Telangana State Current affairs In Telugu July 2022, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ జూలై 2022 తెలుగులో
Telangana state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Telangana Government releases notification for Various posts through TSPSC like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations.To complement your preparation, we are providing you the Telangana State Current affairs In Telugu July 2022 .
తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను తెలుగులో అందిస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State Current affairs In Telugu, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో
1. ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్
టెక్నాలజీ హబ్‌గా మారిన హైదరాబాద్ ఏరోస్పేస్ వ్యాలీగా కూడా ఎదుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర సర్కారు పెద్దపీట వేస్తోంద న్నారు. జీఎంఆర్ హైదరాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లో ఫ్రాన్స్‌కు చెందిన విమాన రంగ ఉత్పత్తుల సంస్థ శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఫెసిలిటీ కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
వైమానిక రంగంలోని నిర్వహణ, మరమ్మతుల రంగంలో కేవలం దేశంలోనే కాకుండా మధ్యప్రాచ్య దేశాలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాఫ్రాన్ సంస్థ ప్రారంభించ బోయే నిర్వహణ, మరమ్మతుల కేంద్రం (ఎంఆర్‌ఓ) అంతర్జాతీయంగా హైదరాబాద్‌ను మరో స్థానానికి తీసుకెళ్తుందని కేటీఆర్ చెప్పారు.
2. పవర్ గ్రిడ్ ఈడీగా రాజేశ్ శ్రీవాత్సవ నియమితులయ్యారు
పవర్ గ్రిడ్ సదరన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాజేష్ శ్రీవాత్సవ నియమితులయ్యారు. ఆయన తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. 1984లో ఆయన ఎన్టీపీసీలో చేరారు. ఆ తర్వాత 1991 వరకు సీనియర్ ఇంజనీర్‌గా పని చేశారు. ట్రాన్స్‌మిషన్, లైన్స్, ప్రాజెక్ట్స్ విభాగాల్లో ఆయన 34 ఏళ్ల పాటు సేవలు అందించారు. సదరన్ సీజీఎంగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీగా నియమితులవడంపై సహోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
3. హైదరాబాద్‌కు మరో దిగ్గజం.. 1,200 కోట్ల పెట్టుబడి.. 1,000 ఉద్యోగాలు
రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ రూ.1200 కోట్లతో తన కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైమానిక రంగానికి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్‌ఓ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. భారత్‌లో తన తొలి ఎంఆర్‌ఓ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చిన శాఫ్రాన్ నిర్ణయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి స్వాగతించారు. మన దేశంలో ఒక విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనన్నారు. శాఫ్రాన్ ఎంఆర్‌ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. శాఫ్రాన్ అతిపెద్ద నిర్వహణ కేంద్రం హైదరాబాద్‌లోనే రాబోతుందన్నారు.
4. దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్
రామగుండం (ఎన్టీపీసీ)లో ఏర్పాటు చేసిన భారతదేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) సౌర విద్యుత్ ప్లాంట్ నుంచి పూర్తి సామర్థ్యంతో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటికే 80 మెగావాట్ల మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తాజాగా మిగిలిన 20 మెగావాట్ల పనులను కూడా పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించారు.
ఇక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసే జలాశయం (500 ఎకరాల విస్తీర్ణం)పై రూ.423 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. బీహెచ్‌ఈఎల్ ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. సాధారణంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా భూమి అవసరం అవుతుంది. ఫ్లోటింగ్ ప్లాంట్ల ఏర్పాటుతో పెద్ద మొత్తంలో భూసేకరణ ఖర్చు తగ్గుతుంది.
5. సులభతర వాణిజ్యంలో తెలంగాణకు అగ్రస్థానం
సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ) ర్యాంకుల్లో 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలకు శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐ ఐటీ) ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను గురువారం వెల్లడించింది. గతంలో ఉన్న ర్యాంకుల విధానానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది రాష్ట్రాలను టాప్ అఛీవర్స్, అఛీవర్స్, అస్పైరర్స్, ఎమర్జింగ్ ఇకో సిస్టమ్స్ అనే 4 కేటగిరీ లుగా విభజించింది.
అయితే టాప్ అఛీవర్స్ జాబితాలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరి యాణా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. బిజినెస్ రిఫారమ్స్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా 301 అంశాల్లో సంస్కరణలు చేపట్టాలని డీపీఐఐటీ ఆదే శించింది. అందులో భాగంగా తెలంగాణ 301 అంశాల్లోనూ సంస్క రణలు చేపట్టి నూటికి నూరు శాతం మార్కులు సాధించింది.
6. పొంటాక్‌తో టీ–హబ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది
సాంకేతిక ఆధారిత స్టార్టప్‌లకు ఊతమివ్వడం ద్వారా దేశంలోని ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహమిచ్చేందుకు ‘టీ–హబ్’మరో కీలక అడుగు ముందుకేసింది. బ్రిటన్, అమెరికా, భారత్, కెనడాలో ఆవిష్కరణల నిధిని సమకూర్చడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పొంటాక్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. టీ–హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, పొంటాక్ మేనేజింగ్ పార్ట్‌నర్ ప్రేమ్ పార్థసారథి ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు.
ఏడాది పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా టీ–హబ్ కొత్త భవన్‌లో పొంటాక్ నూతన శాఖ ఏర్పాటుకు వీలుగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. టీ–హబ్‌లో పురుడు పోసుకునే స్టార్టప్‌లను యూకే మార్కెట్‌తో అనుసంధానం చేసేందుకు వీలుగా పొంటాక్ టీ–హబ్‌తో కలిసి నిధులు సమకూరుస్తుంది. యూకే, భారత్‌లో స్టార్టప్‌లు మరింత వృద్ధి, మరిన్ని నిధులకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని శ్రీనివాస్‌రావు తెలిపారు.
7. తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ నవీన్ రావు నియమితులయ్యారు
తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ నవీన్ రావు నియమితుల య్యారు. హైకోర్టు సూచనల మేరకు గవర్నర్ ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. గతంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూ యాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూ ర్తిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానంలో జస్టిస్ నవీన్‌రావును నియమించారు.
8. ఐఐసీటీ శాస్త్రవేత్తలకు అరుదైన గుర్తింపు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఆర్‌ఎస్‌ఐ) నుంచి అరుదైన గుర్తింపు లభించింది. దేశవ్యా ప్తంగా రసాయన శాస్త్ర పరిశోధనలు చేస్తున్న 30 మంది శాస్త్రవేత్తలను కాంస్య పతకాలకు ఎంపిక చేయగా అందులో ఐఐసీటీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్‌లుగా పనిచేస్తున్న డాక్టర్ ప్రథమ ఎస్.మైన్‌కర్, డాక్టర్ దేబేంద్ర కె.మహాపాత్ర, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డికి దర్శన్ రంగనాథన్ స్మారక ఉపన్యాసకుడిగా గుర్తింపు లభించింది. మొహాలీలో ఇటీవల జరిగిన 29వ సీఆర్‌ఎస్‌ఐ జాతీయ సదస్సులో ఈ అవార్డులను అందజేశారు. మెడిసినల్ కెమిస్ట్రీ, కృత్రిమ సేంద్రియ రసాయన శాస్త్రం, కొత్త మందుల ఆవిష్కరణ వంటి రంగాల్లో డాక్టర్ ప్రథమ పరిశోధనలు చేస్తుండగా వైద్యానికి కీలకమైన సంక్లిష్టమైన సహజ రసాయనాలు గుర్తించేందుకు డాక్టర్ దేబేంద్ర కృషి చేస్తున్నారు. ఫార్మా రంగంతోపాటు సీఎస్‌ఐఆర్ వ్యవస్థలోనూ అనుభవం గడించిన డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి సేంద్రియ, మెడిసినల్ రసాయన శాస్త్ర రంగాలను మానవ సంక్షేమానికి వర్తించే దిశగా కృషి చేస్తున్నారు.
9. చుక్కా రామయ్యకు జీవిత సాఫల్య పురస్కారం
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు తెలంగాణ వేదిక్ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందచేశారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా దీక్షితులు కళావేదికపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు అవార్డును అందచేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ చుక్కా రామయ్య గణితశాస్త్రానికే ప్రతిరూపం లాంటి వారని, ఆయన తెలుగు రాష్ట్రాలలో ఐఐటీని ఇంటింటికీ తీసుకెళ్లారని కొనియాడారు.
అవార్డుల స్థాయి కన్నా ఎత్తుకు ఎదిగిన రామయ్య నుంచి లెక్కలు మాత్రమే కాదు జీవితం సక్రమంగా నడిచే లెక్కలు కూడా నేర్చుకోవాలన్నారు. త్వరిత గణిత విధానంలో రికార్డు సాధించిన సాయి కిరణ్ సారథ్యంలో ఉన్నత ప్రతిభ చూపిన చంద్రయ్య, నరసింహారావులకు గణిత రత్న అవార్డు బహూకరించారు. బాల సాహిత్య రచయిత చొక్కాపు రమణ అధ్యక్షత వహించారు.
10. శంషాబాద్‌లో విడిభాగాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఫ్రాన్స్‌కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ శాఫ్రాన్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే విమాన నిర్వహణ, మరమ్మతుల కేంద్రం (ఎంఆర్‌వో) ప్రపంచంలోనే అతిపెద్దదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ కేంద్రం 2025 నాటికి సిద్ధమవుతుందన్నారు. మధ్య ప్రాచ్య దేశాలు, దక్షిణ ఆసియా దేశాల నుంచి కూడా విమానాలు మరమ్మతులకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆ సంస్థ తెలంగాణలో వరసగా పెడుతున్న మూడో అతిపెద్ద పెట్టుబడి ఇదని అన్నారు. మన దేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి ఎంఆర్‌వో కేంద్రం ఇదేనని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోస్పేస్‌లో కొత్తగా నిర్మించిన శాఫ్రాన్ విమాన ఇంజిన్ల విడిభాగాల అధునాతన ఉత్పత్తి కేంద్రాన్ని, సమీపంలో ఉన్న శాఫ్రాన్ ఎలక్ట్రికల్, పవర్ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2020 నుంచి తాను, తమ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయని ఆయన అన్నారు.
11. తెలంగాణలో ఒకే రోజు 53 సంస్థలతో ఒప్పందాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజే 53 కార్పొరేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొంది. రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య, విజ్ఞాన సంస్థ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్ – టాస్క్) పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో టీహబ్ 2.0లో ఈ ఒప్పందాలు జరిగాయి. టాస్క్ చరిత్రలో ఇది మైలు రాయి అని, యువతకు ఉపాధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పురోగమిస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. 26 కొత్త సంస్థలతో ఒప్పందాలు, 27 పాత సంస్థలతో పునరుద్ధరణపై టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు, భారత్ ఫోర్జ్, కల్యాణి రాఫెల్ 24/7, హెటిరో, హైసియా, ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్, వాహన్, విడాల్, రుబికాన్, హెడ్ హెల్డ్ హైలు ఉన్నాయి.
12. ఆవిష్కరణల్లో తెలంగాణ అ‘ద్వితీయం’!
నీతి ఆయోగ్ ప్రకటించిన ‘ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్–2021 (భారత ఆవిష్కరణల సూచీ– 2021)’ మూడో ఎడిషన్ ర్యాంకుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏడు అంశాల్లో 66 సూచికల ఆధారంగా రాష్ట్రాల పనితీరును ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీ టివ్‌నెస్ (ఐఎఫ్‌సీ) సహకారంతో నీతి ఆయోగ్ అధ్యయనం చేసి ‘గ్లోబల్ ఇండియన్ ఇండెక్స్ (జీఐఐ)’ స్కోర్‌ను కేటాయించింది. నివేదికను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ ఆవిష్కరించారు.
పెర్ఫార్మర్స్‌లో టాప్
ఏడు అంశాల ఆధారంగా మొత్తం స్కోర్ కేటాయించగా ఇందులో ఐదింటి ఆధారంగా పెర్ఫార్మర్స్ (అద్భుత పనితీరు చూపినవారు)గా, మరో రెండింటి ఆధారంగా ఎనేబులర్స్ (సాధించినవారు)గా గుర్తించారు. పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య–పర్వత ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లకు వేర్వేరుగా స్కోర్‌ను కేటాయించారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో 17.66 సగటు స్కోర్‌తో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో కర్ణాటక (18.01), మూడోస్థానంలో హరియాణా ఉన్నాయి. ఇక కేటగిరీల వారీగా చూస్తే పెర్ఫార్మర్స్ కేటగిరీలో 15.24 స్కోర్‌తో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా ఎనేబులర్స్ కేటగిరీలో 20.08 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచింది.
13. మహిళల కోసం ప్రత్యేక ‘లీగల్ సెల్’
మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేకంగా లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్ సెల్‌ను జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు.
మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ లీగల్ సెల్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని రేఖా శర్మ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత న్యాయ సలహాలు, సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. మహిళలకు చట్టపరమైన సహాయం కోసం ఈ సెల్ వన్–స్టాప్ సెంటర్‌గా పనిచేస్తుందని సునీతాలక్ష్మారెడ్డి వివరించారు. అలాగే మహిళలకు సహాయంగా ఉండేందుకు ప్రారంభించిన వాట్సాప్ హెల్ప్ లైన్ 9490555533, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహిళా కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులు గురించి తెలియజేశారు.
14. సులభతర వాణిజ్యంలో తెలంగాణకు అగ్రస్థానం
సులభతర వాణిజ్య విధానం(ఈవోడీబీ) ర్యాంకుల్లో 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను వెల్లడించింది. గతంలో ఉన్న ర్యాంకుల విధానానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది రాష్ట్రాలను టాప్ అచీవర్స్, అచీవర్స్, అస్పైరర్స్, ఎమర్జింగ్ ఇకో సిస్టమ్స్ అనే 4 కేటగిరీలుగా విభజించింది. టాప్ అచీవర్స్ జాబితాలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి.
15. హైదరాబాద్ ఐఐటీ కి జాతీయ ర్యాంకు
దేశంలోని ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో నిలిచి హైదరాబాద్ ఐఐటీ మరోసారి సత్తా చాటింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో విడుదల చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకుల్లో హైదరాబాద్ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు జాతీయ ర్యాంకులు సాధించాయి.
అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ(హెచ్) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్ లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఐఐటీ(హెచ్) టాప్–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. దేశంలోకెల్లా ఉత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ తొలిస్థానంలో నిలిచి వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది.
జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓవరాల్ విభాగంలో 20వ ర్యాంకు, రీసెర్చ్‌లో 27వ ర్యాంకు సాధించింది. వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా వర్సిటీ 22వ ర్యాంకు పొందింది. ఓవరాల్ ర్యాంకుల విభాగంలో 46వ స్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలోవరంగల్ ఎన్‌ఐటీ 21 ర్యాంకు ఓవరాల్ విభాగంలో 45వ ర్యాంకు పొందింది.
ఇంజనీరింగ్ విద్యలో జేఎన్‌టీయూ (హైదరాబాద్)కు జాతీయస్థాయిలో 76వ ర్యాంకు దక్కింది. కాగా, ప్రతిభగల విద్యా ర్థులు, సమర్థులైన అధ్యాపకుల కృషివల్లే ఐఐటీ (హెచ్) దినదినాభివృద్ధి చెందుతోందని సంస్థ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు. వివిధ విభాగాల్లో ఓయూ ర్యాంకులు సాధించడంపై వర్సిటీ వీసీ రవీందర్ హర్షం వ్యక్తం చేశారు.
16. హైదరాబాద్ రైల్వేస్టేషన్లో ‘ఆజాదీకీ రైల్ గాడీ’
పలువురు స్వాతంత్య్ర సమరయోధులు హైదరాబాద్ రైల్వే స్టేషన్లో నాటి పోరాట సన్నివేశాలను వివరిస్తూ అందరిలో జాతీయ భావాన్ని నింపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ద.మ.రైల్వే ఏర్పాటు చేసిన ‘ఆజాదీకీ రైల్ గాడీ, ఔర్ స్టేషన్’ కార్యక్రమంలో సమరయోధులు కె.చంద్రప్రకాశ్‌రావు, పి.మోహన్‌రావు, జి.గాలయ్యలు పాల్గొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంతో మమేకమై నేటికీ రైల్వేలో సేవలందిస్తున్న ఆనాటి ఏపీ ఎక్స్‌ప్రెస్, ప్రస్తుత తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలును హైదరాబాద్ స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఆజాదీకీ రైల్ గాడీగా పేరొందిన తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (నెం.12723) రైలును ఈ సందర్భంగా అందంగా తీర్చిదిద్దారు.
17. తెలంగాణలో మరో 13 మండలాలు ఏర్పాటు
తొమ్మిది జిల్లాల్లో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక ప్రజావసరాల మేరకు మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 594 మండలాలుండగా, కొత్త వాటితో కలిపి మొత్తం సంఖ్య 607కి చేరనుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.
జిల్లా కొత్త మండలాలు
నల్గొండ గట్టుప్పల్
నారాయణపేట గుండుమల్, కొత్తపల్లె
వికారాబాద్ దుడ్యాల్
మహబూబ్‌నగర్ కౌకుంట్ల
నిజామాబాద్ ఆలూర్, డొంకేశ్వర్, సాలూర
మహబూబాబాద్ సీరోల్
సంగారెడ్డి నిజాంపేట్
కామారెడ్డి డోంగ్లి
జగిత్యాల ఎండపల్లి, భీమారం
18. తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి జాబితా పంపింది. ఇందులో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజ శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు ఉన్నారు. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఈ హైకోర్టులో ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొలీజియం సిఫార్సు చేసిన ఈ ఆరుగురి నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఖాళీల సంఖ్య 9కి తగ్గుతుంది. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణతో పాటు హిమాచల్‌ప్రదేశ్ (2), ఒడిశా (3), గువాహటి (2), కోల్‌కతా (9), పంజాబ్, హరియాణా (13) హైకోర్టులకు కలిపి మొత్తం 35 మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. జులై 19వ తేదీన కర్ణాటక హైకోర్టు (5), అలహాబాద్ హైకోర్టు (9), 20న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (7)కు చేసిన సిఫార్సులను కూడా కలిపితే గత అయిదు రోజుల్లో 9 హైకోర్టులకు 56 పేర్లను సిఫార్సు చేసినట్లయింది.
19. వేసెక్టమీలో దేశంలోనే రాష్ట్రానికి రెండో స్థానం
పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వేసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్‌గఢ్ మొదటిస్థానంలో ఉంది. దీంతోపాటు వ్యక్తిగత జాబితాలో అత్యధిక సర్జరీలు చేసినందుకు హనుమకొండ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ యాకూబ్‌పాషాకు కేంద్రం ప్రత్యేక అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వేసెక్టమీ సర్జరీలు జరగగా, డాక్టర్ యాకూబ్‌పాషా తన 22 ఏళ్ల సర్వీసులో 40 వేలకు పైగా సర్జరీలు నిర్వహించారు.
తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ‘నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ సమ్మిట్–2022’లో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు అవార్డు అందుకున్నారు.
20. తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్లు.. తమిళనాడు టాప్
‘స్టేట్ ఫైనాన్స్‌లు 2021–22 బడ్జెట్‌ల అధ్యయనం’పేరుతో రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పుల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో బీజేపీ ఎంపీ కిషన్‌కపూర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు కాగా, ఏపీ అప్పు రూ.3,98,903 కోట్లుగా ఉందని తెలిపారు.
తమిళనాడు రూ.6,59,868 కోట్లతో మొదటిస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రాల రుణాలను ఆమోదించేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ద్వారా నిర్దేశించిన ఆర్థిక పరిమితులను అనుసరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సాధారణ నికర రుణ సీలింగ్(ఎన్బీసీ)ను కేంద్రం నిర్ణయిస్తుందని, క్రితం సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలను తదుపరి సంవత్సరంలోని రుణ పరిమితులలో సర్దుబాటు చేస్తారని పేర్కొన్నారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |