Telugu govt jobs   »   Telangana Movement & State Formation   »   Telangana Movement & State Formation

Telangana Movement- Spread of Telangana Ideology, Download PDF | తెలంగాణ భావజాల వ్యాప్తి

తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సంస్థల కృషి

తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్:

  • 1992లో మనోహర్‌ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు.
  • పి.జి.సిలబస్ లో ఆధునిక తెలంగాణ సాహిత్యంలో వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ప్రజలమనిషి అనే నవలను చేర్చాలని ఉద్యమించి విజయం సాధించారు.
  • ఈ ఆర్గనైజేషన్ ఉస్మానియా క్యాంపస్ లో 1993 ఏప్రిల్ 4,5 తేదీలలో చిన్న రాష్ట్రాల సదస్సును నిర్వహించింది.
  • ఈ సదస్సులో పాల్గొన్న జాతీయ పార్టీ నాయకుడు – జార్జ్ ఫెర్నాండేజ్
  • తెలంగాణలోని ఎయిడెడ్ కళాశాలల్లో ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీలను పూరించడానికి ఆంధ్ర ప్రాంతం వారిని తెలంగాణకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
  • ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా 1994లో మనోహర్ రెడ్డి నిరాహారదీక్ష చేశారు.
  • ఈ నిరాహారదీక్షకు తలొగ్గిన ప్రభుత్వం బదిలీలను నిలిపివేసింది.

General Awareness Quiz in Telugu, 28th August 2023_70.1APPSC/TSPSC Sure shot Selection Group

తెలంగాణ ఉద్యమ వేదికలు

తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో పలువురు తెలంగాణ వాదులు వివిధ జిల్లాలలో, వివిధ పేర్లతో ఉద్యమ వేదికలను ఏర్పాటు చేశారు.

  • తెలంగాణ చైతన్యవేదిక – మెదక్
  • తెలంగాణ ఉద్యమవేదిక – మహబూబ్ నగర్
  • తెలంగాణ పోరాట వేదిక – నల్గొండ
  • తెలంగాణ ప్రజావేదిక – రంగారెడ్డి

సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్

  • రాష్ట్రంలోని సినిమా, వార్తాపత్రికలు, ఇతర మీడియా సంస్థలు తెలంగాణేతరుల చేతులలో ఉండడం వలన వారు తెలంగాణ పట్ల కొంత వ్యతిరేకంగా ప్రవర్తించారు.
  • ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ప్రపంచ దృష్టికి వాస్తవాలను అందించడానికి ప్రజాసంఘాల నాయకులు ప్రయత్నించారు.
  • ఈ ప్రయత్నాలలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1997లో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ను స్థాపించారు.

తెలంగాణ ప్రగతి వేదిక

  • తెలంగాణ సమస్యలపై చర్చించడానికి 1997 జూలెలో రెండు రోజుల సదస్సు రాపోలు ఆనందభాస్కర్ నేతృత్వంలో హైదరాబాద్లో జరిగింది.
  • ఈ సదస్సు అనంతరం రాపోలు ఆనందభాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి వేదిక 1997 జూలై 13న ఏర్పడింది.
  • ఈ వేదిక బతకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.
  • ఆ తరువాతి కాలంలో తెలంగాణ ఐక్యవేదిక ఆవిర్భవించడంతో తెలంగాణ ప్రగతి వేదిక అందులో ఒక భాగస్వామి సంస్థగా పనిచేసింది.

తెలంగాణ స్టడీస్ ఫోరం

  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ స్టడీస్ ఫోరం 1998 లో ఏర్పాటయింది. 
  • ఈ ఫోరం ఏర్పాటులో కీలకపాత్రను పోషించినవారు : గాదె ఇన్నయ్య, నిర్మల, పిట్టల శ్రీశైలం
  • ఈ ఫోరం తెలంగాణ సమస్యలపై కరపత్రాలు, పుస్తకాలను ముద్రించి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం వరకు అలుపెరగని పోరాటాన్ని కొనసాగించింది.

ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ ప్రెషన్ సభా

  • 1997లో హైదరాబాద్ లోని మొజాంజాహి మార్కెట్ దగ్గర గల అశోక్ థియేటర్ లో ‘ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ ప్రెషన్’ పేరుతో సభను నిర్వహించారు.
  • జర్నలిస్టు గూలాం రసూల్ ఖాన్ ఎన్ కౌంటర్‌ ను ఖండించడానికి కవులు, కళాకారులు ఈ సభను నిర్వహించారు.
  • ఈ సభలో గద్దర్ తను రాసిన ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా‘ పాటను మొదటిసారిగా పాడాడు.
  • తెలంగాణకు జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలపై ప్రభుత్వ శాఖల నుండి సేకరించిన సమాచారంతో గాదె ఇన్నయ్య ముద్రించిన ‘దగాపడ్డ తెలంగాణ’ పుస్తకమును ఈ సదస్సులో ఆవిష్కరించారు.
  • ఈ సదస్సులోనే భువనగిరి సభ సమావేశాన్ని (1997 మార్చి 8న) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

O. U. ఫోరం ఫర్ తెలంగాణ

  • సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ వారికి జరుగుతున్న నష్టాల గురించి చర్చించడానికి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రొఫెసర్ లక్ష్మణ్ అధ్యక్షతన ఒక అవగాహన సదస్సు జరిగింది.
  • ఈ సదస్సుకు ముఖ్య అతిధి – దాశరధి కృష్ణమాచార్యులు.
  • ఈ సదస్సులోనే ఓ.యు. ఫోరం ఫర్ తెలంగాణ అనే ప్రజాసంఘం ఏర్పడింది.
  • దీనికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ నియమితులయ్యారు.
  • నూతన సంవత్సరం సందర్భంగా 1988లో తెలంగాణ మ్యాప్ తో కూడిన మాతెలంగాణ గ్రీటింగ్స్ ను పంపిణీ చేసింది.
  • అంతేగాకుండా క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది 
  • తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తో కలిసి ఓ.యు. ఫోరం ఫర్ తెలంగాణ కాళోజీ చేతుల మీదుగా ‘తెలంగాణ పొలిటికల్ మ్యాప్’ను విడుదల చేసింది.ఇదే తెలంగాణ మొదటి పొలిటికల్ మ్యాప్ అని చాలామంది పేర్కొంటున్నారు.
  • ఈ ఫోరం సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, నవంబర్ 1ని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఉస్మానియాలో అవగాహన సదస్సులు నిర్వహించింది.
  • అదేవిధంగా ఈ ఫోరం చిన్న రాష్ట్రాల సదస్సులను 1988, 1996 లలో నిర్వహించింది.
  • ఈ సదస్సులలో పాల్గొన్న ముఖ్యనాయకులు : జార్జ్ ఫెర్నాండెజ్ , టూమర్ (నాగాలాండ్)
  • ఈ సంస్థ విద్యార్థులలో, అధ్యాపకులలో భావజాలం వ్యాప్తి చేయడంలో క్రియాశీలకపాత్ర పోషించింది.
  • ఈ సంస్థ టి.ఆర్.ఎస్. పార్టీ ఏర్పడిన సమయంలో ఆ పార్టీపై అవగాహన కల్పించడానికి 2001 మే లో ఠాగూర్ ఆడిటోరియంలో కె.సి.ఆర్. ను ఆహ్వానించి భారీ సభను నిర్వహించింది.

మంజీర రచయితల సంఘం – సిద్దిపేట సదస్సు

  • 1997 ఆగస్టు నెలలో రచయితలు, ఉద్యోగులు కలిసి తెలంగాణపై సిద్దిపేట పట్టణంలో సదస్సును నిర్వహించారు.
  • ఈ సభ సమావేశంలోనే నందిని సిధారెడ్డి రాసిన ‘నాగేటి సాళ్లల్ల – నా తెలంగాణ’ పాట వచ్చింది.
  • ఈ విధంగా తెలంగాణ భావజాల ప్రచారం కోసం 1990 నుండి 1997 వరకు తెలంగాణలోని ప్రధాన నగరాలలో చాలా సమావేశాలు జరిగాయి.

మల్లేపల్లి రాజం ట్రస్ట్

  • మల్లేపల్లి లక్ష్మయ్యకు చిన్నాన్న అయిన మల్లేపల్లి రాజం యొక్క స్మారకార్థం ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున తన స్వగ్రామమైన జనగామాలో స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించేవారు.
  • ఆ విధంగా 1997 జనవరిలో జయశంకర్ సార్ తో స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఏమి జరుగుతున్నది అనే అంశంపై జయశంకర్‌సార్ ఉపన్యసించారు.
  • ఉద్యమానికి ఈ ఉపన్యాస అవసరాన్ని గుర్తించిన మల్లేపల్లి లక్ష్మయ్య ఈ ఉపన్యాసాన్ని ” తెలంగాణ లో ఏం జరుగుతుంది?” అనే పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు.
  • ఈ పుస్తకమును జనవరిలో అశోక థియేటర్ (హైదరాబాదు)లో జరిగిన తెలంగాణ సభ ఆవిష్కరించారు.

Telangana Movement- Spread of Telangana Ideology, Download PDF

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్ 

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు 
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – 1969 ఉద్యమానికి కారణాలు
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం యొక్క సంక్షిప్త చరిత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

What were the main reasons behind the Telangana Movement?

The movement was driven by grievances related to social inequities, unequal land distribution, and historical exploitation in the Telangana region.

What was the Telangana Movement?

The Telangana Movement was a socio-political movement in India that aimed to create a separate state of Telangana within Andhra Pradesh.