Telugu govt jobs   »   Current Affairs   »   Singer Jayaraj has been selected for...

Singer Jayaraj has been selected for ‘Kaloji Narayana Rao Award’ 2023 | ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023కి గాయకుడు జయరాజ్ ఎంపికయ్యారు

Singer Jayaraj has been selected for ‘Kaloji Narayana Rao Award’ 2023 | ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ 2023కి గాయకుడు జయరాజ్ ఎంపికయ్యారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ గ్రహీతను ప్రకటించింది. ప్రముఖ కవి, గేయ రచయిత మరియు గాయకుడు జయరాజ్ ఈ అవార్డు ని సొంతం చేసుకున్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సుల మేరకు సీఎం కేసీఆర్ జయరాజ్ను ఎంపిక చేశారు.

ఈ నెల 9న కాళోజీ జయంతి వేడుకల సందర్భంగా అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో జయరాజ్ కు ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డులో రూ.1,01,116 నగదు బహుమతి, స్మారక జ్ఞాపిక మరియు శాలువాతో సత్కరించనున్నారు.

మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన ఆయన వివక్ష లేని సమసమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. బుద్ధుడి బోధనలకు ప్రభావితమై అంబేడ్కర్ రచనలతో స్ఫూర్తి పొందారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో అలుపెరగకుండా పల్లెపల్లెనా తిరుగుతూ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో జయరాజ్ కీలక పాత్ర పోషించారు. ప్రకృతి సౌందర్యాన్ని చాటిచెబుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ అనేక పాటలు రాశారు. అతని సాహిత్య రచనలు విస్తృత ప్రజాదరణ పొందాయి మరియు పాఠకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని పొందిన అనేక పుస్తకాలను రచించారు.

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

కాళోజీ నారాయణరావు ఏ రాష్ట్రానికి చెందినవారు?

ప్రజాకవి (ప్రజల కవి) అని కూడా పిలువబడే కాళోజీ నారాయణరావు ప్రస్తుత తెలంగాణలో తెలుగు కవి, వక్త మరియు రాజకీయ నాయకుడు. 1914 సెప్టెంబరు 9న కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని రత్తినహళ్లి అనే గ్రామంలో జన్మించారు.