తెలంగాణ: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యుత్తు, పర్యావరణ సూచిక (స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్) రౌండ్-1 ర్యాంకుల్లో ఓవరాల్ కేటగిరీలో తెలంగాణ 17, ఆంధ్రప్రదేశ్ 18వ స్థానాల్లో నిలిచాయి. 20 పెద్ద రాష్ట్రాల విభాగంలో గుజరాత్ తొలి స్థానంలో నిలవగా.. తెలంగాణ 11, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానానికి పరిమితమయ్యాయి. విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు, విద్యుత్తు లభ్యత- ధర- విశ్వసనీయత, స్వచ్ఛ ఇంధన సరఫరా, విద్యుత్తు సామర్థ్యం, పర్యావరణ సుస్థిరత, వినూత్న విధానాలు.. అనే ఆరు కొలమానాల ఆధారంగా 2019-20 సమాచారం మేరకు నీతిఆయోగ్ ఈ ర్యాంకులు ప్రకటించింది. ‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 7, 12, 13 విద్యుత్తు రంగానికి సంబంధించినవి. దాన్ని అనుసరించి రాష్ట్రాలు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అంచనావేయడానికి ఈ ర్యాంకులు ఇచ్చాం’’ అని నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్ వెల్లడించారు. 1990 నుంచి 2019 మధ్య ఆర్థిక వ్యవస్థ 6 రెట్లు పెరిగితే విద్యుత్తు వినియోగం 2.5 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. మన తలసరి విద్యుత్తు వినియోగం ప్రపంచ సగటులో 1/3 వంతుకు మాత్రమే పరిమితమైందన్నారు.
మొదటి మూడు స్థానాల్లో..
- పెద్ద రాష్ట్రాల్లో: గుజరాత్, కేరళ, పంజాబ్
- చిన్న రాష్ట్రాల్లో: గోవా, త్రిపుర, మణిపుర్
- కేంద్రపాలిత ప్రాంతాల్లో: ఛండీగడ్, దిల్లీ, దయ్యూదామన్, దాద్రానగర్‌హవేలీ
- ఓవరాల్ ర్యాంకులు: చండీగఢ్, దిల్లీ, డయ్యూడామన్-దాద్రానగర్ హవేలీ
****************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |