Adda247 APP
Role of Press and Newspapers in Andhra Movement:
ఆంధ్ర ఉద్యమంలో వార్తా పత్రికలు
ఆంధ్ర ప్రకాశిక 1885:
- ఈ పత్రిక ని 1885లో పార్ధసారధి నాయుడు గారు మద్రాసు కేంద్రంగా స్థాపించారు
- ఈ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురితమయ్యేవి
- తెలుగువారిని ఏకం చేయడం ఈ పత్రిక యొక్క ముఖ్యలక్షణం
దేశాభిమాని 1887:
- ఇది విజయవాడలో ప్రారంభించబడిన మొదటి ఆంగ్లో-తెలుగు వార పత్రిక
- దేశాభిమాని ముందు పేరు కృష్ణా న్యూస్, మరియు సంపాదకుడు దేవగుప్త శేషచలపతిరావు.
- 1908లో ఇది దినపత్రికగా మారింది మరియు ప్రధాన కార్యాలయం గుంటూరుకి మారింది.
- 1911 లో భారతదేశానికి వచ్చిన ఇంగ్లండ్ రాజు జార్జ్-V కి డిల్లీలో పట్టాభిషేకం జరిపి ఇంగ్లీషు లో ఒక వ్యాసాన్ని కూడా ప్రచురించింది.
- స్వంత ప్రభుత్వం గురించి ఆంధ్రుల సంస్కృతి గురించి తెలియజేసింది.
- 1911 లో వరుసగా 6 వ్యాసాలు ప్రచురించి తెలుగు వారు పడే అవస్థలను తెలియజేశారు
- 1911 ఏప్రిల్ 15న తెలుగు వారు వెనుకబడిన వారా అనే శీర్షిక ప్రచురించారు.
- 1912లో ఆగస్టు 29న హిందూ లో విశ్వామిత్ర అనే లేఖ ప్రచురితమైంది.
కృష్ణా పత్రిక:
- దీనిని 1902లో మచిలీపట్నంలో ప్రారంభించారు.
- 1912 నవంబర్ 30న ఆంధ్రోధ్యమం, జాతీయోధ్యమం గురించి ప్రచురించింది.
- ది క్రై ఆఫ్ మదర్ ఇండియా గేయాన్నిఈ పత్రిక ప్రచురించిచింది.
ఆంధ్ర కేసరి
- దీనిని 1904లో చిలుకూరి వీరభద్రరావు, రాజమండ్రిలో స్థాపించారు.
- వెంకట లక్ష్మణ రావుగారు మరియు వీరభద్రరావు గారు కలిపి 1906లో విజ్ఞాన చంద్రిక మండలిని స్థాపించి ఆంధ్రుల చరిత్ర అనే గ్రంధాన్ని రచించారు. వీరికి చరిత్ర చుతరసన అనే బిరుదు లభించింది
ఆంధ్రా పత్రిక
- ఆంధ్రా పత్రిక 1908 సెప్టెంబర్ 9 న కాశీనాధుని నాగేశ్వరరావుగారు ముంబాయి కేంద్రంగా స్థాపించారు.
- ఇది వార పత్రికగా మొదలై 1914లో దినపత్రికగా మారింది
- ఆంధ్రపత్రిక ప్రచురణ సంస్థకి ఆంధ్ర గ్రంధమాల అని నాగేశ్వర రావుగారు పేరు పెట్టారు
- 1910 నుంచి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఉగాది సంచికలు అనే శీర్షికని ప్రచురించారు.
- 1910లో మొదటి ఉగాది సంచిక ప్రచురితమైంది మరియు ఈ సంచిక లో విన్నపం అనే వ్యాసంలో ఆంధ్ర రాష్ట్ర ప్రాముఖ్యత గురించి తెలిపారు
- నాగేశ్వర రావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి తెలియజేస్తూ ఆంధ్ర మహాజనులకో విన్నపం అనే శీర్షిక ప్రచురించారు
స్వదేశీ మిత్రన్
- ఇది ప్రధానంగా ఒక తమిళ పత్రిక మరియు ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేసింది
- రాజారమణీయం గారు విశాఖపట్నంలో 1915న 3వ ఆంధ్ర సభ గురించి అందులో మాతృభాషలో విద్యాభోదన గురించి తెలిపిన తీర్మానం ని ఈ తమిళ పత్రిక సమర్ధించింది.
గోష్టి పత్రిక:
- ఈ పత్రికని ప్రారంభించింది జి.వి. సుబ్బారావుగారు
- రాయలసీమ, తెలంగాణ ప్రజలు, తెలుగు వారు అందరూ 1936 మార్చి 24న ఉగాది పండుగ జరుపుకున్నారు.
- ఈయన ఉగాదిని పురస్కరించుకుని ఒక కవితని కూడా ప్రచురించారు.
- 1936 మార్చిలో గోష్టి పత్రిక ఆంధ్ర దేశ పటాన్ని ప్రచురించింది.
ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రచురణ అయిన ఇతర శీర్షికలు:
- ఆంధ్రా పత్రిక మహాత్మ గాంధీ గారు చేపట్టిన నూలు వస్తారలు తయారు చేసుకోవాలి అని సూచించింది.
- మరియు 1938లో జరిగిన ఉగాది సంచికలో ఆంధ్ర అభ్యుదయం అనే శీర్షికని నాగేశ్వరరావుగారు రచించారు
- 1920లో భాషా రాష్ట్రాల స్వయం పరిపాలన అనే శీర్షిక ప్రచురితమైంది
- నెహ్రూగారు 1953 లో ఆంధ్ర రాష్ట్ర ప్రారంభోత్సవం చేసినపుడు ఆంధ్రరాజ్య అవతరణ అనే శీర్షికని ఆంధ్రా పత్రిక ప్రచురించింది.
- 1956లో మహాంధ్ర సాక్షాత్కారం అనే శీర్షిక ప్రచురితమైంది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |