Telugu govt jobs   »   RBI: ATM cash withdrawal rule changed...

RBI: ATM cash withdrawal rule changed | ఆర్ బిఐ: ఎటిఎం నగదు ఉపసంహరణ నిబంధనలు  మార్చింది

ఆర్ బిఐ: ఎటిఎం నగదు ఉపసంహరణ నిబంధనలు మార్చింది

RBI: ATM cash withdrawal rule changed | ఆర్ బిఐ: ఎటిఎం నగదు ఉపసంహరణ నిబంధనలు  మార్చింది_2.1

ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ఎటిఎం) నుంచి నగదు ఉపసంహరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) కొన్ని నిబంధనలను మార్చింది. ఈ ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా రూల్ మార్పుల్లో ఉచిత అనుమతి పరిమితికి మించిన లావాదేవీలపై అధిక ఛార్జీలు,  కొత్త ఉచిత ఎటిఎమ్ లావాదేవీ పరిమితి మరియు ఇంటర్ చేంజ్ ఫీజు పెరగడం ఉంటాయి.

ఆర్ బిఐ నిర్వచించిన కొత్త ఎటిఎమ్ ఛార్జీలు దిగువ పేర్కొన్నవిధంగా ఉంటాయి:

  • స్వంత బ్యాంకు నుంచి ఉచిత నగదు ఉపసంహరణ పరిమితి: బ్యాంకు ఖాతాదారులు ఇప్పుడు తమ స్వంత బ్యాంకు ఎటిఎంల నుండి ప్రతి నెలా ఐదు ఉచిత ఆర్థిక మరియు ఆర్థికేతర లావాదేవీలు చేయవచ్చు.
  • ఇతర బ్యాంకుల నుంచి ఉచిత ఎటిఎం లావాదేవీ పరిమితి: ఎటిఎం కార్డుదారులు మెట్రో కేంద్రాల్లో మూడు ఉచిత ఆర్థిక మరియు ఆర్థికేతర లావాదేవీలు చేయవచ్చు, మెట్రో యేతర ప్రాంతాలలో ఇతర బ్యాంకు ఎటిఎంల నుండి  ఐదు లావాదేవీలు
  • ఉచిత పరిమితికి మించి ఎటిఎం నగదు ఉపసంహరణపై ఛార్జీలు: ఉచిత ఎటిఎం లావాదేవీలు పరిమితికి మించి ఎటిఎం లావాదేవీలపై ఛార్జీలను పెంచడానికి ఆర్ బిఐ బ్యాంకులను అనుమతించింది.
  • ఇంటర్ చేంజ్ ఫీజులో పెరుగుదల: ప్రతి లావాదేవీకి ఇంటర్ చేంజ్ ఫీజు ఆర్థిక లావాదేవీలకు రూ.15 నుంచి రూ.17కు మారగా, ఆగస్టు 1, 2021 నుంచి అమల్లో ఉన్న ఆర్థికేతర లావాదేవీలకు రూ.5 నుంచి రూ.6కు మార్చబడింది.
  • ఉచిత లావాదేవీలు పరిమితికి మించి ఎటిఎం ఉపసంహరణలపై కొత్త ఛార్జీలు: బ్యాంకు కస్టమర్లు జనవరి 1, 2022 నుంచి అమల్లోనికి వచ్చే ఉచిత లావాదేవీ పరిమితికి మించి ప్రతి ఎటిఎం నగదు ఉపసంహరణకు రూ.21 (ప్రస్తుతం ఇది రూ.20) చెల్లించాల్సి ఉంటుంది.

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!

RBI: ATM cash withdrawal rule changed | ఆర్ బిఐ: ఎటిఎం నగదు ఉపసంహరణ నిబంధనలు  మార్చింది_3.1