State level best panchayat in Telangana|తెలంగాణరాష్ట్రం లో ఉత్తమ పంచాయతీలు
తెలంగాణలో 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్రం నిర్దేశించిన 9 అంశాల్లో ప్రమాణాల ప్రాతిపదికన వీటికి పురస్కారాలివ్వాలని నిర్ణయించింది. మొత్తం 43 పంచాయతీలకు 47 పురస్కారాలు లభించాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖా-కె పంచాయితీకి 3 విభాగాల్లో, వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మరియపురం 2 విభాగాల్లో పురస్కారాలకు ఎంపికయ్యాయి, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా పంచాయతీకి 2 ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది. దీంతో పాటు ఈ గ్రామాలను జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ విభాగం కింద పోటీకి రాష్ట్రం తరఫున ఎంపిక చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులకు హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర మంత్రుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరగనుంది.
వీటితో పాటు రాష్ట్రంలో ఉత్తమ శిక్షణ సంస్థలుగా.
1.రాజేంద్రనగర్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (టీఎస్ఐఆర్డీ)
- రాజేంద్రనగర్ విస్తరణ కేంద్రం (ఈటీసీ)
- హసనపర్తిలోని విస్తరణ కేంద్రాల (ఈటీసీ)ను పురస్కారాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***********************************************************************************************************************