Telugu govt jobs   »   Current Affairs   »   RBI ద్రవ్య పరపతి విధానం ఆగస్టు 2023
Top Performing

RBI ద్రవ్య పరపతి విధానం ఆగస్టు 2023

RBI ద్రవ్య పరపతి విధానం ఆగస్టు 2023

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్, శక్తికాంత దాస్, 2024 ఆర్థిక సంవత్సరం యొక్క మూడవ ద్రవ్య విధానాన్ని ప్రకటించారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC) ఆగస్టు 8 నుండి 10 వరకు మూడు రోజుల సమావేశాన్ని నిర్వహించింది. మునుపటి రెండు పాలసీ సమీక్షలు ఏప్రిల్ మరియు జూన్‌లలో జరిగాయి. జూన్ 2023లో ఇటీవలి సమీక్షలో, RBI MPC కీలకమైన రెపో రేటును 6.50 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 6.25 శాతంగా ఉండగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) మరియు బ్యాంక్ రేట్లు 6.75 శాతంగా నిర్ణయించారు.

పర్యవసానంగా, MPC పాలసీ రెపో రేటును 6.50% వద్ద యథాతథంగా ఉంచామని. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి అనుగుణంగా మరియు ద్రవ్యోల్బణ అంచనాలను అందుకోవడం కోసం MPC నిబద్ధతతో వ్యవహరిస్తుంది అని గవర్నర్ తెలిపారు.

విధానం  అంచనా శాతం 
రేపో రేట్ 6.50 %
బ్యాంక్ రేట్ 6.75 %
ఏం.ఎస్.ఎఫ్ /MSF 6.75%
ఎస్. డి ఎఫ్ /SDF 6.25%
CRR 4.5%

RBI GDP ఆంచానాలు:

FY23-24 కోసం GDP వృద్ధి అంచనా 6.5% వద్ద ఉంచబడింది

  • FY24 కోసం GDP అంచనా 6.5%
  • Q1FY24 కోసం GDP అంచనా 8%
  • Q2FY24 కోసం GDP అంచనా 6.5%
  • Q3FY24 కోసం GDP అంచనా 6%
  • Q4FY24 కోసం GDP అంచనా 5.7%

RBI పాలసీ లైవ్: FY24 కోసం CPI ద్రవ్యోల్బణం అంచనా 5.1% నుండి 5.4%కి పెరిగింది
2023-24 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం అంచనాను 5.1% నుంచి 5.4%కి పెంచినట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

  • Q2FY24 కోసం CPI ద్రవ్యోల్బణం అంచనా 5.2% నుండి 6.2%కి పెరిగింది
  • Q3FY24 కోసం CPI ద్రవ్యోల్బణం అంచనా 5.4% నుండి 5.7%కి పెరిగింది
  • Q4FY24 కోసం CPI ద్రవ్యోల్బణం అంచనా 5.2% వద్ద ఉంచబడింది

RBI పాలసీ లైవ్ అప్‌డేట్: రూ. 2000 నోట్ల ఉపసంహరణ కారణంగా మిగులు లిక్విడిటీ స్థాయి పెరిగింది
గురువారం జరిగిన ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ₹2,000 నోటును ఉపసంహరించుకోవడం తాత్కాలిక చర్య అని అన్నారు. దేశం నుండి ₹2,000 డినామినేషన్ పూర్తిగా ఉపసంహరించబడిన తర్వాత, సిస్టమ్‌లో “తగినంత ద్రవ్యత” ఉంటుంది. గవర్నర్ దాస్ జోడించారు.

ఈ ఏడాది మేలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ₹2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది మరియు సెప్టెంబర్ 30 లోపు అన్ని నోట్లను తప్పనిసరిగా మార్చుకోవాలని పేర్కొంది.

గతంలో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం (CPI) 5.1 శాతంగా అంచనా వేయగా, దానిని ఇప్పుడు 5.4 శాతానికి పెంచారు.

RBI పాలసీ : బ్యాంకులు 10% CRRని నిర్వహించాలి
మే 19 మరియు జూలై 28 మధ్య బ్యాంకులు తమ నికర డిమాండ్ మరియు సమయ బాధ్యతల (NDTL) పెరుగుదలపై 10% పెరుగుతున్న నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని కొనసాగించాలని RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఈ చర్య పక్షం రోజుల నుండి అమలులోకి వస్తుంది. ఆగష్టు 12 నుండి ప్రారంభమవుతుంది అని తెలిపారు.
నగదు నిల్వల నిష్పత్తి (CRR) 4.5 శాతం వద్దే కొనసాగుతుందని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

RBI ద్రవ్య పరపతి విధానం ఆగస్టు 2023_4.1

FAQs

RBI ఎన్నో ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది

RBI 3 వ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది.