SCCL జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్దు చేయబడింది: తెలంగాణా హైకోర్టు సింగరేణి SCCL జూనియర్ అసిస్టెంట్ పరీక్ష 2023ని రద్దు చేసింది. SCCLలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 4 సెప్టెంబరు 2022న నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు 28 ఆగస్టు 2023న తీర్పు వెలువరించింది. పరీక్ష నిర్వహణలో లోపాలను లేవనెత్తుతూ హైకోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఇంతకాలం ఫలితాలు విడుదల చేయలేదు.
APPSC/TSPSC Sure shot Selection Group
సింగరేణి SCCL జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాల 2023పై హైకోర్టు స్టే విధించింది
సింగరేణి జూనియర్ అసిస్టెంట్: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలు, విద్యార్హతలు తదితర అంశాల్లో అవకతవకలు జరిగాయని కొందరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్లు తమ వాదనకు ఆధారాలు చూపించారని పేర్కొన్న హైకోర్టు, తదుపరి నిర్ణయం వెలువడే వరకు సింగరేణి SCCL జూనియర్ అసిస్టెంట్ పరీక్ష రద్దు చేయాలని ఆదేశించింది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 04 సెప్టెంబర్ 2022న జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు జరిగిన పరీక్షల నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చాయి. పరీక్షలను పక్కాగా నిర్వహించామని సింగరేణి అధికారులు, జేఎన్ టీయూ అధికారులు చెబుతున్నా.. పరీక్ష రోజునే కొందరు అభ్యర్థులను ప్రత్యేక శిక్షణ కోసం గోవాకు తీసుకెళ్లి పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే సింగరేణి యాజమాన్యం, జేఎన్టీయూ అధికారులు హడావుడిగా పరీక్ష ఫలితాలను 10 సెప్టెంబర్ 2022న విడుదల చేశారు.
SCCL జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |