Telugu govt jobs   »   Study Material   »   Telangana History Vemulawada Chalukyulu
Top Performing

Telangana History – Vemulawada Chalukyulu, Download PDF | తెలంగాణ చరిత్ర – వేములవాడ చాళుక్యులు

తెలంగాణ చరిత్ర – వేములవాడ చాళుక్యులు

వేములవాడను చాళుక్యులది తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం. రాష్ట్ర కూటులకు సామంతులైన వీరి కాలంలో ఎందరో కవులు కీర్తిని పొందారు. కన్నడ రాజభాష మాత్రమే కాదు. ఆ భాషకు స్వర్ణయుగం వీరి పాలనాకాలం. దేవాలయాల నిర్మాణంలో చాళుక్యుల కృషి చరిత్ర లిఖితం. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా మొదట బోధన్, తర్వాత వేములవాడ, కొంతకాలం గంగాధరను రాజధానులుగా చేసుకొని తెలంగాణలోని పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు

వేములవాడ చాళుక్యులు తెలంగాణ ఉత్తర ప్రాంత (నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు) పరిధిలో.. క్రీ.శ. 7వ శతాబ్దపు ఉత్తరార్ధం నుంచి 11వ శతాబ్దపు పూర్వార్ధం వరకు పాలించారు. గోదావరి నదికి దక్షిణానగల మంజీర నది నుంచి మహాకాళేశ్వర సర్వాంతం వ్యాపించి ఉన్న భూభాగమే పోదనాడు. దీన్నే సపాదలక్ష దేశం అంటారు. ఇదే వేములవాడ చాళుక్య రాజ్యం. వీరు అనేక దేవాలయాలను నిర్మించడమే కాకుండా బహుభాషా కవులను పోషించారు.

Aptitude MCQs Questions And Answers in telugu |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

తెలంగాణ చరిత్ర – వేములవాడ చాళుక్యులు వివరాలు

వేములవాడ చాళుక్యుల సామ్రాజ్యం, స్థాపకుడు మరియు మరిన్ని వివరాలు దిగువ పట్టిక రూపంలో అందించాము.

సామ్రాజ్యం వేములవాడ చాళుక్యులు
స్థాపకుడు విక్రమాదిత్య యుద్ధమల్లుడు
మతం హైందవం, జైనం
 రాజధాని వేములవాడ
గొప్పవాడు రెండవ అరికేసరి
 చివరివాడు మూడో అరికేసరి

వేములవాడ చాళుక్యులు చరిత్ర ఆధారాలు

సాహిత్య ఆధారాలు

పంపకవి రచించిన విక్రమార్జున విజయం , ఆది పురాణం
సోమదేవ సూరి యశస్తిలక
మల్లియ రేచన కవిజనాశ్రయం

 ‘వేములవాడ’ (కరీంనగర్) ను రాజధానిగా చేసుకున్న తర్వాతనే వీరి ప్రత్యేక సంస్కృతి, రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనందున వీరిని వేములవాడ చాళుక్యులు అంటారు.

వేములవాడ చాళుక్యులు పాలకులు, వారి రాజకీయ చరిత్ర

సత్యాశ్రయ రణ విక్రముడు

  1. వేములవాడ చాళుక్య వంశంలో మొదటి వాడు బోధనన్ను రాజధానిగా చేసుకొని పాలించాడు.
  2. వీరు మొదట బాదామి చాళుక్యులకు, తర్వాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి పాలించారు
  3. కొల్లిపర శాసనం (మొదటి అరికేసరి) ప్రకారం వేములవాడ చాళుక్య వంశ మూలపురుషుడు- సత్యాశ్రయరణ విక్రముడు. 

వినయాదిత్య యుద్ధమల్లుడు

  •  యుద్ధమల్లుడు నిజామాబాద్ జిల్లాలోని “నిందూరు బోధను” రాజధానిగా పాలన చేశాడు.
  • ఇతను కొన్ని రాజ్యాలను, చిత్రకూట దుర్గాన్ని (కరీంనగర్ లోని రాయగిరి) సాధించారు.

మొదటి అరికేసరి

మొదటి అరికేసరి రాజధానిని బోధన్ నుండి “వేములవాడ” కు మార్చాడు.

బద్దెగుడు

  • బద్దెగ బద్దెగేశ్వరాలయాన్ని నిర్మించాడు. బద్దగేశ్వరాలయమును వేములవాడలోని భీమేశ్వరాలయంగా గుర్తించారు.
  • ఇతని బిరుదు “సోలద-గండ” (అపజయమెరుగని వీరుడు)

 రెండవ నరసింహుడు

  1. పూరర ప్రతిహార మహీపాల చక్రవర్తిని ఓడించి “కాలప్రియ (కల్పి” అనే చోట విజయ సంభాన్ని నాటాడు.
  2. యమునా నదిని దాటి కన్యాకుబ్జ నగరం చేరి తన గుర్రాలకు గంగానది నీరు త్రాగించాడు.
  3. వేములవాడలో జైన చౌముఖాలు చెక్కించిన వేములవాడ చాళుక్యరాజు – రెండవ నరసింహుడు.

రెండో అరికేసరి

  • ఇతను వేములవాడ శిలాశాసనంను సంస్కృతంలో వేయించాడు.
  • ఇతడు తన పేరుతో బోధన్లో అరికేసరి జీనాలయంను నిర్మించాడు.
  • ఇతని కాలం నాటి కవులు : * పంపకవి * జీనవల్లభుడు * మల్లియరేచన

వాగరాజు

  • ఇతని ఆస్థాన కవి సోమదేవసూరి యశస్థిలక చంపూ కావ్యం ను వాగరాజు కాలంలోనే పూర్తిచేశాడు. 

భద్రదేవుడు (రెండవ బద్దెగుడు)

  • కరీంనగర్ జిల్లాలోని ‘గంగాధర పట్టణం’ రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. 
  • వేములవాడలో “సుభదామ జినాలయం” ను నిర్మించాడు.

మూడో అరికేసరి

  •  వేములవాడ చాళుక్యులలో చివరివాడు.
  • నీటి వసతి సరిగాలేక రాజధానిని తిరిగి గంగాధర నుండి వేములవాడకు మార్చాడు. ఇక్కడి పెద్దవాగు నీటివసతిని తీరుస్తుంది.
  • రెండవ తైలపుడు రాష్ట్రకూట రాజ్యాన్ని కూల్చి కళ్యాణి చాళుక్య రాజ్యస్థాపనతో ఈ వేములవాడ చాళుక్య రాజ్యం కూడా అంతరించింది.
  • పర్బని శాసనం ప్రకారం – ఇతడు శుభదామ జినాలయానికి మరమ్మత్తులు చేయడానికి రేపాక గ్రామాన్ని సోమదేవసూరికి దానం చేశాడు.

మతం పరిస్థితులు

వైష్ణవ, శైవ శక్తి మతాలు

  • రెండవ అరికేసరి తంత్రపాలుడు అయిన పెద్దన వేములవాడలో ‘ఆదిత్యాలయాన్ని కట్టించాడు.
  • వేములవాడ శాసనం (2వ అరికేసరి) పేర్కొన్న వేములవాడలోని ప్రధానాలయాలు (4)

1) రాజేశ్వరాలయం : ఇది రాజాదిత్య బిరదాంకితుడైన మొదటి నరసింహుని పేరుతో  నిర్మించిన ఆలయం. దీని స్థానాధిపతి – మల్లికార్జునుడు.

2) బద్దెగేశ్వరాలయం :  ఇది వేముల వాడ రాజైన బద్దెగుని పేరుతో నిర్మించిన ఆలయం. ఈ ఆలయ స్థానాధిపతి – విద్యారాశి

3) ఆదిత్య గృహం :  ఇది వేములవాడలోని ప్రధాన ఆదిత్య ఆలయం. ఈ గృహ స్థానాధిపతి – వ్యక్తిలింగి

4) నగరేశ్వరాలయం:

  • ఈ ఆలయ స్థానాధిపతి – వ్యాఖ్యాన భట్టాకరుడు.
  • వేములవాడ చాళుక్యులు బోధలో 100 స్తంభాల ఇంద్రనారాయణ ఆలయంను నిర్మించారు.
  • ఈ 100 స్తంభాలగుడిని ఔరంగజేబు కాలంలో ‘దేవల్ మసీద్’గా మార్చారు.
  • జైనాలయాలు, హిందూ దేవాలయాలు అనుబంధంగా ఉండే మఠాలలో అనేక విద్యలు బోధించబడేవి
  • కొల్లిపర శాసనం ప్రకారం మొదటి అరికేసరి ముగ్ధశివాచార్యునికి “బల్మోగ” అనే గ్రామాన్ని దానమిచ్చాడు.

 జైనం

  • వేములవాడ చాళుక్య రాజులు జైనమతాన్ని ఆదరించారు.
  • ప్రముఖ జైన కవులు అయిన పంపకవి, జీనవల్లభుడు, సోమదేవసూరిలను ఆదరించారు
  •  జినవల్లభుడు ధర్మపురిలో జీనాలయాన్ని నిర్మించాడు.
  • రెండవ బద్దెగుడు (భద్రదేవుడు) తన గురువైన సోమదేవుని కోసం శుభదామ జినాలయమును నిర్మించారు.
  • ఈ జైన ఆలయ బసది కోసం మూడవ అరికేసరి రేపాక అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. • పర్బనీ శాసనం ప్రకారం ఈ రేపాక గ్రామంలోనే రెండవ బద్దెగుడు జైన ఆలయంను కట్టించాడు.

వేములవాడ చాళుక్యులు సాహిత్య సేవ

  • వేములవాడ చాళుక్య రాజులు తెలుగు, కన్నడ భాషల సాహిత్యాన్ని ప్రోత్సహించారు
  • పద్మకవి – తెలుగులో జినేంద్రపురాణం
  • మల్లియ రేచన – కవి జనాశ్రయం (తొలి తెలుగు లక్షణ గ్రంథం) 

పంపకవి

  • కన్నడ కవిత్రయంలో మొదటి వాడు, ఆదికవి.
  •  2వ అరికేసరి ఆస్థానకవి.
  • ఇతని బిరుదులు : ఆదికవి, కవితా గుణార్ణవుడు

రచనలు:

  • విక్రమార్జున విజయం (ఇందులో 2వ అరికేసరిని కావ్యనాయకుడిగా (అర్జునిడిగా) చిత్రీకరిస్తూ కావ్యరచన చేశాడు.
  • ఆదిపురాణం (ఋషభనాథుని జీవిత చరిత్ర)
  • జినేంద్ర కళ్యానాభ్యుదయం
  •  2వ అరికేసరి ఆస్థానంలో ఉండి మహాభారతంను కన్నడ భాషలోకి అనువదించాడు.
  • 2వ అరికేసరి పంపకవికి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిని అగ్రహారంగా దానం చేశాడు.
  • పంపకవి సమాధి బోధన్ కోటగోడపై కలదు.

సోమదేవ సూరి

 రచనలు:

  1. కథాసరిత్సాగరం
  2. మహేంద్రమాలతి
  3. యశస్థిలకం
  4. యుక్తి చింతామణి
  5. సన్నావతి ప్రకరణ
  6. నీతికావ్యామృత 
  7. సంజిల్వ
  8. సైదో వాదోపనిషద్ (పద్యగ్రంథం)

3వ అరికేసరి కుంటువృత్తి, వనికాటువులు అనే గ్రామాలను సోమదేవసూరికి దానం చేశాడు.

వేములవాడ భీమకవి

 రచనలు     

  1. రాఘవ పాండవీయం
  2. శతకంధర రామాయాణం

 జినవల్లభుడు (పంపకవి తమ్ముడు)

  • ఇతను రుర్క్యాల గుట్ట (కరీంనగర్) వద్ద ‘చక్రేశ్వరీతీర్థం’ అనే జైన ఆలయాన్ని కట్టించాడు
  •  రుర్క్యాల శాసనం ప్రకారం జీనవల్లభుడు వృషభాద్రి పై జైన ఆలయాన్ని కట్టించాడు..
  • కుర్క్యాలలోని బొమ్మలవర్మ గుట్టపై ఇతను వేయించిన శిలా శాసనంలో తొలి తెలుగు క పద్యం కన్పించింది.

వేములవాడ చాళుక్యుల శాసనాలు 

1.కుర్క్యాల శాసనం (బొమ్మలగుట్ట శాసనం) 

జినవల్లభుడు (రెండవ అరికేసరి క్రీ.శ 946) తొలికంద పద్య శాసనం, ఇందులో మూడు కంద పద్యాలున్నాయి. పంపకవికి ధర్మపురి అగ్రహారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. జినవల్లభుడు జైన పండితులను ఆదరించినట్లు తెలియుచున్నది.

2.కరీంనగర్ శిలాశాసనం :   (రెండవ అరికేసరి క్రీ.శ. 930–55)

అరిపినపల్లి గ్రామంలో ధారవయ్య అనే బ్రాహ్మణునికిచ్చిన భూదానము గూర్చి వివరించబడింది.

3. బద్దెగుని వేములవాడ శిలాశాసనం : (బద్దెగుడు )

మేధావంతుడు, గౌడ సంఘాధ్యక్షుడయిన సోమదేవుడనే కవి గురించి ఈ శాసనంలో ఉన్నది.

4. రేపాక శిలాశాసనం : (ఉజయ క్రీ.శ. 968)

వేములవాడ చాళుక్య మూడవ అరికేసరి రేపాకలో జినాలయం నిర్మించినాడని, ఆ దేవాలయానికి భూదానం చేసినాడనీ ఈ శాసనం తెలుపుతుంది.

5. ఆహవ మల్లుని వేములవాడ శిలాశాసనం: (పశ్చిమ చాళుక్య చక్రవర్తి ఆహవమల్లదేవుడు) దండనాయకుడైన మహేశ్వర శక్తి పండితునికి దానము చేసిన సమయంలో వేయించిన శాసనం 

6. మసీదు శాసనం : (చాళుక్యుల కాలం క్రీ.శ. 1018)

ధర్మపురి నరసింహ ఆలయ నిర్మాణ విశేషాలు. 

7. చికరాజు వేములవాడ శిలాశాసనము : (జయసింహ వల్లభుడు క్రీ.శ. 1033)

రాజేశ్వర, బద్దెగేశ్వర దేవరలకు దానమిచ్చు సందర్భంలో వేయించిన శాసనమిది. 

8. కుమార సోమేశ్వరుని వేములవాడ శిలాశాసనం : (కుమార సోమేశ్వరుడు క్రీ.శ. 1106)

వేములవాడలోని శ్రీమదరికేశ్వర దేవర నైవేద్యం కొరకు ఆదేవర పూజారి ఆచార్యులకు అగ్రహరం దానమిచ్చినపుడు చేయించిన నాశనం 

9. జగదేవరాజు వేములవాడ శిలాశాసనం : (శ్రీమజ్జెగద్దేవరాజు శ్రీ.శ.1108)

హరికేశ్వర దేవరకు ఇల్లిందకుంట అగ్రహారమును దానమిచ్చినపుడు వేయించిన దానశాసనం.

10.కురువగట్టు శాసనం : (శ్రీమజ్జిగద్దేవరాజు క్రీ.శ. 1108 )

జడుర సమీపంలోని గంగాపురం సమీపంలోని గుట్టపై చౌడేశ్వరీ ఆలయంలో ఈ శాసనం ఉంది. వినయాదిత్య యుద్ధమల్లుని రెండవ కుమారుడైన భీరగృహుని ప్రశస్తి ఈ శాసనంలో ఉంది.

తెలంగాణా చరిత్ర- వేములవాడ చాళుక్యులు PDF  

తెలంగాణ చరిత్ర ఆర్టికల్స్ 

తెలంగాణ చరిత్ర- విష్ణు కుండినులు 
తెలంగాణా చరిత్ర -శాతవాహనులు 
తెలంగాణా చరిత్ర – ఇక్ష్వాకులు 
తెలంగాణ చరిత్ర – సాలార్‌జంగ్ సంస్కరణలు
తెలంగాణ చరిత్ర – కుతుబ్ షాహీలు (క్రీ.శ.1512-1687)
తెలంగాణ చరిత్ర – అసఫ్ జాహీ వంశం
తెలంగాణ చరిత్ర – రేచర్ల పద్మ నాయకులు

adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Telangana History - Vemulawada Chalukyulu, Download PDF_5.1

FAQs

What were Vemulawada Chalukyas also known as?

The chalukyas were chandra vamsa kshatriyas. But vemulawada chalukyas called themselves as suryavamsa kshatriyas

What was the first capital of vemulawada chalukyas?

The dynasty's First capital was at Podana (modern Bodhan),

Who was the most famous king of Vemulawada Chalukyas?

Arikesari 2 was the greatest of the Vemulawada chalukyas rulers