Telangana Budget MCQS Questions And Answers in Telugu: Telangana Budget is an important topic in every competitive exam. here we are giving the Telangana Budget Section which provides you with the best compilation of Telangana Budget .Telangana Budget is a major part of the exams like TSPSC GROUP-2 & 3. Many aspirants for government exams have benefited from our website now it’s your turn.
This is the best site to find recent updates on Telangana Budget not only for competitive exams but also for interviews.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Telangana Budget MCQs Questions And Answers in Telugu (తెలుగులో)
Q1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2023 – 24 ప్రవేశ పెట్టె సమయం లో JNTU యొక్క ఏ క్యాంపస్ ని ఫార్మా హబ్ గా చేయనున్నట్టు గా ప్రకటించింది. ?
- సుల్తాన్ పూర్
- హైదరాబాద్
- మంథని
- వనపర్తి
Q2. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 2023 – 24 యొక్క కేటాయింపుల లో సరి కానిది ఏది. ?
- నీటి పారుదల రంగం – రూ. 26,885 కోట్లు
- వ్యవసాయ రంగం – రూ. 26,831 కోట్లు
- ఆయిల్ ఫామ్ సాగు కోసం – రూ. 1000 కోట్లు
- దళిత బంధు పథకానికి – రూ. 15,700 కోట్లు
Q3. తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయానికి సంబందించి కింది వ్యాఖ్యలను గమనించండి.
- 2013 – 14 సంవత్సరం లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం : రూ. 1,12,162
- 2022 – 23 సంవత్సరం లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం : రూ. 3,17,115
- 2022 – 23 సంవత్సరానికి సంబందించి తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం భారత దేశం యొక్క తలసరి ఆదాయం కన్నా 86% ఎక్కువ ఉన్నది.
పై అంశాలను గమనించి కింద ఇచ్చిన 4 ఆప్షన్ల లో సరైన దానిని ఎన్నుకొనుము.
- 1 మాత్రమే సరైనది
- 1 మరియు 2 మాత్రమే సరైనవి
- 2 మరియు 3 మాత్రమే సరైనవి
- 1, 2, 3 అన్నియు సరైనవి
Q4. తెలంగాణ రాష్ట్రానికి సంబందించి విద్యుత్ సామర్థ్యం యొక్క గణాంకాలను గమనించండి.
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయం లో విద్యుత్ సామర్థ్యం : 7778 మెగా వాట్లు
- ప్రస్తుత విద్యుత్ సామర్థ్యం : 18,453 మెగా వాట్లు
- 2023 – 24 బడ్జెట్ లో విద్యుత్ ఉత్పత్తి కి 12,727 కోట్లు కేటాయించారు.
పై అంశాలను గమనించి కింద ఇచ్చిన 4 ఆప్షన్ల లో సరైన దానిని ఎన్నుకొనుము.
- 1 మాత్రమే సరైనది
- 1 మరియు 2 మాత్రమే సరైనవి
- 2 మరియు 3 మాత్రమే సరైనవి
- 1, 2, 3 అన్నియు సరైనవి
Q5. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 2023 – 24 యొక్క కేటాయింపుల లో సరి కానిది ఏది. ?
- షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక నిధి కోసం – రూ. 36,750 కోట్లు
- షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక నిధి కోసం – రూ. 15,233 కోట్లు
- కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ కోసం : రూ. 3210 కోట్లు
- రైతు బంధు పథకం కోసం : రూ. 13,075 కోట్లు
Q6. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ – 2023 ప్రకారం ప్రస్తుత ధరల లో తెలంగాణ రాష్ట్రం యొక్క GSDP మరియు GSDP వృద్ధి రేటు ఏవి. ?
- 11.27 లక్షల కోట్లు మరియు 14.6 % వృద్ధి రేటు
- 13.27 లక్షల కోట్లు మరియు 15.6 % వృద్ధి రేటు
- 11.27 లక్షల కోట్లు మరియు 14.9 % వృద్ధి రేటు
- 13.27 లక్షల కోట్లు మరియు 15.9 % వృద్ధి రేటు
Q7. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ – 2023 ప్రకారం ప్రస్తుత ధరల లో భారత దేశం యొక్క GDP లో తెలంగాణ రాష్ట్రం యొక్క GSDP వాటా ఎంత ?
- 4.5 %
- 4.6 %
- 4.7 %
- 4.9 %
Q8. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ – 2023 ప్రకారం ప్రస్తుత ధరల లో వివిధ రంగాల వారి వాటా ల లో సరి కానిది ఎంచుకొనుము. ?
- వ్యవసాయ రంగం యొక్క వాటా – 18.2 %
- పరిశ్రమల రంగం యొక్క వాటా – 19 %
- సేవల రంగం యొక్క వాటా – 62.8 %
- అన్నీ సరైనవే
Q9. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ – 2023 ప్రకారం ( ప్రస్తుత ధరల లో ) అత్యధిక GDDP గల మొదటి 3 జిల్లా లు ఏవి. ?
- రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి
- రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి
- హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి
- హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి
Q10. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ – 2023 ప్రకారం ( ప్రస్తుత ధరల లో ) అత్యల్ప GDDP గల చివరి 3 జిల్లా లు ఏవి. ?
- ములుగు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నారాయణ పేట్
- జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నారాయణ పేట్
- కొమురం భీమ్ ఆసిఫాబాద్, నారాయణ పేట్, వనపర్తి
- ములుగు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వనపర్తి
SOLUTIONS
S1. Ans(a)
Sol. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టె సమయం లో JNTU యొక్క సుల్తాన్ పూర్ క్యాంపస్ ని ఫార్మా హబ్ గా చేయనున్నట్టు గా ప్రకటించింది.
S2. Ans(d)
Sol. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 2023 – 24 యొక్క కేటాయింపులు
నీటి పారుదల రంగం – రూ. 26,885 కోట్లు
వ్యవసాయ రంగం – రూ. 26,831 కోట్లు
ఆయిల్ ఫామ్ సాగు కోసం – రూ. 1000 కోట్లు
దళిత బంధు పథకానికి – రూ. 17,700 కోట్లు
S3. Ans(d)
Sol. 2013 – 14 సంవత్సరం లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం : రూ. 1,12,162
2022 – 23 సంవత్సరం లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం : రూ. 3,17,115
2022 – 23 సంవత్సరానికి సంబందించి తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం భారత దేశం యొక్క తలసరి ఆదాయం కన్నా 86% ఎక్కువ ఉన్నది.
S4. Ans(d)
Sol. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయం లో విద్యుత్ సామర్థ్యం : 7778 మెగా వాట్లు
ప్రస్తుత విద్యుత్ సామర్థ్యం : 18,453 మెగా వాట్లు
2023 – 24 బడ్జెట్ లో విద్యుత్ ఉత్పత్తి కి 12,727 కోట్లు కేటాయించారు.
S5. Ans(d)
Sol. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 2023 – 24 యొక్క కేటాయింపులు
షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక నిధి కోసం – రూ. 36,750 కోట్లు
షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక నిధి కోసం – రూ. 15,233 కోట్లు
కళ్యాణ లక్ష్మీ మరియు షాదీ ముబారక్ కోసం : రూ. 3210 కోట్లు
రైతు బంధు పథకం కోసం : రూ. 15,075 కోట్లు
S6. Ans(b)
Sol. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ – 2023 ప్రకారం ప్రస్తుత ధరల లో తెలంగాణ రాష్ట్రం యొక్క GSDP 13.27 లక్షల కోట్లు మరియు GSDP వృద్ధి రేటు 15.6 %
S7. Ans(d)
Sol. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ – 2023 ప్రకారం ప్రస్తుత ధరల లో భారత దేశం యొక్క GDP లో తెలంగాణ రాష్ట్రం యొక్క GSDP వాటా : 4.9 %
S8. Ans(d)
Sol. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ – 2023 ప్రకారం ప్రస్తుత ధరల లో వివిధ రంగాల వారి వాటా :
వ్యవసాయ రంగం యొక్క వాటా – 18.2 %
పరిశ్రమల రంగం యొక్క వాటా – 19 %
సేవల రంగం యొక్క వాటా – 62.8 %
S9. Ans(a)
Sol. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ – 2023 ప్రకారం ( ప్రస్తుత ధరల లో ) అత్యధిక GDDP గల మొదటి 3 జిల్లా లు : రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి
S10. Ans(a)
Sol. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ – 2023 ప్రకారం ( ప్రస్తుత ధరల లో ) అత్యల్ప GDDP గల చివరి 3 జిల్లా లు : ములుగు(33), కొమురం భీమ్ ఆసిఫాబాద్(32), నారాయణ పేట్(31)
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |