Telugu govt jobs   »   Current Affairs   »   Republic Day 2023
Top Performing

Republic Day 2023 | 74 వ గణతంత్ర దినోత్సవం 2023

Republic Day 2023: India celebrates its 74th Republic Day. Behind these republic celebrations which started on 26th January 1950, there is a lot of uniqueness and the spirit of the freedom heroes of India is hidden. In the present article, Adda247 is trying to explain the history behind the 74th Republic Day celebrations in relation to 2023 as well as the history of the independence war behind the Republic Day celebrations from the perspective of competitive exams.

Republic Day 2023: భారతదేశం తన 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. 1950 జనవరి 26 న ప్రారంభమైన ఈ గణతంత్ర వేడుకల వెనుక ఎంతో విశిష్టత మరియు భారత స్వాతంత్ర వీరుల స్ఫూర్తి దాగి ఉన్నది. ప్రస్తుత వ్యాసము నందు 2023కు సంబంధించి 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల వెనుక ఉన్న చరిత్ర అలాగే గణతంత్ర దినోత్సవ వేడుకల వెనుక ఉన్న స్వాతంత్ర సమార చరిత్ర అంశాలను పోటీ పరీక్షల కోణంలో వివరించడానికి Adda247 ప్రయత్నిస్తోంది.

 

APPSC Group 4 Junior Assistant Hall Ticket 2022 |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

Republic Day 2023 | గణతంత్ర దినోత్సవం

భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

Why Republic Day is celebrated 26th January?| జనవరి 26 న మాత్రమే గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుగుపుకుంటారు?

జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు. 1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజును స్వాతంత్ర దినోత్సవంగా వ్యవహరించారు. ఐతే దేశ స్వాతంత్ర  దినాన్ని బ్రిటీషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు. బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజును స్వతంత్ర దినోత్సవంగా వ్యవహరించారు.

History Of Republic Day | భారత గణతంత్ర దినోత్సవ చరిత్ర

Poorna swaraj Resolution | పూర్ణ స్వరాజ్ తీర్మానం

భారత జాతీయ కాంగ్రెస్, 19 డిసెంబర్ 1929న, లాహోర్ సెషన్‌లో చారిత్రాత్మకమైన ‘పూర్ణ స్వరాజ్’ – (సంపూర్ణ  స్వాతంత్ర్యం) తీర్మానాన్ని ఆమోదించింది. 26 జనవరి 1930న బహిరంగ ప్రకటన చేయబడింది – ఈ రోజును కాంగ్రెస్ పార్టీ ‘స్వాతంత్ర్య దినోత్సవం‘గా జరుపుకోవాలని భారతీయులను కోరింది. భారతదేశానికి స్వయం పరిపాలన హోదా ప్రశ్నపై స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు మరియు బ్రిటిష్ వారి మధ్య చర్చలు విఫలం కావడం వల్ల ఈ ప్రకటన ఆమోదించబడింది.

1929లో, అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, భవిష్యత్తులో భారతదేశానికి అధినివేశ హోదా ఇవ్వబడుతుందని అస్పష్టంగా ప్రకటించారు. దీనినే ఇర్విన్ డిక్లరేషన్‌ అంటారు. చాలా కాలంగా అధినివేశ హోదా కోసం డిమాండ్ చేస్తున్నందున భారత నాయకులు దీనిని స్వాగతించారు. అప్పుడు వీరు భారతదేశానికి అధినివేశ హోదా అధికారికీకరణపై దృష్టి పెట్టడానికి బ్రిటిష్ వారితో అన్ని తదుపరి చర్చలను కోరుకున్నారు.

ఇర్విన్ డిక్లరేషన్ కు ఇంగ్లాండ్‌లో ఎదురుదెబ్బ తగిలింది: రాజకీయ నాయకులు మరియు సాధారణ ప్రజలు భారతదేశం అధినివేశ  హోదాను పొందేందుకు అనుకూలంగా లేరు. ఒత్తిడిలో, లార్డ్ ఇర్విన్, జిన్నా, నెహ్రూ, గాంధీ మరియు సప్రూలతో జరిగిన సమావేశంలో, తాను ఎప్పటికి అధినివేశ  హోదాను వాగ్దానం చేయలేనని భారతీయ నాయకులకు చెప్పాడు. భారత జాతీయ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది మరియు ఇప్పుడు కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకుంది: అది అధినివేశ  హోదా కోసం డిమాండ్లను వదులుకుంది మరియు బదులుగా, 1929 లో లాహోర్ సమావేశంలో, సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చే ‘పూర్ణ స్వరాజ్’ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం వలస పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమానికి నాంది పలికింది.

Republic Day 2023 | 74 వ గణతంత్ర దినోత్సవం 2023_4.1

Republic Day Celebrations 2023 | 2023 గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం నాడు, దేశంలోని వివిధ ప్రాంతాలలో సాయుధ దళాలు మరియు పాఠశాల విద్యార్థులచే జెండా ఎగురవేత వేడుకలు మరియు కవాతులు జరుగుతాయి. ఈ కవాతుల్లో అత్యంత గొప్పది మరియు అత్యంత ముఖ్యమైనది న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించబడుతుంది, ఇది దేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు సైనిక పరాక్రమం యొక్క బహుళ-వర్ణ చిత్రాలను ప్రదర్శిస్తుంది.

ఈ కవాతు భారత రాష్ట్రపతి అధ్యక్షతన జరుగుతుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించడం, కష్టనష్టాల్లో ధైర్యంగా నిలిచిన సైనికులకు, పౌరులకు, చిన్నారులకు ధైర్యసాహసాలు పరాక్రమ పురస్కారాలు అందించడం రిపబ్లిక్ డే పరేడ్‌లోని ప్రధాన కార్యక్రమాల్లో ఒకటి.

దేశం కోసం ప్రాణాలర్పించిన సాయుధ దళాల సభ్యులందరి స్మారకార్థం ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి వద్ద భారత ప్రధాని మొదట పుష్పగుచ్ఛం ప్రదర్శిస్తారు. ఆ తర్వాత 21 గన్ సెల్యూట్, జాతీయ జెండాను ఆవిష్కరించడం మరియు జాతీయ గీతం ఆలపించడం జరుగుతుంది. తర్వాత, శౌర్య పురస్కార విజేతలకు పరమవీర చక్ర, అశోక్ చక్ర మరియు వీరచక్ర వంటి అవార్డులను అందజేస్తారు.

గ్యాలంట్రీ అవార్డుల విజేతలు ఓపెన్ మిలిటరీ జీపుల్లో రాష్ట్రపతికి సెల్యూట్ చేయడంతో కవాతు ప్రారంభమవుతుంది, ఆ తర్వాత సైన్యం యొక్క ఆయుధాగారానికి జోడించిన వివిధ ట్యాంకులు, క్షిపణులు మరియు ఇతర పరికరాల ప్రదర్శన జరుగుతుంది. దీని తరువాత, సాయుధ దళాలు, పోలీసు, హోంగార్డ్స్ మరియు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యొక్క వివిధ రెజిమెంట్ల మార్చ్-పాస్ట్ జరుగుతుంది. భారత సాయుధ దళాల కమాండర్-ఇన్-చీఫ్ అయిన భారత రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు. దీని తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన టేబులాక్స్ మరియు దేశభక్తి గల పాఠశాల పిల్లల సాంస్కృతిక నృత్యాలతో కూడిన శక్తివంతమైన కవాతు జరుగుతుంది.

Who is the Chief Guest of Republic Day 2023 | 2023 గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిధి

  • 2023 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి హాజరుకానున్నారు. గత నెల 10న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కైరో పర్యటన సందర్భంగా ఈ ఆహ్వానాన్ని తెలియజేసారు.
  • ‘ది అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్’ అధ్యక్షుడు తొలిసారి ముఖ్య అతిథిగా రిపబ్లిక్ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ ఏడాదితో భారత్, ఈజిప్ట్ దౌత్య సంబంధాలు ఏర్పర్చుకొని 75 ఏళ్లు పూర్తవుతోంది.
  • ఈ నేపథ్యంలో భారత్ అధ్వర్యంలో జరగనున్న 2022-23 జి 20 సమావేశాలకు ఈజిప్టును అతిథిగా ఆహ్వానించారు.
  • 1950 నుంచి భారత్ మిత్ర దేశాల నేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. 1952, 53, 66ల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా రిపబ్లిక్ట్ డే వేడుకలు నిర్వహించారు.
  • 2007లో ప్రతిన్(రష్యా), 2008లో నికోలస్ సర్కోజీ (ఫ్రాన్స్), 2015లో బరాక్ ఒబామా (అమెరికా), 2016లో ఫ్రాన్సోయిస్ హోలన్ (ఫ్రాన్స్) లు అతిథులుగా హాజరయ్యారు.
  • 2021లో నాటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను చీఫ్ గెస్ట్ ఆహ్వానించారు. కానీ, కొవిడ్ కేసులు పెరగడంతో ఆయన పర్యటన రద్దైంది. 2018లో ఆసియాన్ దేశాల అదినేతలను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించారు.

Click Here For More Free Study Material for APPSC, TSPSC Exams

 

Republic Day 2023 | 74 వ గణతంత్ర దినోత్సవం 2023_5.1

Read More:-
Telangana, AP Govt Jobs Adda247 Telugu
Official Website Adda247

 

 

 

 

 

Sharing is caring!

Republic Day 2023 | 74 వ గణతంత్ర దినోత్సవం 2023_6.1

FAQs

what republic day is this year 2023?

This year's republic day is of 74th edition.

When did Republic Day is celebrated?

Republic day will be celebrated every year on 26th January 2023.

Who is the guest for 2023 Republic day celebrations

Egypt's President Abdul Fatah Al Sisi to attend Republic Day 2023 as Chief Guest