Telugu govt jobs   »   RFCL ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2024

RFCL ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2024, 27 ఖాళీలకు దరఖాస్తు చేసుకొండి

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ప్రధాన కార్యాలయం ఉత్తర ప్రదేశ్ లో ఉంది మరియు తెలంగాణ లో రామగుండం ప్లాంట్ నందు రెగ్యులర్ విధానం లో వివిధ ఖాళీలకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCL అధికారిక వెబ్ సైటు rfcl.co.inలో మొత్తం 27 ఖాళీల కోసం RFCL 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 02 మార్చి 2024 నుండి 31 మార్చి 2024 వరకు అభ్యర్థులు తప్పనిసరిగా RFCL E1 లెవెల్ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు. RFCL 024 వివరణాత్మక నోటిఫికేషన్‌ను ఈ కధనం లో అందించాము. ఆసక్తి గల అభ్యర్ధులు అధికారిక ప్రకటన తనిఖీ చేసి, వారి అర్హతను బట్టి పోస్ట్ లను నిర్ధారించుకోవాలి. RFCL E1 2024 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 03 మార్చి 2024 నుండి ప్రారంభమవుతుంది మరియు 31 మార్చి 2024 చివరి తేదీ.

Adda247 APP

Adda247 APP

RFCL రిక్రూట్‌మెంట్ 2024

RFCL 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా RFCL దాని రామగుండం ప్లాంట్, తెలంగాణ మరియు కార్పొరేట్ ఆఫీస్, నోయిడాలో 27 పోస్టులను భర్తీ చేయనుంది. RFCL రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్- rfcl.co.inలో విడుదల చేయబడింది. తాజా అధికారిక నవీకరణ ప్రకారం, దరఖాస్తు ప్రక్రియ 03 మార్చి 2024న ప్రారంభమైంది మరియు దరఖాస్తుదారులు 31 మార్చి 2024లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించవచ్చు.

RFCL నోటిఫికేషన్ 2024 PDF

RFCL నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్ సైటు లో విడుదల చేసింది. RFCL లో వివిధ విభాగాల్లో 27 ఖాళీలను ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయనున్నారు.  అధికారిక నోటిఫికేషన్ PDFలో ప్రతి విభాగానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం అందించారు. RFCL 2024 వివరణాత్మక నోటిఫికేషన్ PDFని ఈ దిగువన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

RFCL నోటిఫికేషన్ 2024 PDF

RFCL రిక్రూట్‌మెంట్ 2024: ముఖ్యమైన తేదీలు

RFCL 2024 నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకోవాలి అని అనుకున్న అభ్యర్ధులు తప్పనిసరిగా చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. RFCL E1 2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ PDFతో పాటు, ముఖ్యమైన తేదీల గురించి అవగాహన ఉండాలి.

RFCL రిక్రూట్‌మెంట్ 2024: ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ 03 మార్చి 2024
దరఖాస్తు చివరి తేదీ 31 మార్చి 2024

RFCL ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2024  దరఖాస్తు లింకు

RFCL E1 రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ కి దరఖాస్తు చేయడానికి అధికారిక లింకు అందుబాటులో ఉంది. అభ్యర్థులు RFCL E1 నోటిఫికేషన్ లోని అర్హతా ప్రమాణాలు కలిగి ఉంటే తెలంగాణ ప్రభుత్వ రంగా సంస్థలో పనిచేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను ఆన్‌లైన్లో పూర్తి చేసి వాటిని ప్రధాన కార్యాలయానికి పంపించాలి. RFCL మేనేజ్‌మెంట్ ట్రైనీస్ రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు కోసం ఆన్‌లైన్ లింక్‌ను అధికారిక వెబ్‌సైట్ https://www.rfcl.co.in/లో అందుబాటులో ఉంది.

RFCL E1 రిక్రూట్‌మెంట్ 2024 దరఖాస్తు లింకు

గమనిక: దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్ధులు ఫీజు చెల్లించి పూర్తి దరఖాస్తుని ప్రింట్ అవుట్ తీసుకుని తగిన దృవపత్రాలతో అధికారిక కార్యాలయానికి పంపించాలి

అధికారిక కార్యాలయం చిరునామా: 07 మార్చి 2024 లోపు మీ పోస్ట్ అధికారిక కార్యాలయనికి చేరాలి

(పోస్ట్ కార్డ్ మీద ఇలా రాయాలి) APPLICATION FOR THE POST OF ____________ IN RFCL-2024

Deputy General Manager (HR)-I/c,

Ramagundam Fertilizers and Chemicals Limited,

Corporate Office,

4th Floor, Wing-A, Kribhco Bhawan, Sector-1,

Noida, Uttar Prades- 201301.

RFCL ఇంజనీర్ దరఖాస్తు రుసుము

RFCL ఇంజనీర్ మరియు అకౌంటెంట్, మెడికల్ ఆఫీసర్ వంటి పోస్ట్ లకు దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్ధులు తప్పనిసరిగా దరఖాస్తు రుసుము చెల్లించాలి. RFCL దరఖాస్తు రుసుము వివరాలు ఈ దిగువన పట్టికలో అందించాము

RFCL ఇంజనీర్ దరఖాస్తు రుసుము 
UR/OBC/EWS Rs. 700
Others

RFCL ఇంజనీర్ 2024 ఖాళీలు

RFCL ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2024 దాని రామగుండం ప్లాంట్ తెలంగాణ మరియు కార్పొరేట్ ఆఫీస్ నోయిడా కోసం క్రింద పేర్కొన్న స్థానాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. RFCL E1 రిక్రూట్‌మెంట్ ప్రకారం 2024 ఖాళీలు వివిధ కేటగిరీల వారీగా ప్రచురించబడ్డాయి.

RFCL ఇంజనీర్ ఖాళీలు 2024
పోస్ట్  ఖాళీలు
ఇంజనీర్ (E-1) 19
సీనియర్ కెమిస్ట్ 02
అక్కౌంట్స్ ఆఫీసర్ (E-1) 05
మెడికల్ ఆఫీసర్ (E-1) 01
మొత్తం  27

RFCL E-1 పోస్ట్ లకు అర్హత ప్రమాణాలు

RFCL E-1 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 కోసం దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థి తప్పనిసరిగా నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి .అర్హత ప్రమాణాలు విద్యా అర్హత, వయో పరిమితుల గురించి తెలుసుకొండి

RFCL E-1 పోస్ట్ లకు విద్యా అర్హత

వివిధ విభాగాల్లోని పోస్ట్ లకు వివిధ అర్హతా ప్రమాణాలు ఉన్నాయి. పోస్ట్ లను బట్టి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి BE, B.Tech గ్రాడ్యుయేషన్, MBA, CA/CMA MBBS  పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి అవసరమైన పత్రాలను కలిగి ఉండకపోతే వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అనుమతించారు.

RFCL E-1 వయోపరిమితి

RFCL రిక్రూట్‌మెంట్ 2024 కోసం గడువు తేదీ 31. మార్చి 2024. అభ్యర్ధులు గడువు తేదీ నాటికి తగిన అర్హతలు కలిగి ఉండాలి. మరియు వయోపరిమితి లో సడలింపు లేదు. నోటిఫికేషన్ లో పేర్కొన్న గరిష్ట వయస్సు వివరాలు తెలుసుకొండి.

  • మెడికల్ ఆఫీసర్ పోస్ట్ లకి- 35 సంవత్సరాలు
  • మిగిలిన అన్నీ పోస్ట్ లకి- 30 సంవత్సరాలు

RFCL ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2024: ఎంపిక ప్రక్రియ

RFCL E-1రిక్రూట్‌మెంట్ 2024 లో అభ్యర్ధుల సంఖ్యని బట్టి ఇంటర్వ్యూ లేదా పరీక్ష మరియు ఇంటర్వ్యూ ని నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో వారి పనితీరు ఆధారంగా ఎంపిక ఉంటుంది.

RFCL ఇంజనీర్ 2024 జీతం

RFCL ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2024లో ఎంపికైన అభ్యర్థులు RFCL అధికారుల షరతుల ఆధారంగా వారి వేతనాన్ని పొందుతారు. RFCL నిర్ణయించిన జీతం గ్రేడ్ E-1 పే స్కేల్‌లో ప్రాథమిక చెల్లింపు రూ. 40,000-1,40,000/-. ఇతర అలవెన్సు లు, సెలవులు, PF, గ్రాట్యుటీ వంటి అన్నీ ప్రభుత్వ సౌకర్యాలు అందుకుంటారు.

SCCL (Singareni) MT, JEO, JFO 2024 Non-tech Part Complete Live Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!