Telugu govt jobs   »   Telangana Job Calendar 2024

Telangana Job Calendar 2024 | తెలంగాణ జాబ్ క్యాలండర్ త్వరలో | సిఎం రేవంత్ ప్రకటన

Telangana Job Calendar 2024: సిఎం రేవంత్ రెడ్డి గారు 13 జులై 2024 న JNTU హైదరాబాద్ లో ప్రసంగిస్తూ జాబ్ క్యాలండర్ పై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే జాబ్ క్యాలండర్ విడుదల అయ్యేలా చర్యలు చేపట్టానున్నట్టు తెలిపారు. పోటీ పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధులకు ఇది ఒక సువర్ణఅవకాశం పరీక్షల కోసం ముందునుంచి సన్నద్దమవ్వడంతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ పొందగలరు. Telangana Job Calendar 2024 కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులు వారి ప్రణాళికని సిద్దం చేసుకుని సన్నద్దమవ్వలి. అతి త్వరలో తెలంగాణ జాబ్ క్యాలండర్ ని వివిధ పోస్ట్ లతో విడుదల చేయనున్నారు. తెలంగాణ జాబ్ క్యాలండర్ కి చట్టబద్దత కల్పించే ప్రణాళిక చేయనున్నారు.

తెలంగాణ జాబ్ క్యాలండర్

తెలంగాణలో జాబ్ క్యాలండర్ పై సిఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టతనిచ్చారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలండర్ విడుదల అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఒక వారం రోజుల్లో విడుదల చేయనున్నారు. అసెంబ్లీ లో జాబ్ క్యాలండర్ కి చట్టబద్దత కూడా కల్పించనున్నారు. తెలంగాణ లో నిరుద్యోగులకి ఇది శుభవార్త. ఈ జాబ్ క్యాలండర్ ద్వారా TS పోలీస్, TGPSC గ్రూప్స్, గురుకుల్, విద్య, వైద్య ఆరోగ్యం,JL, DL, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్ట్లు వంటి ఇతర విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దాదాపు 18,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలండర్ విడుదల అవ్వనుంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం మరియు అవకతవకలు వలన ఎంతో మంది ఆశావహులు వారి ప్రభుత్వ ఉద్యోగం ఒక కలలా మిగిలిపోకూడదు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుని మరింత ముందుకు సాగాలి. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, 30 లక్షల మంది TGPSCలో నమోదయ్యారని ముఖ్యమంత్రి గుర్తించారు. దీనికోసం ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలండర్ విడుదల కోసం చర్యలు చేపట్టారు.

తెలంగాణ జాబ్ క్యాలండర్ ముఖ్యమైన తేదీలు:

తెలంగాణ జాబ్ క్యాలండర్ ఒక వారం రోజుల్లోగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధులు వారి ప్రణాళిక ని సిద్దం చేసుకుని పరీక్షలకి ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. తెలంగాణ జాబ్ క్యాలండర్ ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి:

Telangana Job Calendar Important Dates
తెలంగాణ జాబ్ క్యాలండర్ విడుదల అతి త్వరలో
ఖాళీల వివరాల సేకరణ 31 మార్చి 2025
ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 2 జూన్  2025
పరీక్షల నిర్వహణ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్
ఫలితాల విడుదల డిసెంబర్ 2025

TGPSC గ్రూప్ 1 పై స్పష్టత

అక్టోబర్‌లో జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో అనుమతించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, ఇది న్యాయపరమైన సమస్యలకు దారితీస్తుందని, కోర్టులు మొత్తం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దు చేయవచ్చని అన్నారు. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా రిక్రూట్‌మెంట్ యొక్క మెయిన్ పరీక్షకు 1:50 అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. ఇది పోటీ పరీక్షలకి సన్నద్దమయ్యే అభ్యర్ధుల ఎంపిక లో కీలక పాత్ర పోషిస్తుంది. TGPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి అని తెలిపారు.

Telangana Mega Pack

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!