Telugu govt jobs   »   State GK   »   Telangana economy in United AP (1956-2014)

Telangana Economy in United AP (1956-2014) | ఉమ్మడి APలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956-2014)

Telangana Economy in United AP (1956-2014) 

Telangana was an economically well stabilised before its merger with Andhra state. Since 1956, after the merger Telangana has developed in many fields. Hyderabad was already in a high state and financially well stabilised. Telangana’s glory can be seen in industrial progress.  Telangana is an area rich with improved transport facilities, communication systems, hospitals and schools, Before the merger with Andhra Pradesh. In this Article we are providing of Telangana economy in United AP (1956-2014)

Study Material The most important and prestigious exams in Telangana are TSPSC Group-1,2,3,4, Police, Revenue etc. Many aspirants for these prestigious jobs. Willing to enter. Since it is highly competitive, one can get a job with smart study by choosing high weightage related subjects. Civics, history, geography, economics, science and science, contemporary subjects play an important role in these exams. So Adda247 Telugu for candidates who are interested in this TSPSC Group-1,2,3,4,Police,Revenue etc. exams, below are some important topics related to one of these topics Telangana Economy.

Telangana economy in United AP (1956-2014), Check Details_3.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana economy in United AP (1956-2014) | ఉమ్మడి APలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956 – 2014)

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పటి ఆంధ్రరాష్ట్రము కలయికతో 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు జరిగింది.
  • ఈ ఏర్పాటు మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గురించి 3 దశలలో అధ్యయనం చేయడం జరిగింది.
  • అవి : (1956-1970, 1971-1990, 1991-2014)
  • తెలంగాణ స్థితి గతులకు సంబంధించి 1956- 2014 కాలం “3” భాగాలుగా విభజించవచ్చు.
  1. 1956-1970 విలీనం జరిగిన తరువాతి దశ (1969 ఉద్యమం)
  2. 1971 1990 ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం యొక్క ప్రధాన పాత్ర
  3. 1991 – 2014 ఆర్ధిక సంస్కరణలు అమలు, తదనంతర దశ

First Phase (1956 – 1970) | మొదటి దశ 1956 – 1970

  • 1949 జాగీర్దార్ రద్దు చట్టం అమలు
  • 1950 – హైదరాబాద్ కౌలుదారు చట్టం.
  • 1956 నుండి 12సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి జరిగిన తీరుకి పర్యవసనంగా 1969లో జరిగిన ఉద్యమం అని చెప్పవచ్చు.
  • 1969లో వెలువడిన ప్రాంతీయ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలోని అభివృద్ధి స్థాయి భారతదేశ అభివృద్ధి స్థాయి కంటే ఎక్కువగా ఉందని నిర్ధారించింది. వ్యవసాయం, నీటిపారుదల, విద్య, ప్రసారాలు, రవాణా వంటి రంగాల్లో అభివృద్ధి స్థాయి దేశ ప్రగతి సగటు స్థాయిలో సగం కూడా లేదని ఈ నివేదిక నొక్కి చెప్పింది.
  • 1956-57 సం॥ సాగుకింద ఉన్న మొత్తం భూమి 123.8 లక్షల ఎకరాలు కాగా 1967-68 సం॥ నాటికి అది అదే స్థాయిలో 124.2 లక్షల ఎకరాలుగా ఉంది. అదేవిధంగా నీటి పారుదల క్రింద ఉన్న విస్తీర్ణం. 1956-57లో 23 లక్షల ఎకరాలు కాగా 1967-68 లో కొద్ది మార్పుతో ఇది 26,47 లక్షల ఎకరాలు మాత్రమే.
  • ఈ 1966-68 మధ్యకాలంలో సాగు విస్తీర్ణం, నీటి పారుదల కింద ఉన్న విస్తీర్ణంలో సాధించిన పెరుగుదల నామమాత్రమనే గుర్తించాలి.
  • ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణా సాగుకింద ఉన్న భూభాగం 40% కానీ కీలక ఉత్పాదకాల్లో తెలంగాణ వాటా 1967 – 68 నాటికి 27 % – 35% మాత్రమే.
  • పశుసంపద రెండు ప్రాంతాల్లో సమానంగా ఉన్నప్పటికీ పశు వైద్యశాలలు 1:1.75 నిష్పత్తిలో ఉన్నాయి.
  • గ్రామీణ విద్యుదీకరణ మూడవ వంతు కంటే తక్కువ ఖర్చు జరిగింది. 12.7 కోట్ల వ్యయం గ్రామీణ విద్యుదీకరణ పై ఖర్చు పెట్టవలసి ఉండగా కేవలం 10 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు.
  • రోడ్డు రవాణా, ప్రసారాల పైన 49% ఖర్చు పెట్టినప్పటికి 100 చ.మై. విస్తీర్ణం కేవలం 20 మైళ్లు రోడ్డు మాత్రమే ఉంది.
  • కుమార్ లలిత్ నివేదిక ప్రకారం తెలంగాణ – ఆంధ్రలో 2:2.5 నిష్పత్తిలో వ్యయం జరగవలసి ఉండగా వాస్తవంలో 1:22 నిష్పత్తిలో జరిగింది.
  • రెండవ ప్రణాళిక కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయంలో తెలంగాణ వాటా 45% ఉన్నప్పటికి ఖర్చు పెట్టిన మొత్తం 34% మించలేదు.
  • అదేవిధంగా మూడవ ప్రణాళిక కాలంలో 42.6 తెలంగాణ వాటా ఉన్నా 37% మించి ఖర్చు చేయలేదు, పర్యవసనంగా వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి కావల్సిన ప్రోత్సాహకం లభించలేదు.

నీటి పారుదల స్థితి

  • సాగునీరు వ్యవసాయ అభివృద్ధికి కీలకమైనది.
  • 1956–57 లో తెలంగాణలో స్థూల సాగు కింద ఉన్న భూమిలో 18.5%
  • 1967-68 నాటికి తెలంగాణలో స్థూల సాగు కింద ఉన్న భూమిలో 21.3% పెరిగింది.
  • అదే ఆంధ్రలో 33% నీటి సౌకర్యం కలిగి ఉంది.
  • మూడవ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమకూర్చిన 42% కాగా ప్రణాళిక పథకాలకు పెట్టిన వ్యయం 18.9 కోట్లు లోటు.
  • జనాభా, భూభాగం, వెనకబాటు అనే ‘3’ అంశాల ఆధారంగా ప్రణాళిక వ్యయాన్ని నిర్ణయించవలసి ఉండగా అన్ని వాటాల్లో కూడా 2:1 నిష్పత్తి పాటించి తెలంగాణకు వ్యయం చేయవలసిన మొత్తాన్ని చేయలేదు.
  • రెండవ ప్రణాళిక కాలంలో నీటి పారుదల సామర్థ్యం ఆంధ్ర – తెలంగాణ 2:1 లేదు, ఇది ఆంధ్ర – తెలంగాణ 3.6 1లో ఉంది.

పరిశ్రమలు

  • తెలంగాణలో పరిశ్రమలు వ్యవసాయాధారిత పరిశ్రమలు కావు
  • సహజ వనరుల లభ్యత ప్రకారంగా జిల్లాలు వివిధ పరిశ్రమలు అనుకూలంగా ఉన్నాయి.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి బొగ్గు, ముడి ఇనుము వంటి ఖనిజ ఆధారిత పరిశ్రమలకు అనుకూలంగా ఉండగా ఆదిలాబాద్లో అటవీ వనరుల ఆధారిత పరిశ్రమలకు మెండుగా ఉంది.
  • పారిశ్రామిక అభివృద్ధికి ఎక్కువగ హైద్రాబాద్ పట్టణానికే పరిమితమయింది.
  • పట్టణంలో భూమి, నీరు, విద్యుత్తు, మానవశ్రమ, విరివిరిగా లభించడం వల్ల పరిశ్రమలను స్థాపించారు.
  • ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెద్దగా లేకపోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమల పరంగా వాటా తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్ ‘అన్నపూర్ణ‘ అంటే వ్యవసాయం ప్రధానంగా ఉన్న రాష్ట్రంగా గుర్తింపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల రీత్యా 2/3 వంతు తెలంగాణలోనే ఉన్నవి.
  •  ప్రాంతాలవారిగా పరిశ్రమల మీద కేంద్రం పెట్టిన పెట్టుబడులు తెలంగాణలో 84. 80కోట్లు ఆంధ్రలో 41.71 కోట్లు అదేవిధంగా 1987-66 మధ్య ఫ్యాక్టరీల చట్టంకింద నమోదయిన ఫ్యాక్టరీల సంఖ్య ఆంధ్రలో 12.7% కాగా తెలంగాణలో 2.24% మాత్రమే.

నియామకాలలో అన్యాయం

  • 1961లో తెలంగాణ ప్రాంతీయ కమిటి విడుదల చేసిన మూడవ అనుబంధ నివేదిక ప్రకారం తెలంగాణ ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాలలు ప్రబలుతున్నాయి.
    1. ప్రాంతీయ సర్వీసు నిబంధనలు ఏకీకృత సూత్రం ప్రకారం జరగకపోవడం.
    2. తెలంగాణ ఉద్యోగాల అవకాశాలు పెరిగినప్పటికీ స్థానికేతరులయిన ఆంధ్ర వారు ఎక్కువ శాతం ఉద్యోగాల్లో ప్రవేశించడం.
  •  తెలంగాణ ప్రాంత శ్రేయస్సును కాపాడే విషయంలో తెలంగాణ ప్రాంతీయ మండలి ఏ మాత్రం క్రియా శీలక పాత్ర వహించలేకపోయింది.
  • రాష్ట్రం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే తెలంగాణ ప్రాంతీయ మండలి హోదాను కమిటి స్థాయిని దిగజార్చి విధులు అధికారాలను తగ్గించివేశారు.
  • పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను అమలు పరచవలసిన బాధ్యత ప్రాంతీయ మండలి కమిటీకి ఉండగా, కమిటి బాధ్యతలను తగ్గించిన సందర్భంలో ఒప్పందంలోని అంశాల అమలు జరిగే అవకాశం లేకపోయింది.
  • 1956- 1970 మద్యకాలంలో తెలంగాణలో ఆర్థికాభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. తీవ్ర అసంతృప్తి జ్వాలలే 1969 తెలంగాణ ఉద్యమానికి దారితీశాయి.
  • శ్రీ కృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికలో 53 సం॥ ల పాలనలో ముఖ్యంగా యువత 2.5 లక్షల మేర ఉపాధి కోల్పోయారని వెల్లడించింది.
  • 1956-1968 మద్యకాలంలో ముల్కి నిబంధనలు ఉల్లంఘించి 22100 మంది 1975 రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి 58,962 మంది తెలంగాణేతరులు ఉద్యోగాలలో చేరారని పలు కమిటీలు స్పష్టంగా చేసాయి.
  • 2001లో నాటి ప్రభుత్వం నియమించిన గిర్ గ్లాని ఏకసభ్య కమిషన్ కూడా మొత్తంగా తెలంగాణ ప్రాంతం వారు 2.5లక్షల ఉద్యోగాలు కోల్పోయారని తేల్చింది.

Also Read: Telangana Economy in Telugu

Second Phase (1970 – 1990) | రెండవదశ – 1970 – 1990

  • 1970-1990 మధ్య గల ’20’ సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు సంతరించుకున్నాయి. ఈ దశలోని అభివృద్ధి ప్రక్రియకు ప్రభుత్వ రంగం దిశా నిర్ధేశం చేసిందని చెప్పవచ్చు.
  • తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో వెనకబడి ఉండటానికి కారణాలను ఆర్థిక శాస్త్రవేత్తలు చారిత్రక, సామాజిక అంశాలుగా చూపారు. భారతదేశంలో బీహార్ పరిస్థితి ఎలాంటిదో ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణ పరిస్థితి అటువంటిదే
  • సహజ వనరులు ఉన్నప్పటికి అభివృద్ధిలో వెనకబడటానికి కారణాలు మాత్రం కేవలం చారిత్రక సామాజిక అంశం కాదు. అవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల్లోని వివక్ష అనేది ప్రత్యామ్నాయ దృక్పధం.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల్లో వివక్ష వల్ల ఏర్పడిన అభివృద్ధిని ఆర్థిక వ్యవస్థ ప్రధాన రంగాలయిన వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగం పరిశీలన ద్వారా విశ్లేషించవచ్చు.

వ్యవసాయ రంగం

  • 1980-81 నుండి 1990- 1991 మధ్య కాలంలో వ్యవసాయరంగంలోని స్థూల విలువ వృద్ధిరేటు ఉత్తర తెలంగాణ 22% కాగా దక్షిణ తెలంగాణలో 2.8% అయితే తెలంగాణలో వ్యవసాయం ఎక్కువగా వర్షాధారం కావడం వల్ల అస్థిరత్వం ఎక్కువగా ఉంది.
  • అస్థిరత్వాన్ని కొలవడానికి అస్థిరత్వ సూచిని వాడుతారు ఈ సూచీ దక్షిణ తెలంగాణలో 12.8% కాగా ఉత్తర తెలంగాణలో 11.93% ఉంది. దక్షిణ కోస్తాలో ఈ సూచీ కనిష్టంగా 4.93% గా ఉంది దీని అర్థం ఏమిటంటే రైతుల ఆధీనంలో లేని అంశాలు (వర్షాపాతం, భూసార మార్పులు) వ్యవసాయ ఉత్పత్తిని ఒడిదొడుగులకు లోను చేశాయి.
  • తెలంగాణలో పంటల తీరులో మార్పు వచ్చింది. చిరుధాన్యాలైన సజ్జ, కొర్ర సాము స్థానంలో వరి పంట చేరింది. వాణిజ్యపంటలైన పత్తి, మిర్చి, నూనె గింజలు లాంటి పంటల విస్తీర్ణం పెరిగింది.
  • సాగునీటి పారుదల కింద ఉన్న నికర భూమి మొత్తం 1982-83 నుండి 2002-2003 మధ్య 10.37 లక్షల హెక్టార్ల నుండి 14.91 లక్షల హెక్టార్లకు 2011-12 నాటికి 18.2 లక్షల హెక్టార్లకు పెరిగింది.
  • నీటి పారుదల క్రింద ఉన్న నికర భూమిలో దాదాపు 75% బోరుబావులు ఇతర బావుల కిందనే ఉంది. కాలక్రమేణ చెరువుల క్రింద సేద్యం పడిపోగా కాలువల కింద యథా స్థానంలో ఉండగా బావుల కింద సేద్యం పెరిగిపోయింది.
  • సాగునీటి ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టక పోవడం వల్ల రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న చెరువులు క్షీణించిపోయాయి.
  • బావుల మీద ఆధారపడడం వల్ల సాగు వ్యయం క్షీణించి పోయింది. సాగు వ్యయం ఎక్కువయి భారం అధికమయింది.
  • 2012–13 ‘70’వ (ఎన్ఎస్ఎస్ఓ) నివేదిక ప్రకారం తెలంగాణ రైతులు రుణగ్రహితతో ఉన్న వ్యవసాయ కుటుంబాల సంఖ్య 89%.

విద్యుత్ ఉత్పత్తి, వినియోగం

  • విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూడా తెలంగాణకు న్యాయం జరగలేదు. 1973లో వాటి ఖమ్మం జిల్లా మణుగూరులో పెట్టవలసిన విద్యుత్తు ప్రాజెక్టును విజయవాడకు మార్చి వేశారు.
  • బొగ్గు లభించిన చోటనే విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం జరగవలసి ఉన్నప్పటికీ, అది ఆర్ధికంగా సహేతుకం అయినప్పటికీ ప్రాజెక్టులను వేరే చోట స్థాపించి మొత్తం మీద 1760 పైగా వాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని తెలంగాణ కోల్పోయింది.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు అధ్యక్షుడయిన నార్ల తాతారావు ఆధ్వర్యంలోనే విద్యుత్ ప్రాజెక్టులను తెలంగాణ నుంచి తరలించి ఆంధ్ర, రాయలసీమ నెలకొల్పారు.
  • అలాగే 1966-67 నుంచి -2004-05 వరకు జల విద్యుత్తు ప్రాజెక్టులు (కుంటాల, ప్రాణహిత, ఇచ్చంపల్లి, సింగారెడ్డి, డిండి). రెండు గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు (శంకరపల్లి, నేదునూరు) చేపట్టే ప్రతిపాదన ఉండగా వాటిని పూర్తిగా నిర్లక్ష్యపరచారు. పైన చెప్పిన అన్ని విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 4617 మెగా వాట్ల విద్యుత్తును తెలంగాణ కోల్పోవలసి వచ్చింది.
  • తెలంగాణలో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు కావలసిన అదనపు వోల్టేజి గల ట్రాన్స్ఫార్కర్ల విషయంలో కూడా వివక్ష ఎదురయ్యింది.
  • మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన రాజీవ్ బీమా ఎత్తిపోతల ప్రాజెక్టు కల్వకుర్తిలోని మహాత్మాగాంధీ పథకం నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు కావలసిన సబ్ స్టేషన్ల కేటాయింపులు తగిన రీతిలో చేయలేదు.
  • 1995 నుంచి బోరు బావులు, వ్యవసాయ బావులు ఆధారపడ్డడం బాగా పెరిగింది. బోరుబావుల సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరింది.
  • వీటి కోసం విద్యుత్ అవసరం ఎక్కువ కాగా లభించే విద్యుత్తు తక్కువ సామర్థ్యం గల ట్రాన్స్ ఫార్మర్ల నుంచి తీసుకోవడం వల్ల విద్యుత్ నాణ్యత తక్కువగా ఉండటం వల్ల మోటార్లు కాలిపోవడం, అందుకు అధిక వ్యయం కావడం నిరంతర ప్రక్రియగా మారింది.
  • అధిక వోల్టేజి గల ట్రాన్స్ ఫార్కర్లను మార్చాలనే ప్రతిపాదనకు కూడా తగిన ద్రవ్య కేటాయింపులు చేయలేదు.
  • తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్వరూపం 1970-1990ల మధ్య ఏ విధంగా ఉందనే విషయానికి సంబంధించి మనకు ప్రత్యక్షంగా గణాంకాలు లేవు.
  • 1962-63 వార్షిక అంతానికి వ్యవసాయరంగం 56,2 శాతం రాష్ట్ర ఆదాయాన్ని సమకూరిస్తే 1999 – 2000 నాటికి ఇది 28.6 శాతానికి పడిపోయింది.
  • పారిశ్రామిక రంగంలో ప్రధాన రంగమైన తయారీ రంగం (నమోదయిన, నమోదు కానటువంటి) వాటా ఈ మధ్య కాలానికి 8 శాతం నుంచి 12 శాతానికి మాత్రమే పెరిగింది.
  • రాష్ట్రంలోని దక్షిణ కోస్తా జిల్లాల నుంచి ఎక్కువగా తెలంగాణకు వలస వచ్చారు. ఈ విధమైన వలస ఉన్న సందర్భంలో వృద్ధి బాగానే, జరుగుతుంది. వృద్ధి పంపిణీ అనేది కూడా సమస్యగానే ఉంటుంది.
  • 1990 మధ్య దశాబ్దం నుంచి తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. సాగునీటి సేద్యంలో వచ్చిన భూమి 2007-08 నాటికి దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈ పెరిగిన మొత్తంలో 70 శాతం బావుల కిందనే ఉంది.

Also Read: Telangana History in Telugu

Third Phase (1993 – 2014) | మూడవ దశ 1993 నుంచి 2014 వరకు

  • భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు 1990ల తరవాత వేగం పుంజుకున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్థిక సంస్కరణల అమలు దాదాపుగా అదే సమయంలో జరిగింది. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపైనా సంస్కరణల ప్రభావం పడింది.
  • మధ్య 1990ల నుంచి వ్యవసాయ రంగంపై ప్రత్యక్ష ప్రభావం కనబడింది. WTO ఒప్పందం అమలులోకి వచ్చింది.
  • తరువాత వాణిజ్య సంస్కరణలు వ్యవసాయరంగంలో లాభదాయక ధరలను పొందే అవకాశం ఉంటుందని 1997 నుంచి వ్యావసాయిక ఉద్యమాలకుండే రక్షణలు తొలగించారు.
  • దేశంలో కూడా ఉత్పాదకత మార్కెట్లను సరళీకరణ చేసి ప్రైవేట్ రంగానికి అవకాశమిచ్చారు. పలు కీలక అంశాల మీద ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించారు. సంస్కరణల ప్రభావం ఆర్థిక రంగాల మధ్య రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలోని ప్రాంతాల మధ్య, పట్టణ, గ్రామీణ రంగాల మధ్య అంతరాలను పెంచింది.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం ఏ విధంగా ఉందో తెలసింది.
  • ఈ కాలంలో జరిగిన మరొక పరిణామం ఏమిటంటే 1993-94 సంవత్సరం నుంచి జిల్లాల వారీగా ఆదాయాన్ని మదింపు చేసే ప్రక్రియ ప్రవేశపెట్టారు. కాబట్టి తెలంగాణ స్థూల దేశీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని అంచనా వేసే అవకాశం ఉంది.
  • అదే విధంగా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల సమకూర్పు ఏ విధంగా ఉంది. జిల్లాల సమకూర్పు ఏ విధంగా ఉంది. ఇవన్నీ 1993-94 నుంచి 2013-2014 సంవత్సరాల మధ్యకాలంలో ఏ విధంగా మారుతూ వస్తున్నాయి వంటి అంశాలను విశ్లేషించే వీలు ఉంది.
  • 1993-94 నుండి 2009 -10 వరకు రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ తలసరి ఆదాయం కంటే తక్కువ ఉన్నప్పటికి, వార్షిక వృద్ధిరేటు మాత్రం దేశం కన్నా రాష్ట్ర వృద్ధిరేటు ఎక్కువగా కలదు.
  • అంతేగాకుండా 2009-10లో మాత్రం రుణాత్మక వృద్ధి రేటు(-0.01) నమోదయింది. 1994-95 సం॥ రాష్ట్రంలో అత్యధిక వృద్ధిరేటు (0.47) నమోదయింది.
  • 2005-06 నుంచి 2007-08 సం॥ వరకు వరసగా దేశంలో ఒకే వృద్ధిరేటు (0.08%) నమోదయింది.

adda247

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Telangana economy in United AP (1956-2014), Check Details_5.1

FAQs

How was Telangana economy in United AP (1956-2014)?

Telangana economy in United AP (1956-2014) details are provided in this article.

The period 1956-2014 can be divided into can be divided into how many stages?

The period 1956-2014 can be divided into "3" parts regarding the state of Telangana.