Telugu govt jobs   »   Current Affairs   »   Telangana State Current affairs In Telugu...

Telangana State Current Affairs In Telugu September 2022 | తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2022 తెలుగులో 

Telangana State Current affairs In Telugu September 2022, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2022 తెలుగులో

Telangana state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Telangana Government releases notification for Various posts through TSPSC like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations.To complement your preparation, we are providing you the Telangana State Current affairs In Telugu September 2022 .

తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను తెలుగులో అందిస్తున్నాము.

Telangana State Current Affairs In Telugu July 2022 |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State Current affairs In Telugu, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో

1. NABARD తెలంగాణ సీజీఎంగా సుశీల

NABARD CGM
NABARD CGM

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రి కల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డు) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా సుశీల చింతల నియమితులయ్యారు.  తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ ప్రాంతీయ కార్యా లయాల్లో పని చేశారు.

తమిళనాడులో పని చేసిన సమయంలో ఆ రాష్ట్ర ఉమెన్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బోర్డులోనూ సుశీల ఉన్నారు. నాబార్డ్‌ మద్దతు ఇచ్చే ఇంక్యుబేషన్‌ సెంటర్లతోపాటు అగ్రి స్టార్టప్‌లతో చురుకుగా పనిచేసిన ఆమెకు.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు, క్రెడిట్‌ ప్లానింగ్, పర్యవేక్షణ, ఫైనాన్స్, మైక్రో క్రెడిట్, సహకార సంఘాలు, ఆర్‌ఆర్‌బీల పర్యవేక్షణలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉంది.

2. బుద్ధవనంలో రూ.100 కోట్ల పెట్టుబడులు

100 crore investments in Buddhavanam
100 crore investments in Buddhavanam

నాగార్జునసాగర్‌ తీరంలో నిర్మించిన బుద్ధవనంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌ దేశానికి చెందిన సంస్థ ముందు కొచ్చింది. దీంతోపాటు బెంగళూరుకు చెందిన మరో సంస్థ కూడా పెట్టుబడులకు సిద్ధమని ప్రకటించింది.

ఈ రెండు సంస్థలు కలిసి రూ. 100 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. బుద్ధవనంలో తమకు 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే రూ.75 కోట్లతో అక్కడ బౌద్ధస్తూపం, ఆరామం, ధ్యానమందిరం, ఆధ్యాత్మిక విద్యాకేంద్రం, బౌద్ధ భిక్షువుల శిక్షణ కేంద్రం, ఆచార్య నాగార్జునుడికి సంబంధించిన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తైవాన్‌కు చెందిన ఫొగంగ్‌షాన్‌ సంస్థ ప్రకటించింది. ఇక బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మహాబోధి సొసైటీ..పదెకరాల స్థలా న్ని కేటాయిస్తే రూ.25 కోట్లతో బౌద్ధస్తూపం, ఆరామం, గ్రంథాలయం, భిక్షు శిక్షణాలయం, ధ్యానమందిరాలను నిర్మించనున్నట్లు వెల్లడించింది.

3. రీజినల్‌ రింగ్‌ రోడ్డు (RRR) దక్షిణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Regional Ring Road hyderabad
Regional Ring Road hyderabad

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
హైదరాబాద్‌కు చుట్టూ 60, 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతోపాటు భూసేకరణ, ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి. తాజాగా దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ‘ఇంటర్‌ కాంటినెంటల్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ టెక్నోక్రాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’కు కన్సల్టెన్సీగా బాధ్యతలు అప్పగిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆదేశాలు జారీ చేసింది. రీజినల్‌ రింగ్‌ రోడ్డులోని ప్రతిపాదిత 182 కిలోమీటర్ల పొడవైన దక్షిణ భాగానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపాందించాల్సిందిగా తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ ఆ సంస్థను ఆదేశించింది. త్వరలో కన్సల్టెన్సీ సంస్థ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించి, అలైన్‌మెంట్‌ తయారీ కసరత్తు ప్రారంభించబోతోంది. దీనితో మొత్తంగా ప్రతిష్టాత్మక రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించేందుకు మార్గం సుగమమైంది.

హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపగా గతంలో ఓ కన్సల్టెన్సీతో తాత్కాలిక అలైన్‌మెంట్‌ను రూపొందించారు. మొత్తంగా 342 కిలోమీటర్ల పొడవుతో రింగ్‌ రోడ్డు ఉంటుందని అందులో ఉత్తర భాగం 160 కిలోమీటర్ల మేర.. దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం తొలుత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దానికి నాగ్‌పూర్‌ కేంద్రంగా పనిచేసే కే అండ్‌ జే సంస్థను కన్సల్టెన్సీగా నియమించగా.. ఆ సంస్థ సర్వే చేసి ఉత్తర భాగం పొడవును 158.62 కిలోమీటర్లుగా ఖరారు చేసింది.

TSPSC General Studies
TSPSC General Studies

4. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు

Telangana Secretariat
Telangana Secretariat

కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు.సచివాలయానికి అంబేద్కర్‌ నామకరణం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు.
అంబేద్కర్‌ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికి ఆదర్శమని కొనియాడారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు. అలాగే పార్లమెంట్‌ కొత్త భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు.

5. మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీఎంఈల వయోపరిమితి 65 ఏళ్లకు పెంపు

Age limit of principals of medical colleges and DMEs
Age limit of principals of medical colleges and DMEs

మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల మాదిరిగానే ప్రిన్సిపాళ్లు, వైద్యవిద్యా సంచాలకులు, అదనపు సంచాలకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ చేసిన సవరణ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

సెప్టెంబర్ 13న మంత్రి హరీశ్‌ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ(పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. హరీశ్‌ మాట్లాడుతూ గతంలో వైద్య విద్య లో పనిచేసే అధ్యాపకుల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచామన్నారు. ప్రొఫెసర్ల నుంచే మెడికల్‌ కాలేజీలకు ప్రిన్సిపాళ్లుగా, వైద్య విద్య డైరెక్టర్, అడిషనల్‌ డైరెక్టర్లుగా నియమిస్తున్నా, వారి వయో పరిమితిని పెంచలేదన్నారు. ఇప్పుడు సవరణ ప్రతిపాదించామని చెప్పారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) కూడా 70 ఏళ్ల వరకు పెంచుకోవచ్చని చెప్పిందన్నారు.

6. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

Telangana National Integration Day
Telangana National Integration Day

తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఏటా సెప్టెంబర్  17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ప్రకటించారు.

ఈ మేరకు సెప్టెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేశారు. 2022 సెప్టెంబర్  17 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతున్న శుభసందర్భంగా సెప్టెంబర్ 16 నుంచి 18వరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.

7. ఎనిమిది బిల్లులకు తెలంగాణ శాసనసభ, మండలి ఆమోదం

Telangana Legislature
Telangana Legislature

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి 8 బిల్లులకు ఆమోదం తెలిపాయి. అందులో ఆరు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు గత ఏప్రిల్‌ 12న రాష్ట్ర మంత్రి మండలి అంగీకారం తెలపగా, తాజాగా అసెంబ్లీలో మాత్రం ప్రభుత్వం 5 విశ్వవిద్యాలయాలకే బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం, గురునానక్, ఎంఎన్‌ఆర్, అమిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌(ఇక్మార్‌) విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి రెండు ప్రధాన అంశాలపై రూపొందించిన తీర్మానాలను రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించాయి. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను వ్యతిరేకిస్తూ ప్రతిపాదించిన ఒక తీర్మానాన్ని, నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలనే మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రెండింటికీ ఆమోదం లభించింది. విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో, మండలిలో మంత్రి జగదీశ్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. పార్లమెంట్‌ నూతన భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, నిబంధనల ప్రకారమే పంజాగుట్టలో విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చింది. 125 అడుగుల విగ్రహాన్ని ఐమాక్స్‌ పక్కనే కడుతున్నాం. జనవరిలోగా దాన్ని ఆవిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అనంతరం తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. మండలిలో మంత్రి సత్యవతి రాథోడ్, పార్లమెంట్‌ నూతన భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న తీర్మానాన్ని ప్రతిపాదించారు.

8. అసెంబ్లీలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Telangana Legislature
Telangana Legislature

తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రే కులపతి (ఛాన్స్‌లర్‌)గా వ్యవహరించనున్నారు. సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఉన్న ఫారెస్ట్‌ కళాశాలను వర్సిటీగా మారుస్తామని గత మార్చిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్సిటీకి ప్రత్యేక చట్టం చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బాసరలోని ఆర్‌జీయూకేటీకి మాత్రమే విద్యారంగ నిపుణుడు కులపతిగా ఉన్నారు. మిగిలిన అన్ని వర్సిటీలకు గవర్నర్‌ కులపతిగా వ్యవహరిస్తున్నారు. తొలిసారిగా అటవీ వర్సిటీకి సీఎం ఛాన్స్‌లర్‌ కాబోతున్నారు. ఈ మేరకు బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో బోధన, బోధనేతర నియామకాలను చేపట్టేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు (టీయూసీఆర్‌బీ) – 2022 బిల్లు సహా మొత్తం ఏడు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు – 2022, ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంతం రద్దు, మున్సిపల్‌ చట్టాల సవరణ, బోధనాసుపత్రుల వైద్య నిపుణుల వయో పరిమితి పెంపు, తెలంగాణ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లులను ఆయా మంత్రులు ప్రవేశపెట్టారు.

9. వైద్య సలహామండలిలో తెలంగాణకు స్థానం

జాతీయ వైద్య కమిషన్‌లోని సెక్షన్‌ 11(2)(సీ) ప్రకారం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన వైద్య సలహామండలి (మెడికల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌)లో తెలంగాణకు స్థానం లభించింది. ఇందులో కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రతినిధి డాక్టర్‌ వి.రాజలింగ్‌లను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సభ్యులుగా నియమించింది.

adda247

10. హైదరాబాద్‌లో ఏడో జాతీయ డిజిటల్‌ పరివర్తన సదస్సు

7th National Digital Transformation Conference
7th National Digital Transformation Conference

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పలువురు వక్తలు తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఏడో జాతీయ పరివర్తన సదస్సు జరిగింది. దీనికి ఒడిశా మంత్రి తుషారకాంతి బెహరా, తెలంగాణ నవీన సాంకేతిక విభాగం సంచాలకురాలు రమాదేవి, హెచ్‌పీఈ సంస్థ కంట్రీ మేనేజర్‌ మయాంక్‌ చతుర్వేది, అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ వాణిజ్య విభాగాధిపతి అజయ్‌కౌల్‌లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ మున్ముందు డిజిటల్‌ రంగం అద్భుతాలను సాధిస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణలో డిజిటల్‌ రంగంలో సాధించిన ప్రగతిని రమాదేవి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

11. రైతు బీమాకు రూ. 1,450 కోట్లు,  ఒక్కో రైతుకు రూ.3,830  చెల్లింపు

Rythu Bima
Rythu Bima

ఈ ఏడాదికి సంబంధించిన రైతు బీమా ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఒక్కో రైతుకు రూ.3,830 చొప్పున మొత్తం రూ.1,450 కోట్లు చెల్లించింది.

గతేడాది కంటే ఎక్కువగా రైతులు ఈ పథకం కింద నమోదు అయ్యారు. గతేడాది 35.64 లక్షల మంది లబి్ధదారులు ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 37.77 లక్షలకు చేరినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అంటే అదనంగా 2.13 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు.

2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. బీమా పరిధిలోని రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబాలకు (నామినీ) పరిహారంగా ఎల్‌ఐసీ రూ.5 లక్షలు అందజేస్తుంది.

12. దళితబంధు 600కోట్లు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు

dalit bandu
dalit bandu

ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన ఎస్సీ కార్పొరేషన్‌, ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.

హుజూరాబాద్‌తో ప్రారంభం

దళితబంధు పథకం ఇప్పటివరకు నాలుగు కేటగిరీల్లో అమలైంది. తొలుత కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో మొత్తం 18,211 కుటుంబాలను గుర్తించిన యంత్రాంగం.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులను జమ చేసింది.

APPSC Group-2 ACHIEVERS BATCH 2022 | Telugu | Complete Online Live Classes By Adda247

13. నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు తొలిసారి డ్రోన్‌తో మందుల సరఫరా

Drug delivery by drone
Drug delivery by drone

టీశా – మెడికార్ట్‌ అనే స్టార్టప్‌ కంపెనీ డ్రోన్‌ ద్వారా ఔషధాల సరఫరా ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌కు విజయవంతంగా చేరవేసింది. నిర్మల్‌ పట్టణంలో వైద్యుడు ప్రశాంత్‌ ఆ మందులను స్వీకరించారు. నిజామాబాద్‌ నుంచి నిర్మల్‌ దాదాపు 70 కి.మీ. దూరంలో ఉంది. డ్రోన్‌తో అరగంట కన్నా తక్కువ సమయంలోనే ఔషధాలు నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నాయి. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా డ్రోన్‌ ఎక్కడకు చేరుకోవాలో, ఎలా చేరుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారు. భూమికి 400 అడుగుల పైన గాలిలో ప్రయాణించే ఈ డ్రోన్‌ చేరుకోవాల్సిన ప్రదేశంలో క్యూఆర్‌ కోడ్‌ను అతికిస్తారు. 60 మీటర్ల దూరం నుంచే ఆ క్యూఆర్‌ కోడ్‌ను రీడ్‌ చేసి డ్రోన్‌ అక్కడ దిగుతుంది. ఈ విధానంలో 20 కిలోల వరకూ మందులను సరఫరా చేసేందుకు అవకాశమున్నట్లు వైద్యుడు ప్రశాంత్‌ తెలిపారు.

14. తెలంగాణలో కొత్తగా మరో 13 మండలాలు

13 new mandals in Telangana
13 new mandals in Telangana

 

రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. గతంలోనే వీటికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అయింది. తాజాగా ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్‌ 3) ప్రకారం ఈ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సెప్టెంబర్ 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మండలాలన్నీ సెప్టెంబర్‌ 26, 2022 నుంచి ఉనికిలోకి వస్తాయి. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫైనల్‌ గెజిట్‌లో పేర్కొంటున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. జగిత్యాల, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ కొత్త మండలాలను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే 607 మండలాలు ఉండగా, ఇప్పుడు మరో 13 కొత్తగా ఏర్పాటు కావడంతో రెవెన్యూ మండలాల సంఖ్య 620కి చేరింది.

15. ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మరోసారి హరీశ్‌రావు

the President of the Exhibition Society
the President of the Exhibition Society

ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా 2వ సారి ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్‌రావు, ఉపాధ్యక్షుడిగా అశ్వినీ మార్గం, కార్యదర్శిగా సాయినాథ్‌ దయాకర్‌ శాస్త్రి, సంయుక్త కార్యదర్శి వనం సురేందర్, కోశాధికారిగా పాపయ్య చక్రవర్తితోపాటు మరో ఏడుగురు మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా నామినేషన్‌ దాఖలు చేయగా, పోటీగా మరెవ్వరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. కొత్త కమిటీని 30న ఎగ్జిబిషన్‌ సొసైటీ అధికారికంగా ప్రకటించనుంది.

16. మెదక్ నుంచి తొలి ప్యాసింజర్ రైలు ప్రారంభం

First passenger train starts from Medak
First passenger train starts from Medak

మెదక్‌ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సెప్టెంబర్ 23న మెదక్‌లో రైలు కూత వినిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మెదక్‌–అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ మధ్య నూతన రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తూ మెదక్‌ నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్‌ రైలును మెదక్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

  • మెదక్‌–అక్కన్నపేట వరకు 17.2 కిలోమీటర్ల రైల్వేలైన్‌ కోసం రూ.205 కోట్లు వ్యయమైందన్నారు.
  • మెదక్‌ నుంచి రెండు ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌–ముంబై ట్రాక్‌కు కనెక్ట్‌ చేస్తారని చెప్పారు.

adda247

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana State Current Affairs In Telugu September 2022_23.1