Telangana Movement & State Formation: Naxalite movement, నక్సలైట్ ఉద్యమం
- బెంగాల్ లో ఖాళీగా ఉన్న 6 లక్షల భూమిని పేదలకు గిరిజనులకు పంచుతామని హామీ ఇచ్చి, 1967 ఎన్నికలలో CPI(M) పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా అజయ్ ముఖర్జీ, ఉపముఖ్యమంత్రి మరియు హోంమినిష్టర్ గా జ్యోతిబసు ప్రమాణ స్వీకారం చేశారు.
- కాని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా 6 లక్షల ఖాళీ భూములను మాత్రం పేదలకు పంచడానికి నిరాకరించారు.
చారుమంజుదార్:
- ప్రభుత్వం భూమిని పంచకపోవడంతో డార్జిలింగ్ ప్రాంత పార్టీ సెక్రటరీగా ఉన్న చారుమజుందార్ నేతృత్వంలో డార్జిలింగ్ (బెంగాల్) ప్రాంతంలోనే ‘సిల్ గురి’ ప్రజలు భూ ఆక్రమణకు పూనుకొన్నారు.
- మొదట సిలిగురి ప్రాంతంలోనే నక్సల్బరి అనే గ్రామంలో 1967 మే 23 నుండి 25 మధ్యకాలంలో 10,000 మంది సంతాల్ గిరిజనులు భూ ఆక్రమణ మొదలు పెట్టారు
- ఇటువంటి సమయంలో 1967 నవంబర్ లో వివిధ కమ్యూనిస్టు వర్గాల మధ్య ఉన్న సిద్ధాంతపరమైన భేదాలను తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో ‘కమ్యూనిస్టు విప్లవకారుల అఖిలభారత సమన్వయకమిటీ ఏర్పడింది.
- ఈ కమిటి రెండవ సమావేశం 1968 మే నెలలో కలకత్తాలో జరిగింది.
- ఈ సమావేశంలో CPI(M) పార్టీ సిల్ గురి ప్రాంత జనరల్ సెక్రటరీ చారుమజుందార్ సాయుధ పోరాటం నిర్వహించాలనీ, ఎన్నికలను బహిష్కరించాలని పేర్కొన్నాడు.
- ఈ ప్రకటనను వ్యతిరేకించిన జాతీయ కమ్యూనిస్టు నాయకులు : తరిమెల నాగిరెడ్డి , దేవులపల్లి వెంకటేశ్వరరావు.
- కాని చారుమజుందార్ యొక్క సాయుధ పోరాట తీర్మానంను అంగీకరించిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమ నాయకులు: పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు
CPI(ML) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్టు)
- చారుమజుందార్ యొక్క తీర్మానంను ఆమోదించిన వారితో కలిసి 1969 ఏప్రిల్ 22 నాడు CPI(ML) ను స్థాపించారు.
- నక్సల్బరి గ్రామంలో పుట్టిన ఉద్యమం గనుక వీరికి పత్రికలు నక్సలైట్లుగా నామకరణం చేశారు
- CPI(ML) ను స్థాపించిన అనంతరం 1969 మే 1 న కలకత్తాలోని ‘షహీద్ మినార్’ మైదానంలో కానూ సన్యాల్ CPI(ML) పార్టీ అవతరణను, పార్టీ విధానాలను ప్రకటించాడు.
APPSC/TSPSC Sure shot Selection Group
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు
- 1960 లలో సి.పి.ఐ (ఎం) యొక్క అనుబంధ విద్యార్థి సంస్థ – స్టూడెంట్స్ ఫెడరేషన్.
- నక్సలిజంతో ప్రభావితులైన విద్యార్థులు స్టూడెంట్స్ ఫెడరేషన్ నుండి విడిపోయి డెమోక్రటిక్ స్టూడెంట్స్ పేరుతో విద్యార్థి సంస్థను ఏర్పరచుకున్నారు.
- కొండపల్లి సీతారామయ్య, ఛండ్ర పుల్లారెడ్డి నాయకత్వాలలో పనిచేస్తున్న విద్యార్థులు డెమోక్రటిక్ స్టూడెంట్స్ నుంచి విడిపోయి 1974లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ (పి.డి.ఎస్.యు) ను ఏర్పాటు చేసుకున్నారు.
- 1974 అక్టోబర్ లో సరోజినిదేవీ హాల్లో పి.డి.ఎస్.యు సభలు జరిగాయి.
- ఈ సభలలో కొండపల్లి సీతారామయ్య మరియు చండ్ర పుల్లారెడ్డి వర్గం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.
- ఈ ఘర్షణలో పాల్గొని కొండపల్లి సీతారామయ్య వర్గ ముఖ్య విద్యార్థులు :
- మల్లోజుల కోటేశ్వరరావు (కిషజ్)
- సాహు (శనిగరం వెంకటేశ్వర్లు)
- గణపతి (ముప్పాళ్ల లక్ష్మణరావు)
- అల్లం నారాయణ
ఆర్.ఎస్.యు (రాడికల్ స్టూడెంట్ యూనియన్)
- ఈ ఘర్పణతో కొండపల్లి సీతారామయ్య వర్గం విద్యార్థులు పి.డి.ఎస్.యు నుండి బయటికి వచ్చి 1974 అక్టోబర్ లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ను ఏర్పాటు చేసుకున్నారు.
- దీనికి రాడికల్ స్టూడెంట్ యూనియన్ అని నామకరణం చేసింది – శ్రీశ్రీ.
- ఆర్.ఎస్.యు. రాష్ట్ర మహాసభలు –
- మొదటి రాష్ట్ర మహాసభలు – హైదరాబాద్ (1975)
- రెండవ రాష్ట్ర మహాసభలు – వరంగల్ (1978)
- మూడవ రాష్ట్ర మహాసభలు – అనంతపురం
- నాల్గవ రాష్ట్ర మహాసభలు – గుంటూరు (1981)
- ఐదవ రాష్ట్ర మహాసభలు – తిరుపతి (1982)
ఆర్.ఎస్.యు – గ్రామాలకు తరలండి క్యాంపెయిన్
- వేసవి సెలవులలో విద్యార్థులకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి వారిని విప్లవోద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా కొండపల్లి సీతారామయ్య ప్రణాళిక రచించాడు.
- ఈ ప్రణాళికలో భాగంగా 1978 ఏప్రిల్ నుండి మే వరకు 30 రోజుల క్యాంపును కరీంనగర్ లోని మంథని దగ్గర గల శాస్త్రులపల్లిలో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో సత్యమూర్తి, సాంబశివరావు (వైట్ మాన్) మరియు ఇతర ముఖ్యులు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
- ఈ శిక్షణ అనంతరం 5గురు సభ్యులు గల 150 విద్యార్థి బృందాలను ఏర్పాటుచేసి కరీంనగర్ జిల్లా పర్యటనకు పంపిచారు
- ఈ 30 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న నారదాసు లక్ష్మణరావు గుంటూరులో జరిగిన ఆర్.వై.ఎల్ సభలలో పాల్గొని ప్రసంగించారు.
- నారదాసు లక్ష్మణరావు తన ప్రసంగాలను గ్రామలకు తరలండి – నా అనుభవాలు అనే పేరుతో పుస్తకంగా క్రోడీకరించారు.
భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు
గొల్లపల్లి సభ (1977, ఆగస్టు 27)
- ఎమర్జెన్సీ అనంతరం సి.పి.ఐ (ఎం.ఎల్) పీపుల్స్ వార్ పైన నిషేధం ఎత్తివేయబడింది.
- దీనితో సి.పి.ఐ(ఎం.ఎల్) పార్టీ వారు 1977 జూలై నుండి ఆగస్టు నెలల మధ్య కాలంలో ప్రజాసంఘాల కార్యక్రమాలు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించారు.
- ఆ కార్యక్రమాలలో భాగంగా గొల్లపల్లి సభ నిర్వహించారు.
- ఆగస్టు 27, 1977న జగిత్యాల తాలూకాలోని గొల్లపల్లి గ్రామంలో రైతు కూలీ సంఘాల నేతృత్వంలో జరిగిన సభకు దాదాపు 3000 మంది రైతులు హాజరయ్యారు.
ముద్దునూరు సంఘటన
- ముద్దునూరు భూస్వామి – రాజేశ్వరరావు.
- ఇతనిని ఎదిరించి 1978 జూన్ 30 నాడు ప్రజలు ఇతని ప్రాంతంలోని కట్టె కొట్టి, చెట్లు నరికి తీసుకొని వెళ్లిపోయారు.
లక్సెట్టిపేట సంఘటన
- తునికాకు సీజన్లో కూలీలంతా అధికరేట్లు కావాలని, తాము ఏరుకొని వచ్చిన తునికాకుకు న్యాయమైన ధర అందించాలని కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా లక్సెట్టిపేటలో సమ్మెచేసి విజయం సాధించారు.
జగిత్యాల జైత్రయాత్ర (1978 సెప్టెంబర్ 7)
- 1978 సెప్టెంబర్ 7న జగిత్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం.ఎల్) ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన రైతు కూలీ ప్రదర్శన జరిగింది.
- జగిత్యాల తాలూకాలోని అన్ని గ్రామాల నుండి రైతులు, రైతు కూలీలు వచ్చినప్పటికీ కేవలం వెల్దుర్తి, సారంగాపూర్ గ్రామాల నుండి రైతులు రాలేకపోయారు.
- వెల్దుర్తి గ్రామ భూస్వామి సత్యనారాయణరావు ఆ గ్రామ రైతులు జగిత్యాల జైత్ర యాత్రలో పాల్గొనకుండా అడ్డుపడ్డాడు.
- ఈ మహాసభను చారిత్రాత్మకమైన రైతు ప్రదర్శనగా ఆంధ్రభూమి దినపత్రిక అభివర్ణించింది.
జగిత్యాల జైత్రయాత్ర అనంతర సంఘటనలు
చిన్న మెట్ పల్లి ఘటన
- 1958లో 30 ఎకరాల స్వంత భూమి కలిగిన జగన్మోహనరావు అనే భూస్వామి 1978 నాటికి 150 ఎకరాలకు ఆసామి అయ్యాడు.
- జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్న రైతాంగం తమ దొరచేసే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సంఘం పెట్టుకోవాలనుకున్నారు.
- మెట్ పల్లి రైతులు సెప్టెంబర్ 14న తమ గ్రామంలో బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు.
- ఈ సభను అడ్డుకోవడానికి భూస్వామి జగన్మోహనరావు తన బలగంతో ఆ సభపై దాడి చేయించాడు.
- ఈ వార్త విన్న చుట్టు ప్రక్క గ్రామ ప్రజలు చిన్నమెట్పల్లికి చేరుకొని భూస్వామి జగన్మోహనరావు ఇంటికి ఊరేగింపుగా బయలుదేరారు.
- ఈ ఊరేగింపును చూసిన భూస్వామి అల్లుడైన బోర్నపల్లి సురేష్ బంగ్లా పైనుండి ఊరేగింపుపై కాల్పులు ప్రారంభించాడు.
- ఈ కాల్పుల విషయం తెలుసుకున్న సురేష్ సొంతూరు బోర్నపల్లి ప్రజలు సురేష్ ఇంటిని తగలబెట్టారు.
కల్లోల ప్రాంతంగా ప్రకటన
- రైతుకూలి సంఘాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కేంద్ర ప్రభుత్వంనకు నివేదిక సమర్పించాడు.
- దీనితో అక్టోబర్ 20, 1978న జగిత్యాల, సిరిసిల్ల తాలూకాలను ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
- రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పటికి కేంద్రంలోని ఆనాటి జనతా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని (జగిత్యాల, సిరిసిల్ల) కల్లోలిత ప్రాంతంగా ప్రకటించుటకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.
రైతు కూలీ సంఘాలు
- ప్రజలు జగిత్యాల, సిరిసిల్ల తాలూకాలలో భూస్వాములకు ఎదురుతిరగారు.
- రాడికల్ స్టూడెంట్ యూనియన్ “గ్రామాలకు తరలండి” అనే క్యాంపెయిన్లో భాగంగా అనేక గ్రామాలలో రైతు కూలీ సంఘాలను ఏర్పరచారు.
- 1977లో మద్దనూరు గ్రామంలో జీతాలు, కూలీరేట్లు పెంచాలని మద్దనూరు భూస్వామి రాజేశ్వరరావుకు వ్యతిరేకంగా పాలేర్లు, రైతు కూలీలు సమ్మెచేశారు
- మద్దనూరులో ప్రారంభమైన ఈ పోరాటం జగిత్యాల తాలూకా అంతటా వ్యాపించింది.
రైతు కూలీ సంఘాల సారా వ్యతిరేక ఉద్యమం
- 1979లో జగిత్యాల తాలూకా ప్రాంతంలో సారాకాంట్రాక్టులకు రాకుండా భూస్వాములను అడ్డుకొని గ్రామకమిటీల నాయకత్వాన ప్రజల సమక్షంలో వేలంపాట నిర్వహించారు.
- వేలంపాడిన గుత్తేదారు గ్రామ అభివృద్ధికి కొంత డబ్బును ఖర్చు పెట్టాలనే నిబంధనను పెట్టి గ్రామాలను కొంతవరకు అభివృద్ధి చేసుకున్నారు.
- తెలంగాణ గ్రామాలలో ఎన్.టి.ఆర్ ప్రభుత్వం వారుణి వాహిని పేరుతో ప్రవేశపెట్టిన సారాపంపిణీని వ్యతిరేకిస్తూ రైతుకూలీ సంఘం అనేక పోరాటాలు నిర్వహించింది.
- 1970 లలో గిరిజన భూములను కొనడంపై ప్రభుత్వం నిషేధిస్తూ చట్టం చేసింది.
- చట్టంనే 1/70 చట్టం అని కూడా పేర్కొంటారు.
- ఈ చట్టం ముఖ్యాంశాలు:
- 1. గిరిజన భూములను గిరిజనేతరులు కొనుక్కున్నా, లీజుకు తీసుకున్నా చెల్లదు.
- 2. ఎటువంటి పరిస్థితులలోనైనా గిరిజనులు భూములు అమ్ముకున్నా, అద్దకు ఇచ్చుకున్నా వారికి (గిరిజనులకి) ఆ భూమిపై హక్కు పోదు.
- పెడ్యూల్ తెగల వారి భూములను షెడ్యూల్ తెగలు కాని వారికి బదలాయించకూడదని సుప్రీం కోర్టు సమత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు సందర్భంగా తీర్పు చెప్పింది.
ఇంద్రవెల్లి సభ
- 1970లలో ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని నిర్మించిన ముఖ్యమైన విప్లవకారులు : సాహు (శనిగరం వెంకటేశ్వర్లు), దాసరి లక్ష్మీకాంతం (పొర్కల దొర)
- ఆదివాసీ రైతుకూలీ సంఘం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ రైతు కూలీలైన గోండు, కోలాంలను కూడగట్టి 1980 ఏప్రిల్ 21న భారీ బహిరంగ సభను ఇంద్రవెల్లిలో నిర్వహించడానికి ఏర్పాటు చేశారు.
- పిట్టబొంగరం అనే గ్రామంలో గోండురైతులు సభకు వస్తుండగా అడ్డుకున్న పోలీసులకు, గోండు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది.
- దానితో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొని పోలీసులు కాల్పులు జరిపారు.
- ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ కాల్పులలో 13 మంది మరణించారు. కానీ పౌర హక్కుల సంఘం వారు ఈ కాల్పులలో 60 మంది దాకా మరణించారని పేర్కొంటారు.
- ఈ విధంగా ఇంద్రవెల్లి గిరిజన సభ రక్తసిక్తమైంది.
- ఇంద్రవెల్లిలో ప్రాణాలు అర్పించిన గిరిజన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి తరువాత సంవత్సరంలో అదిలాబాద్ జిల్లా గిరిజన రైతు కూలీ సంఘం వారు ఇంద్రవెల్లి సభను నిర్వహించారు.
- అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇంద్రవెల్లి అమరవీరులకు స్థూపంను నిర్మించి ఆవిష్కరించారు.
- ఎన్.టి.ఆర్ సీఎం అయిన తరువాత 1987లో ఈ అమరవీరుల స్థూపాన్ని కూల్చివేయడం జరిగింది.
- ఈవిధంగా గిరిజన రైతు కూలీ సంఘాల నేతృత్వంలో ఆదివాసి భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా గిరిజనులు ఉద్యమించారు.
Telangana Movement Naxalite movement Download PDF
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |