జీఎస్‌డీపీ వృద్ధిలో తెలంగాణ మూడో స్థానం , Telangana ranks third in GSDP growth
స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్-జీఎస్‌డీపీ) వృద్ధిరేటులో (స్థిర ధరల్లో) దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉందని రాష్ట్ర అర్థ గణాంక శాఖ రూపొందించిన గణాంకాల నివేదిక స్పష్టం చేసింది. మిజోరం, గుజరాత్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత ధరల్లో అయితే రాష్ట్రానికి నాలుగో స్థానమని.. సిక్కిం, మధ్యప్రదేశ్, త్రిపుర మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయంది. జీఎస్‌డీపీ రూ.9,80,407 కోట్లని తెలిపింది. 2020-21లో దేశ జీడీపీ మైనస్ 3గా ఉండగా.. రాష్ట్ర జీఎస్‌డీపీ 2.4గా నమోదైందని పేర్కొంది. తలసరి ఆదాయ జాతీయ సగటు రూ.1,28,829 కాగా.. తెలంగాణది రూ.2,37,632గా ఉందని పేర్కొంది. ఈ నివేదికలో రాష్ట్ర పరిపాలన, భౌగోళిక స్వరూపం, జనాభా, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ, పాఠశాల విద్య, వ్యవసాయం, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఆరోగ్యం, గ్రామీణ తాగునీరు, పల్లె, పట్టణప్రగతి, సామాజిక భద్రత అంశాలను విశ్లేషించారు.
********************************************************************************************