తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క జూలై 25న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆయన అసెంబ్లీలో రూ.2,91,159 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు, ఇందులో మూలధన వ్యయం రూ.33,487 కోట్లు ఉంది. పన్ను ఆదాయం రూ.1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూ.26,216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు రూ.21,636.15 కోట్లు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
Adda247 APP
తెలంగాణ బడ్జెట్ 2024-25 కేటాయింపులు:
- ఆర్థిక లోటు అంచనా: రూ.49,255.41 కోట్లు
- ప్రాథమిక లోటు అంచనా: రూ.31,525.63 కోట్లు
- రెవెన్యూ మిగులు అంచనా: రూ.297.42 కోట్లు
- వ్యవసాయానికి: రూ.72,659 కోట్లు
- ఉద్యానశాఖకు: రూ.737 కోట్లు
- పశుసంవర్ధశాఖకు: రూ.1,980 కోట్లు
- రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి: రూ.723 కోట్లు
- గృహజ్యోతికి: రూ.2,418 కోట్లు
- ప్రజాపంపిణీ వ్యవస్థకు: రూ.3,836 కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు: రూ.29,816 కోట్లు
- స్త్రీ, శిశు సంక్షేమానికి: రూ.2,736 కోట్లు
- ఎస్సి సంక్షేమం: రూ.33,124 కోట్లు
- ఎస్టీ సంక్షేమం: రూ.17,056 కోట్లు
- మైనార్టీ సంక్షేమం: రూ.3,003 కోట్లు
- బీసీ సంక్షేమం: రూ.9,200 కోట్లు
- వైద్య, ఆరోగ్యం: రూ.11,468 కోట్లు
- ట్రాన్స్కో, డిస్కంలకు: రూ.16,410 కోట్లు
- అడవులు, పర్యావరణం: రూ.1,064 కోట్లు
- పరిశ్రమల శాఖకు: రూ.2,762 కోట్లు
- ఐటీ శాఖకు: రూ.774 కోట్లు
- నీటిపారుదల రంగానికి: రూ.22,301 కోట్లు
- విద్యకు: రూ.21,292 కోట్లు
- హోంశాఖకు: రూ.9,564 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు: రూ.5,790 కోట్లు
కేంద్రం రూపొందించిన EPFO పధకాలు
మాదకద్రవ్యాల నియంత్రణ:
- యువతను మాదకద్రవ్యాల ప్రభావం నుండి రక్షించేందుకు హోం శాఖకు రూ.9,564 కోట్లు కేటాయించారు.
- తెలంగాణ మాదకద్రవ్య నిరోధక సంస్థను బలోపేతం చేయడానికి తగిన సౌకర్యాలు కల్పిస్తారు.
- విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి, 4,137 మంది విద్యార్థులను యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా నియమించారు.
- మాదకద్రవ్యాల వల్ల జరిగే హానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖుల సహకారం తీసుకుంటారు.
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి:
- వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు కేటాయించారు.
- రైతు భరోసా సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు.
- బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదు, విలువలు, ఆశల వ్యక్తీకరణ కూడా.
- ఈ ఏడాదిలోనే రైతు కూలీలకు రూ.12వేలు అందించే బృహత్తర కార్యక్రమం చేపడతారు.
- పీఎం ఫసల్ బీమా యోజనలో చేరాలని నిర్ణయించారు.
- రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- వరి రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు.
వంట గ్యాస్:
- పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర నుంచి ఊరట కల్పించేందుకు మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంటగ్యాస్ సిలిండరు ప్రారంభించారు.
- ఈ పథకం వల్ల 39,57,637 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు.
- బడ్జెట్లో గ్యాస్ సిలిండర్ల కోసం రూ.723 కోట్లు కేటాయించారు.
ఉచిత విద్యుత్:
- గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్న వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తారు.
- డిస్కంలు సున్నా బిల్లులు జారీ చేస్తాయి, ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లిస్తుంది.
- జూలై 15 నాటికి 45,81,676 ఇళ్లలో ఉచిత విద్యుత్ అందించారు.
- ఈ బడ్జెట్లో ఉచిత విద్యుత్కు రూ.2,418 కోట్లు కేటాయించారు.
గృహ నిర్మాణం:
- నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.
- ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6 లక్షలు చెల్లిస్తారు.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందిస్తారు.
- పూర్తికాని ఇళ్లను త్వరగా పూర్తి చేస్తారు.
కేంద్ర బడ్జెట్ 2024-25 ముఖ్యమైన అంశాలు
రైతు భరోసా:
- 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తారని, ఇప్పటి వరకు రూ.10,556 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశారని చెప్పారు.
- అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15,000 చెల్లిస్తారు.
- సన్న రకం వరి ధాన్యాలను పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తారు.
రాజధాని అభివృద్ధి:
- హైదరాబాద్ నగర అభివృద్ధికి భారీగా రూ. 10వేల కోట్లు కేటాయించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూ.1500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు, పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు.
- ప్రస్తుతం మూడు ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉంది. వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో, ప్రభుత్వం 78.4 కి.మీ. పొడవున్న 5 అదనపు కారిడార్లను రూ.24,042 కోట్లతో అభివృద్ధి పరుస్తుంది. ఇందులో భాగంగా మెట్రో రైలును పాతనగరానికి పొడిగించి దానిని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేయనున్నారు.
- ప్రస్తుతమున్న కారిడార్లను నాగోలు నుంచి ఎల్.బి.నగర్ వరకు విస్తరించారు. నాగోలు, ఎల్.బి నగర్, చంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ ఛేంజ్ స్టేషన్లగా అభివృద్ధి చేస్తాం. మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు, ఎల్.బి.నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం.
- “ఓఆర్ఆర్ పరిధిలో విపత్తుల నిర్వహణకు ఒక ఏకీకృత సంస్థ ఏర్పాటు. జీహెచ్ఎంసీ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి.
Economic Survey 2023-24 Key Highlights In Telugu
మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు:
- మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కి.మీ. పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం. నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య, నివాస కేంద్రాలు, పాత హెరిటేజ్ ప్రాంతాలకు కొత్త సొబగులు.
- మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు, పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్ల అభివృద్ధి. లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నదీ పరివాహక అభివృద్ధి తరహాలో మూవీ అభివృద్ధి. హైదరాబాద్ నగరాభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూ.1,500 కోట్లు ప్రతిపాదన.
- హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట, GHMC, HMDA, సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు GHMC పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 5.3,065
- HMDA పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు. మెట్రో వాటర్ వర్క్స్ కి రూ.3,385 కోట్లు ప్రతిపాదన. హైడ్రాకి రూ.200 కోట్లు
- ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.200 కోట్లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి రూ.500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి రూ.500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్టు సిస్టమ్ కోసం రూ.50 కోట్లు
- రీజనల్ రింగ్ రోడ్ (RRR)తో అభివృద్ధి మరింత వేగవంతం. ఉత్తర ప్రాంతంలోని 158.6 కి.మీ. పొడవున్న సంగారెడ్డి- తూప్రాన్ గజ్వేల్ చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కి.మీ.ల పొడవున్న చౌటుప్పల్ షాద్ నగర్-సంగారెడ్డి రోడ్డును, జాతీయరహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన.
- రీజనల్ రింగు రోడ్డు హైదరాబాద్ నగర ఉత్తర-దక్షిణ ప్రాంతాలనూ, తూర్పు-పశ్చిమ ప్రాంతాలనూ కలుపుతూ జాతీయరహదారి నెట్వర్క్ అనుసంధానం,
- ఎక్స్ప్రెస్వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లేన్లతో నిర్మించి దానిని ఎనిమిది లేన్ల • సామర్థ్యానికి విస్తరణ.
- ‘ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్.ఆర్.ఆర్ ఉత్తర ప్రాంత అభివృద్ధికి రూ.13,522 కోట్లు. దక్షిణ ప్రాంతాభివృద్ధికి రూ.12,980 కోట్లు ఖర్చు. దీనికోసం బడ్జెట్లో ప్రస్తుతం రూ.1525 కోట్ల ప్రతిపాదన.
Telangana Budget 2024-25 Highlights Telugu PDF
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |