Telugu govt jobs   »   QS World University Rankings 2022 released...

QS World University Rankings 2022 released | QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 విడుదల

QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 విడుదల

QS World University Rankings 2022 released | QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 విడుదల_2.1

లండన్ కు చెందిన క్వాక్వరెల్లి సైమండ్స్ (QS), QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022ను విడుదల చేసింది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను వివిధ పరామితులపై పోల్చి ర్యాంక్ చేస్తుంది. జూన్ 09, 2021న విడుదలైన QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022లో ఎనిమిది భారతీయ విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ 400 గ్లోబల్ యూనివర్సిటీల్లో చోటు సంపాదించాయి. అయితే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బాంబే, ఐఐటి-ఢిల్లీ, మరియు ఐ.ఐ.ఎస్.సి బెంగళూరు అనే మూడు విశ్వవిద్యాలయాలు మాత్రమే టాప్ 200లో ఉన్నాయి.

టాప్ ఇండియన్ యూనివర్సిటీ

  • ఐఐటి-బాంబే 177 ర్యాంక్ తో భారతదేశంలో అత్యుత్తమ యూనివర్సిటీగా స్థానం పొందింది. దీని తరువాత ఐఐటి-ఢిల్లీ (185), ఐ.ఐ.ఎస్.సి (186) ఉన్నాయి.
  • బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి) కూడా “ప్రపంచంలోని అగ్రశ్రేణి పరిశోధనా విశ్వవిద్యాలయంగా నిర్ణయించబడింది, పరిశోధన ప్రభావాన్ని కొలిచే Citations Per Faculty (సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ) (CPF) సూచిక కోసం 100/100 ఖచ్చితమైన స్కోరును సాధించింది.
  • ఏ భారతీయ సంస్థ అయినా పరిశోధనలో లేదా మరే ఇతర పరామీటర్ లో అయినా ఖచ్చితమైన 100 స్కోరును సాధించడం ఇదే మొదటిసారి.

టాప్ యూనివర్సిటీ

  • మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) వరుసగా 10 సంవత్సరాల పాటు ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో నిలిచింది.
  • MIT తరువాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం రెండవ స్థానంలో ఉంది. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మూడవ స్థానాన్ని పంచుకున్నాయి.

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!

QS World University Rankings 2022 released | QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2022 విడుదల_3.1