Rayalaseema Thermal Power Plant (RTPP) will be renamed as Dr.MVR RTPP | రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ పేరును డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీగా మార్చనున్నారు
రాయలసీమలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP) పేరును దివంగత నేత రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన డాక్టర్ ఎంవి రమణారెడ్డి (MVR) పేరు పెట్టనున్నారు. రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ ప్రాంతానికి రమణారెడ్డి కృషి వల్లనే థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది. 1994 లో ఏర్పాటైన ఈ థర్మల్ పవర్ ప్లాంట్ సామర్ధ్యం 1650మెగావాట్లు. RTPP థర్మల్ పవర్ ప్లాంట్ పేరుని డాక్టర్ ఎంవిఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ గా మారుస్తూ ఆ మేరకు ఉత్తర్వులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ జారీ చేశారు.
రాష్ట్రంలో మరో రెండు థర్మల్ పవర్ ప్లాంట్లకు పేరు మార్పు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ కు దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రం అని పేరు మార్చారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న పవర్ ప్లాంటుకు డాక్టర్ నార్ల తాతారావు పవర్ ప్లాంట్ అని పేరు మార్చారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |