1969 ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీల పాత్ర
- 1969 జనవరిలో తెలంగాణ రక్షణల అమలుకోసం ముఖ్యమంత్రి చొరవ తీసుకోకపోతే తాము కూడా విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని పేర్కొన్న ప్రతిపక్ష పార్టీలు: 1) జనసంఘ్ 2) సి.పి.ఐ 3) సి.పి.ఎం 4) సంయుక్త సోషలిస్టు పార్టీ 5) మజ్లిస్
- ఈ ప్రకటనకు స్పందించిన ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1969 జనవరి 18, 19న అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు
జనసంఘ్ పార్టీ పాత్ర
- జనసంఘ్ పార్టీ హైద్రాబాద్ నగర కార్యదర్శి అయిన ఎమ్. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించారు.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించినందుకు జగన్మోహన్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించారు.
CPI పార్టీ పాత్ర
- 1969 ఏప్రిల్ లో సికింద్రాబాదులోని ‘బురుగు మహదేవ్ హాలు’లో సమైక్యాంధ్రులు సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన కమ్యునిస్టుల ముసుగులో సభను నిర్వహించారు.
- ఈ సభకు అధ్యక్షత వహించిన నగర కార్మిక నాయకుడు – సత్యనారాయణరెడి.
- సభ బయట అప్పటికే ఉన్న తెలంగాణవాదులతో వీరు కలిసి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో రెండు వర్గాల మధ్య గొడవ ప్రారంభం అయింది
- ఈ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తెలంగాణవాదులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు.
APPSC/TSPSC Sure shot Selection Group
CPM పార్టి పాత్ర
- CPM పార్టి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం ‘ నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దూరంగా ఉన్నది. నర్రా రాఘవరెడ్డి అధ్యక్షతన నకిరెకల్ లో మే 4న విశాలాంధ్ర సమైక్యతాసభ జరిగింది.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఇతర పార్టీలు: స్వతంత్ర పార్టీ ,సంయుక్త సోషలిస్టు పార్టీ
- భారతీయ క్రాంతిదళ్ పార్టీ అధ్యక్షుడు చౌదరిచరణ్ సింగ్ ప్రత్యేక తెలంగాణకు తమ పార్టీ మద్దతు ఎప్పుడు ఉంటుందని పేర్కొన్నాడు.
కాంగ్రెస్ పార్టీ పాత్ర
కొండా లక్ష్మణ్ బాపూజీ
- తెలంగాణలో ఆంధ్రప్రాంతం వారిపై దాడులు జరుగుతున్నాయనే అపోహలను ఆంధ్ర మీడియా సృష్టించింది.
- దీంతో ఆంధ్రావారు ఈగల పెంటలోని తెలంగాణ ఉద్యోగులు, వర్కర్లు నివాసముండే కాలనీపై దాడి చేశారు.
- ఈగలపెంట ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మరియు బాధితులకు ఎలాంటి సహాయం చేయలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.
- 1969 మార్చి 28న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లవని, జి.వో.36 ను కొట్టివేసింది.
- దాంతో కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. దీంతో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి చరిత్రలో నిలిచిపోయాడు.
- 1969 ఏప్రిల్ లో సికింద్రాబాద్ కాల్పులకు నిరసనగా ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 8 వరకు కొండాలక్ష్మణ్ బాపూజీ నిరాహార దీక్ష చేపట్టాడు.
- మొదట్లో తెలంగాణ ప్రాంతానికి అస్సాం రాష్ట్రంలో విధంగా ప్రాంతీయ ప్రతిపత్తిని కోరుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ 1969 మే 14న మొదటిసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు.
తెలంగాణ పి.సి.సి ఏర్పాటు
- 1969 జూన్ 1 న కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షతన గాంధీభవన్లోని ప్రకాశం హాలులో తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల సదస్సు నిర్వహించబడింది.
- ఈ సదస్సులోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీని ఎన్నుకున్నారు.
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్
- రాష్ట్ర మంత్రి వర్గం నుండి రాజీనామా చేసిన వి.బి.రాజు అధ్యక్షతన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీని 1970 ఫిబ్రవరి 26 న ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రభుత్వ చర్యలు
(ఎ) అఖిలపక్ష ఒప్పందం
ఈ ఒప్పందం ప్రకారం తీసుకోవలసిన చర్యలు:
- ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో నియమించిన ఉద్యోగులందరినీ వెంటనే తొలగించి వారి స్థానాలలో స్థానికులను నియమించాలి. ఈ విధంగా ఉద్యోగాలు కోల్పోయిన ఆంధ్రప్రాంతం వారికి వారి ప్రాంతంలో ఉద్యోగవకాశాలు కల్పించాలి.
- ప్రభుత్వ విభాగాలకే కాక స్వయం ప్రతిపత్తిగల సంస్థలకు కూడ ముల్కీ నిబంధనలను వర్తింపజేయాలి.
- ఆంధ్ర ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీసి ఆ నిధులను తెలంగాణ ఆ ప్రాంతపు అభివృద్ధి కొరకు ఉపయోగించాలి.
- రాజధానియైన హైదరాబాదు నగరంలో విద్యావసతులను విస్తరింపజేయాలి.
జి.వో.36:
- 1969 అఖిలపక్ష నిర్ణయాన్ని అమలుపరచుటకు, రాష్ట్ర ప్రభుత్వం 1969 జనవరి 21 రోజు 36 నంబరు గల ఒక జీ.వో ను జారీ చేసింది
- జి.వో.36 జారీ అయిన మరుక్షణమే, ఆనాటి అగ్రనాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించినారు.
ఉద్యోగుల సమస్యల పరిశీలనకు ఉన్నతాధికార సంఘం – 1970
- తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి నసి ఉల్లా బేగ్ అధ్యక్షతన ఉన్నతాధికారుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘంలో సభ్యులు :
- 1) ఎల్ చంద్ (రెవెన్యూ బోర్డు సభ్యుడు)
- 2) సి.ఆర్. కృష్ణస్వామి (రెవెన్యూ బోర్డు ప్రత్యేక కార్యదర్శి)
- 3) రావు సాహెబ్
(బి) అష్ట సూత్ర పథకం
- అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969 ఏప్రిల్ 11న పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఒక పథకాన్ని ప్రతిపాదించింది. దానిని అష్టసూత్ర పథకమని అంటారు.
అష్టసూత్ర పథకంలోని అంశాలు:
- ఆంధ్రప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీయడానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమిస్తారు.
- మిగులు నిధుల తరలింపువలన తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించుటకు కావలసిన నిధులను సమకూర్చుతారు.
- తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను తయారుచేయడానికి ముఖ్యమంత్రి అద్యక్షతన ఒక ప్రాంతీయ అభివృద్ధి సంఘాన్ని ఏర్పాటు చేయుట. ఈ సంఘంలో ప్రణాళిక సంఘం ప్రతినిధి, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు.
- నిర్ణయించిన ప్రణాళికలను అమలుపరచడానికి ప్రణాళికా సంఘం సలహాదారుని అధ్యక్షతన ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేయుట.
- తెలంగాణ ప్రాంతీయ సంఘానికి, తరువాత ఆ ప్రాంతపు అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన యంత్రాంగానికి, ఇంకా ఎక్కువ అధికారాలనిచ్చుట.
- తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వడానికి కావలసిన రాజ్యాంగపరమైన సవరణ చేయడం.
- తెలంగాణ ఉద్యోగస్తుల సమస్యలను పరిశీలించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తాం.
- తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిని సారించడానికి ఆరు నెలలకు ఒకసారి తెలంగాణ అభివృద్ధి కమిటీ సమావేశాలను ప్రధానమంత్రి సమక్షంలో జరుపుతారు.
(సి) తెలంగాణ ప్రాంతీయ సంఘానికి విస్తృత అధికారాలు
- తెలంగాణ ప్రాంతీయ సంఘానికి విస్తృత అధికారాలను కల్పిస్తూ 1970 మార్చి 7న రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ సంఘం ఉత్తర్వు – 1958ను సవరిస్తూ ఉత్తర్వును జారీ చేశాడు.
- ప్రాంతీయ సంఘానికి పెంచిన అధికారాలు:
- తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆదాయ, వ్యయాల వివరాలను వేరువేరుగా చూపడం.
- యూనివర్సిటీ విద్య, భారీ మధ్యతరగతి పరిశ్రమలు కూడా తెలంగాణ ప్రాంతీయసంఘ పరిధిలోకి వస్తాయి.
- తెలంగాణ ప్రాంతీయులను ప్రభుత్వ సర్వీసులలో నియమించడానికి అనుసరించవలసిన నియమ నిబంధనలను కూడా ప్రాంతీయ సంఘం కిందకు తేవాలని ఈ ఉత్తర్వు తెలుపుతుంది.
- సర్వీసుల విలీనంపై కేంద్రప్రభుత్వ నిర్ణయాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ సంఘానికి నివేదిక అందించాలి.
- ప్రాంతీయ సంఘం చేసిన సిఫార్సులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతి ఆరు నెలలకొకసారి ప్రాంతీయ సంఘానికి నివేదిక అందించాలి.
డి) వివిధ కమిటీలు
1) కుమార్ లలిత్ కమిటీ
- తెలంగాణ మిగులు నిధులపై కాగ్ అధికారి కుమార్ లలిత్ నేతృత్వంలో మిగులు నిధుల కమిటీ ఏర్పడింది.
- 1969 జనవరి 19 న జరిగిన అఖిలపక్ష ఒప్పందంలో భాగంగా 1969 జనవరిలో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
- ఈ కమిటి నవంబర్ 1, 1956 నుండి మార్చి 31, 1968 వరకు జరిగిన కేటాయింపులన్నింటిని పరిశీలించి నివేదికను సమర్పించింది.
- తెలంగాణ మీద ఖర్చు పెట్టవలసి ఉండి పెట్టకుండా మిగిలిపోయిన మిగులు నిధులు 34.10 కోట్లని పేర్కొంది.
2) జస్టిస్ భార్గవ కమిటీ :
- సమగ్ర తెలంగాణ చరిత్ర అష్టసూత్ర పథకంలో భాగంగా ప్రధానమంత్రి ఇందిరాగాంధి ప్రకటించినట్లుగా 1969 ఏప్రిల్ 22న జస్టిస్ వశిష్టభార్గవ నాయకత్వాన కమిటీని నియమించారు.
- తెలంగాణలోని మిగులు నిధులపై ఈ కమిటీని నియమించారు.
- ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం అధికారికంగా బహిరంగపరచలేదు.
3) వాంఛూ కమిటీ:
- ఈ కమిటీ అధ్యక్షుడు : కె.ఎన్.వాంఛూ.
- సభ్యులు : నిరె డే, ఎం.పి. సెతల్వాడ్
- ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో సూచనలు చేయడానికి ఈ కమిటీని కేంద్రం 1969 ఏప్రిల్ లో నియమించింది.
సూచనలు:
- రాష్ట్ర ఉద్యోగాలలో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత లభించేటట్లు చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది.
- కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం వారికి ప్రాధాన్యత లభించేటట్లు చట్టంచేసే అధికారం పార్లమెంట్ కు లేదు.
- తన నివేదికలో ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి వీలు లేదని మరియు రాజ్యాంగ సవరణకు కూడా అవకాశం లేదు అని పేర్కొంది.
తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం
- 1969 ఉద్యమంలో అమరులైన వారికి అమరవీరుల స్మారక స్థూపాన్ని నెలకొల్పాలని విద్యార్థి సభ నిర్ణయించింది.
- 1970 ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కులో ఈ స్మారక స్థూపాన్ని శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.
- కాని ఈ శంకుస్థాపన కార్యక్రమంకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
- పోలీసుల అనుమతి లేనప్పటికి అనేక నిషేదాజ్ఞలను ఉల్లంఘించి గన్ పార్క్ లో శంకుస్థాపన చేసినది లక్ష్మీనారాయణ (నగర్ మేయర్).
- నిషేదాజ్ఞలను ఉల్లంఘించినందుకు పోలీసులు అరెస్టు చేసిన నాయకులు-
- మర్రి చెన్నారెడ్డి
- మేయర్ లక్ష్మినారాయణ
- టి.గోవింద్ సింగ్
- మల్లిఖార్జున్.
- సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ ప్రాంతంలో ‘1970 ఫిబ్రవరి 25న నగర్ డిప్యూటి మేయర్ శ్రీమతి మ్యాడం రామచంద్రయ్య శంకుస్థాపన చేశారు.
- 1970 ఫిబ్రవరి 28న గన్‌పార్కులో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని తొలగించినారు.
- ఆ తరువాతి కాలంలో హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లోని మునిసిపల్ కార్పోరేటర్ల కృషి వలన ఈ స్థూపం స్థాపించబడింది.
- ఈ స్థూపం నిర్మాణం ‘1975’ లో పూర్తి అయింది.
- ఈ స్థూపాన్ని నిర్మించిన కళాకారుడు, శిల్పి – ఎక్కా యాదగిరిరావు (జె.ఎన్.టి.యు. ప్రొఫెసర్)
- కాని మరో విశాధకరమైన విషయం ఏమిటంటే ఈ స్థూపం ఇప్పటివరకు ఆవిష్కరించబడలేదు.
- అయినప్పటికి నవంబర్ 1 న (విద్రోహ దినం) రోజున ప్రజలు ఆ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు.
ఈ స్థూపం ప్రత్యేకతలు
- ఈ స్థూపం యొక్క అడుగుభాగం నల్లరాయితో తయారు చేయబడింది. ఈ స్థూపానికి నాలుగువైపుల ఉన్న శిలాఫలకాలపై ప్రతివైపు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. అప్పటి తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు సంకేతం ఈ తొమ్మిది రంధ్రాలు.
- అడుగుభాగం పైన నిర్మించబడిన స్థూపం ఎర్రరంగు రాయితో నిర్మించబడింది. ఎరుపురంగు త్యాగానికి గుర్తుగా ఎరుపురాయిని ఎంచుకొన్నారు
- ఈ స్థూపం దగ్గర ఉన్న మరొక తోరణం ను ‘సాంచిస్థూపం’ నుండి స్వీకరించారు.
- శిలాఫలకానికి నాలుగువైపులా చెక్కిన పుష్పాలు అమరవీరులకు అర్పించే నివాళులకు సంకేతం.
- స్థూపం మధ్యభాగంలో ఉన్న స్తంభంపై ఏవైపు నుండి చూసిన దానిపై తొమ్మిది గీతలు కనబడుతాయి. ఈ తొమ్మిది గీతలు కూడా తొమ్మిది జిల్లాలకు సంకేతం.
- స్థూపం పై భాగంలో అశోకుని ధర్మచక్రంను నిర్మించారు.
- 1969 ఉద్యమంలో చనిపోయిన అమరవీరులు ధర్మసంస్థాపన కొరకు తమ ప్రాణాలు బలి పెట్టారని తెలియజేయడానికి స్థూపం పైభాగంలో ఈ అశోకుని ధర్మచక్రంను నిర్మించారు.
- స్థూప శీర్షభాగంలో ‘తొమ్మిది రేకులు’ కలిగిన మల్లెపువ్వును నిర్మించారు.ఈ మల్లేపువ్వు స్వచ్చతకు సంకేతం.
- అమరవీరుల త్యాగానికి సాహసానికి సంకేతంగా మల్లేపువ్వును స్థూపశీర్షభాగంలో ఏర్పాటు చేశారు.
1969 ఉద్యమం – ముఖ్య సంస్థలు
1. తెలంగాణ విద్యార్థులు కార్యాచరణ సమితి – 1969 జనవరి 13 కార్యదర్శి మల్లికార్జున్
2. తెలంగాణ విద్యార్థుల పరిరక్షణ సమితి – 1969 జనవరి 13, అధ్యక్షుడు-వెంకటరామరెడ్డి
3. తెలంగాణ విమోచనోద్యమ సమితి – 1969 జనవరి 28, అధ్యక్షుడు-కాళోజి
4. తెలంగాణ ప్రజాసమితి – 1969 మార్చి 25, అధ్యక్షుడు-మదన్ మోహన్
5. పోటీ తెలంగాణ ప్రజాసమితి – 1969 ఏప్రిల్, అధ్యక్షుడు-శ్రీధర్ రెడ్డి
6. తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కార్యాచరణ సమితి – డాక్టర్. కె.ఆర్.ఆమోస్
1969 ఉద్యమం – ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు
- ఓ.యు. కళాశాలల విద్యార్థి సంఘాల సమావేశం – 1969 జనవరి 12, అధ్యక్షుడు-వెంకటరామిరెడ్డి
- తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సదస్సు – 1969 జనవరి 28, అధ్యక్షుడు – కాళోజి నారాయణరావు
- రెడ్డి హాస్టల్ సదస్సు – 1969 మార్చి 8, 9 : అధ్యక్షురాలు – టి.ఎన్.సదాలక్ష్మి
- ఉస్మానియా ప్రొఫెసర్ల తెలంగాణ సదస్సు – 1969 మే 20, అధ్యక్షుడు – మంజూర్ ఆలమ్
- తెలంగాణ రచయితల సదస్సు – 1969 జూన్ 6, అధ్యక్షుడు – కాళోజి నారాయణరావు
1969 ఉద్యమం – ప్రధాన ఘట్టాలు
- తొలి పోలీసు కాల్పులు : 1969 జనవరి 20న శంషాబాద్ లో జరిగాయి.
- తొలి అమరుడు : జనవరి 24న సదాశివపేటలో కాల్పుల్లో మరణించిన తొలి అమరుడు శంకర్.
- మే డే | తెలంగాణ కోరికల దినం: తెలంగాణ ప్రజాసమితి పిలుపు మేరకు 1969 మే 1న జరిగింది.
- జూన్ – 2 పోలీసు కాల్పులు: జూన్ 2-5 మధ్య నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోలీసు కాల్పుల్లో 30 మంది మరణించారు.
- జూన్ 20-25 సత్యాగ్రహం : అబిడ్స్ లో ప్రజలు స్వచ్ఛందంగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
- జూన్ 25 ముషీరాబాద్ జైలు సంఘటన : ముషీరాబాద్ జైలులోపల సత్యాగ్రహీలపై ఖైదీలు దాడి చేశారు.ఈ దాడిలో సుమారు 70 మంది సత్యాగ్రహీలు గాయపడ్డారు
ముఖ్యమైన రోజులు
- మార్చి 17 : పోరాటం దినం (ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రకటించారు.)
- ఏప్రిల్ 15 : తెలంగాణ పోరాట దినం
- మే 1: తెలంగాణ డిమాండ్స్ డే / కోరికల దినం
- మే 17: తెలంగాణ మృతవీరుల దినం
- జులై 10: తెలంగాణ పరిరక్షణ దినం
- జులై 12 : తెలంగాణ ఫ్లాగ్ డే
- జులై 12 : తెలంగాణ లిబరేషన్ డే
1969 ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీల పాత్ర, డౌన్లోడ్ PDF
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |