Telugu govt jobs   »   Telangana History & Culture: Most Expected...
Top Performing

Telangana History & Culture: Most Expected Questions For Telangana High Court

The countdown has begun! With the Telangana High Court Exam just around the corner, scheduled to take place from April 15th to April 20th, 2025, aspirants are in the final leg of their preparation journey. This exam opens doors to a wide range of technical and non-technical posts, making it a golden opportunity for students aiming to build a career in the judicial system. To help you ace the exam, we’ve curated a quick revision guide focusing on one of the most important sections—Telangana History & Culture.

These carefully selected questions cover the most expected topics that could appear in the exam, ensuring your preparation is both efficient and effective. Whether you’re brushing up on key facts or revisiting critical historical events, this guide will serve as your ultimate companion for last-minute revisions. Let’s dive in and gear up for success!

Most Expected Questions For Telangana High Court

Q1.  తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా ఉపయోగించే సహజ రంగులను తయారు చేయడంలో ఉపయోగించే పువ్వు ఏది?

1. గునుగు

2. మోదుగు

3. తంగేడు

4.  చామంతి

Ans: 2 మోదుగు

వివరణ:  హోలీ పండుగలో సహజ రంగులను తయారు చేయడానికి మోదుగు పువ్వులు (పలాష్ పువ్వులు) ఉపయోగిస్తారు. ఈ పువ్వుల నుండి ఎరుపు రంగు తయారు చేయవచ్చు.

Q2. ప్రతిపాదన (A) : ఆంధ్ర మహాసభ 1930వ సంవత్సరంలో స్థాపించబడింది.

కారణం (R) : ఆ సంస్థ అన్ని రంగములలో తెలుగువారి అభివృద్ధికి కృషి చేసింది.

1) (A) మరియు (R) కరెక్టు మరియు (R), (A)కు సరైన కారణం/వివరణ.

2) (A) మరియు (R) రెండూ కరెక్టు కాని (R), (A)కు సరైన కారణం/వివరణ కాదు.

3)(A) కరెక్టు, కాని (R) తప్పు

4) (A) తప్పు, కాని (R) కరెక్టు

Ans: 1) (A) మరియు (R) కరెక్టు మరియు (R), (A)కు సరైన కారణం/వివరణ.

వివరణ: ఆంధ్ర మహాసభ 1930లో మాడపాటి హనుమంతరావు నేతృత్వంలో స్థాపించబడింది. ఈ సంస్థ తెలుగువారి భాషా, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధికి కృషి చేసింది.

Q3. ఈ క్రింది వాటిలో సరియైన ప్రవచనము ఏది?

1) కె.సి. గుప్త దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించాడు.

2) భాగ్యరెడ్డి వర్మ హైద్రాబాద్ అంబేద్కర్ గా పిలువబడినాడు

3) మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైద్రాబాద్ స్టేట్బ్యంక్ను స్థాపించాడు.

4) హుస్సేన్సాగర్ చెరువును హయత్భక్షీ బేగం నిర్మించింది.

Ans: 2) భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ అంబేద్కర్ గా పిలువబడినాడు

వివరణ: భాగ్యరెడ్డి వర్మ దళితుల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ నాయకుడు. ఆయనను “హైదరాబాద్ అంబేద్కర్” అని కూడా పిలిచేవారు

Q4. “నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు” గ్రంథ కర్త ఎవరు?

1) ఈశ్వరీ బాయి

2) టి. సదాలక్ష్మి

3) సంగెం లక్ష్మీబాయి

4) ఆరుట్ల కమలాదేవి

Ans: 3) సంగెం లక్ష్మీబాయి

వివరణ: సంగెం లక్ష్మీబాయి స్వీయ అనుభవాలను “నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు” అనే గ్రంథంలో రచించారు

Q5. ‘జమిదికా’ అను పదానికి తెలంగాణలో గల అర్థం ఏమిటి?

1. సంగీత పరికరం

2. మంట కోసం వాడే ప్రత్యేకమైన రాయి

3. పక్షులను వేటాడటానికి ఉపయోగించే ఒక పరికరం

4. చెప్పులు కుట్టుటకు ఉపయోగించే ఒక పరికరం

Ans: 1) సంగీత పరికరం

Q 6. సూర్య దేవాలయం తెలంగాణలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో నెలకొని ఉంది?

1. కొలనుపాక, నల్గొండ

2. బాసర, ఆదిలాబాద్

3. వికారాబాద్, రంగారెడ్డి

4. జైనూరు, ఆదిలాబాద్

Ans: 4) జైనూరు, ఆదిలాబాద్

Q7. ‘రుమాలు’ అనే పదాన్ని తెలంగాణలో ఈ క్రింది అర్థంలో వాడుతారు?

1. భుజాలమీద వేసుకొనే ఒక ప్రత్యేకమైన బట్ట

2. తలపైన ధరించునది

3. నడుముకు చుట్టుకొనే ఒక వస్త్రం

4. హాఫ్ శారీ

Ans: 2) తలపైన ధరించునది

వివరణ: తెలంగాణలో ‘రుమాలు’ అనే పదం తలపైన ధరించే వస్త్రాన్ని సూచిస్తుంది. ఇది ప్రధానంగా కురుమగొల్లలు తమ తలపై రుమాలు ధరించడం ద్వారా గుర్తించబడతారు

Q8. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనములు ఏవి?

A) మైలాంబ బయ్యారం చెరువు శాసనాన్ని వేయించింది.

B) రుద్రదేవుడు మోటువల్లి అభయ శాసనాన్ని వేయించినాడు

C) పాల్కుర్కి సోమనాథుడు పండితారాధ్య చరిత్రను రచించినాడు

D)  రంగనాథుడు పురుషార్ధసారం గ్రంథాన్ని రచించినాడు

1) A మరియు C

2) B మరియు D

3) C మరియు D

4) A మరియు B

Ans: 1) A మరియు C

వివరణ: మైలాంబ బయ్యారం చెరువు శాసనాన్ని వేయించింది. పాల్కుర్కి సోమనాథుడు పండితారాధ్య చరిత్రను రచించాడు.

Q9. నల్గొండ జిల్లాలోని కొలనుపాక ఈ క్రింది దేనికి ప్రసిద్ధి?

1. సూర్యదేవాలయం

2. బుద్ధ దేవాలయం

3. జైన దేవాలయం

4. శక్తి పీఠం

ANS: 3. జైన దేవాలయం

వివరణ: కొలనుపాకలోని జైన దేవాలయం ప్రాచీనమైనది మరియు ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగి ఉంది

Q10. సంచార జాతికి చెందిన దొమ్మరి వారు ప్రదర్శించే ‘దొమ్మరి ఆట’ను గురించి ఏ మధ్య యుగపు రచనలో పేర్కొన్నారు?

1) పలనాటి వీరచరిత్ర

2) ఆముక్త మాల్యద

3) మెహన తరంగణ

4) శ్రీ సీతారామ భూపాల విలాసం

Ans:1) పలనాటి వీరచరిత్ర

వివరణ: ‘దొమ్మరి ఆట’ గురించి ‘పలనాటి వీరచరిత్ర’లో ప్రస్తావించబడింది.

Q11. ఈ క్రింది వాటిని జతపరుచుము:

A) దొమ్మరాట   1) సంగీతం, నృత్యం, గానంతో కూడిన జానపద కళ

B) యక్షగానం    2) కర్ర ఆట

C) కాటి పాపలు   3) డోలు వాయించడము

D) కోలాటం        4) చనిపోయినవారికి చేయు మతపరమైన మంత్ర విద్య వేడుక

సరియైన జతలు ఏవి?

1). A -2, B-1,C-3, D -4

2). A -3, B-1,C-4, D – 2

3). A- 3, B-4,C-1, D – 2

4). A – 1, B-4, C-2, D – 3

Ans: 2). A -3, B-1, C-4, D – 2

వివరణ: దొమ్మరాటలో డోలు వాయించడము (A-3), యక్షగానం సంగీతం, నృత్యం, గానంతో కూడిన జానపద కళ (B-1), కాటి పాపలు చనిపోయినవారికి చేయు మతపరమైన మంత్ర విద్య వేడుక (C-4), కోలాటం కర్ర ఆట (D-2)గా జతపరచబడతాయి

Q12. ఈ క్రింది వాటిని జతపరుచుము:

పత్రిక                 సంపాదకుడు

A) నీలగిరి పత్రిక              1) బి. శ్రీనివాస శర్మ

B) హిత బోధిని                  2) కోకల సీతరామ శర్మ

C) ఆంధ్రాభ్యుదయము  3) యం. నర్సింగరావు

D) ది రయ్యత్                  4) శబ్నవాసు వెంకట రామరావు

సరియైన జతలు ఏవి?

1). A -2, B-3, C-4, D -2

2). A -3, B-1, C-4, D – 2

3). A- 3, B-4, C-1, D – 2

4). A – 1, B-4, C-2, D – 3

Ans: 1). A -2, B-3, C-4, D -2

వివరణ: నీలగిరి పత్రికకు కోకల సీతారామ శర్మ (A-2), హిత బోధిని పత్రికకు యం. నర్సింగరావు (B-3), ఆంధ్రాభ్యుదయము పత్రికకు శబ్నవాసు వెంకట రామరావు (C-4), ది రయ్యత్ పత్రికకు కోకల సీతారామ శర్మ (D-2) సంపాదకులుగా ఉన్నారు

Q13. ముద్ద పప్పు బతుకమ్మ ఏ రోజున జరుపుకుంటారు?

1) బతుకమ్మ పండగ రెండవరోజు

2) బతుకమ్మ పండుగ ఎనిమిదవ రోజు

3) బతుకమ్మ పండుగ మూడవ రోజు

4) బతుకమ్మ పండుగ ఆరవ రోజు

Ans: 3) బతుకమ్మ పండుగ మూడవ రోజు

వివరణ: ముద్ద పప్పు బతుకమ్మను బతుకమ్మ పండుగ మూడవ రోజున జరుపుకుంటారు.

Q14. ‘చిత్తారమ్మ జాతరను’ కింది వాటిలో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు?

1) పటాన్ చెరు, సంగారెడ్డి

2) అనంతగిరి, వికారాబాద్

3) కోయిలకొండ, మహబూబ్నగర్

4) గాజుల రామారం, హైద్రాబాద్

ANS: 4) గాజుల రామారం, హైదరాబాద్

వివరణ: చిత్తారమ్మ అమ్మవారి జాతర హైదరాబాద్‌లోని గాజుల రామారంలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుంది. ఇది ఒక ప్రసిద్ధ స్థానిక ఉత్సవం

Q15. ముల్కీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది?

1) 1956

2) 1950

3) 1969

4) 1952

Ans: 4) 1952

వివరణ: ముల్కీ ఉద్యమం 1952లో ప్రారంభమైంది. ఇది నైజాం ప్రభుత్వం విధించిన ముల్కీ నిబంధనల అమలును కొనసాగించాలని కోరిన ఉద్యమం

Q16. వేయి స్తంభాల గుడిని క్రింది వాటిలో ఏ పేరుతో / పేర్లతో కూడా పిలుస్తారు?

1) స్వయంభ దేవాలయం, కేశవాలయం

2) పద్మాక్షి ఆలయం

3) సిద్ధేశ్వరాలయం

4) రుద్రేశ్వరాలయం, త్రికూట ఆలయం

Ans: 4) రుద్రేశ్వరాలయం, త్రికూట ఆలయం

వివరణ: వేయి స్తంభాల గుడిని రుద్రేశ్వరాలయం అని పిలుస్తారు. ఇది త్రికూట ఆలయ నిర్మాణశైలితో నిర్మించబడింది, అంటే మూడు గర్భగృహాలు కలిగిన ఆలయం.

Q17. క్రింది వాటిలో ఏ అవసరాల కోసం కుతుబ్షాహీలు ‘దార్-ఉల్-షిఫా”ను నిర్మించారు?

1) మత ప్రార్థనలు

2) మత భోదన

3) ప్రయాణికుల విశ్రాంతి గృహం

4) ప్రజల ఆరోగ్య అవసరాలు

Ans: 4) ప్రజల ఆరోగ్య అవసరాలు

వివరణ: ‘దార్-ఉల్-షిఫా’ అనే ఆసుపత్రిని ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కుతుబ్ షాహీ రాజులు హైదరాబాదులో నిర్మించారు. ఇది ఆసుపత్రి మరియు ఔషధ కేంద్రంగా ఉపయోగపడింది

Q18.  “జాతక” కథలు ఏ భాషలో లిఖించబడ్డాయి?

1) నేపాలి

2) ఖరోస్తి

3) సంస్కృతం

4) పాళీ

Ans: 4) పాళీ

వివరణ: బౌద్ధ ధర్మ గ్రంథాల్లో ముఖ్యమైనవి జాతక కథలు. ఇవి పాళీ భాషలో రచించబడ్డాయి. ఇందులో బుద్ధుని పూర్వ జన్మల కథలు ఉంటాయి.

Q19. సూర్యాపేట జిల్లాలోని ‘ఫణిగిరి’ దేనికి ప్రసిద్ధి చెందింది?

1) నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం ఆరంభమైంది.

2) లింగవంతుల జాతర

3) మూసీనది కృష్ణాలో ప్రవేశిస్తుంది.

4) బౌద్ధ క్షేత్రం

Ans: 4) బౌద్ధ క్షేత్రం

వివరణ: ఫణిగిరి (ప్రాచీనంగా ధర్మసాగర) బౌద్ధ క్షేత్రంగా ప్రసిద్ధి. ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన స్టూపాలు, విహారాలు లభించాయి.

Q20.  స్వతంత్ర హైద్రాబాద్ అనే భావనను ‘భారతదేశ’ హృదయంలో ఒక పుండుగా, దానినీ శస్త్ర చికిత్స ద్వారా నిర్మూలించవలసిన అవసరం’గా అభివర్ణించింది ఎవరు?

1) మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి

2) జవహర్లాల్ నెహ్రూ

3) సర్ధార్ వల్లబ్బాయ్ పటేల్

4) స్వామి రామానంద తీర్థ

Ans: 3) సర్దార్ వల్లభభాయ్ పటేల్

వివరణ: హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలనే ఉద్దేశంతో సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ వ్యాఖ్య చేశారు. ఆయన నేతృత్వంలో ‘ఆపరేషన్ పోలో’ ద్వారా సంస్థానాన్ని విలీనం చేశారు.

Telugu Telangana History & Culture: Most Expected Questions pdf

TELANGANA HIGH COURT( GRADUATE LEVEL) MCQ BATCH (BRAIN POWER BATCH) | Online Live Classes by Adda 247

Sharing is caring!

Telangana History & Culture: Most Expected Questions For Telangana High Court_4.1
About the Author

Hi! I'm Kalyani, your go-to guide for exam prep on the ADDA247 Telugu blog. With 3+ years of experience in EdTech, I specialize in creating informative content on national and state-level exams, focusing on AP and Telangana State Exams. As someone who's walked the talk, I've personally appeared for competitive exams like TGPSC Groups, IBPS, Railways, and most recently, IBPS RRB Clerk Mains 2024. This hands-on expertise enables me to provide valuable insights and guidance to help you navigate your exam prep journey. On this blog, you can expect expert advice, study materials, and exam strategies for AP and Telangana State Exams, as well as Railways, Banking, Insurance, SSC, and other competitive exams. Stay tuned for regular updates, and let's crack those exams together!