స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నవంబర్ 1, 4 మరియు 6 తేదీల్లో జరిగిన ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ప్రిలిమ్స్ పరీక్ష 2023 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ను తనిఖీ చేసి తెలుసుకోవచ్చు. SBI PO మెయిన్స్ పరీక్ష డిసెంబర్ 5న జరగనుంది. పరీక్ష ఫలితాల లింకు, ఫలితాలను ఎలా తనిఖీ చేయాలో తెలుసుకోవడానికి పూర్తి కధనాన్ని చదవండి.
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
SBI PO ప్రిలిమినరీ పరీక్ష 2023కి ఫలితాలు తన అధికారిక వెబ్సైట్ www.sbi.co.in/careers లో విడుదల చేసినట్లు తెలిపింది. SBI PO 2023 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ లాగిన్ క్రెడెన్షియల్స్, రిజిస్ట్రేషన్ / రోల్ నంబర్ మరియు పాస్వర్డ్ / పుట్టిన తేదీని ఉపయోగించి వారు తమ ప్రిలిమ్స్ ఫలితాలు తెలుసుకోవచ్చు. అభ్యర్ధుల కోసం ఈ కధనంలో SBI PO PRILIMS 2023 ఫలితాల లింక్ ద్వారా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థుల కోసం తదుపరి దశ నియామక ప్రక్రియలో మెయిన్స్ పరీక్ష 05 డిసెంబర్ 2023 న నిర్వహించబడుతుంది. SBI PO ప్రిలిమ్స్ రిజల్ట్ 2023కు సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది కథనం చదవండి.
SBI PO ఫలితాలు 2023
SBI PO ప్రిలిమ్స్ రిసల్ట్ 2023 స్కోర్‌కార్డ్ మరియు కట్ ఆఫ్ మార్కులతో పాటుగా ప్రకటించబడింది. SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు 2023 విడుదలతో ఎంతో మంది ఆశావహుల నిరీక్షణ ఫలించింది. 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కోసం అభ్యర్థుల నియామక ప్రక్రియ యొక్క మొదటి దశలో ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన తర్వాత మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ పరీక్షలు ఉంటాయి.
APPSC/TSPSC Sure shot Selection Group
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు 2023: అవలోకనం
SBI PO ప్రిలిమ్స్ నవంబర్ 2023 ప్రారంభంలో నిర్వహించింది దానికి సంభందించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ అభ్యర్థులు SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు 2023 యొక్క సంక్షిప్త అవలోకనాన్ని పొందవచ్చు.
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు 2023: అవలోకనం |
|
సంస్థ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
పరీక్ష పేరు | SBI PO ప్రిలిమ్స్ పరీక్ష 2023 |
పోస్ట్ | ప్రొబేషనరీ ఆఫీసర్ |
ఖాళీలు | 2000 |
విభాగం | ఫలితాలు |
SBI PO ప్రిలిమ్స్ పరీక్షా తేదీ | 21 నవంబర్ 2023 |
అధికారిక వెబ్ సైటు | www.sbi.co.in/careers |
SBI PO ప్రిలిమ్స్ ఫలితాల 2023 లింక్
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు 2023 కీ వెలువడ్డాయి. SBI తన అధికారిక వెబ్ సైటు లో ఫలితాలను విడుదల చేసింది నవంబర్ 21 నుంచి ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు ఎదురుచూస్తున్న అభ్యర్ధుల కోసం కోసం SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను 2023ని తనిఖీ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అందించాము. ఫలితాల స్థితిని తనిఖీ చేయడానికి, అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హులా కాదా అని తెలుసుకోవడానికి SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు తనిఖీ చెయ్యాలి.
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు 2023 లింక్ 1 తనిఖీ చెయ్యండి
SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు 2023 లింక్ 2 తనిఖీ చెయ్యండి
SBI PO ప్రిలిమ్స్ 2023 పరీక్షలో మీరు విజయం సాధించారా? అయితే మాతో పంచుకోండి
SBI PO ఫలితాలను 2023ని డౌన్‌లోడ్ చేయడానికి దశలు
అభ్యర్ధులు SBI PO ప్రిలిమ్స్ 2023 ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది చర్చించిన దశలను తప్పక అనుసరించాలి:
దశ 1: SBI అధికారిక వెబ్‌సైట్, https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careersని సందర్శించండి.
దశ 2: హోమ్‌పేజీలో “తాజా ప్రకటనలు” విభాగం కోసం చూడండి.
దశ 3: SBI PO రిక్రూట్‌మెంట్ 2023 కింద SBI PO ప్రిలిమ్స్ ఫలితం 2023 లింక్ కోసం శోధించండి.
దశ 4: ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి మరియు అభ్యర్థులు కొత్త పేజీకి దారి మళ్లించబడతారు.
దశ 5: SBI PO ఫలితం 2023ని యాక్సెస్ చేయడానికి దరఖాస్తు ప్రక్రియ సమయంలో అందించిన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీ నమోదు చేసి, ఆపై సబ్‌మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
దశ 6: SBI PO ప్రిలిమ్స్ ఫలితం 2023 వెలువాడుతుంది. భవిష్యత్ సూచన కోసం దీన్ని చూసి మరియు డౌన్‌లోడ్ చేసుకోండి.
దశ 7: భవిష్యత్తు అవసరాల కోసం ఫలితం యొక్క ప్రింటవుట్ తీసుకోవడం మంచిది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ యొక్క తదుపరి దశలలో ఈ ముద్రిత కాపీ అవసరం కావచ్చు.
SBI PO ఫలితాలు 2023లో పేర్కొనబడిన వివరాలు
SBI PO ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అభ్యర్థులు దానిపై పేర్కొన్న వివరాలు సరైనవని నిర్ధారించుకోవాలి. వివరాల జాబితా క్రింది విధంగా ఉంది:
- అభ్యర్థి పేరు.
- రిజిస్ట్రేషన్ నంబర్
- రోల్ నంబర్
- వర్గం
- ఫలితాల స్థితి
- పొందిన మార్కులు
- కట్-ఆఫ్ మార్కులు
SBI PO ప్రిలిమ్స్ 2023 కట్ ఆఫ్ మార్కులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI PO ప్రిలిమ్స్ ఫలితాలతో పాటు SBI PO కట్ ఆఫ్‌ను విడుదల చేసింది. అభ్యర్థుల కోసం SBI PO ప్రిలిమ్స్ 2023 కట్ ఆఫ్ మార్కులను ఇక్కడ అందించాము.
SBI PO ప్రిలిమ్స్ 2023 కట్ ఆఫ్ మార్కులు |
|
విభాగము | కట్ ఆఫ్ మార్కులు |
General/EWS/OBC | 59.25 |
SC | 53 |
ST | 47.50 |
IDBI ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ 2023 తనిఖీ చెయ్యండి
SBI PO ఆర్టికల్స్
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |