Telugu govt jobs   »   స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) లో...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) లో 10వేల ఉద్యోగాలు, త్వరలోనే నోటిఫికేషన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఫ్రెషర్లకు 10,000 జనరల్ క్లర్కులు, అసోసియేట్‌లుగా అవకాశం కల్పించనుంది. వచ్చే మార్చి లోపు 10 వేల మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు వెల్లడించింది. ఇందులో 85 శాతం మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పించనున్నట్లు SBI బ్యాంక్‌ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా తెలిపారు. ఐటీ శాఖతో పాటు ఇతర విభాగాలకు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 3 వేల మంది POలు, 8 వేల మంది అసోసియేట్లకు బ్యాంకింగ్‌ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి ఆపై వివిధ వ్యాపార విభాగాల్లో నియమించుకోనున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు కోసం Adda247 తెలుగు పేజీ ని బుక్ మార్క్ చేసుకోండి లేదా Adda247 యాప్ ని ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి

బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించేలా శిక్షణ

IT సెక్టార్‌లో నియామకాలు నెమ్మదించాయి. చాలా మంది యువత ఉద్యోగాల వేటలో నిమగ్నమై నిరాశతో ఉన్నారు. నిరాశతో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రత్యామ్నాయం చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు SBI ప్రకటించింది. అలాగే ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తామని చెప్పారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, బ్యాంక్ లో పనిచేసేవారి సంఖ్య 2, 35,858 నుండి 2,32,296కి పడిపోయింది. SBI బ్యాంకు కూడా టెక్నికల్ స్కిల్స్ కోసం విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించుకుంది.

SSC CPO 2023 నోటిఫికేషన్ విడుదల, డౌన్‌లోడ్ 1876 ఖాళీల నోటిఫికేషన్ 2023 PDF_30.1

Adda247 APP

ఎలాంటి వివక్ష తావులేకుండా

బ్యాంకింగ్‌ సెక్టార్‌లోనూ సాంకేతికతపై ఆధారపడడం గణనీయంగా పెరిగింది. టెక్నాలజీ ఆధారంగా కస్టమర్లకు అధునాతనంగా సేవలందించాలనే దానిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలోనే చాలా బ్యాంకులు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన కల్పించేలా శిక్షణ పొందిన వారిని.. వారి వారి ప్రతిభను బట్టి వివిధ వ్యాపార, ఐటీ బాధ్యతలు అప్పగించనున్నట్లు SBI బ్యాంక్‌ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా చెప్పారు. దీనివల్ల బ్యాంకింగ్‌ సెక్టార్‌కు తగిన స్థాయిలో టెక్‌ మ్యాన్‌పవర్‌ అందించడం సాధ్యపడుతుందన్నారు. శిక్షణ పొందిన అభ్యర్ధికి బాధ్యతల విషయంలో ఎలాంటి వివక్ష కూడా ఉండబోదన్నారు.

TEST PRIME - Including All Andhra pradesh Exams

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!