River Ganga
The Ganga River, is located in northern India that flows toward the border with Bangladesh. It is the longest river in India and flows for around 1,569 miles (2,525 km) from the Himalayan Mountains to the Bay of Bengal. The Ganga River System, also known as the Ganges River System, is one of the most significant river systems in the Indian subcontinent. Ganga river holds immense cultural, religious, and ecological importance.
The Ganga River System includes some perennial rivers and some non-perennial rivers. Ganga River System has its southern origins in the peninsula and northern origins in the Himalayas. The Ganga River is formed by the confluence of two small rivers, Bhagirathi and Alakananda, in the Kumaon Himalayas. in this article we are providing complete details of The Ganga River System. to know more details about The Ganga River System, read the article completely.
River Ganga | గంగా నదీ వ్యవస్థ
ఇది భారతదేశంలో అతిపెద్ద నదీ వ్యవస్థ. గంగా నది కుమయూన్ హిమాలయాల్లో భగీరథి, అలకనంద అనే రెండు చిన్న నదుల కలయికతో ఏర్పడుతుంది. భగీరథ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కుమయూన్ హిమాలయాల్లోని కేదారనాథ్ సమీపంలో గంగోత్రి హిమనీ నదంలో జన్మించి, దేవప్రయాగ వద్ద అలకనంద నదితో కలుస్తుంది. అలకనంద నది కూడా కుమయూన్ హిమాలయాలు ఉన్న ఘర్వాల్ జిల్లా, బద్రీనాథ్ సమీపంలోని అలకనందా లేదా సతోపంత్ అనే హిమనీ నదంలో జన్మిస్తుంది.
River Ganga Origin | పుట్టుక
అలక్‌నంద నది దేవ ప్రయాగ వద్ద భగీరథితో కలిసిన తర్వాత గంగా నదిగా పిలుస్తారు. అలక్‌నంద ‘అల్క’ అనే హిమానీ నదం వద్ద, భగీరథి..గంగోత్రి అనే హిమానీ నదం వద్ద జన్మించాయి.
- అలక్‌నంద, పిండార్ నదులు కలిసే ప్రదేశం కరణ్‌ప్రయాగ. అలక్‌నంద, మందాకిని కలిసే ప్రదేశం రుద్రప్రయాగ.
- గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశం (త్రివేణి సంగమం) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ (లేదా) అలహాబాద్.
- గంగానది హరిద్వార్ వద్ద మైదానంలోకి ప్రవేశించి.. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి బెంగాల్‌లో రెండు ప్రధాన శాఖలుగా చీలుతుంది. దీనిలో ఒక శాఖ పద్మానదిగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి, బ్రహ్మపుత్రతో కలిసి ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టాను ఏర్పరుస్తుంది. మరో శాఖ హుగ్లీ నదిగా పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది.
River Ganga length | పొడవు
గంగానది భారతదేశంలో ఎక్కువ దూరం ఉత్తరప్రదేశ్‌లో (1450 కి.మీ.) ప్రవహిస్తుంది. దీని మొత్తం పొడవు 2525 కి.మీ. కాగా భారత్‌లో దీని పొడవు సుమారు 2415 కి.మీ. ఇది భారతదేశంలో అతి పొడవైన నది, అతి తరుణ నది. దేశంలో ని వైశాల్యంలో 4వ వంతు ఆక్రమించి, అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతాన్ని కలి గి ఉంది. దీనికి గల మరో పేరు జాహ్నవి.
APPSC/TSPSC Sure Shot Selection Group
River Ganga flows through which states | ప్రవాహం
- దేవప్రయాగలో అలకనందతో భగీరథ కలిశాక దాన్ని గంగా నదిగా పేర్కొంటారు.
- హరిద్వార్ వద్ద గంగానది మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.
- అక్కడి నుంచి ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
- అక్కడ బ్రహ్మపుత్ర నదిని కలుపుకుని మరికొంత దూరం ప్రయాణించి, బంగాళాఖాతంలో కలిసేముందు అనేక పాయలుగా చీలి ప్రపంచంలోనే పెద్దదైన డెల్టాను ఏర్పరుస్తోంది.
River Ganga Tributaries | ఉప నదులు
గంగా ఎడమ వైపు ఉపనదులు: రామ్ గంగా, గోమతి, ఘగ్ర, గండక్, కోసి తదితర హిమాలయ నదులు ఎడమవైపు నుంచి గంగా నదిలో కలుస్తాయి.
గంగా కుడివైపు ఉపనదులు: యమున, చంబల్, సోణ్, బెట్వా, కెన్, దామోదర్, టాన్స్ మొదలైన ద్వీపకల్ప నదులు కుడివైపు నుంచి గంగా నదిలో కలుస్తాయి.
గండక్ : నేపాల్‌లోని ఎవరెస్ట్, ధవళగిరి శిఖరాల మధ్య గల సోహాతు కనుమ వద్ద సుమారు 7000 మీ. ఎత్తులో జన్మించింది. అందువల్ల దీన్ని భారతదేశంలో ఎత్తై ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నదిగా పరిగణిస్తారు. గండక్ నదిని నేపాల్‌లో సాలిగ్రామి, బిహార్‌లో నారాయణి అని పిలుస్తారు. ఇది పట్నా వద్ద గంగానదిలో కలుస్తుంది.
కోసీ: దీన్ని సంస్కృతంలో కౌశికి అంటారు. కోసికి బిహార్ దు:ఖదాయని అని పేరుంది. కోసి నది నేపాల్, టిబెట్, సిక్కిం సరిహద్దుల్లో గల గోసాయ్ నాధీ వద్ద జన్మించి, కాంచన్‌గంగా పర్వత శిఖరాన్ని తాకుతూ కోసీచాత్ర మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుంది. బిహార్‌లో గంగానదిలో కలుస్తుంది. దీని ఉప నదులు అరుణ్, సన్‌కోసి, దుద్‌కోసి తదితరాలు.
గాగ్రా: కర్ణాలి అని కూడా పిలుస్తారు. నేపాల్‌లోని గుర్ణమాంధీత శిఖరం వద్ద జన్మించి, బిహార్‌లోని ధాప్రా వద్ద గంగానదిలో కలుస్తుంది. దీని ఉపనది శారదా. చౌక, కాళి అని కూడా శారదా నదిని పిలుస్తారు.
యమునా: యమునోత్రి అనే హిమానీ నదం వద్ద జన్మించి, ముస్సోరి కొండలను దాటి తజేవాలా అనే ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది. అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. దీని పొడవు 1376 కి.మీ.
యమునా నది ఒడ్డున మధుర, ఆగ్రా, ఢిల్లీ నగరాలున్నాయి. ఇది గంగానది ఉపనదుల్లో అతి పెద్దది. దీని ఉప నదులు చంబల్, బెట్వా, కెన్, కాల్‌సిధి.
చంబల్: మధ్యప్రదేశ్‌లోని జన్‌పావో కొండల్లోని మౌ అనే ప్రదేశంలో జన్మించి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో యమునా నదిలో కలుస్తుంది. దీని పొడవు 960 కి.మీ. ఆరావళి పర్వతాల్లో బనాస్ నది దీనిలో కలుస్తుంది.
బెట్వా: నేత్రావతి నది అని కూడా పిలుస్తారు. ఇది మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో జన్మించి సాంచి, గ్వాలియర్, ఝాన్సీల గుండా ప్రవహించి హమీర్ పూర్ వద్ద యమునా నదిలో కలుస్తుంది.
కెన్: కైమూర్ కొండల్లో జన్మించి బుందేల్‌ఖండ్ పీఠభూమి గుండా ప్రవహించి బాండ వద్ద యమునా నదిలో కలుస్తుంది. దీన్ని కర్ణావతి నది అని కూడా పిలుస్తారు.
సోన్: మధ్యప్రదేశ్‌లోని అమర్ కంటక్ పీఠభూమిలో జన్మించి, నర్మదా నదికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల గుండా ప్రవహించి పట్నా వద్ద గంగా నదిలో కలుస్తుంది.
దీని ఉపనదులు : మహానందా, గోవత్, రిహాండ్, కన్హర్ తదితరాలు. దీన్ని సువర్ణ నది అని కూడా పిలుస్తారు.
దామోదర్: జార్ఖండ్‌లోని ఛోటానాగ్‌పూర్ పీఠభూమిలోని టోరీ అనే ప్రాంతంలో జన్మించి, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు దిగువన హుగ్లీ నదిలో కలుస్తుంది. దీన్ని బెంగాల్ దు:ఖదాయని అని కూడా పిలుస్తారు. బరాకర్, కోనార్, గరి, జమునై దీని ఉపనదులు.
టాన్స్: కైమూర్ పర్వతాల్లోని గోమచి శిఖరాల్లోని మైహర్ వద్ద జన్మించి, అలహాబాద్ నగరానికి దిగువన సిర్స వద్ద గంగానదిలో కలుస్తుంది. దీనికి గల మరో పేరు తామస.
మహానంద: పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లోని మహల్దీరామ్ కొండల్లో పుట్టి, బెంగాల్‌లోని మహానంద శాంక్చ్యురీ నుంచి ప్రవహించి సిలిగురి, జల్‌పాయ్‌గురి జిల్లాల మీదుగా బంగ్లాదేశ్‌లో పద్మానదిలో కలుస్తుంది.
National Mission for Clean Ganga
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) అనేది నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ (NGRBA) యొక్క అమలు విభాగం. గవర్నింగ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ NMCGలో రెండు అంచెలుగా ఉంటాయి.
గమనిక: NGRBA రద్దు చేయబడింది మరియు గంగా నది యొక్క పునరుజ్జీవనం, రక్షణ మరియు నిర్వహణ కోసం నేషనల్ కౌన్సిల్ (జాతీయ గంగా కౌన్సిల్ అని సూచిస్తారు) 2016లో స్థాపించబడింది.
NMCG కాలుష్యం తగ్గింపు జోక్యాలపై దృష్టి సారిస్తుంది, ఇందులో అంతరాయాలు, మళ్లింపు మరియు బహిరంగ కాలువల ద్వారా ప్రవహించే మురుగునీటి శుద్ధి. బయోరిమిడియేషన్, ఆప్ట్ ఇన్-సిటు ట్రీట్‌మెంట్, పయనీరింగ్ టెక్నాలజీ, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (STP) మరియు ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ETP) ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం దీని లక్ష్యం.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |