Telugu govt jobs   »   గురుకులాల్లో కొత్త కొలువులు

తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో 6 వేలకు పైగా ఖాళీలు, త్వరలో భర్తీకి సిద్ధం

తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో భారీగా ఖాళీలు: భర్తీకి సమాయత్తం

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో అనేక ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 2025-26 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్‌లో వీటిని చేర్చి భర్తీ చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ గురుకుల సంస్థల్లో మొత్తం 6 వేలకు పైగా ఖాళీలు భర్తీకి అవకాశం ఉంది.

గత నోటిఫికేషన్‌ బ్యాక్‌లాగ్‌ ఖాళీలు

2023లో గురుకుల నియామక బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌కి సంబంధించి 1800కు పైగా బ్యాక్‌లాగ్‌ ఖాళీలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ స్థాయి పోస్టుల నుంచి దిగువ స్థాయి ఉద్యోగాల వరకు ఇవి ఉన్నాయి. నిర్దిష్ట పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు ఎక్కువ కేటగిరీల్లో ఎంపిక కావడం వల్ల కొన్ని పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయి.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

రిలింక్విష్‌మెంట్‌ సదుపాయం లేక ఖాళీల పెరుగుదల

మునుపటిలా రిలింక్విష్‌మెంట్‌ సదుపాయం లేకపోవడంతో, అభ్యర్థులు ఒక ఉద్యోగంలో చేరి ఇతర పోస్టులను వదులుకోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు మొదటి వారంలో కొత్తగా నియమితులైన అభ్యర్థులకు గురుకుల సొసైటీలు పోస్టింగులు ఇచ్చాయి. ఈ పోస్టుల్లో చేరేందుకు వారికి 60 రోజుల గడువు ఉంది.

DSC, JL నియామకాలకు సంబంధించి

డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పరీక్షలు ముగిశాయి. అలాగే ఇంటర్మీడియట్‌ విద్యలో జేఎల్‌ పోస్టుల నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. డీఎస్సీ, జేఎల్‌ పరీక్షలకు హాజరైన వారిలో కొందరు ఇప్పటికే గురుకుల ఉద్యోగాల్లో చేరి ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ, జేఎల్‌ ఉద్యోగాలు పొందితే.. వారు గురుకుల ఉద్యోగాలను వదులుకునే అవకాశం ఉంది.

వెయ్యి నుంచి 2 వేల కొత్త పోస్టులు ఖాళీకి సిద్ధం

డీఎస్సీ, జేఎల్‌ నియామక ప్రక్రియలు పూర్తయ్యాక, మరో వెయ్యి నుంచి 2 వేల గురుకుల ఉద్యోగాలు ఖాళీ అవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎస్సీ గురుకుల సొసైటీలో 1800కు పైగా ఖాళీలతో పాటు ఇతర సొసైటీల్లోనూ ఖాళీలు ఉన్నాయి. గత సంవత్సరం ఈ పోస్టుల భర్తీకి సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో అనుమతి లభించలేదు. ఇప్పటి పరిస్థితుల ప్రకారం, మొత్తం 6 వేలకు పైగా కొత్త పోస్టులు వచ్చే అవకాశం ఉంది.

Child Development and Pedagogy Ebook for all DSC,TET Exams by Adda247

Adda247 Telugu YouTube Channel

Adda247 Telugu Telegram Channel

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

 

Sharing is caring!