‘హర్ ఘర్ జల్(ప్రతి ఇంటికి నీరు)’ కలిగిన రాష్ట్రంగా పుదుచ్చేరి
పుదుచ్చేరి జల్ జీవన్ మిషన్ (జెజెఎం) కింద గ్రామీణ ప్రాంతాల్లో 100% పైపుల ద్వారా నీటి సరఫరా చేసే లక్ష్యాన్ని సాధించింది. అంతకుముందు, గోవా, తెలంగాణ మరియు అండమాన్ & నికోబార్ దీవులు జల్ జీవన్ మిషన్ కింద ప్రతి గ్రామీణ ఇంటికి పంపు నీటి సరఫరాను అందించాయి. కాబట్టి, జల్ జీవన్ మిషన్ కింద హామీ ఇచ్చిన ప్రతి గ్రామీణ గృహానికి పంపు నీటి సరఫరాను అందించే నాల్గవ రాష్ట్రం / యుటి గా పుదుచ్చేరి అవతరించినది.
2024 నాటికి ప్రతి గ్రామీణ గృహాలకు సురక్షితమైన పంపు నీటిని అందించడానికి జల్ జీవన్ మిషన్ రాష్ట్రాలు / యుటిల భాగస్వామ్యంతో అమలు చేయబడుతోంది. పంజాబ్ రాష్ట్రం మరియు దాద్రా & నగర్ హవేలి మరియు డామన్ & డియు యొక్క యుటిలు 75% పైగా గ్రామీణ గృహాలు ఖచ్చితమైన నీటి సరఫరాను అందిస్తున్నాయి.
జల్ జీవన్ మిషన్ (జెజెఎం):
- ఇది కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. ఇది 2019 ఆగస్టులో ప్రకటించబడింది.
- 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ గృహాలకు పంపు నీటి కనెక్షన్‌ను అందించడం దీని లక్ష్యం.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- పుదుచ్చేరి ముఖ్యమంత్రి: ఎన్ రంగసామి.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
11 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
11 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి