్చు.
  • చివర్లో ఇలా ఒకసారి సమాధానాలను సరిచూసుకుంటే.. అవసరమైన మార్పులు చేసుకోవడానికీ అవకాశం ఉంటుంది.
  • ఏదైనా పరీక్షకు హాజరైన తర్వాత గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పరీక్ష హాలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత మీరు రాసిన సమాధానాల్లో చాలావరకూ తప్పులే ఉన్నాయని అనిపించవచ్చు. దాంతో నిరుత్సాహపడకుండా, మీరు రాసిన పరీక్ష యొక్క తర్వాతి దశకు సన్నద్ధం  అవ్వడం ప్రారంభించండి లేదా వేరే పరీక్షకు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాలి.
  • అంటే జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ జరగాల్సిన దాన్ని నిర్లక్ష్యం చేయడం మంచి పద్దతి కాదు, దీని వలన సమయం వృధా అవుతుంది, మీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.  ఇలా జరగకుండా ఉండాలంటే రాసిన పరీక్ష గురించి ఆలోచించడం మానేయాలి. మీ దృష్టి మొత్తాన్నీ తర్వాత మీరు రాయబోయే పరీక్ష మీదే కేంద్రీకరించాలి. రాయాల్సిన పరీక్ష భవితవ్యం ఇంకా మీ చేతుల్లోనే ఉంది. దాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కాబట్టి జరిగిన పరీక్ష లో మీరు చేసిన తప్పుల నుండి నేర్చుకుంటూ మిగిలిన పరీక్షలకు సన్నద్ధం అవ్వాలి.
  • చేసిన తప్పులను నుండి నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే, ఖచ్చితంగా మీరు విజయం సాదిస్తారు.

pdpCourseImg

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Preparation Tips for Government Exams | పోటీ పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి మెలకువలు_5.1