SWC5th Edition awarded India’s Most Innovative Sustainability Project of the Year to Sri City | SWC5వ ఎడిషన్ లో భారతదేశపు అత్యంత వినూత్నమైన సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని శ్రీ సిటీ పొందింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తిరుపతి జిల్లా లో ఉన్న శ్రీసిటీ కి అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోనే ప్రముఖ సంస్థ బిజినెస్ వరల్డ్ ముంబై వేదికగా జరిగిన 5వ సస్టైనబూల్ వరల్డ్ కాన్క్లేవ్ (SWC)ఎడిషన్ లో శ్రీసిటీ కి సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. దేశం మొత్తం మీద ఉన్న అన్నీ నగరాలలోకి శ్రీసిటీ కి ఈ అవార్డు దక్కడం ఎంతో గర్వకారణం. బిజినెస్ వరల్డ్ ఛైర్మన్ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్ డా.అనురాగ్ ఈ అవార్డుని ప్రధానం చేశారు. ఈ సందర్భంగా శ్రీసిటీ లో ఉన్న సుస్థిరమైన పట్టణీకరణ అభివృద్ధి చర్యలను తెలిపారు. ఈ అవార్డు అందుకున్న శ్రీసిటీ ఎండి డా.రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుకూలమైన చర్యలు చేపట్టడంలో శ్రీసిటీ కి ఈ అవార్డు నిదర్శనం అని తెలిపారు.
Sharing is caring!