Telangana Movement & State Formation, జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు
తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC గ్రూప్స్ , TREIRB, రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు. దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , తెలంగాణ ఉద్యమం, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్స్, పోలీస్, రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana Movement & State Formation (తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు PDF తెలుగులో)
TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
జై ఆంధ్ర ఉద్యమం, ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు
- బ్రహ్మానంద రెడ్డి రాజీనామా అనంతరం 1971 సెప్టెంబర్ 30న పి.వి.నరసింహారావు తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యాడు.
- పి.వి.నరసింహారావు విశాలాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడం, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయడం వలన కూడా ఆంధ్రప్రాంతీయులు ఇతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు.
- 1972లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో గెలిచింది.
- ఈ విజయానంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పి.వి.నరసింహారావు అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానవర్గం స్పష్టం చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈయనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
- 1972 ఫిబ్రవరి 14న జస్టిస్ ఓబుల్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్దం కాదని తీర్పు చెప్పింది.
- ఈ తీర్పు అనంతర కాలంలో 1972 ఫిబ్రవరి 17న వరంగల్ లోని అజంజాహీమిల్ మైదానంలో జరిగిన బహిరంగసభలో ఇందిరాగాంధీ తెలంగాణకు అన్యాయం జరగనీయబోనని ప్రకటించింది.
- దానితో ఇందిరాగాంధీ సూచనమేరకు పి.వి.నరసింహారావు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
- ఈ కేసు వాదించిన న్యాయవాదులలో ముఖ్యన్యాయవాది – వి.నరసింగరావు (పి.వి.వియ్యంకుడు)
- ముల్కి నిబంధనలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో పి.వి.నరసింహారావు కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
- ఈ నిర్ణయాలలో భాగంగా కేంద్రప్రభుత్వ భూసంస్కరణల చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో పి.వి.నరసింహారావు క్రింది నిర్ణయాలు తీసుకున్నాడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972 మే 2న జారీ చేసిన ఆర్డినెన్సు ప్రకారం రాష్ట్రంలో అన్ని రకాల భూమి లావాదేవీలను నిలిపివేసింది.
- 1972 సెప్టెంబర్ 15న భూగరిష్ట పరిమితి బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ఆ భూగరిష్ట పరిమితి చట్టంవలన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల భూస్వాములు పి.వి.నరసింహారావుకు వ్యతిరేకులుగా మారారు.
- రాష్ట్రంలో అన్ని పరిస్థితులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న కాలం నిబంధనలు చట్టబద్ధమైనవే అని సుప్రీంకోర్టు చెప్పింది.
- ఈ తీర్పు లో తెలంగాణలో కొనసాగుతున్న ముల్కీ నిబంధనలు రాజ్యాంగంలోని చట్టబద్ధమైనవే అని పేర్కొన్నది.
- ఈ తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు “సుప్రీంకోర్టు నిర్ణయం ఈ సమస్య పట్ల సందేహానికి, వివాదానికి తావులేని వ్యాఖ్యానాన్ని ఇచ్చింది” అని హర్షం వ్యక్తంచేశారు.
- ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ తో ఆంధ్రలో జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది.
- దీంతో సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆంధ్రప్రాంతంలో విద్యార్థులు సమ్మెలు, సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు.
- ఇటువంటి సమయంలో అక్టోబర్ 24న ముఖ్యమంత్రి అధికార పర్యటనపై ఏలూరు సందర్శించగా అక్కడి విద్యార్థులు పి.వి.ని అవమానపరిచారు.
- 1972 నవంబర్ 27న ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ పంచసూత్ర పథకంను పార్లమెంట్ ఉభయ సభలలో ప్రకటించడం జరిగింది.
Telangana Movement And State Formation
పంచసూత్ర పథకం (1972)
- ముల్కీ నియమాలు తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, తహసిల్దారు, అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజనీరు పదవులకు వర్తిస్తాయి. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు,మిగతా ఉమ్మడి కార్యాలయాలల్లో ప్రతి మూడు ఉద్యోగాలల్లో ఒక ఉద్యోగానికి కూడా వర్తిస్తాయి.
- ఈ రక్షణలు రాజధాని అయిన హైదరాబాదు నగరంలో 1977 సంవత్సరం చివరి వరకు, మిగతా తెలంగాణ జిల్లాలలో 1980 సంవత్సరం చివరి వరకు అమలు జరుగుతాయి.
- ఉభయ ప్రాంతాలల్లో ఉద్యోగులకు తగిన ప్రమోషన్ అవకాశాలు కల్పించేందుకు వివిధ ఉద్యోగాలను మొదటి లేక రెండవ గెజిటెడ్ స్థాయి వరకు ప్రాంతీయీకరణ చేయడం జరుగుతుంది.
- సాంకేతిక, వృత్తిపరమైన విద్యాలయాలతో సహా నగరంలోని అన్ని విద్యాలయాలల్లో ప్రస్తుతం తెలంగాణ ప్రాంత విద్యార్థులకు లభించే స్థానాలకంటే అదనంగా కొన్ని స్థానాలు సృష్టించడం జరుగుతుంది. కొత్తగా సృష్టించిన స్థానాలు బేషరతుగా ఏ ప్రాంతం వారైనా పొందవచ్చు.
- జంటనగరాలలో ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలకు చెందిన ఉమ్మడిపోలీసుబలగాలు ఉంటాయి.
- పంచసూత్ర పథకంపై గౌతులచ్చన్న స్పందిస్తూ “మహారాజుకి మనవి చేసుకుంటే మరి రెండు దెబ్బలు వేయమన్న” సామెతకు సరిపోయినట్లుగా ఈ పంచసూత్ర పథకం ఉంది అని పేర్కొన్నాడు.
- పంచసూత్ర పథకాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ప్రాంత ఎం.పి.లు ,జి.యస్. మేల్కోటే
- మల్లిఖార్జున్
- రామకృష్ణారెడ్డి
- గంగారెడ్డి
- 1972 డిశంబర్ 7న ఆంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. తరువాతి కాలంలో 1973 మార్చి 25న 108 రోజుల సమ్మెను విరమించారు)
రాష్ట్రపతి పాలన
- జై ఆంధ్ర ఉద్యమం ఎక్కువ కావడంతో 1973 జనవరి 18న పి.వి.నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.
- 1973 జనవరి 18న భారత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాడు.
- ఈ రాష్ట్రపతి పాలనాసమయంలో రాష్ట్ర శాసనసభను రదుచేయడానికి బదులుగా అనిశ్చిత స్థితిలో ఉంచారు.
- ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్- ఖండూభాయ్ దేశాయ్.
- గవర్నరు సలహాదారులుగా నియమించబడినవారు- హెచ్.సి.శరిన్, వి.కె.రావు
Telangana Economy (తెలంగాణ ఎకానమీ)
తెలంగాణ సంఘర్షణ సమితి మహాసభ
- తెలంగాణ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ మహాసభను 1973 ఫిబ్రవరి 2న హైదరాబాద్లోను కేశవమెమోరియల్ హైస్కూల్ లో నిర్వహించడం జరిగింది.
- ఈ సభకు అధ్యక్షత వహించినది – జగన్మోహన్ రెడ్డి
- ఈ సభలో వాజ్ పేయి మాట్లాడుతూ ఆంధ్రప్రజలు స్నేహపూర్వకంగా విడిపోవాలని అనుకున్నప్పుడు వారిని ఏ శక్తికూడా నిరోధించలేదని తెలంగాణ ఆంధ్ర రాజీ క్యా కరేంగి ఇందిరాజీ) పేర్కొన్నాడు.
- ఇటువంటి సమయంలో కేంద్రహోంశాఖామంత్రి ఆరు సూత్రాల పథకాన్ని రూపొందించాడు.
- 1973 సెప్టెంబర్ 21న ఆరుసూత్రాల పథకాన్ని ప్రకటించారు.
- ఆరు సూత్రాల పథకంను రూపొందించడంలో కీలకపాత్ర పోషించినవారు : కె.సి.పంత్ (కేంద్ర నీటిపారుదల, విద్యుత్ శాఖామంత్రి)
- తెలంగాణ ప్రాంతానికి చెందిన మల్లిఖార్జున్, ఎం.ఎం.హషీం తప్ప ఆ రోజు ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరు కూడా ఆరు సూత్రాల పథకాన్ని సమర్థిస్తూ ఒక సంయుక్త ప్రకటన చేశారు.
ఆరు సూత్రాల పథకం
- రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధికి మరియు రాజధాని అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి. దీని కొరకు ఒక రాష్ట్ర స్థాయి ప్రణాళికా బోర్డును, వెనుకబడిన ప్రాంతాలకు ఉపసంఘాలు నియమించాలి
- రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో, ఉన్నత విద్యా వసతులను పెంచుటకై ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి.
- ఒకనిర్ణీతస్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకం విషయంలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి.
- ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను నియమించాలి. ఇటువంటి ట్రిబ్యునల్ ఇచ్చే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం విధిగా అమలుపరచాలి
- పైన వివరించిన సూత్రాలను అమలు చేయుటలో వచ్చే సమస్యలను అధిగమించడానికి భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని రాష్ట్రపతికి కలిగించాలి.
- పైన సూచించిన వాటిని అవలంబించినచో ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ కమిటి కొనసాగింపు రద్దు అవుతాయి.
ఆరుసూత్రాల పథకం – తెలంగాణకు అన్యాయం
- ఈ ఆరుసూత్రాల పథకం వలన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ పొందిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
- ముల్కీ నిబంధనలు రద్దు అయిపోయాయి
- 1958లో ఏర్పాటు అయిన తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దు అయ్యింది.
- తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ఆదాయ వ్యయాలు బడ్జెట్లో విడివిడిగా చూపాలన్న నియమం కూడా రద్దయింది.
- తెలంగాణలో స్థానికులుగా గుర్తింపు పొందటానికి స్థిర నివాసం 15సం|| కాలం నుండి 4 సం॥ కాలానికి తగ్గింది.
- ఇప్పటివరకు అక్రమంగా చేరిన ఆంధ్ర ఉద్యోగులను సక్రమమైనవిగానే గుర్తించాల్సి వచ్చింది.
- ప్రాంతీయ సంఘం రద్దుతో తెలంగాణ భూములకు రక్షణ లేకుండా పోయింది.
- ప్రాంతీయ సంఘం స్థానంలో ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఏర్పడింది. దీని వలన ఎటువంటి లాభం లేదు.
- 1969 ఉద్యమం వలన ఏ లాభాలు అయితే కలిగాయో వాటన్నింటిని 1973 జై ఆంధ్ర ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రజలు కోల్పోయారు.
- ప్రాంతీయ సంఘం, ముల్కీ నిబంధనలతో సహా సర్వం పోగొట్టుకున్నారు.
- గతంలో వలనే 6 సూత్రాల పథకం కూడా అమలుకు నోచుకోలేకపోయింది.
రాజ్యాంగ సవరణ- ప్రెసిడెన్షియల్ ఆర్డర్
- ఆరు సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని సవరించి (రాజ్యాంగ 32వ సవరణ) రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలివ్వడం జరిగింది.
- దానిని విపులీకరిస్తూ భారత రాష్ట్రపతి అక్టోబర్ 18, 1975న జి.ఎస్.ఆర్ 524(ఇ) సంఖ్యగల ఒక ఉత్తరువును జారీ చేశాడు. దీనినే ‘ప్రెసిడెన్షియల్ ఆర్డర్’ అని అంటారు.
ప్రెసిడెన్నియల్ ఆర్డర్: సిబ్బంది నియమకాల పద్దతి
- సిబ్బంది నియామకాలకు సంబంధించి పాటించవలసిన అంశాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి.వో 674, అక్టోబర్ 20, 1975 రోజున జారీ చేసింది. ముఖ్యాంశాలు:
1.లోకల్ కేడర్లు, లోకల్ ఏరియాల నిర్ధారణ:
ఎ) ఒక జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో ఉండే LDC స్థాయి వరకు ఉద్యోగాలన్నీ జిల్లా స్థాయి కేడర్లవుతాయి.
ఈ స్థాయి నియామకాలకు ‘ప్రతి జిల్లా ఒక లోకల్ ఏరియా’ అవుతుంది.
బి) ఒక జోన్లో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో ఉండే LDC స్థాయికంటే ఎక్కువస్థాయిగల నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, కొన్ని నిర్ణీత గెజిటెడ్ ఉద్యోగాలన్నీ జోన్ స్థాయి కేడర్లు అవుతాయి.
ఈ నియామకాలకు ‘ప్రతి జోన్ ఒక లోకల్ ఏరియా’ అవుతుంది.
సి) అవసరం అయితే ఒక జిల్లా స్థాయి కేడరు ఒకటికంటే ఎక్కువ జిల్లాలకు విస్తరింపచేయవచ్చు. అదేవిధంగా ఒక జోన్ సాయి కేడరను ఒకటి కంటే ఎక్కువ జోన్లకు విస్తరింపజేయవచ్చు..
* వీటిని ‘మల్టీ జోనల్ కేడర్లు’ అంటారు
2. బదిలీలు : ఒక లోకల్ ఏరియా నుండి మరొక లోకల్ ఏరియా మధ్య, అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పరిధిలో ఉన్నటువంటి, లేనటువంటి సంస్థల మధ్య కొన్ని నిర్ణీత పరిమితులలో సిబ్బంది బదిలీలకు అవకాశం ఉంటుంది.
3. జోన్ల వర్గీకరణ: రాష్ట్రంలోని 23 జిల్లాలను 6 జోన్లుగా వర్గీకరించటం జరిగింది.
4. లోకల్ కేండిడేట్: సాధారణంగా ఒక లోకల్ ఏరియాలో కనీసం 4 సంవత్సరాల నివాసం కల్గిన ప్రతి వ్యక్తి ఆ ఏరియాలో లోకల్ కేండిడేట్ అవుతాడు.
5. లోకల్ కేండిడేట్సకు రిజర్వ్ చేయబడిన ఉద్యోగాల పరిమితులు:
ఎ) జిల్లా స్థాయి కేడర్లు : 80 శాతం
బి) జోనల్ స్థాయి కేడర్లు : ఇందులో అన్ని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు : 70 శాతం ,నిర్ణీత గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు : 60 శాతం
ముఖ్య విషయాలు
- లోకల్ అభ్యర్థుల కొరకు రిజర్వ్ చేసిన ఉద్యోగాలు పోగా మిగిలినవి అన్నీ ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ కావాలి.
- అవి నాన్ లోకల్ అభ్యర్థుల కొరకు రిజర్వ్ కావటానికి వీలులేదు.
- వీటికి లోకల్ మరియు నాన్ లోకల్ అభ్యర్థులందరూ అర్హులే.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్తించని కార్యాలయాలు, సంస్థలు –
- రాష్ట్ర సచివాలయం
- శాఖాధిపతుల కార్యాలయాలు
- రాష్ట్ర స్థాయిగల ఇతర కార్యాలయాలు
- భారీ అభివృద్ధి ప్రాజెక్టులు
- ప్రత్యేక కార్యాలయాలు,
- పోలీసు శాఖలోని కొన్ని ఉద్యోగాలు.
- పరిధిలోకి రాకపోయినప్పటికి నియామకాలు చేసేటప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు న్యాయబద్ధమైన వాటా (equitable share) లభించాలనే స్పష్టమైన నిబంధన ఉంది.
- ఈ నియామకాలు ఏ విధంగా జరిగినా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1, 1975న జారీచేసిన 728 జీవోలో పేర్కొంది.
Telangana History PDF In Telugu | తెలంగాణ చరిత్ర స్టడీ మెటీరియల్ PDF
జయభారత్ రెడ్డి కమిటీ (ఆఫీసర్స్ కమిటీ) రిపోర్టు
- 1975 అక్టోబర్ లో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులలో ఆంధ్రప్రాంత వాళ్ళకు ప్రయోజకరమైన అంశాలను అమలుచేసి తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైన అంశాలను అమలు చేయలేదు.
- ఈ ఉత్తర్వులు ఏ మాత్రం అమలు చేయకపోవడం వలన తెలంగాణ ప్రాంతీయులకు కింది స్థాయి 4 ఆద్యోగాలలో కూడా అన్యాయం జరిగింది.
- ఈ రాష్ట్రపతి ఉత్తర్వులను సక్రమంగా అమలుచేయాలని తెలంగాణ ఎన్.జి.ఓ ఉద్యోగుల సంఘం ముఖ్యమంత్రి రామారావుకు వినతి పత్రం సమర్పించారు
- ఈ ఎన్.జి.ఓ ఉద్యోగసంఘం చేసిన వినతులకు స్పందించిన ఎన్.టి. రామారావు ఐ.ఎ.ఎస్ అధికారి జయభారత్ రెడ్డి నాయకత్వాన ముగ్గురు ఐ.ఎ.ఎస్ అధికారులతో 1984లో ఒక కమిటీని నియమించారు
- ఈ కమిటీకి అధ్యక్షుడు : జయభారత్ రెడ్డి (ఐ.ఎ.ఎస్)
- సభ్యులు: అమర్‌నాథ్ (ఐ.ఎ.ఎస్), ఉమాపతి (ఐ.ఎ.ఎస్)
- రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 58, 962 మంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందారని ఈ కమిటీ 36 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
- సహజంగానే తెలంగాణకు న్యాయం జరిగే అంశాలను తొక్కి పెట్టడానికి అలవాటు పడిన ఆంధ్రపాలకులు మరో ఐ.ఎ.ఎస్ అధికారి సుందరేషన్ నాయకత్వంలో మరో కమిటీని వేసింది.
- కొద్ది కాలంలోనే ఈ కమిటీ కూడా తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
- జయభారత్ రెడ్డి కమిటీ, సుందరేషన్ కమిటీల సిఫారసుల ఆధారంగా 1985 డిశంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 610 జీ.వో ను వెలువరించింది.
- ఈ 610 జీ.వో 1986 మార్చి 31 నాటికి అమలు కావాలని ఆ జీ.వో లోనే పేర్కొన్నారు.
- వాస్తవంలో ఈ 610 జీ.వో ఇప్పటి వరకు అమలు కాలేదు.
Political and ideological efforts
జి.వో.610-ముఖ్యాంశాలు
- డిసెంబర్ 30, 1985న జారీ అయిన జీవో 610, మార్చ్ 31, 1986 నాటికి అమలు కావాలని తెలియజేస్తుంది.
సారాంశం- ప్రధాన అంశాలు:
- ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలులోకి వచ్చిన రోజు నుండి జి.వో. 610 జారీ అయ్యేనాటికి తెలంగాణా ప్రాంతంలోని జిల్లాల్లో, జోన్లలో నిబంధనలకు వ్యతిరేకంగా నియమించబడిన నాన్ లోకల్ ఉద్యోగస్తులందరిని వారి స్వస్థలాలకు మార్చి 31, 1986లోగా పంపించాలి.వారిని బదిలీ చేయుటకు వీలుగా ఆయా ప్రాంతాలలో అవసరమైతే అదనపు (సూపర్ న్యూమరరీ) ఉద్యోగాలను కల్పించాలి.
- జూరాల, శ్రీశైలం ఎడమకాలువ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కొరకు నాన్ గెజిటెడ్ కేడర్లలో నియమించిన స్థానికేతరులదరిని వారికి సంబంధించిన జోన్లకు బదిలీ చేయాలి.
- రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఇతర రాష్ట్రస్థాయి కార్యాలయాలలో ఉండే ఉద్యోగాల నియామకంలో అన్ని లోకల్ కేడర్లకు (అంటే అన్ని ప్రాంతాలవారికి) సమన్యాయం
- బోగస్ సర్టిఫికెట్ల ద్వారా తెలంగాణ ప్రాంతపు ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజ్ లో పేరు నమోదు చేసి అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన స్థానికేతరులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి.
- అక్రమ నియామకాలు, ప్రమోషన్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతపు అభ్యర్థులు చేస్కున్న అప్పీళ్ళన్నింటిని మార్చి 31, 1986లోగా పరిష్కరించాలి.
- వివిధ లోకల్ ఏరియాలు, కేడర్ల మధ్య సిబ్బంది బదిలీలను విచ్చలవిడిగా చేయరాదు
- ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలులోనికి వచ్చినప్పటి నుండి జరిగిన నియమకాలు ప్రమోషన్లు అన్నింటిని పున:పరిశీలించాలి. ఈ పనిని రాష్ట్ర సచివాలయంలోని విభాగాలు జూన్ 30, 1986 లోగా పూర్తిచేయాలి…
Download: Telangana Movement – jai andhra movement
మరింత చదవండి:
- 1969 ఉద్యమం వివిధ రాజకీయ పార్టీల పాత్ర
- 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
- 1969 ఉద్యమానికి కారణాలు
- 1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు,
- తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
- తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |