Telugu govt jobs   »   State GK   »   Details About Telangana Regions, Divisions and...

Telangana Regions, Divisions and Districts | తెలంగాణాలోని ప్రాంతాలు, డివిజన్లు మరియు జిల్లాల గురించి వివరాలు

Telangana Regions

History of Telangana: When it was incorporated into the Dominion of India in 1948 after The Independence of India, the Telangana region of Hyderabad state consisted of 8 districts such as Hyderabad, Mahbubnagar, Medak, Nalgonda, Nizamabad, Adilabad, Karimnagar and Warangal. On November 1, 1956, a united Andhra Pradesh was formed by merging the Telangana region of Hyderabad state with the state of Andhra Pradesh. Parts of Bhadrachalam division and Aswaraopeta taluk were merged from Godavari districts to Khammam district for better governance.

భారత స్వాతంత్ర్యం తరువాత 1948లో భారతదేశంలోని డొమినియన్‌లో చేర్చబడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి 8 జిల్లాలు ఉన్నాయి.1953, అక్టోబరు 1న వరంగల్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా ఏర్పాటుచేయబడింది. 1956, నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేయడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మెరుగైన పరిపాలన కోసం భద్రాచలం డివిజన్, అశ్వారావుపేట తాలూకా భాగాలను గోదావరి జిల్లాల నుండి ఖమ్మం జిల్లాలో కలుపబడ్డాయి. 1978, ఆగస్టు 15న హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్ అర్బన్ జిల్లా, హైదరాబాద్ రూరల్ జిల్లాగా విభజించారు. హైదరాబాద్ అర్బన్ జిల్లాను చార్మినార్, గోల్కొండ, ముషీరాబాద్, సికింద్రాబాద్ తాలూకాలు అనే 4 తాలూకాలుగా ఉన్నాయి. వీటిలో ఎంసిహెచ్ ప్రాంతం, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ రూరల్ జిల్లాను రంగారెడ్డి జిల్లాగా మార్చారు.

ఆంధ్రప్రదేశ్ నుండి 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పడింది. భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను తిరిగి తూర్పుగోదావరి జిల్లాకు ఇచ్చారు.2016, అక్టోబరు 11న 21 కొత్త జిల్లాలు సృష్టించబడ్డాయి. దాంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాలు కనిష్టంగా 2 నుండి గరిష్టంగా 5 జిల్లాలుగా విభజించబడ్డాయి. 2019, ఫిబ్రవరి 17న 9 మండలాలతో ములుగు, 11 మండలాలతో నారాయణపేట కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి. అప్పుడు మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరుకుంది.

2016లో వరంగల్ జిల్లాను వరంగల్ పట్టణ జిల్లాగా, వరంగల్ గ్రామీణ జిల్లాగా విభజించారు. ఆ తరువాత 2021 ఆగస్టు 12న వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Details About Telangana Regions, Divisions and Districts_3.1APPSC/TSPSC Sure shot Selection Group

Date of Telangana statehood | తెలంగాణా రాష్ట్రంగా అవతరించిన రోజు

తెలంగాణా రాష్ట్రంగా అవతరించిన రోజు: తెలంగాణ భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన హైదరాబాద్ రాజ్యంలో భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడే ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం కొరకు దశాబ్దాలుగా జరిగిన వేర్పాటు ఉద్యమాలు ఫలించి, 2014 జూన్ 2 నాడు కొత్త రాష్ట్రంగా అవతరించింది.

Telangana State Boundaries | తెలంగాణా రాష్ట్ర సరిహద్దులు

తెలంగాణా రాష్ట్ర సరిహద్దులు: తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలంగాణ రాష్ట్రపు వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. రాష్ట్రంలో 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఉన్నాయి.

Some famous people of Telangana | తెలంగాణాలోని కొందరు ప్రముఖులు

తెలంగాణాలోని కొందరు ప్రముఖులు: చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళు దొరికాయి. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందింది. తెలుగులో తొలి రామాయణ కర్త బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులు.

Some of the major tourist destinations in Telangana are | తెలంగాణాలోని కొన్ని ముఖ్య పర్యాటక ప్రాంతాలు

తెలంగాణాలోని కొన్ని ముఖ్య పర్యాటక ప్రాంతాలు: ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీ స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీ సీతారామాలయం, బాసరలో జ్ఞానసరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి ముఖ్య పర్యాటక ప్రాంతాలు.

Statistics | గణాంకాలు

India_Telangana_locator_map
India_Telangana_locator_map

గణాంకాలు: భద్రాద్రి జిల్లా 8,062 కి.మీ2 (3,113 చ. మై.) వైశాల్యంతో అతిపెద్ద జిల్లా కాగా, 2,019 కి.మీ2 (780 చ. మై.) వైశాల్యం కలిగిన రాజన్నసిరిసిల్ల అతి చిన్న జిల్లా. హైదరాబాద్, 35,269,257 మందితో అత్యధిక జనాభా కలిగి ఉన్న జిల్లా.

Telangana State Map | తెలంగాణా రాష్ట్ర పటం

Telangana-districts
Telangana-districts

Telangana Districts (Undivided Andhra Pradesh) | తెలంగాణ జిల్లాలు (అవిభక్త ఆంధ్రప్రదేశ్)

అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా ప్రాంతంలో 13 జిల్లాలు వుండేవి.

Population | జనాభా

Population | జనాభా: 2001 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,09,87,271 కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతపు జనాభా 3,52,88,768 గా ఉంది. రంగారెడ్డి జిల్లా 52.96 లక్షల జనాభాతో ప్రథమస్థానంలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లా 40.42 లక్షలతో రెండో స్థానంలో, హైదరాబాదు జిల్లా 40.10 లక్షల జనాభాతో మూడవ స్థానంలో ఉంది. నిజామాబాదు జిల్లా చివరి స్థానంలో ఉంది.

2001, 2011 జనాభా లెక్కల ప్రకారం అప్పటి జిల్లాల వారీగా జనాభా క్రింది విధంగా ఉండేది.

జిల్లా పేరు 2001 ప్రకారం జనాభా 2001 ప్రకారం స్థానం 2011 ప్రకారం జనాభా 2011 ప్రకారం స్థానం
ఆదిలాబాదు జిల్లా 2488003 9 2737738 9
కరీంనగర్ జిల్లా 3491822 4 3811738 4
నిజామాబాదు జిల్లా 2345685 10 2552073 10
వరంగల్ జిల్లా 3246004 6 3522644 5
ఖమ్మం జిల్లా 2578927 8 2798214 8
మెదక్ జిల్లా 2670097 7 3031877 7
రంగారెడ్డి జిల్లా 3575064 2 5296396 1
హైదరాబాదు జిల్లా 3829753 1 4010238 3
మహబూబ్ నగర్ జిల్లా 3513934 3 4042191 2
నల్గొండ జిల్లా 3247982 5 3483648 6

తెలంగాణా కొత్త  జిల్లాల పేర్లు అందులోని మండలాల సంఖ్య చదరపు కిలోమీటర్లలో అది విస్తరించి ఉన్న ప్రాంతం అందులో నివసిస్తున్న జనాభా మరియు జనసాంద్రత వివరాలు ఈ క్రింది పట్టికలో పొందుపరచబడ్డాయి పరిశీలించండి

జిల్లా పేరు మండలాల సంఖ్య చదరపు కి.మీ.లో ప్రాంతం జనాభా జనసాంద్రత
ఆదిలాబాద్ 18 4153 708972 171
భద్రాద్రి కొత్తగూడెం 23 7483 1069261 143
హైదరాబాద్ 16 217 3943323 18172
జగిత్యాల 18 2419 985417 407
జనగాం 13 2188 566376 259
జయశంకర్ భూపాలపల్లి 20 6175 711434 115
జోగులాంబ గద్వాల్ 12 2928 609990 208
కామారెడ్డి 22 3652 972625 266
కరీంనగర్ 16 2128 1005711 473
ఖమ్మం 21 4361 1401639 321
కొమరం భీమ్ 15 4878 515812 106
మహబూబాబాద్ 16 2877 774549 269
మహబూబ్ నగర్ 26 5285 1486777 281
మంచిరియల్ 18 4016 807037 201
మెదక్ 20 2786 767428 275
మేడ్చల్-మల్కాజిగిరి 14 1084 2440073 2251
ములుగు 9 3881 294671 124
నాగర్ కర్నూల్ 22 6545 893308 142
నారాయణపేట 11 2336.44 566874 243
నల్గొండ 31 7122 1618416 227
నిర్మల్ 19 3845 709418 185
నిజామాబాద్ 27 4288 1571022 366
పెద్దపల్లి 14 2236 795332 356
రాజన్న సిరిసిల్ల 13 2019 552037 273
రంగా రెడ్డి 27 5031 2446265 486
సంగారెడ్డి 26 4403 1527628 347
సిద్దిపేట 22 3632 1012065 279
సూర్యాపేట 23 3607 1099560 305
వికారాబాద్ 18 3386 927140 274
వనపర్తి 14 2152 577758 268
వరంగల్ రూరల్ 15 2175 718537 330
వరంగల్ అర్బన్ 11 1309 1080858 826
యాదాద్రి భువనగిరి 16 3092 739448 239

Telangana Districts Details | తెలంగాణా జిల్లాల వివరాలు

వ.సంఖ్య జిల్లా జిల్లా ప్రధానకార్యాలయం రెవెన్యూ డివిజన్లు సంఖ్య మండలాలు సంఖ్య మొత్తం రెవెన్యూ గ్రామాలు జనాభా (2011) వైశాల్యం (చ.కి)
1 ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ 2 18 505 7,08,952 4,185.97
2 కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ 2 15 419 5,15,835 4,300.16
3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం 2 23 377 13,04,811 8,951.00
4 జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి 1 11 223 7,12,257 6,361.70
5 జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్ 1 12 196 6,64,971 2,928.00
6 హైదరాబాద్ జిల్లా హైదరాబాద్ 2 16 34,41,992 4,325.29
7 జగిత్యాల జిల్లా జగిత్యాల 3 18 286 9,83,414 3,043.23
8 జనగామ జిల్లా జనగామ 2 12 176 5,82,457 2,187.50
9 కామారెడ్డి జిల్లా కామారెడ్డి 3 22 473 9,72,625 3,651.00
10 కరీంనగర్ జిల్లా కరీంనగర్ 2 16 210 10,16,063 2,379.07
11 ఖమ్మం జిల్లా ఖమ్మం 2 21 380 14,01,639 4,453.00
12 మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ 2 16 287 7,70,170 2,876.70
13 మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ 1 16 310 13,18,110 4,037.00
14 మంచిర్యాల జిల్లా మంచిర్యాల 2 18 362 807,037 4,056.36
15 మెదక్ జిల్లా మెదక్ 3 21 381 767,428 2,740.89
16 మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్ 2 15 163 2,542,203 5,005.98
17 నల్గొండ జిల్లా నల్గొండ 3 31 566 1,631,399 2,449.79
18 నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ 4 20 349 893,308 6,545.00
19 నిర్మల జిల్లా నిర్మల 2 19 429 709,415 3,562.51
20 నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ 3 29 450 1,534,428 4,153.00
21 రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి 5 27 604 2,551,731 1,038.00
22 పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి 2 14 215 795,332 4,614.74
23 సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి 4 27 600 1,527,628 4,464.87
24 సిద్దిపేట జిల్లా సిద్దిపేట 3 24 381 993,376 3,425.19
25 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల 2 13 171 546,121 2,030.89
26 సూర్యాపేట జిల్లా సూర్యాపేట 2 23 279 1,099,560 1,415.68
27 వికారాబాదు జిల్లా వికారాబాద్ 2 19 503 881,250 3,385.00
28 వనపర్తి జిల్లా వనపర్తి 1 14 216 751,553 2,938.00
29 హన్మకొండ జిల్లా వరంగల్ 2 14 163 1,135,707 1,304.50
30 వరంగల్ జిల్లా వరంగల్ 2 13 192 716,457 2,175.50
31 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి 2 17 321 726,465 3,091.48
32 ములుగు జిల్లా  ములుగు 1 9 336 2,94,000
33 నారాయణపేట జిల్లా నారాయణపేట 1 11 252 5,04,000
మొత్తం 73 594 35,003,694 112,077.00

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Details About Telangana Regions, Divisions and Districts_7.1

FAQs

How many regions are there in Telangana?

The seven zones are Kaleshwaram (Zone 1), Basara (Zone 2), Rajanna (Zone 3), Bhadradri (Zone 4), Yadadri (Zone 5), Charminar (Zone 6) and Jogulamba (Zone 7).

How many Districts are there in Telangana?

there are 33 Districts are there in Telangana

What is the region of Telangana?

Telangana is located on the Deccan Plateau and lies in the Southern region of India.