Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana History MCQs Questions And Answers...
Top Performing

Telangana History MCQs Questions And Answers in Telugu, 27th September 2023 For TSPSC Group 2 & TSPSC Group 3

Telangana History MCQs Questions And Answers in Telugu : Practice Telangana History Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of Telangana History. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana History MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana History MCQs Questions And Answers in Telugu.

Q1. కడివెండిలో ఎవరి ఇంటిలో సంఘం కార్యాలయాన్ని ఏర్పాటు చేసినారు?

(a) మాశెట్టి రామచంద్రయ్య 

(b) చాకలి ఐలమ్మ

(c) నల్లా నరసింహులు

(d) దొడ్డి కొమురయ్య 

Q2. దొడ్డి కొమరయ్య అమరత్వం తరువాత ప్రజల్లో ఉప్పొంగిన సమరోత్సాహాన్ని గ్రహించిన కమ్యూనిస్టు పార్టీ – ఆంధ్రమహాసభ అగ్రనాయకత్వం ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కొన్ని లక్ష్యాలను కచ్చితంగా అమలు చేయాలని తీర్మానించింది. కింది వాటిలో ఏది సరైంది?

  1.  అన్ని రకాల నిర్బంధ చాకిరి, అక్రమ నిర్బంధ వసూళ్లు వెంటనే నిలిపివేయాలి. నిర్బంధ లెవీ పన్ను చెల్లింపు విధానాన్ని నిరాకరించాలి.
  2.  భూస్వాముల నుంచి కౌలుకు తీసుకొని సాగుచేసుకొంటున్న భూములను నిలబెట్టుకోవడమేగాక, భూస్వాములు అక్రమంగా స్వాధీనపర్చుకొన్న భూములన్నింటినీ తిరిగి ఆక్రమించుకోవడానికి కూడా ప్రజలను సంఘటితపరచాలి. 
  3. పెద్ద భూస్వాముల, దేశముఖ్ వద్ద గల ధాన్యం నిల్వలను స్వాధీనం చేసుకొని అవసరం ఉన్న గ్రామీణ పేద ప్రజలకు పంపిణీచేయాలి.

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

Q3. ఆకునూరు రైతులు పోరాటం ఎందుకు చేసినారు.

  1. లెవీ పన్నుకి వ్యతిరేకంగా 
  2. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా
  3. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా
  4. రజాకార్లకు వ్యతిరేకంగా

Q4. ఖాసిం రజ్వి దాడులకు, నిజాం అసమర్థ పాలనకు వ్యతిరేకంగా, భూస్వా వ్యవస్థ నిర్మూలనకు గాను 1947 సెప్టెంబర్ 11న కమ్యూనిస్టులు మరొకసారి అధికారికంగా తెలంగాణాలో సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చారు.

ఈ పోరాటం యొక్క ఆశయాలు ఈ కింది వాటిలో ఏవి?

  1. భూస్వాముల, పోలీసుల, రజాకర్ల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనపర్చుకోవడం. 
  2. భూస్వాముల, ప్రభుత్వ బంజరు భూములను ఆక్రమించి పేద రైతులకు పంచడం.
  3. ఎలాంటి పన్నులు చెల్లించకుండా ప్రభుత్వాన్ని పూర్తిగా స్తంభింపచేయడం.
  4. ప్రజలను రక్షించడానికి జిల్లా, తాలూకా, గ్రామస్థాయిల్లో రక్షణ గెరిల్లా దళాలను ఏర్పాటు చేయడం. 

(a) 1 మరియు 3

(b) 1, 2, 3 మరియు 4

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

Q5. చిలుకూరు ఆంధ్రమహాసభ సమావేశమనేది తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఒక ప్రధానమైన మలుపుగా సహకరించింది. చిలుకూరు ఆంధ్రమహాసభ ఏ సంవత్సరంలో జరిగింది.?

(a) 1945

(b) 1941

(c) 1951

(d) 1935

Q6. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారత కమ్యూనిస్టుల మొదటి అతిపెద్ద రైతాంగ సాయుధ విప్లవం. ఇది సుమారుగా 16,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో సుమారు 3000 గ్రామాలకు విస్తరించింది. సాయుధ పోరాట ముఖ్య ఫలితాలు ఈ కింది వాటిలో ఏవి?

  1. వెట్టిచాకిరి విధానంతోపాటు చట్ట వ్యతిరేక ముడుపులు, వసూళ్లూ, లంచాలు, భూస్వామ్య విధానపు రకరకాల అణచివేతలు అంతం చేయబడ్డాయి.
  2. తెలంగాణా ప్రతి పల్లెలో కొంతమేరకు సామాజిక సమానత్వం సాధించబడింది.
  3. నిజాం నిరంకుశ, భూస్వామ్య పాలనను తుదముట్టించి, వ్యావసాయిక కార్యక్రమాలను చేపట్టి లక్షల ఎకరాల భూమిని పునఃపంపిణి చేయడం జరిగింది.
  4. ఉచితంగా పనిచేయించుకొని వెళ్ళగొట్టడమనేది నిషేధించబడింది. వ్యవసాయ కూలీలకు కనీస కూలీ రేటు ఖరారు చేయబడింది.

(a) 1 మరియు 3

(b) 1, 2, 3 మరియు 4

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

Q7. 1951లో గాంధీజీ సిద్ధాంతాలు వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో అఖిల భారత సర్వోదయ సమ్మేళనం ఎక్కడ జరిగింది.

(a) పోచంపల్లి

(b) ఇండోర్

(c) అంగుల్

(d) శివరాంపల్లి

Q8. భూదానోద్యమాన్ని ప్రారంభించిన వినోభాభావే ఎవరి శిష్యుడు?

(a) నెహ్రూ

(b) అంబేద్కర్

(c) మహాత్మ గాంధీ

(d) పైనవేవి కావు

Q9. వినోభాభావే భూధాన ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించాడు?

(a) పోచంపల్లి

(b) శివరాం పల్లి

(c) సర్వెల్

(d) రాజూర

Q10.  ఈ కింది వాటిలో కోదండరామిరెడ్డి తన ఆత్మకథ ఏది?

(a) అన్ టూ ది లాస్ట్

(b) సర్వోదయ

(c) నిన్నటి ఇతిహాసం

(d) తెలంగాణ పోరాటాలు

Solutions:

S1. Ans (a)

Sol: కడవెండి ఆంధ్రమహాసభ గ్రామ సంఘం ప్రధాన కార్యాలయంగా సంఘ సభ్యుడైన మాశెట్టి రామచంద్రయ్య ఇల్లు ఉండేది. అదే ఆనాటి గ్రామ ప్రజావేదిక.

S2. Ans (d)

Sol: దొడ్డి కొమరయ్య అమరత్వం తరువాత ప్రజల్లో ఉప్పొంగిన సమరోత్సాహాన్ని గ్రహించిన కమ్యూనిస్టు పార్టీ – ఆంధ్రమహాసభ అగ్రనాయకత్వం ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కొన్ని లక్ష్యాలను కచ్చితంగా అమలు చేయాలని తీర్మానించింది. అవి

  • అన్ని రకాల నిర్బంధ చాకిరి, అక్రమ నిర్బంధ వసూళ్లు వెంటనే నిలిపివేయాలి. నిర్బంధ లెవీ పన్ను చెల్లింపు విధానాన్ని నిరాకరించాలి.
  •  భూస్వాముల నుంచి కౌలుకు తీసుకొని సాగుచేసుకొంటున్న భూములను నిలబెట్టుకోవడమేగాక, భూస్వాములు అక్రమంగా స్వాధీనపర్చుకొన్న భూములన్నింటినీ తిరిగి ఆక్రమించుకోవడానికి కూడా ప్రజలను సంఘటితపరచాలి. 
  • పెద్ద భూస్వాముల, దేశముఖ్ వద్ద గల ధాన్యం నిల్వలను స్వాధీనం చేసుకొని అవసరం ఉన్న గ్రామీణ పేద ప్రజలకు పంపిణీచేయాలి.

S3. Ans (a)

Sol:  జనగామ తాలూకాలోని ఆకునూరు గ్రామ ప్రజలు 1943 లో బలవంతపు లెవీ పన్నుకి వ్యతిరేకంగా గ్రామ పోలీస్ పటేల్ సీతల్ ప్రసాద్ నాయకత్వలో గొప్ప తిరుగుబాటును లేవదీశారు.

S4. Ans (b)

Sol:  ఖాసిం రజ్వి దాడులకు, నిజాం అసమర్థ పాలనకు వ్యతిరేకంగా, భూస్వా వ్యవస్థ నిర్మూలనకు గాను 1947 సెప్టెంబర్ 11న కమ్యూనిస్టులు మరొకసారి అధికారికంగా తెలంగాణాలో సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చారు.

పోరాట ఆశయాలు

  • భూస్వాముల, పోలీసుల, రజాకర్ల వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనపర్చుకోవడం. 
  • భూస్వాముల, ప్రభుత్వ బంజరు భూములను ఆక్రమించి పేద రైతులకు పంచడం.
  • ఎలాంటి పన్నులు చెల్లించకుండా ప్రభుత్వాన్ని పూర్తిగా స్తంభింపచేయడం.
  • ప్రజలను రక్షించడానికి జిల్లా, తాలూకా, గ్రామస్థాయిల్లో రక్షణ గెరిల్లా దళాలను ఏర్పాటు చేయడం. 

S5. Ans (b)

Sol: చిలుకూరు ఆంధ్రమహాసభ సమావేశమనేది తెలంగాణ రైతాంగ ఉద్యమానికి ఒక ప్రధానమైన మలుపుగా సహకరించింది. 1941 లో జరిగిన చిలుకూరు ఆంధ్రమహాసభ సమావేశం రావి నారాయరెడ్డి ఆధ్వర్యంలో జరగడంతో పాక్షికంగా ఆంధ్రమహాసభ కార్యకలాపాలు కమ్యూనిస్టులు నాయకత్వంలోకి వెళ్ళిపోయాయి.

S6. Ans(b)

Sol:  తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారత కమ్యూనిస్టుల మొదటి అతిపెద్ద రైతాంగ సాయుధ విప్లవం. ఇది సుమారుగా 16,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో సుమారు 3000 గ్రామాలకు విస్తరించింది. సాయుధ పోరాట ముఖ్య ఫలితాలు

  • వెట్టిచాకిరి విధానంతోపాటు చట్ట వ్యతిరేక ముడుపులు, వసూళ్లూ, లంచాలు, భూస్వామ్య విధానపు రకరకాల అణచివేతలు అంతం చేయబడ్డాయి.
  • తెలంగాణా ప్రతి పల్లెలో కొంతమేరకు సామాజిక సమానత్వం సాధించబడింది.
  • నిజాం నిరంకుశ, భూస్వామ్య పాలనను తుదముట్టించి, వ్యావసాయిక కార్యక్రమాలను చేపట్టి లక్షల ఎకరాల భూమిని పునఃపంపిణి చేయడం జరిగింది.
  • ఉచితంగా పనిచేయించుకొని వెళ్ళగొట్టడమనేది నిషేధించబడింది. వ్యవసాయ కూలీలకు కనీస కూలీ రేటు ఖరారు చేయబడింది.

S7. Ans (d)

1951లో గాంధీజీ సిద్ధాంతాలు వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో అఖిల భారత సర్వోదయ సమ్మేళనం శివరాంపల్లిలో జరిగింది. ఈ సమ్మేళన అనంతరం ఆచార్య వినోభాబావే శివరాంపల్లి నుండి పోచంపల్లికి వెళ్ళాడు.

S8. Ans (c)

Sol: భూదానోద్యమాన్ని మహాత్మాగాంధీ ముఖ్య శిష్యుడైన వినోబాభావే తెలంగాణాలో ప్రారంభించారు. ఆయన తన పాదయాత్ర ద్వారా తెలంగాణ మొత్తం పర్యటించి కొన్నివేల ఎకరాల భూమిని భూస్వాముల దగ్గర నుంచి దానంగా పొంది భూమిలేని పేదలకు పంచాడు.

S9. Ans (a)

Sol: ఆచార్య వినోభాబావే నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 1951 ఏప్రిల్ 18న భూధాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ పాదయాత్రకు కోదండరామిరెడ్డి ఇన్ ఛార్జిగా ఉన్నారు.

S10. Ans (c)

Sol: పోచంపల్లి గ్రామ పెద్ద వెదిరె రామచంద్రారెడ్డి తన తండ్రిగారి పేరున ఉన్న 100 ఎకరాల భూమిని భూదాన యజ్ఞానికి దానం చేశాడని కోదండరామిరెడ్డి గారు తన ఆత్మకథ అయిన నిన్నటి ఇతిహాసంలో పేర్కొన్నాడు.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana History MCQs Questions And Answers in Telugu, 27th September 2023_5.1

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website