Telugu govt jobs   »   Telangana High Court Quick Revision Practice...
Top Performing

Telangana High Court Quick Revision Practice Set- 01, Download PDF

The countdown has begun! With only a few days left for the Telangana High Court Exam scheduled from 15th to 20th April 2025, it’s time to make every moment count. Whether you’re aiming for a technical role or a non-technical post, effective revision can be your key to success. To make your last-minute preparation effortless and efficient, we’ve carefully curated a set of important Multiple Choice Questions (MCQs) with detailed answers, designed specifically for a quick yet thorough revision. Go through these questions, refresh your knowledge, and walk into the examination hall with confidence!

Quick Revision Practice Questions:

Q1. తెలంగాణా రాష్ట్ర జంతువు యొక్క శాస్త్రీయ నామం ఏమిటి?

(a) ఆక్సిస్ ఆక్సిస్

(b) ప్రోసోఫిస్ సినరేరియ

(c) కొరాషియాస్ బెంగాలెన్సిస్

(d) అనొనా స్క్వామోసా

Q2. హిమాయత్ సాగర్ ను ఏ నది పై నిర్మించారు?

(a) మూసి

(b) ఈసా

(c) మంజీరా

(d) ప్రాణహిత

Q3. తెలంగాణా ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

(a) సెప్టెంబర్ 15

(b) ఆగష్టు 29

(c) సెప్టెంబర్ 14

(d) జూలై 11

Q4. తెలంగాణలో అధికంగా విస్తరించి ఉన్న నేలలు ఏవి?

(a) నల్ల రేగడి నెలలు

(b) ఎర్ర నేలలు

(c) ఒండ్రు నేలలు

(d) జేగురు నేలలు

Q5. 2021 సంవత్సరానికి గాను దాశరథి కృష్ణమాచార్య పురస్కారం అందుకున్నది ఎవరు?

(a) పెన్నా శివ రామకృష్ణ

(b) ఎల్లురి శివారెడ్డి

(c) అంపశయ్య నవీన్

(d) సుద్దాల అశోక్ తేజ

Q6. తెలంగాణా ఫారెస్ట్ అకాడమి ఏ ప్రాంతంలో కలదు ?

(a) వాడపల్లి

(b) వనస్థలిపురం

(c) దూలపల్లి

(d) ములుగు

Q7. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఎవరు?

(a) సబితా ఇంద్రా రెడ్డి

(b) సత్యవతి రాథోడ్

(c) డి. అనసూయ సీతక్క

(d) పువ్వాడ అజయ్ కుమార్

Q8. ఇటీవల మరణించిన తెలంగాణా సాయుధ పోరాట వీరనారి ఎవరు?

(a) చాకలి ఐలమ్మ

(b) మల్లు స్వరాజ్యం

(c) ప్రమీలబాయి

(d) జాటోత్ మంగ్లీ

Q9. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం నడిపిన వ్యక్తి ఎవరు ?

(a) పింగళి వెంకట రామరెడ్డి

(b) టి.కె. బాలయ్య

(c) సురవరం ప్రతాపరెడ్డి

(d) రావి నారాయణ రెడ్డి

Q10. క్రింది వాటిలో కాళోజి నారాయణరావు రచన కానిది ఏది?

(a) అణా కథలు

(b) పార్థివ న్యాయం

(c) నా గొడవ

(d) చిల్లర దేవుళ్ళు

Q11. ఇందూరు అనేది క్రింది ఏ జిల్లా యొక్క పూర్వ నామం?

(a) ఆదిలాబాద్

(b) కరీంనగర్

(c) నిజామాబాద్

(d) హుజురాబాద్

Q12. ఏడుపాయల జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?

(a) మెదక్

(b) సంగారెడ్డి

(c) జోగులాంబ గద్వాల్

(d) వనపర్తి

Q13. తెలంగాణాలోని వ్యవసాయ వాతావరణ మండలాల సంఖ్య ఎంత ?

(a) 1

(b) 2

(c) 3

(d) 4

Q14. రాష్ట్రంలో అత్యధిక పంటలసాంద్రత గల జిల్లా ఏది?

(a) నల్గొండ

(b) మహబూబ్ నగర్

(c) కామారెడ్డి

(d) నిజమాబాద్

Q15. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు?

(a) మంచిర్యాల

(b) మెదక్

(c) సూర్యాపేట

(d) భద్రాద్రి కొత్తగూడెం

Q16. హైదరాబాద్ రాజ్యంలో హలీసిక్కా ను ప్రవేశ పెట్టిన ప్రధాని ఎవరు?

(a) సాలార్ జంగ్ –I

(b) సాలార్ జంగ్ –II

(c) మహారాజ కిషన్ ప్రసాద్

(d) సాలార్ జంగ్ –III

Q17. సాలార్ జంగ్ –I యొక్క అసలు పేరు ఏమిటి?

(a) మీర్ ఖమ్రుద్దిన్ ఖాన్

(b) లాయక్ అలీ

(c) ఫతిజింగ్

(d) మీర్ తురబ్ ఆలీఖాన్

Q18. నిజాం వంశ స్థాపకుడు ఎవరు ?

(a) మీర్ ఖమ్రుద్దిన్ ఖాన్

(b) మీర్ తురబ్ అలీ ఖాన్

(c) అఫ్జలుద్దౌల

(d) మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

Q19. క్రింది వానిలో తెలంగాణా బడ్జెట్ కేటాయింపుల్లో సరికాని అంశం ఏది?

(a) వ్యవసాయ రంగానికి రూ. 24,439 కోట్లు

(b) నీటి పారుదల శాఖకు రూ. 23,373 కోట్లు

(c) రైతు భరోసా – రూ.20 వేల కోట్లు

(d) విద్యా రంగానికి రూ. 23,108 కోట్లు

Q20. తెలంగాణా నూతన పురపాలక చట్టం ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది ?

(a) 2014

(b) 2015

(c) 2019

(d) 2021

Q21. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణిని ఏ సంవత్సరం నుండి ప్రారంభించింది ?

(a) 2014

(b) 2015

(c) 2016

(d) 2017

Q22. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

(a) హిమాకోహ్లి

(b) రాధా కృష్ణన్

(c) సతీష్ చంద్ర శర్మ

(d) సోమేశ్ కుమార్

Q23. తెలంగాణ ప్రభుత్వం చేనేతలక్ష్మి పథకం ఏ రోజున ప్రారంభించారు?

(a) ఆగష్టు 7, 2016

(b) సెప్టెంబర్ 7, 2016

(c) ఆగష్టు 7, 2015

(d) జూలై 7, 2016

Q24. క్రిందివారిలో దక్షినపధాపతి బిరుదు కల శాతవాహన రాజు ఎవరు?

(a) శ్రీముఖుడు

(b) మొదటి శాతకర్ణి

(c) గౌతమీపుత్ర శాతకర్ణి

(d) కుంతల శాతకర్ణి

Q25. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది?

(a) 1918

(b) 1920

(c) 1926

(d) 1929

Q26. తెలంగాణలో పత్తి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న పాత జిల్లా ఏది?

(a) ఆదిలాబాద్

(b) వరంగల్

(c) నిజామాబాద్

(d) నల్గొండ

Q27. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ యొక్క ప్రస్తుత పేరు ఏమిటి ?

(a) డా. బి. ఆర్. అంబేద్కర్ ప్రాజెక్ట్

(b) సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్

(c) పి.వి. నరసింహారావు ప్రాజెక్ట్

(d) మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రాజెక్ట్

Q28. తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగ క్యాప్షన్ ఏమిటి?

(a) I Love Telangana

(b) Open Happiness

(c) India’s Most Preferred Destination

(d) Rural and Community Centric Tourism

Q29. తెలంగాణలో గోదావరి నది పొడవు ఎంత ?

(a) 772 కిమీ.

(b) 560 కి.మీ.

(c) 354 కి.మీ

(d) 650 కి.మీ.

Q30. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏ రెండు జిల్లాల్లో మొదట ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది?

(a) పెద్దపల్లి , జయశంకర్ భూపాలపల్లి

(b) సిద్ధిపేట, కరీంనగర్

(c) రాజన్న సిరిసిల్ల, ములుగు

(d) కామారెడ్డి, సంగారెడ్డి

Solutions

S1. Ans.(a)

Sol. తెలంగాణా రాష్ట్ర జంతువు మచ్చల జింక. దీని శాస్త్రీయ నామం ఆక్సిస్ ఆక్సిస్.

  • తెలంగాణా రాష్ట్ర వృక్షం – జమ్మి చెట్టు (ప్రోసోఫిస్ సినరేరియ)
  • తెలంగాణా రాష్ట్ర పక్షి – పాలపిట్ట (కొరాషియాస్ బెంగాలెన్సిస్)
  • తెలంగాణా రాష్ట్ర ఫలం – సీతాఫలం ( అనొనా స్క్వామోసా)

S2. Ans.(b)

Sol. హిమాయత్ సాగర్ డ్యాం ను 1927లో ఈసా నది పై నిర్మించారు. దీనిని 7 వ నిజాం అయిన మీర్ ఊస్మాన్ ఆలీఖాన్ నిర్మించారు. ఈసా నది మూసి నది యొక్క ఉపనది.

S3. Ans.(d)

Sol. హైదరాబాద్ కి చెందిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ జన్మదినమైన జూలై 11ని తెలంగాణా ఇంజినీర్స్ డే గా పాటించడం జరుగుతుంది. ఇతను హైదరాబాద్ నిజాం పాలనలో చీఫ్ ఇంజనీర్, హైదరాబాద్ రాష్ట్రంలోని ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్, హిమాయత్ సాగర్ మరియు నిజమాబాద్ లోని ఆలీసాగర్ రిజర్వాయర్ల నిర్మాణంలో భాద్యత వహించారు.

S4. Ans.(b)

Sol. తెలంగాణ రాష్ట్రంలో అధికంగా విస్తరించి ఉన్న నేలలు – ఎర్ర నేలలు (48%).

S5. Ans.(b)

Sol. సాహిత్య రంగంలో విశేష కృషి చేసినందుకు గాను 2021 సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్య పురస్కారం అందుకున్నది ఎల్లూరి శివారెడ్డి. ఇతను తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరం నుండి దాశరథి జయంతి (జూలై 22) రోజున ఈ అవార్డు ను ప్రధానం చేస్తుంది.

S6. Ans.(c)

Sol. తెలంగాణా రాష్ట్ర ఫారెస్ట్ అకాడమి మేడ్చల్ జిల్లా దూలపల్లి లో కలదు ఇది 1987 సంవత్సరంలో ఏర్పడింది. తెలంగాణా రాష్ట్ర ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ములుగు జిల్లాలో కలదు.

S7. Ans.(c)

Sol. డి. అనసూయ సీతక్క 2023 నుండి పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో సహా), మహిళా & శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నారు..

S8. Ans.(b)

Sol. మల్లు స్వరాజ్యం (1931 – 2022 మార్చి 19) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. మల్లు స్వరాజ్యం ఆత్మకథ “నా మాటే తుపాకీ తూటా” అన్న పేరుతో 2019లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ద్వారా పుస్తకంగా వచ్చింది.

S9. Ans.(c)

Sol. సురవరం ప్రతాప రెడ్డి గోల్కొండ పత్రికకి సంపాదకుడిగా వ్యవహరించాడు. తెలంగాణా సామాజిక, సాంస్కృతిక మరియు సాహిత్య రంగాలకి సంబంధించి అనేక పరిశోధనాత్మక వ్యాసాలను వెలువరించాడు. ఇతను కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు అందుకున్న తొలి తెలుగు రచయిత. తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం నడిపారు.

S10. Ans.(d)

Sol. కాళోజి నారాయణ రావు తెలంగాణా మాండలికాల రారాజుగా ప్రసిద్ధి చెందాడు. కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్9 ని 2014 సంవత్సరం నుండి తెలంగాణా మాండలిక భాషా దినోత్సవంగా జరుపుతున్నారు. చిల్లర దేవుళ్ళు దాశరథి రంగాచార్యుల యొక్క రచన, దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

S11. Ans.(c)

Sol. నిజామాబాద్ జిల్లా యొక్క పూర్వనామం ఇందూరు. హైదరాబాద్ పాలకుడు నిజాం పేరు మీదుగా ఈ జిల్లాను నిజామబాద్ గ మార్చడం జరిగింది. నిజామ్ ఆబాద్ అనగా అర్థం నిజాం వర్థిల్లాలి.

S12. Ans.(a)

Sol. మెదక్ జిల్లాలోని వన దుర్గా భవాని దేవాలయం వద్ద ఏడుపాయల జాతర జరుగుతుంది.

S13. Ans.(d)

Sol. వర్షపాతం, వివిధ రకాల నేలలు మరియు పంటల సరళిని బట్టి తెలంగాణ రాష్ట్రాన్ని 4 వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు.

S14. Ans.(d)

Sol. రాష్ట్రంలో అత్యధిక పంటల సాంద్రత గల జిల్లా- నిజామాబాద్, అత్యల్ప పంటల సాంద్రత గల జిల్లా -కొమురం భీం అసిఫాబాద్. రాష్ట్ర సగటు పంటల సాంద్రత – 1.27

S15. Ans.(a)

Sol. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మంచిర్యాల జిల్లాలో కలదు. భారత ప్రభుత్వం 2012లో కవ్వాల్ వన్యప్రాణుల అభయారాణ్యంను పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది.

S16. Ans.(a)

Sol. సాలార్ జంగ్ –I హైదరాబాద్ రాజ్యంలో నిజాం పేరు మీదుగా 1857 లో హలీ సిక్కా అనే నూతన నాణేన్ని ప్రవేశ పెట్టాడు. హలీ సిక్కా అనగా వెండి నాణెం.

S17. Ans.(d)

Sol. సాలార్ జంగ్ –I యొక్క అసలు పేరు మీర్ తురబ్ అలీ ఖాన్. హైదరాబాద్ నిజాం నాసిరుద్దౌల ఇతనికి సాలార్ జంగ్ బిరుదుని ఇవ్వడం జరిగింది. ఇతను 1853 సంవత్సరం నుండి 1888 సంవత్సరం వరకి దివాన్ గా పని చేసాడు.

S18. Ans.(a)

Sol. మీర్ ఖమ్రుద్దిన్ ఖాన్ 1724 సంవత్సరంలో నిజాం వంశాన్ని స్థాపించాడు. ఇతని బిరుదులు – నిజాం ఉల్ ముల్క్ , అసఫ్ జాహి. ఇతని బిరుదుల పేరు మీదగానే వీరి రాజ్యానికి అసఫ్ జాహిలు, నిజాంలు అనే పేరు వచ్చింది.

S19. Ans.(c)

Sol. తెలంగాణ రాష్ట్ర మొత్తం బడ్జెట్: రూ.3,04,965 కోట్లు

రెవెన్యూ వ్యయం: రూ.2,26,982 కోట్లు

మూలధన వ్యయం: రూ.36,504 కోట్లు

రంగాల వారీగా కేటాయింపులు

రైతు భరోసా – రూ.18 వేల కోట్లు

నీటిపారుదల – రూ.23,373 కోట్లు

వ్యవసాయ శాఖ – రూ. 24,439 కోట్లు కేటాయించింది.

S20. Ans.(c)

Sol.తెలంగాణ పాత మున్సిపల్ చట్టం స్థానంలో 2019 జూలై 21 నుండి నూతన పురపాలక చట్టం-2019 అమలులోకి వచ్చింది.

S21. Ans.(d)

Sol. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరం నుండి 18 సంవత్సరాలు నిండిన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ చేపట్టింది.

S22. Ans.(c)

Sol. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి- సతీష్ చంద్ర శర్మ. వీరు తెలంగాణ రాష్ట్ర హై కోర్టు యొక్క 4 వ ప్రధాన న్యాయమూర్తి. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి టి బి ఎన్ రాధాకృష్ణన్.

S23. Ans.(a)

Sol. తెలంగాణా ప్రభుత్వం చేనేత లక్ష్మి పథకాన్ని ఆగష్టు7, 2016 న ప్రారంభించింది. చేనేత వస్త్రాలను పెద్ద ఎత్తున విక్రయించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం (టెస్కో) చేనేత లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది.

S24. Ans.(b)

Sol. శాతవాహన వంశ స్థాపకుడైన శ్రీముఖుడి యొక్క కుమారుడు మొదటి శాతకర్ణి. ఇతని బిరుదులు- అప్రతిహిత చక్ర, దక్షిణపధపతి. యజ్ఞ యాగాదులు చేయడం, భూములను దానం చేయడం ఇతనితోనే ప్రారంభమైంది.

S25. Ans.(a)

Sol. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1918 సంవత్సరంలో హైదరాబాద్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేత స్థాపించబడింది.

S26. Ans.(a)

Sol. తెలంగాణాలో పత్తి ఉత్పత్తి చేసే జిల్లాల్లో ఆదిలాబాద్,రాజన్న సిరిసిల్ల,ఖమ్మం మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది.

మొదటి రెండు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర కలవు.

S27. Ans.(b)

Sol. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఇప్పుడు సీతారామ ఎత్తిపోతల పథకంగా పేరు మార్చబడింది.

S28. Ans.(c)

Sol. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శీర్షిక – “India’s Most Preferred Destination”

తెలంగాణ ప్రభుత్వ పర్యాటక & సంస్కృతి మరియు పురావస్తు శాఖ మంత్రి – శ్రీ జూపల్లి కృష్ణారావు.

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ i- Explore Telangana app ను ప్రారంభించింది.

S29. Ans.(b)

Sol. దక్షిణ భారత దేశంలో, తెలంగాణలో అతి పొడవైన నది గోదావరి. దీనిని తెలివాహ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ నది పొడవు 1465 కి.మీ. తెలంగాణలో దీని పొడవు 560కి.మీ.

S30. Ans.(c)

Sol. ఆరోగ్య తెలంగాణా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను మార్చి5 న రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రారంభించారు. తెలంగాణా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు 30 రకాల పరీక్షలు నిర్వహించనుంది. ఈ వివరాలను ‘ఈ-హెల్త్’ మొబైల్ యాప్ లో పొందుపరుస్తారు.

Telangana High Court Quick Revision Practice Set- 01 PDF

TELANGANA HIGH COURT( GRADUATE LEVEL) MCQ BATCH (BRAIN POWER BATCH) | Online Live Classes by Adda 247

Sharing is caring!

Telangana High Court Quick Revision Practice Set- 01, Download PDF_4.1
About the Author

Hi! I'm Kalyani, your go-to guide for exam prep on the ADDA247 Telugu blog. With 3+ years of experience in EdTech, I specialize in creating informative content on national and state-level exams, focusing on AP and Telangana State Exams. As someone who's walked the talk, I've personally appeared for competitive exams like TGPSC Groups, IBPS, Railways, and most recently, IBPS RRB Clerk Mains 2024. This hands-on expertise enables me to provide valuable insights and guidance to help you navigate your exam prep journey. On this blog, you can expect expert advice, study materials, and exam strategies for AP and Telangana State Exams, as well as Railways, Banking, Insurance, SSC, and other competitive exams. Stay tuned for regular updates, and let's crack those exams together!