తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం
తెలంగాణ ఉద్యమం యొక్క పునరుజ్జీవనం కేవలం రాజకీయ పరివర్తన మాత్రమే కాకుండా సాంస్కృతిక గుర్తింపు యొక్క లోతైన పునరుజ్జీవనాన్ని గుర్తించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్వేగభరితమైన పిలుపులు ఊపందుకోవడంతో, అవి అధికార కారిడార్‌లలోనే కాకుండా తెలంగాణ గొప్ప వారసత్వపు హృదయ స్పందనలో కూడా ప్రతిధ్వనించాయి. ఇది చాలా కాలంగా కప్పివేయబడిన సంప్రదాయాలు, భాషలు మరియు ఆచారాలను తిరిగి కనుగొనడం మరియు జరుపుకోవడం కోసం ఒక పదునైన ప్రయాణం. దశాబ్దాల తరబడి నిద్రాణంగా ఉన్న కథనాలకు కొత్త ఊపిరి పోస్తూ తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవనానికి ఈ ఉద్యమం ఉత్ప్రేరకంగా మారింది. ఈ కధనంలో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి చర్చించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
ధూంధాం
- మలిదశ ఉద్యమంలో తెలంగాణ అన్యాయాలను ప్రజలకు తెలియజెప్పడానికి ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదిక తెలంగాణ ధూంధాం
- దీనియొక్క తొలి ప్రదర్శన సెప్టెంబర్ 30, 2002 కామారెడ్డిలో జరిగింది
- రసమయి బాలకిషన్, అందెశ్రీ, వరంగల్ శంకర్, గోరటి వెంకన్న, విమలక్క గూడ అంజయ్య తమ ఆటపాటలతో అలరించారు.
- ధూంధాం దశాబ్ది ఉత్సవాలు డిసెంబర్ 22, 2012న హైదరాబాద్ లో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగాయి.
తెలంగాణ అమరవీరుల స్థూపం
- 1969 తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి స్మృత్యర్థం గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించారు.
- ఈ స్థూపాన్ని చెక్కిన శిల్పి – ఎక్క యాదగిరి.
- ఈ అమరవీరుల స్థూపం అడుగుభాగం నల్లరాయితో తయారుచేశారు.
- నాలుగు వైపుల తొమ్మిది చొప్పున చిన్న రంధ్రాలు వున్నాయి. ఇవి అమరవీరుల శరీరంలో దూసుకుపోయిన బుల్లెట్స్
- స్థూపాన్ని ఎరుపురాయితో నిర్మించారు. ఇది త్యాగానికి, సాహసానికి నిదర్శనం.
- స్థూపం మధ్యభాగంలో ఒక స్థంబం వుంటుంది. ఏ వైపు చూసినా దానిపై తొమ్మిది గీతలు కనిపిస్తాయి. ఇవి తొమ్మిది జిల్లాలకు నిదర్శనం
- పై భాగంలో అశోకుని ధర్మచక్రం వుంటుంది. ఇది ధర్మం, శాంతి, సహనానికి గుర్తు.
తెలంగాణ తల్లి విగ్రహం
- తెలంగాణ తల్లి విగ్రహం రూపొదించడంలో ముఖ్య పాత్ర పోషించినవారు బి.ఎస్.రాములు, బి.వి.ఆర్. చారి, ప్రొ.గంగాధర్.
- పసునూరి దయాకర్ తయారు చేసిన తెలంగాణ తల్లి తొలివిగ్రహాన్ని తెలంగాణ భవన్ లో 2007 నవంబర్ 15న కేసీఆర్ ఆవిష్కరించారు.
ఈ విగ్రహం ప్రత్యేకతలు
- కిరీటంలో, వడ్డాణంలో ప్రసిద్ధి చెందిన కోహినూరు, జాకబ్ వజ్రాలుంటాయి.
- పట్టుచీర – పోచంపల్లి, గద్వాల చీరలకు గుర్తుగా.
- కాలి మెట్టెలు – ముత్తైదువకు చిహ్నంగా.
- వెండి మట్టలు – కరీంనగర్ ఫిలిగ్రీ ఆభరణాలకు చిహ్నంగా.
- చేతిలోని మొక్కజొన్న – తెలంగాణ మెట్ట ప్రాంతాలకు గుర్తుగా
- ఇంకో చేతిలో బతుకమ్మ – తెలంగాణ పండుగకు గుర్తుగా
తెలంగాణ జాగృతి
- తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, కళారూపాల, జానపదులు, సాహిత్యం, తెలంగాణ ప్రాంతం మాండలికం మొదలైనవి పరిరకించడానికి తెలంగాణ జాగృతి సాంఘిక-సాంస్కృతిక సంస్థగా 2008 జూన్ లో ఏర్పడింది.
- దీనిని కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసింది.
- పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
- తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి, వాటికి విశిష్ఠ ముగింపుగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై లక్షలాది మంది ప్రజలతో బతుకమ్మ పండుగ జరిగి సాంస్కృతిక కవాతు నిర్వహిస్తుంది
తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ
- తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) 2009 డిసెంబర్ 24న ఏర్పడింది.
- దీనికి కన్వీనర్ – ప్రొ. కోదండరామ్, కో-కన్వీనర్ -మల్లేపల్లి లక్ష్మయ్య.
- ఈ జేఏసీలో చేరిన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ ఫోరం, బీజేపీ, సీపీఐ, న్యూడెమొక్రసీ.
- 2010 ఫిబ్రవరి 19న జేఏసీ నుండి కాంగ్రెస్ తప్పుకున్నట్లు ప్రకటించింది. తరువాత కాలంలో తెలంగాణ టీడీపీ ఫోరం కూడా జేఏసీ నుండి తప్పుకుంది.
తెలంగాణ జేఏసీ నిరసన కార్యక్రమాలు
2010 లో మానవహారం |
|
2011, జనవరి 10-11 | కలెక్టరేట్ల ముట్టడి |
2011 జనవరి 19 | వంటా వార్పూ |
2011 ఫిబ్రవరి 17 – మార్చి 4 | సహాయనిరాకరణ |
2011 మార్చి 1 | పల్లె పల్లె పట్టాలపైకి |
2011 మార్చి 10 | మిలియన్ మార్చ్ |
2011 సెప్టెంబర్ 16 – అక్టోబర్ 24 | సకలజనుల సమ్మె |
2012 సెప్టెంబర్ 30 | తెలంగాణ మార్చ్ / సాగరహారం |
2013 మార్చి 21 | సడక్ బంద్ |
2013 ఏప్రిల్ 29-30 | సంసద్ యాత్ర |
తెలంగాణ కోసం ఆత్మహత్యలు
- 2009 నవంబర్ 29న కేసీఆర్ అరెస్టుతో మనస్తాపానికి గురైన శ్రీకాంతాచారి అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మబలిదానానికి సిద్ధమయ్యారు.
- ఇతను డిసెంబర్ 3వ తేదీన అంతిమ శ్వాస విడిచాడు.
- 2010 జనవరి 19న ఓయూ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నాడు
- తెలంగాణ ఉద్యమ తీవ్రత గురించి ఢిల్లీకి తెలియజేయాలని ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు యాదిరెడ్డి
- అసెంబ్లీ ముట్టడి సమయంలో యాదయ్య అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్శిటీ ఎన్.సి.సి. గేటు వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు.
- 2010లో అడ్వకేట్ దేవేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
- 2010 జూలైలో ఉపఎన్నికల ఫలితాల్లో డీఎస్ ఓడిపోవడంతో తన కోరిక నెరవేరిందని ఇషాంత్ రెడ్డి ఆత్మబలిదానం చేసుకున్నాడు.
- 2012 మార్చిలో సిరిపురం’ శ్రీకాంత్ అనే విద్యార్థి హైదరాబాద్ లో మరణించాడు.
Revivalision of Telangana Culture, Download PDF
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |