Telugu govt jobs   »   Economy   »   Telangana Economy - Land Reforms in...
Top Performing

Telangana Economy – Land Reforms in Telangana, Download PDF | తెలంగాణ ఆర్థిక వ్యవస్థ – తెలంగాణలో భూ సంస్కరణలు

Table of Contents

Land Reforms in Telangana | తెలంగాణలో భూ సంస్కరణలు

  • భారతదేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ జీవనంలో వ్యవసాయం నేటికీ కీలక స్థానాన్ని ఆక్రమించింది.
  • దేశంలోను, రాష్ట్రంలోను సగం కంటే ఎక్కువ జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు.
  • ఏ సంవత్సరంలో ఐతే వ్యవసాయం వృద్ధిరేటు అధికంగా ఉంటుందో ఆ సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు కూడా అధికంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండడానికి ప్రధానంగా రెండు కారణాలు కన్పిస్తున్నాయి.
  • ఉత్పాదకత తక్కువగా ఉండటానికి సాంకేతిక లోపాలే కారణమని ఆర్థర్ లూయిస్, బ్లాంకెన్ బర్గ్ మొ॥ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.
  • సామ్యవాద ప్రాతిపదికన ఆలోచించే గున్నార్ మిర్దార్, హెరాల్డ్ మాన్ జాకోబి, బెహరిన్డ్ మొ॥ ఆర్ధిక వేత్తలు వ్యవసాయం వెనుకబడడానికి ఫ్యూడల్, సెమీ ఫ్యూడల్ విధానాలే కారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
    • ఉదా:- భూ యాజమాన్యంలో అసమానత, చిన్నపాటి కమతాలు, కమతాల విభజన, అధిక కౌలు, కౌలుదారుడికి భద్రత లేకపోవుట మొదలైనవి.
  • సాంకేతిక లోపాలు తొలగించడానికి తీసుకునే చర్యలే నూతన వ్యవసాయ విధానం (లేదా) హరిత విప్లవానికి కారణమయ్యాయి.
  • భూ వ్యవస్థాపరమైన లోపాలను తొలగించడానికి తీసుకున్న చర్యలే భూ సంస్కరణలుగా చెప్పబడుచున్నవి.

Telangana economy in United AP (1956-2014) |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

Definitions of Land Reforms | భూ సంస్కరణల నిర్వచనాలు

ఐక్యరాజ్యసమితి

  • “కౌలుదారులు, ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భూమిని పునఃపంపిణీ చేయడమే భూ సంస్కరణలు”.

ప్రణాళికా సంఘం

  • “వ్యవసాయ అభివృద్ధి కొరకే భూమిపై చేపట్టే ఏ సంస్కరణలైనా భూ సంస్కరణలే”.
  • భారత రాజ్యాంగం 39వ అధికరణ ప్రకారం భూ సంస్కరణల లక్ష్యాలు పొందుపరిచారు. అవి “భారతం” ప్రజలకు చెందిన ప్రధాన ఆధార భూతాలైన భౌతిక వనరుల మీద యాజమాన్య నియంత్రణ సకల జాతులకు ప్రయోజనం కలిగించే విధంగా న్యాయంగా పంపిణీ జరగాలి”
  • భారత ఆర్ధిక విధానాలు ఆస్తి, సంపద ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండాలి. ఉత్పత్తి వ్యవస్థ ప్రజాస్వామ్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండకూడదు.

భూ సంస్కరణల లక్ష్యాలను గూర్చి, ప్రణాళిక సంఘం అధికారికంగా క్రింది లక్ష్యాలను ప్రకటించింది.

1. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు గల ప్రతిబంధకాలు తొలగించుట.

2. వ్యవసాయ రంగంలో ఉన్న దోపిడీలు, సాంఘిక అన్యాయాలు తొలగించి భూమి దున్నేవాడికి రక్షణ ఇచ్చుట

భూ సంస్కరణల ద్వారా ప్రభుత్వం ‘2’ లక్ష్యాలను నిర్ణయించుకున్నది.

  1. భూగరిష్ట పరిమితి అమలు.
  • కమతాల పరిమాణంలో మార్పు ద్వారా కొరతగా ఉన్న భూమిని హేతుబద్ధంగా ఉపయోగించుట.
  1. భూమి లేని గ్రామీణ ప్రజలకు భూమిని పంపిణీ చేయుట,
  • నెహ్రూ ఉద్దేశ్యంలో “రైతాంగం ఆర్థిక, సామాజిక, రాజకీయ శక్తిని శక్తివంతం చేయడమే భూసంస్కరణ లక్ష్యం”.

Also Read: Telangana economy in United AP (1956-2014)

రాజ్ కృష్ణ భూ సంస్కరణలను 4 రకాలుగా గుర్తించారు.

  1. విమోచనం (Liberative) : ఉదా:- మధ్యవర్తులను తొలగించుట.
  1. పంచి పెట్టేవి (Distributive) : ఉదా:- భూమి హక్కుల పునః పంపకం, కౌలు సంస్కరణలు, కమతాల సమీకరణ
  2. వ్యవస్థా పూర్వకమైనవి (Organisation : ఉదా:- సహకార, సామూహిక వ్యవస్థల నిర్మాణం.
  3. అభివృద్ధికరమైనవి (Development)

పై నాలుగింటిలో మొదటి మూడు – భూ సంస్కరణలకు సంబంధించినవి అని రాజకృష్ణ గారి  అభిప్రాయం.

  • స్వాతంత్ర్యం అంటే విదేశీ పాలన నుండి విముక్తి పొందడమే కాదు. భారత పెట్టుబడిదారులు, భూ స్వాముల దోపిడీ నుండి రైతులను విముక్తి చేయడం అని మహాత్మాగాంధీ అభిప్రాయపడినారు.

Experiences of Land Reforms by P.C. Joshi | P.C. జోషి భూ సంస్కరణల అనుభవాలు

భూ సంస్కరణల అనుభవాలను P.C. Joshi 4 రకాలుగా వర్గీకరించారు.

  1. ప్రభుత్వ చట్టాలద్వారా వచ్చినవి.
    • ఉదా :- మధ్యవర్తుల తొలగింపు, కౌలుదారీ చట్టాలు, కమతాల గరిష్ట పరిమితి నిర్ణయం.
  1. ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినవి
    • ఉదా : తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరీలోని నక్సలైట్ ఉద్యమం..
  1. చట్టాలు, ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినవి.
    • ఉదా : కేరళ, పశ్చిమబెంగాల్లో రాష్ట్ర ప్రజలు ఉద్యమాలు, వామపక్ష ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు.
  1. ప్రజల నుండి ఐచ్చికంగా వచ్చినవి
    • ఉదా: భూ దానోద్యమం.

Major Books written on land reforms | భూ సంస్కరణలపై వ్రాయబడిన ముఖ్య పుస్తకాలు

  • ఆర్థర్ లూయిస్ – The Theory of Economic Growth.
  • థియోడర్ బెర్మన్ – Agrarian Reforms in India
  • బ్రౌన్ లస్టర్ – Seeds of Change, the green revolution and development in 1970’s
  • వై.వి. కృష్ణారావు – Peasant Movement and Struggles
  • ఎ. ఎం. ఖుస్రో – Economic and social Effects of jagirdari Abolition and reforms in Hyd
  • పుచ్చలపల్లి సుందరయ్య – Telangana People’s Struggles and It’s lesson.
  • ఎం.పి.ఆర్.రెడ్డి – Peasant and State Modern Andhra history.
  • శ్రీ ఎన్.జి. రంగా – The modern Indian Peasant,
  • జి. పార్థసారథి & బి. ప్రసాద రావు – Implementation of Land reform’s in Andhra Pradesh.

United Andhra Pradesh land reforms | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలను ‘2’ దశలుగా వర్గీకరించవచ్చు.

  1. మొదటి దశ (1947-70)
  2. రెండవ దశ (1970 తరువాత)

First Phase (1947 – 70) | మొదటి దశ (1947-70)

ఈ దశలో భూ సంస్కరణలు రావడానికి 3 అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి.

  1. వ్యవస్థా పూర్వకమైన అంశాలు
    • భూస్వామ్య పద్ధతులు, కౌలు విధానాలు, భూ కేంద్రీకరణ మొదలగునవి.
  2. రాజకీయ అంశాలు
    • అఖిల భారత కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానాలు, విధానాలు
  3. రైతాంగ ఉద్యమాలు
    • ఫ్యూడల్ దోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ పోరాటం,
    • 1920లో విసునూరు దేశముఖ్కు వ్యతిరేకంగా ముస్లిం రైతు పోరాటం.

వ్యవస్థా  పూర్వక అంశాలు

  1. భూస్వామ్య విధానాలు
  2. కౌలు విధానాలు
  3. భూకేంద్రీకరణ

మొదలగునవి వ్యవసాయ అభివృద్ధికి నిరోధకంగా ఉన్నవి.

  • ఆంధ్రప్రదేశ్ అవతరించక మునుపు తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో భాగం కాగా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో భాగం, కాబట్టి ఈ రెండు ప్రాంతాలలో భూస్వామ్య పద్ధతులలో కొంత సారుప్యం ఉన్నప్పటికీ, కొంత వ్యత్యాసం కూడా ఉన్నది.

1. భూస్వామ్య విధానాలు

  • భారత దేశంలో బ్రిటీష్, నైజాం ప్రాంతాలలో ప్రవేశపెట్టిన భూస్వామ్య పద్ధతులు రెండూ అభివృద్ధి నిరోధకాలే. ఇవి అభివృద్ధికి దోహదపడక పోగా ‘స్తబ్ధతకు’ దారి తీసినవి.
  • 1853లో కారల్ మార్క్స్ జమిందారీ, రైత్వారీ విధానాలు బ్రిటీష్ అధికారులు ప్రవేశపెట్టిన వ్యవసాయక విప్లవ రూపాలని అవి ఇకదానితో ఒకటి విరుద్దమని గుర్తించాడు.
  • జమిందారీ విధానం పెత్తందారీ వ్యవస్థ కాగా రైత్వారీ విధానం ప్రజాతంత్ర వ్యవస్థగా గుర్తించారు.
  • జమిందారీ వ్యవస్థ బ్రిటీష్ భూస్వామ్య వ్యవస్థకు, రైత్వారీ విధానం ఫ్రెంచ్ రైతు స్వామ్య వ్యవస్థకు ప్రతిబింబాలు.
  • ఈ రెండూ భూమి దున్నే రైతు ప్రయోజనాలకు ఉద్దేశించినవి కావు. భూములపై పన్నులు వేసే ప్రభుత్వానికి ఉపయోగపడే సాధనాలు.

2. హైద్రాబాద్ ప్రాంతంలో కౌలు విధానాలు

హైద్రాబాద్ ప్రాంతంలో 1354- పసలీ (1944)లో అసామీ షక్మేచట్టం అమలులోకి వచ్చే నాటికి 2 రకాల కౌలుదారులు ఉండేవారు.

  • షక్కీ కౌలుదారులు ( శాశ్వత కౌలుదారులు ) : కౌలుదారునికి రక్షణ, భూమి సాగు చేసుకునే హక్కు ఉంటే వారిని షక్కీ కౌలుదారులు అంటారు.
  • అసామి షక్మీ కౌలుదారులు ( ఏ హక్కులు లేని కౌలుదారులు ) :అసామీ షక్కీ కౌలుదారుడు కౌలు భూమిని 12 సం॥ తన స్వాధీనంలో ఉంచుకో గలిగినపుడు అతన్నీ షకీ కౌలుదారుడిగా గుర్తిస్తారు.

3. భూ కేంద్రీకరణ

  • తెలంగాణ ప్రాంతంలో నల్గొండ, వరంగల్ లాంటి ప్రాంతాలలో సుమారు 60% నుండి 70% భూమి జాగీదార్లు, ఇనాందార్ల చేతుల్లో కేంద్రీకృతమైంది.
  • భూ యాజమాన్యంలో కేంద్రీకరణను తగ్గించి గరిష్ట పరిమితిని నిర్ణయించి మిగులు భూమిని భూమి లేని వారికి పంపిణీ చేయాలి. అనే అంశంపై వాదోపవాదనలు ఎప్పటినుండో ఉన్నవి.

రాజకీయ అంశాలు

  • 1915లో ఇండియాకు తిరిగి వచ్చిన గాంధీజీ యొక్క రాజకీయ జీవితం రైతాంగ పోరాటంతో ప్రారంభమైంది.
    • ఉదా : చంపారన్ ఉద్యమం (బీహార్)
  • 1931 – కరాచీ కాంగ్రెస్ సభలో జమిందారీ వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించారు.
  • 1946 – కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో మధ్యవర్తులను తొలగిస్తామని హామీ ఇచ్చారు.
  • నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని గుర్తించక పోవడమే కాక 1946 వరకు నిషేధించెను. అందుచే దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్య సమాజ్ 1921 లో ప్రారంభించిన ఆంధ్ర జన సంఘం తెలంగాణ ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేసెను. ఐతే 1948 తర్వాత కాంగ్రెస్ అధికారం పొందడం వల్ల భూ సంస్కరణల చట్టాలు రూపొందించడంలో, అమలు పరచడంలో కొంత పాత్ర పోషించిందని చెప్పాలి.

రైతాంగ ఉద్యమాలు

  • 1928లో ఎన్.జి. రంగా ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఏర్పడింది.
  • 1936 – అఖిలభారత కిసాన్ సభ ఏర్పడింది.
  • 1945లో రైతాంగ సాయుధ పోరాటం జరిగింది.

Land Tenure Systems in Hyderabad State | హైదరాబాద్ రాష్ట్రంలో భూ యాజమాన్య వ్యవస్థలు

హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ రకాల భూ స్వామ్య విధానాలు ఉండేవి.

  • జాగీర్ల
  • సంస్థానాలు
  • ఇనాందార్లు
  • సర్ఫేఖాస్
  • ఖల్సా/దివానీ/రైత్వారీ

Second Phase – Land Reforms after 1970 | రెండవ దశ – భూ సంస్కరణలు 1970 తర్వాత

మొదటి దఫా భూ సంస్కరణలు 1970 నాటికి పూర్తి కాగా రెండవ దఫా భూసంస్కరణలు 1970 తర్వాత

రెండవ దఫా భూ సంస్కరణలు రావడానికి ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించవచ్చు.

  1. ఆర్థిక కారణాలు / హరిత విప్లవం.
  2. రాజకీయ కారణాలు
  3. రైతాంగ పోరాటాల ఉద్రిక్తత

ఆర్థిక కారణాలు/హరిత విప్లవం

  • స్వాతంత్య్రం వచ్చే నాటికి ఇండియా విదేశాల నుండి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థితిలో ఉంది. దీంతో Ford Foundation (USA) కమిటీ వారి సూచనల మేరకు
  • 1960-61లో సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం (IADP)
  • 1965లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం (IAAP) లను ప్రవేశపెట్టారు.
  • 1966లో అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాల కార్యక్రమాన్ని High Yield Variety Programme (HYVP) ప్రారంభించెను. దీని వల్ల వ్యవసాయ ఉత్పత్తి ఘనంగా పెరిగింది.
  • భూ సంస్కరణ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి వ్యవసాయ ఉత్పత్తిని పెంచుట. అంటే వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో భూ సంస్కరణల ఆవశ్యకత తగ్గింది.

రాజకీయ కారణాలు

  • 1948లో కుమరప్ప కమిటీ సూచనలు మధ్యవర్తుల తొలగింపునకు మాత్రమే పరిమితమయ్యెను. దున్నేవాడికి భూమి అనే నినాదం పెడదోవ పట్టింది.
  • 1952, 57 ఎన్నికలలో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ భూస్వామ్య వర్గాలను సంతృప్తి పరిచి వారి ద్వారా గ్రామీణ ఓటర్లను ఆకర్షించడానికి అనేక మినహాయింపులతో సవరణలు తీసుకొచ్చారు.
  • 1967 ఎన్నికలలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటరు శాతం తగ్గింది. కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడినవి.
  • ఇందిరా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, గరిబీ హఠావో నినాదం. అందించి గ్రామీణ పేదలను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది.
  • కొన్ని రాష్ట్రాలలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు రావడంతో భూ సంస్కరణలు అనే అంశం మరలా తెరపైకి వచ్చింది.
  • 1972లో భూ సంస్కరణలపై కాంగ్రెస్ నియమించిన కమిటీ సూచనలపై 1972లో జరిగిన ముఖ్యమంత్రులు సమావేశంలో మొదటిసారిగా భూ సంస్కరణలను జాతీయ అంకంగా గుర్తించి జాతీయ స్థాయిలో కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించారు.
  • అఖిల భారత కాంగ్రెస్ సభలో 1972లో అన్ని రాష్ట్రాలలో నూతన భూ సంస్కరణ చట్టాలను రూపొందించాలని, అర్హులకు భూ పంపిణీ అయ్యేటట్టు చూడాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలను, కార్యకర్తలను కోరారు.
  • ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే 1973 – భూ గరిష్ట పరిమితి చట్టం అమలులోకి వచ్చింది..

రైతాంగా పోరాటాల ఉద్రిక్తత

  • 1969లో మార్ఫిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బంజరు భూముల కోసం, భూస్వాములు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల కోసం భూపోరాటం జరిగింది.
  • ఇది మొదటగా కృష్ణా జిల్లాలో ప్రారంభమై రాష్ట్రమంతటా వ్యాపించింది. సుమారు లక్ష ఎకరాల భూమి 64 వేల వ్యవసాయ కూలీలు ఆక్రమణ చేసి సాగుచేయడం ప్రారంభిచారు.
  • కమ్యూనిస్టు పార్టీలు, సోషలిస్టు పార్టీలు సంయుక్త భూపోరాటాన్ని తీవ్రరూపంలోకి తీసుకుపోయాయి.
  • 1972లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి కాంగ్రెస్ తన ఎన్నికల వాగ్దానాలను అమలు పరచాలని, నూతన భూ సంస్కరణల చట్టాలను ప్రకటించాలని మూడు దశల పోరాట కార్యక్రమాన్ని ప్రకటించారు.
  • 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్స్ బరీ గ్రామంలో ప్రారంభమైన సాయుధ రైతాంగా పోరాటం ఎ.పి.లోని శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించి స్వల్పకాలంలోనే గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలోకి (కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, పశ్చిమగోదావరి) వ్యాప్తి చెందింది.
  • గిరిజనులను చైతన్య వంతులను చేసి గిరిజనేతర భూస్వాముల, అటవీ అధికారుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి మార్గం చూపినది ఈ నక్సలైట్ ఉద్యమమే.
  • 2వ దఫా భూ సంస్కరణలు రావడానికి హరిత విప్లవం తీసుకొచ్చిన దుష్ఫలితాలు, రాష్ట్ర రాజకీయ అధికారంలో వచ్చిన మార్పులు కమ్యూనిస్టు ఉద్యమాల తీవ్రత ప్రధాన కారణాలు. అందుచే భూ సంస్కరణల విషయంలో నూతన చట్టాలు సవరణలు ప్రతిపాదించడం జరిగింది.

Download Land Reforms in Telangana PDF

Read More:
ప్రణాళిక సంఘం మధ్య యుగ భారత ఆర్ధిక వ్యవస్థ
పంచ వర్ష ప్రణాళికలు పారిశ్రామిక రంగం,విధానాలు
స్వాతంత్రానికి పూర్వం భారత ఆర్ధిక వ్యవస్థ నీతి ఆయోగ్
ముఖ్యమైన కమిటీలు-కమీషన్లు పేదరికం,నిరుద్యోగం
ద్రవ్య వ్యవస్థ ద్రవ్యోల్బణం
భారతదేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు భారతదేశంలో పేదరికం కొలత
తెలుగులో ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో స్టాక్ ఎక్స్ఛేంజ్ నియంత్రణ
భారతదేశంలో పేదరికం Telangana Economy

TSPSC  GROUP-2, GROUP-3 General Studies Online Test Series in Telugu and English By Adda247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Telangana Economy - Land Reforms in Telangana, Download PDF | TSPSC Groups_5.1

FAQs

What are the goals of land reforms in Telangana?

The main objectives of land reforms in Telangana were Removal of constraints to increase in agricultural production.

What are the three land reforms?

The first and longest phase (1950 - 72) consisted of land reforms that included three major efforts: abolition of the intermediaries, tenancy reform, and the redistribution of land using land ceilings.

Who was the father of land reforms in India?

Vinoba Bhave, was the father of land reforms in India

What are land Reforms?

In simpler terms, Land Reforms refer to the redistribution of Lands from the rich class to the poor class.