తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సంస్థల కృషి
తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్:
- 1992లో మనోహర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు.
- పి.జి.సిలబస్ లో ఆధునిక తెలంగాణ సాహిత్యంలో వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ప్రజలమనిషి అనే నవలను చేర్చాలని ఉద్యమించి విజయం సాధించారు.
- ఈ ఆర్గనైజేషన్ ఉస్మానియా క్యాంపస్ లో 1993 ఏప్రిల్ 4,5 తేదీలలో చిన్న రాష్ట్రాల సదస్సును నిర్వహించింది.
- ఈ సదస్సులో పాల్గొన్న జాతీయ పార్టీ నాయకుడు – జార్జ్ ఫెర్నాండేజ్
- తెలంగాణలోని ఎయిడెడ్ కళాశాలల్లో ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీలను పూరించడానికి ఆంధ్ర ప్రాంతం వారిని తెలంగాణకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
- ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా 1994లో మనోహర్ రెడ్డి నిరాహారదీక్ష చేశారు.
- ఈ నిరాహారదీక్షకు తలొగ్గిన ప్రభుత్వం బదిలీలను నిలిపివేసింది.
APPSC/TSPSC Sure shot Selection Group
తెలంగాణ ఉద్యమ వేదికలు
తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో పలువురు తెలంగాణ వాదులు వివిధ జిల్లాలలో, వివిధ పేర్లతో ఉద్యమ వేదికలను ఏర్పాటు చేశారు.
- తెలంగాణ చైతన్యవేదిక – మెదక్
- తెలంగాణ ఉద్యమవేదిక – మహబూబ్ నగర్
- తెలంగాణ పోరాట వేదిక – నల్గొండ
- తెలంగాణ ప్రజావేదిక – రంగారెడ్డి
సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్
- రాష్ట్రంలోని సినిమా, వార్తాపత్రికలు, ఇతర మీడియా సంస్థలు తెలంగాణేతరుల చేతులలో ఉండడం వలన వారు తెలంగాణ పట్ల కొంత వ్యతిరేకంగా ప్రవర్తించారు.
- ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ప్రపంచ దృష్టికి వాస్తవాలను అందించడానికి ప్రజాసంఘాల నాయకులు ప్రయత్నించారు.
- ఈ ప్రయత్నాలలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1997లో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ను స్థాపించారు.
తెలంగాణ ప్రగతి వేదిక
- తెలంగాణ సమస్యలపై చర్చించడానికి 1997 జూలెలో రెండు రోజుల సదస్సు రాపోలు ఆనందభాస్కర్ నేతృత్వంలో హైదరాబాద్లో జరిగింది.
- ఈ సదస్సు అనంతరం రాపోలు ఆనందభాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి వేదిక 1997 జూలై 13న ఏర్పడింది.
- ఈ వేదిక బతకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.
- ఆ తరువాతి కాలంలో తెలంగాణ ఐక్యవేదిక ఆవిర్భవించడంతో తెలంగాణ ప్రగతి వేదిక అందులో ఒక భాగస్వామి సంస్థగా పనిచేసింది.
తెలంగాణ స్టడీస్ ఫోరం
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ స్టడీస్ ఫోరం 1998 లో ఏర్పాటయింది.
- ఈ ఫోరం ఏర్పాటులో కీలకపాత్రను పోషించినవారు : గాదె ఇన్నయ్య, నిర్మల, పిట్టల శ్రీశైలం
- ఈ ఫోరం తెలంగాణ సమస్యలపై కరపత్రాలు, పుస్తకాలను ముద్రించి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం వరకు అలుపెరగని పోరాటాన్ని కొనసాగించింది.
ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ ప్రెషన్ సభా
- 1997లో హైదరాబాద్ లోని మొజాంజాహి మార్కెట్ దగ్గర గల అశోక్ థియేటర్ లో ‘ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ ప్రెషన్’ పేరుతో సభను నిర్వహించారు.
- జర్నలిస్టు గూలాం రసూల్ ఖాన్ ఎన్ కౌంటర్ ను ఖండించడానికి కవులు, కళాకారులు ఈ సభను నిర్వహించారు.
- ఈ సభలో గద్దర్ తను రాసిన ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా‘ పాటను మొదటిసారిగా పాడాడు.
- తెలంగాణకు జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలపై ప్రభుత్వ శాఖల నుండి సేకరించిన సమాచారంతో గాదె ఇన్నయ్య ముద్రించిన ‘దగాపడ్డ తెలంగాణ’ పుస్తకమును ఈ సదస్సులో ఆవిష్కరించారు.
- ఈ సదస్సులోనే భువనగిరి సభ సమావేశాన్ని (1997 మార్చి 8న) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
O. U. ఫోరం ఫర్ తెలంగాణ
- సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ వారికి జరుగుతున్న నష్టాల గురించి చర్చించడానికి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రొఫెసర్ లక్ష్మణ్ అధ్యక్షతన ఒక అవగాహన సదస్సు జరిగింది.
- ఈ సదస్సుకు ముఖ్య అతిధి – దాశరధి కృష్ణమాచార్యులు.
- ఈ సదస్సులోనే ఓ.యు. ఫోరం ఫర్ తెలంగాణ అనే ప్రజాసంఘం ఏర్పడింది.
- దీనికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ నియమితులయ్యారు.
- నూతన సంవత్సరం సందర్భంగా 1988లో తెలంగాణ మ్యాప్ తో కూడిన మాతెలంగాణ గ్రీటింగ్స్ ను పంపిణీ చేసింది.
- అంతేగాకుండా క్యాలెండర్‌ను కూడా విడుదల చేసింది
- తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తో కలిసి ఓ.యు. ఫోరం ఫర్ తెలంగాణ కాళోజీ చేతుల మీదుగా ‘తెలంగాణ పొలిటికల్ మ్యాప్’ను విడుదల చేసింది.ఇదే తెలంగాణ మొదటి పొలిటికల్ మ్యాప్ అని చాలామంది పేర్కొంటున్నారు.
- ఈ ఫోరం సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, నవంబర్ 1ని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఉస్మానియాలో అవగాహన సదస్సులు నిర్వహించింది.
- అదేవిధంగా ఈ ఫోరం చిన్న రాష్ట్రాల సదస్సులను 1988, 1996 లలో నిర్వహించింది.
- ఈ సదస్సులలో పాల్గొన్న ముఖ్యనాయకులు : జార్జ్ ఫెర్నాండెజ్ , టూమర్ (నాగాలాండ్)
- ఈ సంస్థ విద్యార్థులలో, అధ్యాపకులలో భావజాలం వ్యాప్తి చేయడంలో క్రియాశీలకపాత్ర పోషించింది.
- ఈ సంస్థ టి.ఆర్.ఎస్. పార్టీ ఏర్పడిన సమయంలో ఆ పార్టీపై అవగాహన కల్పించడానికి 2001 మే లో ఠాగూర్ ఆడిటోరియంలో కె.సి.ఆర్. ను ఆహ్వానించి భారీ సభను నిర్వహించింది.
మంజీర రచయితల సంఘం – సిద్దిపేట సదస్సు
- 1997 ఆగస్టు నెలలో రచయితలు, ఉద్యోగులు కలిసి తెలంగాణపై సిద్దిపేట పట్టణంలో సదస్సును నిర్వహించారు.
- ఈ సభ సమావేశంలోనే నందిని సిధారెడ్డి రాసిన ‘నాగేటి సాళ్లల్ల – నా తెలంగాణ’ పాట వచ్చింది.
- ఈ విధంగా తెలంగాణ భావజాల ప్రచారం కోసం 1990 నుండి 1997 వరకు తెలంగాణలోని ప్రధాన నగరాలలో చాలా సమావేశాలు జరిగాయి.
మల్లేపల్లి రాజం ట్రస్ట్
- మల్లేపల్లి లక్ష్మయ్యకు చిన్నాన్న అయిన మల్లేపల్లి రాజం యొక్క స్మారకార్థం ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున తన స్వగ్రామమైన జనగామాలో స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించేవారు.
- ఆ విధంగా 1997 జనవరిలో జయశంకర్ సార్ తో స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఏమి జరుగుతున్నది అనే అంశంపై జయశంకర్‌సార్ ఉపన్యసించారు.
- ఉద్యమానికి ఈ ఉపన్యాస అవసరాన్ని గుర్తించిన మల్లేపల్లి లక్ష్మయ్య ఈ ఉపన్యాసాన్ని ” తెలంగాణ లో ఏం జరుగుతుంది?” అనే పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు.
- ఈ పుస్తకమును జనవరిలో అశోక థియేటర్ (హైదరాబాదు)లో జరిగిన తెలంగాణ సభ ఆవిష్కరించారు.
Telangana Movement- Spread of Telangana Ideology, Download PDF
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |