1969 ఉద్యమానికి కారణాలు
1969 తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రాంతానికి రాష్ట్ర సాధన కోసం జరిగిన రాజకీయ ఉద్యమం. 08 జనవరి 1969 రవీంద్రనాథ్ అనే వ్యక్తి ఖమ్మంలో రైల్వే స్టేషన్ సమీపంలో నిరాహారదీక్ష చేస్తున్నారు. నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ఆయన తెలంగాణా భద్రతను అమలు చేయాలన్నదే తన ప్రధాన డిమాండ్. జెంటిల్‌మన్ ఒప్పందాన్ని అమలు చేయాలని ఆయన పట్టుబట్టడం మరో డిమాండ్. తెలంగాణ ఉద్యమంలో ఇదొక ప్రధాన ఘట్టం. పోలీసుల విచక్షణారహిత కాల్పుల్లో 369 మంది తెలంగాణ విద్యార్థులు చనిపోయారు. ఈ కధనంలో 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కధనంలో అందించాము. 1969 తెలంగాణ ఉద్యమానికి గల కారణాలు దిగువ వివరించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
1956 నుంచి 1969 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు
• ఈ ఉల్లంఘనల గురించి సమగ్ర సమాచారాన్ని ముందు ఆర్టికల్ 1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు. లో ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించగలరు.
తెలంగాణపై ఆంధ్రవారి పెత్తనం
- తెలంగాణా వారికి భాష ముతక భాష అని, వీరి యాస బాగుండదని ఆంధ్రవారు విమర్శించేవారు.
- తెలంగాణ వారు అనాగరీకులు అని, సోమరిపోతులు అని హేళన చేసేవారు.
- ఆంధ్రరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు చనిపోతే ప్రభుత్వలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
- కాని విశాలాంధ్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన బూర్గుల రామకృష్ణారావు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు.
- ఇటువంటి వివక్షత మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఉన్నపుడు సాధారణ ప్రజల విషయంలో ఎంత పెద్ద మొత్తంలో ఉంటుందో ఊహించుకోవచ్చు.
- కరీంనగర్ ప్రాంతానికి చెందిన ‘కన్నంవార్’ మహారాష్ట్రలో సెటిల్ అయిన తెలంగాణ వ్యక్తి
- ఇతను ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోరుతున్న నాగ్ పూర్ ప్రాంతానికి చెందినవాడు.
- అటువంటి వ్యక్తి మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయినపుడు తెలంగాణ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 15 సం||ల వరకు ముఖ్యమంత్రి కాలేదు.
- అంటే ఆంధ్రవారి పెత్తనం, వివక్ష ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
- రాష్ట్రం ఏర్పడిన 15 సం||ల తర్వాత 1971లో ముఖ్యమంత్రి అయిన పి.వి.నరసింహారావు కేవలం 18 నెలల 23 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండగలిగాడు.
- తర్వాత కాలంలో ఇదే పి.వి.నరసింహారావు ‘మైనార్టి’ ప్రభుత్వం ఉన్నప్పటికి 5సం||లు ప్రధానిగా ఉండగలిగాడు.
- అంటే ఆంధ్రవారి వివక్ష ఏ స్థాయిలో ఉందో మనం గ్రహించవచ్చు.
- ఆంధ్ర నుండి వలస వచ్చిన జలగం వెంగళరావు మాత్రం 5 సం||లు పదవిలో కొనసాగడానికి వారికి అభ్యంతరం లేదు.
1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు
విద్యార్థుల విజయం
- మొదటి నుండి కూడా తెలంగాణలో పాఠశాల, కళాశాల, విద్యార్థి సంఘాలు బలమైన నిర్మాణం కలిగి ఉండేవి.
- 1952 నాన్ ముల్కి ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు.
- 1967లో ప్రభుత్వం కాలేజి ఫీజులను పెద్ద మొత్తంలో పెంచింది.
- ఈ పెంపునకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించి విజయం సాధించారు.
- 1967లో ఓ.యు వైస్ ఛాన్స్ లర్ డి.ఎస్. రెడ్డి, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి మధ్య వైరం ఏర్పడింది.
- దాంతో ముఖ్యమంత్రి వైస్ చాన్స్ లర్ పదవి కాలాన్ని 5 సం||ల నుండి 3 సం||లకు తగ్గిస్తూ ఒక కొత్త చట్టం తెచ్చారు.
- దీనికి వ్యతిరేకంగా ఉస్మానియా విద్యార్థులు ‘జైపాల్ రెడ్డి’ నాయకత్వంలో ఉద్యమించారు.
- డి.ఎస్.రెడ్డి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోని పదవిలో కొనసాగాడు.
- ఈ విధంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మొదటి దెబ్బతగిలి విద్యార్థులు విజయం సాధించారు.
- ఈ విజయ ఉత్సాహం తెలంగాణ విద్యార్థులు 1969 ఉద్యమంలో పాల్గొనుటకు దారితీసింది.
చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు
- 1967 శాసనసభ ఎన్నికలలో మర్రి చెన్నారెడ్డి వందేమాతరం రామాచంద్రారావుపై గెలిచాడు.
- మర్రిచెన్నారెడ్డి ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డాడని వందేమాతరం రామచంద్రారావు హైకోర్టులో కేసు వేశాడు .
- 1968 ఏప్రిల్ 26న హైకోర్టు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది
- ఆ తీర్పులో చెన్నారెడ్డి 6 సం||ల వరకు ఎన్నికలలో పోటీ చేయరాదని ఆదేశించింది.
- చెన్నారెడ్డి హైకోర్టులో ‘స్టే’కు ప్రయత్నించగా హైకోర్టు ఇతని పిటిషన్‌ను తిరస్కరించింది.
- దాంతో చెన్నారెడ్డి సుప్రింకోర్టు మెట్లు ఎక్కగా సుప్రీంకోర్టు కూడా ఇతనికి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది.
- దీంతో చెన్నారెడ్డి రాజకీయ నిరుద్యోగిగా మారిపోయాడు.
- అటువంటి సమయంలో ప్రారంభ దశలో ఉన్న 1969 ఉద్యమం ఇతనికి ఒక మంచి అవకాశంగా కనబడింది.
1969 ఉద్యమ ప్రారంభం
కొత్తగూడెం థర్మల్ స్టేషన్లో అన్యాయాలు
- 1961లో పాల్వంచలో థర్మల్ పవర్ స్టేషన్ స్థాపించబడింది.
- పాల్వంచలోని పవర్ స్టేషన్ తెలంగాణ రిజర్వ్ నిధులతో నిర్మించబడినది కనుక దీనిలోని ఉద్యోగాలలో మిగతా ప్రాంతాల వారికి అవకాశం లేదు.
- 1968 జూలై 30న పాల్వంచ ఎన్.జి.ఓ.ల సమావేశం కె.టి.పి.ఎస్ క్లబ్ లో రామసుధాకర రాజు అధ్యక్షతన జరిగింది.
- 1968లో తెలంగాణ హక్కుల రక్షణ ఉద్యమం ప్రారంభమై 1968 జూలై 10న తెలంగాణ రక్షణల దినంను పాటించడం జరిగింది.
- ఇటువంటి సమయంలోనే హైదరాబాద్ లో జరిగిన ఉద్యోగుల సమావేశంలో కార్మిక నాయకుడు మహదేవ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోరికలను తీర్చకపోయినట్లయితే సమైఖ్య రాష్ట్ర నుండి తెలంగాణ రాష్ట్రం విడిపోవలసి వస్తుందని ప్రకటించాడు
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
తెలంగాణ ప్రాంతీయ సమితి
- 1968లో కొలిశెట్టి రామదాసు ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేశాడు.
కొత్తగూడెం నిరసన
- అర్హులైన తెలంగాణ స్థానికులు లభించని యెడల ఆ ఖాళీలను అలాగే ఉంచాలని 1968 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
- అంతేకాకుండా ముల్కీల స్థానంలో షరతులతో నియమించబడిన నాన్ ముల్కీలను మూడు నెలలలో తొలగించి ఆ స్థానాలలో అర్హులైన ముల్కీలను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది.
- ఈ ప్రభుత్వ ఆదేశాలను కొత్తగూడెం విద్యుత్ కేంద్రంలో కూడా అమలు చేసి నాన్ ముల్కీలను ఉద్యోగాల నుండి తొలగించారు.
- ఈ విధంగా తొలగించబడిన నాన్ ముల్కీ ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారు.
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అటానమస్ బాడీ అయినందున ఈ సంస్థ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ పరిధిలోకి రాదని 1969 జనవరి 3న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుప్పుస్వామి తీర్పు ఇచ్చారు.
- పాల్వంచలోని థర్మల్ పవర్ స్టేషన్లో 1969 జనవరి 5న మొట్టమొదటిసారి నిరసన మొదలైంది.
- కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రంలోని నాన్ ముల్కీ ఉద్యోగులను జనవరి 10 లోగా తొలగించాలని ఉద్యమించారు.
- నానముల్కిలకు వ్యతిరేకంగా జనవరి 10 నుండి నిరాహర దీక్షలు చేయాలని నిర్ణయించారు.
- దీనిలో భాగంగా రోజువారి వేతనంకల కార్మికుల నాయకుడు ‘కృష్ణ’ జనవరి 10న నిరాహార దీక్ష ప్రారంభించాడు.
తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952
రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష
- కొలిశెట్టి రామదాసు మరియు సుధాకర్ రాజుల ప్రోత్సాహంతో బి.ఎ. రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రవీంద్రనాథ్ నిరాహారదీక్షకు సిద్ధమయ్యాడు.
- 1969 జనవరి 8 న ఖమ్మం పట్టణంలోని గాంధీచౌక్ వద్ద రవీంద్రనాథ్ నిరాహారదీక్ష ప్రారంభించాడు.
- రవీంద్రనాథ్ తో పాటు నిరాహార దీక్షలో మొదటి రోజు పాల్గొన్న ఖమ్మం మునిసిపాలిటి ఉపాధ్యక్షుడు – కవి రాజమూర్తి.
- రవీంద్రనాథ్ దీక్షకు మద్దతు తెలిపి సత్యాగ్రహంలో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యుడు – పురుషోత్తమరావు.
- రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా మరియు తెలంగాణ రక్షణలు అమలు జరుపాలని కోరుతూ గోగినేని సత్యనారాయణ అనే శాసనసభ్యుడు జనవరి 12 నుండి మూడు రోజుల నిరసన దీక్షను ఇల్లెందుల లోని తన నివాసంలో ప్రారంభించాడు.
- 1969 జనవరి 22 సాయంత్రం జలగం వెంగళరావు యొక్క ఒత్తిడి వలన 15 రోజులుగా నిరాహారదీక కొనసాగిస్తున్న రవీంద్రనాథ్ నిరాహారదీక్ష విరమించాడు.
- ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం వ్యవస్థాపక సభ్యుడు బి.కిషన్ ఇచ్చిన పండ్లరసాన్ని తీసుకొని రవీంద్రనాధ్ దీక్ష విరమించాడు.
- దీంతో తెలంగాణ రక్షణల అమలు కోసం ఉద్యమం చేస్తున్న తెలంగాణ విద్యార్థుల ఉద్యమం చల్లారిపోయింది.
తెలంగాణ ఉద్యమం &రాష్ట్ర ఏర్పాటు – 1969 ఉద్యమానికి కారణాలు PDF
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |