Telugu govt jobs   »   Study Material   »   Ramappa Temple Telangana
Top Performing

Ramappa Temple In Telangana – Highlights, Architecture and More Details | తెలంగాణలో రామప్ప దేవాలయం – విశేషాలు, వాస్తుశిల్పం మరియు మరిన్ని వివరాలు

Ramappa Temple Telangana:  The Ramappa temple is the right destination for people who admire architectural brilliance and have a panoramic view of true scenic beauty. The temple is situated in Palampet village of the Venkatapur Mandal, in Mulugu District. The temple is named after the sculptor Ramappa, who built it and is perhaps the only temple in India to be named after its craftsman. In this article, we are providing complete details of The Ramappa temple in Telangana. To know more details about The Ramappa temple, please read the article completely.

Ramappa Temple Telangana | రామప్ప ఆలయం పూర్తి వివరాలు

దాదాపు 800 సంవత్సరాల క్రితం వరంగల్(ప్రస్తుతం ములుగు జిల్లా) లోని పాలంపేట ప్రాంతాన్ని కాకతీయ రాజులు పాలించేవారు. ఆ సమయంలో వారు విస్మయపరిచే రామప్ప ఆలయాన్ని నిర్మించారు. మధ్యయుగం నాటి ఈ అద్భుతమైన నిర్మాణం చుట్టూ వివిధ చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. హిందువుల ఆరాధ్య దైవమైన పరమశివుడు సహా ఇతర దేవతా విగ్రహాలను ఈ ఆలయాల్లో పూజిస్తారు. గణపతిదేవ పాలనలో సైన్యాధిపతి రేచర్ల రుద్ర పర్యవేక్షణలో ఈ ఆలయాలను నిర్మించినట్లు కధనం. ఈ ఆలయాలు ఒక మానవ నిర్మిత సరస్సుకు దగ్గర్లో ఉంటాయి. చుట్టుపక్కల వ్యవసాయ భూములకు సాగునీరును అందించేందుకు ఈ సరస్సును నిర్మించారు. ఈ కథనంలో తెలంగాణలోని రామప్ప దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తున్నాము. రామప్ప దేవాలయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే, దయచేసి కథనాన్ని పూర్తిగా చదవండి.

తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022

APPSC/TSPSC Sure shot Selection Group

Ramappa Temple Highlights | విశేషాలు

Ramappa Temple | 39th UNESCO World Heritage Site in India

  • కాకతీయుల రాజధాని వరంగల్‌ (ప్రస్తుతం ములుగు జిల్లా, పాలంపేట గ్రామం)లో కీ.శ.1213లో కాకతీయ గణపతి దేవుడి కాలంలో రేచర్ల రుద్రుడు రామప్ప ఆలయాన్ని నిర్మించారు.
  • ఈ ఆలయంలో రామలింగేశ్వరుడు(ఏకశిల) ప్రధాన దేవుడు. ఆలయ గోపురాన్ని నీటిపై తేలియాడే ఇటుకలతో నిర్మించారు.
  • ఆలయ నిర్మాణానికి నల్ల డోలోమైట్‌, గ్రానైట్‌, శాండ్‌స్టోన్‌ను వినియోగించారు. ఆలయం చుట్టూ ఉన్న మదనికలు కాకతీయ అద్భుత శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలు.
  • ఇప్పటి వరకు తెలంగాణలో హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌కు సాంస్కృతిక, వారసత్వ పరిరక్షణకు సంబంధించి ఆసియా పసిఫిక్‌ హెరిటేజ్‌ మెరిట్‌ అవార్డు లభించింది. తాజాగా ఇప్పుడు రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

Ramappa Temple gets UNESCO World Heritage tag | రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Ramappa Temple History, Highlights, Architecture and More Details_5.1

కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా నిలిచిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌గా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపికవగా. మన దేశం నుంచి 2020 సంవత్సరానికి రామప్పకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లా పాలంపేటలో క్రీ.శ.1213లో నిర్మితమైన అపురూప కట్టడం రామప్ప ఆలయం. శిల్పి రామప్ప పేరుతో ఈకాకతీయ కట్టడం ప్రాచుర్యంలోకి వచ్చింది.

also read:  List of UNESCO World Heritage Sites in India 

History of Ramappa Temple | చరిత్ర 

1213లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో సుమారు 110 సంవత్సరాల పాటు ధూపదీప నైవేద్యాలతో వైభవంగా పూజలు కొనసాగాయి. ముస్లిం రాజుల దండయాత్రతో కాకతీయుల ప్రస్థానం ముగియడంతో సుమారు 550 సంవత్సరాల పాటు ఎలాంటి ఆదరణ లేక చిట్టడవుల్లో, కారుచీకట్లలో కమ్ముకుపోయింది. నిజాం రాజుల దగ్గర పనిచేసే సామంత రాజు ఆసీఫ్‌జాహీల్‌ వేటకు వచ్చిన సమయంలో ఆలయం ఆయన కంట పడింది. 1900లో ఆయన దానిని గుర్తించి దేవాలయం అంచులు పడిపోకుండా సిమెంట్‌ దిమ్మెలను ఏర్పాటు చేయించారు. పరిసరాలను పరిశుభ్రం చేసి వెలుగులోకి తీసుకువచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1951లో పురావస్తు శాఖ దీనిని ఆధీనంలోకి తీసుకుంది. అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సవాల్‌గా తీసుకుని యునెస్కో మెప్పు పొందేలా తీర్చిదిద్దారు. దీంతో ఇప్పుడు ప్రపంచ వారసత్వ హోదా సాధ్యమైంది.

Ramappa Temple Architecture | శిల్పకళ

Ramappa Temple History, Highlights, Architecture and More Details_6.1

ఆశ్చర్యకరంగా ఈ ఆలయానికి ప్రధాన దైవం పేరు కాకుండా దానిని రూపొందించిన శిల్పి రామప్ప స్తపతి పేరు పెట్టడం జరిగింది. దక్షిణ భారతదేశంలో శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఆలయం ఇదే కావడం విశేషం. ఈ ఆలయ సముదాయం లోపల రుద్రేశ్వర ఆలయం ఎన్నో విపత్తులను ఎదుర్కొని నేటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తుంది. దీంతో పాటు ఇక్కడ కటేశ్వర ఆలయం, కామేశ్వర ఆలయం, మొదలగునవి చూడదగినవి. ఈ ఆలయ సముదాయంలో శాసనాలతో కూడిన స్తంభం, భక్తుల కోసం విశ్రాంతి గృహం కూడా ఉంది.

నీటిలో తేలే ఇటుకలు:

పచ్చదనంతో తీర్చిదిద్దబడిన మార్గం గుండా రామప్ప ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణం సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఆలయ నిర్మాణంలో వినియోగించిన ఇటుకలు ఎంతో తేలికగా, నీటిపై కూడా తేలియాడే విధంగా ఉంటాయి. ఈ ఇటుకల నిర్మాణానికి ఆనాడు ఉపయోగించిన సాంకేతికత నిజంగా ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో అద్భుతమైన ఇసుక పెట్టె సాంకేతికతను కూడా వినియోగించారు. పునాదుల్లోని ఖాళీల మధ్య ఇసుకను జోడించడం ద్వారా భూకంపాలు సంభవించినప్పుడు ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా ఇది దోహదపడుతుందని చెబుతారు.

File:13th century Ramappa temple, Rudresvara, Palampet Telangana India - 136.jpg - Wikimedia Commons

ఈ ఆలయంలో గర్భ గృహ (గర్భగుడి), అంతరాళ (గర్భగృహం, మండపానికి కలిపి ఉండే సముదాయం), మహా మండప (ప్రజలు ఆచార క్రతువులు నిర్వహించే వేదిక) ఉన్నాయి. ఈ ఆలయం శిల్పకారుల యొక్క సంపూర్ణ పనితనాన్ని మన కళ్లకు కడుతుంది. ఆనాటి కాలాన్ని సందర్శకులకు పరిచయం చేస్తుంది. గోడల నుంచి స్తంభాల వరకూ ఎక్కడ చూసినా హిందూ పురాణాలకు సంబంధించి అనేక ఘట్టాలను తెలియజేసే రమణీయమైన శిల్పాలు కనిపిస్తాయి. ఇవి ఎన్నో గాధలను తెలియజేస్తాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ నిర్మాణాల్లో ప్రతి అణువు మీకు అద్భుతంగా అనిపిస్తుంది. కాకతీయుల శిల్ప కళాభిమానానికి ఇవి తార్కాణాలు. ఆలయంలో 9 అడుగుల ఎత్తు గల గర్భగుడి లోపల శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగం నుంచి వచ్చే సానుకూల, ఆధ్యాత్మిక తరంగాలు భక్తులకు మనో వికాసాన్ని కలిగిస్తాయి.

Road Map to Ramappa Temple | రామప్ప దేవాలయానికి రోడ్ మ్యాప్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 157 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామానికి దగ్గర్లో రామప్ప ఆలయం ఉంటుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ కు చేరుకుని, అక్కడి నుంచి రామప్ప ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్ నుంచి హనమకొండ చేరుకుని, అక్కడి నుంచి ఈ ప్రదేశానికి వెళ్లవచ్చు. వరంగల్, హనమకొండ పట్టణాల నుంచి రామప్ప ఆలయానికి బస్సుల ద్వారా ప్రజా రవాణా నిరంతరం అందుబాటులో ఉంటుంది. సౌకర్యాన్ని బట్టి ప్రైవేటు వాహనాలు, క్యాబ్, ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

​రామప్ప ఆలయం- నంది విగ్రహం

Ramappa Temple History, Highlights, Architecture and More Details_8.1

ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. నల్లని రాతితో చెక్కబడిన ఈ నంది విగ్రహం సందర్శకులను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. ముందుకు లంఖించేందుకు సన్నద్ధమై యజమాని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఇది కనిపిస్తుంది. నంది ముందు నించి ఏ దిశ వైపు చూసినా అది మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది.

TSPSC Group 2 Quick Revision Live Batch | Online Live Classes by Adda 247

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Ramappa Temple History, Highlights, Architecture and More Details_10.1

FAQs

What is special about Ramappa temple?

The temple is named after the sculptor Ramappa, who built it, making it the only temple in India to be named after its craftsman.

Who built Ramappa temple?

The medieval Deccan Ramappa Temple which dates back to 1213 AD, was built by the patronage of the Kakatiya ruler Kakati Ganapathi Deva

Who is the god in Ramappa temple?

The Ramappa Temple is dedicated to lord Ramalingeswara (Shiva Lingam – lord Shiva).

What is the 2nd name of Ramappa temple?

The Ramalingeswara Temple which is popularly known as the Ramappa temple