On Nov 29th, 2009 , KCR had announced an indefinite hunger strike demanding statehood to Telangana. But enroute, the state police had arrested him and sent to Khammam sub-jail. The movement spread like wildfire with students, Employees, peoples’ organizations plunging into it. In the next 10 days, the whole of Telangana region came to a standstill. in this article we are providing details related to Telangana Movement and State Formation- KCR fast unto death. for more details read the article completely.
Telangana Movement and State Formation: KCR fast unto death | కె.సి.అర్ ఆమరణ నిరాహార దీక్ష
2009 ఎన్నికలు – పార్టీలు
- రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది.
- సామాజిక న్యాయం పేరుతో నటుడు చిరంజీవి 2008, ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. సామాజిక తెలంగాణకు తాను కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.
- 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాల కూటమి కలిసి పోటీచేసింది.
- అనంతర పరిస్థితుల్లో సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ కు దూరమయ్యాయి.
- 2009 జనవరి 16న తన ‘తల్లి తెలంగాణ పార్టీ’ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు విజయశాంతి ప్రకటించారు.
- 2009 జనవరి 31న టీడీపీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఉమ్మడిగా ‘మహాకూటమి’పేరుతో ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీలు నిర్ణయించాయి. ఈ పొత్తులో జయశంకర్ సార్ కీలకంగా వ్యవహరించారు.
- తెలంగాణకు తాను అనుకూలమని, తెలంగాణపై సంయుక్త సంఘాన్ని (Joint Committee) ఏర్పాటు చేస్తున్నట్లు 2009, ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి వైఎస్ హడావుడిగా ప్రకటించారు.
- ‘తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ కు ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ 2009, ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ లో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు.
APPSC/TSPSC Sure shot Selection Group
ఎన్నికల మేనిఫెస్టోలు
- టీడీపీ (TDP) – తన ఎన్నికల మానిఫెస్టోలో తొలిసారిగా తెలంగాణ అంశాన్ని చేర్చింది.
- బీజేపీ (BJP) – మరోసారి చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి ప్రస్తావించింది.
- సీపీఐ (CPI) – జాతీయ విధానం రాష్ట్ర విభజనకు వ్యతిరేకమైనా, చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించకపోయినా, తెలంగాణకు సంబంధించినంత వరకూ జాతీయ కార్యవర్గం మినహాయింపు నిచ్చింది.
- సీపీఎం (CPM)-రాష్ట్రాల విభజనకు తమ పార్టీ వ్యతిరేకమని మేనిఫెస్టోలో ప్రకటించింది.
- బీఎస్పీ (BSP)-చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము సుముఖమని మేనిఫెస్టోలో ప్రకటించింది.
- ప్రజారాజ్యాం – సామాజిక తెలంగాణకు తామ కట్టుబడి ఉన్నట్లు తన మేనిఫెస్టోలో పేర్కొంది. “
ఎన్నికలలో కాంగ్రెస్ విజయం
- ఏప్రిల్ 16న తెలంగాణలో మొదటి దశలో ఎన్నికలు పూర్తి అయ్యాయి.
- ఆ తర్వాత ఆంధ్రా ప్రాంతంలో వైఎస్సార్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రసంగించారు .
- 2009లో కాంగ్రెస్ పార్టీ 152 సీట్లు మాత్రమే గెలుచుకొని తిరిగి అధికారంలోకి వచ్చింది.
- టి.ఆర్.ఎస్ కు రెండు ఎం.పి.స్థానాలు, 10 అసెంబ్లీ వచ్చాయి.
KCR fast unto death | కె.సి.అర్ ఆమరణ నిరాహార దీక్ష
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని కె.సి.ఆర్ ప్రకటించి నవంబర్ 29 2009 నుండి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు
- కె.సి.ఆర్. దీక్ష స్థలం – రంగథాంపల్లి (సిద్దిపేట)
- నవంబర్ 29న కె.సి.ఆర్ కరీంనగర్ నుండి రంగథాంపల్లి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు.
- కె.సి.ఆర్. ఖమ్మం జైలులోనే దీక్ష ప్రారంభించారు.
- ఈ పరిణామాల వల్ల “శ్రీకాంతాచారి” అనే యువకుడు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
- 2009 డిసెంబర్ 4న శ్రీకాంతాచారి అమరుడయ్యారు.
- ఈ ఉద్యమ తీవ్రతను గ్రహించిన ముఖ్యమంత్రి రోశయ్య 2009 డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
- ఈ సమావేశానికి 9 రాజకీయ పార్టీలు హజరయ్యాయి.
- డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబునాయుడు మద్దతు ప్రకటించారు.
- మొదటి నుండి సమైక్యాంధ్రకు అనుకూలమైన ఎమ్. ఐ.ఎమ్., సి.పి.ఐ.(ఎమ్) తప్ప మిగిలిన పార్టీలు అన్నీ తెలంగాణకు మద్దతిచ్చాయి.
- 2009 డిసెంబర్ 8న నీమ్స్, సూపరిండెంట్ ప్రసాదరావు కె.సి.ఆర్ దీక్ష విరమించకపోతే జీవితం ప్రమాదంలో పడుతుందని ప్రకటన విడుదల చేశారు.
- డిసెంబర్ 9 నాడు ప్రధానమంత్రి రష్యాలో, ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు. దాంతో 2009 డిసెంబర్ 9 నాడు కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన ఏవిధంగా ఉండాలి అనే విషయంపై ప్రొ॥ జయశంకర్ సార్ తో చర్చించారు.
- అనంతరం 2009 డిసెంబర్ 9 రాత్రి 11.30గంటలకు హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై క్రింది విధంగా ప్రకటన జారీ చేశారు
- మొదటి ప్రకటన – “తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు” అని చిదంబరం పేర్కొన్నారు.
- తెలంగాణ ఏర్పాటు పై చిదంబర ప్రకటన అనంతరం కె.సి.ఆర్.తో ప్రొ|| జయశంకర్ సార్ నిరాహార దీక్ష విరమింపజేసినారు.
- తరువాత ఆంధ్రాలో జరిగిన సంఘటనల ఫలితంగా తిరిగి కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 23న మరొక ప్రకటనను జారీ చేశారు.
- రెండవ ప్రకటన – “అసెంబ్లీ తీర్మానం చేసిన తరువాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం” అని పేర్కొన్నారు.
Political Joint Action Committee | రాజకీయ ఐక్య కార్యా చరణ కమిటీ
- 2009 డిసెంబర్ 24వ తేదిన తెలంగాణ కోసం రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది.
- డిసెంబర్ 25, 2009న బంజారా హిల్స్ లోని రావి నారాయణ రెడ్డి హాలులో జె.ఎసీ. స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం జరిగింది.
- జేఏసీ కన్వీనర్ గా ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ (రాజనీతిశాస్త్ర ఆచార్యుడు – Political Science) ఏకగ్రీవంగా ఎంపికైనాడు.
- జేఏసీ కో కన్వీనర్- మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ జర్నలిస్టు
- దీనిలో చేరిన పార్టీలు – టీఆర్ఎస్, కాంగ్రెస్ (తెలంగాణ), తెలంగాణ టీడీపీ ఫోరం, బీజేపీ, సీపీఐ, న్యూ డెమోక్రసీ
- 2010 ఫిబ్రవరి 19న రాజకీయ ఐక్యకార్యాచరణ కమిటీ (Political JAC) నుండి కాంగ్రెసు తప్పుకుంది.
- మార్చి 12, 2010న తెలంగాణ జేఏసీ సమావేశం జరిగింది. దీనికి కె.సి.ఆర్ హాజరైనాడు. తెలంగాణ జేఏసీ నుంచి టీడీపీని బహిష్కరించటం జరిగింది.
Justice Sri Krishna Committee | శ్రీ కృష్ణ కమిటీ
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతుల పరిశీలనకు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఫిబ్రవరి 3, 2010లో ఏర్పడింది.
- కమిటీ చైర్మన్ : జస్టిస్ బి.ఎన్ శ్రీకృష్ణ (రిటైర్డు) సుప్రీంకోర్టు న్యాయమూర్తి
- కమిటీ సభ్యులు –
- 1) ప్రో,, రణబీర్ సింగ్, వెస్ ఛాన్సలర్, జాతీయ న్యాయ కళాశాల ఢిల్లీ
- 2) డా. అబుసలేషరీప్, సీనియర్ ఫెలో, జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా సంస్థ, ఢిల్లీ
- 3) ప్రొఫెసర్ డా. రవీందర్ కౌర్ సాంఘిక శాస్త్ర విభాగం, ఐఐటి ఢిల్లీ
- కమిటీ కార్యదర్శి – వినోద్ కుమార్ దుగ్గల్ (రిటైర్డు ఐ.ఎ.ఎస్)
- ఈ కమిటీ తన నివేదికను 2010 డిసెంబర్ 31లోపు అందించాలని కేంద్రం నిర్దేశించింది.
- ఈ కమిటీ తన నివేదికను 2010 డిసెంబర్ 30న కేంద్రానికి అందజేసింది.
కమిటీ ప్రతిపాదనలు
- ఈ కమిటీ తన మొదటి సమావేశం ఫిబ్రవరి 13, 2010న ఢిల్లీలో జరిగింది.
- శ్రీకృష్ణ కమిటీ నివేదికలో 505 పేజీలు, 9 చాప్టర్లు ఉన్నాయి.
- ఉద్యమాన్ని సాధారణ శాంతిభద్రతల పరిస్థితిగా పరిగణించి కేంద్రం సాధారణ మద్దతు తీసుకుంటూ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవడం
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాతం
- హైదరాబాద్ రాజధానిగా రాయలసీమ, తెలంగాణలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు.
- ప్రత్యేక తెలంగాణ, పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు. గుంటూరు, కర్నూలు, నల్లగొండ, మహబూబ్ నగర్జి ల్లాల్లోని కొన్ని మండలాలను కలుపుకుని హైదరాబాదు పెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం.
- హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తి
- ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగబద్ద రక్షణను కల్పించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం.
- ఈ కమిటీ 6వ అంశాన్ని తమ తొలి ప్రాధాన్యత అంశంగా పేర్కొంది. అంటే పరోక్షంగా సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించింది.
- ఒకవేళ 6వ అంశం అమలు చేయడం సాధ్యం కాకపోతే రెండవ ప్రాధాన్యత 5వ అంశం అని పేర్కొంది.
- 8వ అధ్యాయంను రహస్యంగా ఉంచి హెూంమంత్రికి సమర్పించింది
- 8వ అధ్యాయ, బహిర్గతంపై కోర్టులో తెలంగాణ వాది అయిన నిజామాబాద్ మాజీ ఎంపీ కేసు వేశాడు
- 2011 మార్చి 23న హైకోర్టు న్యాయమూర్తి ఎల్. నర్సింహ్మారెడ్డి 8వ అధ్యాయంలోని కొన్ని అంశాలను కోడ్ చేస్తూ తీవ్ర విమర్శలతో కూడిన తీర్పు ఇచ్చారు
- కానీ ఈ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది
అఖిలపక్ష సమావేశం(2012 డిసెంబర్ 28)
- డిసెంబర్ 28, 2012న కేంద్ర హోం శాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
- ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న 8 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి.
- 1. కాంగ్రెసు(ఐ) 2. తెలుగుదేశం పార్టీ 3. తెలంగాణ రాష్ట్ర సమితి 4. భారతీయ జనతాపార్టీ 5. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 6. సి.పి.ఐ. (ఎమ్) 7. మజ్లిస్ 8. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ
అఖిలపక్ష భేటీకి హాజరైన పార్టీల ప్రతినిధులు
- టీ.ఆర్.ఎస్ (TRS) – కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి
- టి.డీ.పీ (TDP) – యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి
- వై.సీ.పీ (YCP) – మైసురారెడ్డి, కేకే మహేందర్ రెడ్డి
- బీజేపీ (BJP) – కిషన్ రెడ్డి, హరిబాబు
- సీపీఐ (CPI) – నారాయణ, గుండా మల్లేష్
- సీపీఎం (CPM) – రాఘవులు, జూలకంటి రంగారెడ్డి
- ఎంఐఎం (MIM) – అక్బరుద్దీన్, అసదుద్దీన్
- కాంగ్రెస్ (Congres) – కేఆర్ సురేశ్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి
మరింత చదవండి
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |