Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...
Top Performing

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 06 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 04 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. ఈ క్రిందివానిలో సరైనది కానిది ఏది?

  1. వావిలాల గోపాల కృష్ణయ్య విశాలాంధ్ర పుస్తకాన్ని (1940) రాశారు
  2. మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్‌లో 1950లో జరిగింది
  3. అయ్యదేవర కాళేశ్వరరావు గుంటూరులో ఒక సభను నిర్వహించి (1949) విశాలాంధ్ర మహాసభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు
  4. 1937లో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఆంధ్ర యూనివర్సిటీ వార్షికోత్సవ సంచికలో ఒక వ్యాసం రాశారు

 

Q2. ఈ క్రింది వానిలో సరికానిది ఏది?

(a) తెలంగాణ తిరుపతి-జమలాపురం

(b) పేదవాడి తిరుపతి – కనుమర్తి వేంకటేశ్వర స్వామి దేవాలయం

(c) తెలంగాణ మైసూర్‌- కొల్లాపూర్‌

(d) సిల్క్ సిటీ ఆఫ్‌ ఇండియా- గద్వాల్‌

 

Q3. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉర్దూ ఎన్ని సంవత్సరాలు అధికార భాషగా ఉండాలి

(a) మొదటి 10 సంవత్సరాలు

(b) మొదటి 20 సంవత్సరాలు

(c) మొదటి 5 సంవత్సరాలు 

(d) మొదటి 15 సంవత్సరాలు

 

Q4. ప్రతిపాదన (A):  తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలలో తమ పెట్టుబడులకు భద్రత ఉందని ఆంధ్రప్రాంతం వారు భావించారు.

కారణము (R) : 1972 అక్టోబరు 3 న సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆంధ్ర పెట్టుబడిదారులు జై ఆంధ్ర ఉద్యమంను లేవదీసి తెలంగాణకు ఉన్న ప్రత్యేక రక్షణలను పూర్తిగా తొలిగించి వేశారు.

సమాధానం :

(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

 

Q5. ప్రథమ వార్షికోత్సవ సభ కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?

  1. 2003 ఏప్రిల్ 27న టి.ఆర్.ఎస్. ప్రథమ వార్షికోత్సవ సభ నల్గొండలో జరిగింది.
  2. ఈ వార్షికోత్సవ సభకు హాజరైన నాయకులు: శిబూసోరెన్, అజిత్సింగ్, భీంసింగ్
  3. వాస్తవానికి 1990 వ దశకం చివరిభాగంలో ప్రత్యేక తెలంగాణ భావనను విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, పట్టణ మధ్యతరగతి వర్గాలు ఒక మేధోపరమైన భావనగా రూపకల్పన చేశాయి. 

(a) 1 మాత్రమే

(b) 2 మరియు 3 

(c) 1 మరియు 2

(d) 1, 2, 3

 

Q6. కింది వాటిని జతపరుచుము

  1. వట్టికోట అళ్వారుస్వామి 1. వేగుచుక్కలు
  2. దేవులపల్లి రామానుజరావు 2. మాడపాటి వారి జీవితం
  3. వెల్దూర్తి మాణిక్యరావ్ 3. ప్రజల మనిషి
  4. గడియారం రామకృష్ణశర్మ 4. మాధ విద్యారణ్య

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 1, C – 2, D – 4

 (d) A – 4, B – 3, C – 2, D – 1

 

Q7. మౌంట్ బాటన్ తన పత్రికల వ్యవహారాల కార్యదర్శి అయిన ఆలెన్ క్యాంప్బల్ను హైదరాబాదు పంపి రెండు ప్రభుత్వాల మధ్య శాంతి నెలకొల్పుటకు ప్రయత్నించారు. క్యాంప్ బెల్ మరియు లాయక్ అలీల మధ్య ఈ క్రింది ఏ అంశాలపై చర్చ జరిగింది.

  1. హైదరాబాద్లో చట్టబద్ద లేని సాయుధదళాలలను రద్దు చేయాలి.
  2. విదేశాలకు రాజకీయ దూతలను పంపకూడదు. కానీ ఆర్థిక సంబంధాల కొరకు విదేశాలకు దూతలను పంపవచ్చు. 
  3. 1949, జనవరి 1 లోపు హైదరాబాద్ రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలి. 

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 

(c) 1 మరియు 2

(d) 1, 2, 3

 

Q8. తెలంగాణ ఉద్యమంలో సినీరంగం ఆర్టిస్టుల పాత్ర కూడా ఉంది. వారికి సంబంధించి కింది వాటిని జతపరుచుము.  

జాబితా – I జాబితా – II

  1. ఉదయకుమార్ 1. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్
  2. అల్లాణి శ్రీధర్ 2. తెలంగాణ ప్రొడ్యుసర్స్ అండ్ మినీ థియేటర్ ఓనర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ
  3. విజయేందర్ రెడ్డి 3. సినీరంగంలో తెలంగాణ హక్కుల పరిరక్షణ సమితి
  4. సానా యాదిరెడ్డి 4. తెలంగాణ సినిమా దర్శకుల సంఘం

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

 

Q9. నానముల్కీలపై ఇతను రాసిన కవిత: ‘మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి…నీ అంతిమ ప్రయాణానికి సిద్ధంగా ఉండు’.. ఈ కవితను రాసినందుకు అతనిని దూరప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. ఈ కవిత రాసింది ఎవరు?

  1. మహారాజా కిషన్ ప్రసాద్
  2. కాసర్ వాకర్
  3. పద్మజ నాయుడు
  4. అక్బర్ ఆలీఖాన్

 

Q10. సెప్టెంబర్ 13న హైదరాబాద్ రాజ్యంపై భారతప్రభుత్వం పోలీస్ చర్యను ప్రారంభించింది. ఈ పోలీస్ చర్యకి సంబంధించి కింది వాటిలో ఏది సరిగా జత కాలేదు.

  1.  కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సదరన్ కమాండ్  గా ఉన్న ఆఫీసర్  – మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి మేజర్
  2. హైదరాబాద్ పోలీస్ చర్యకు నేతృత్వం వహించినది – లెఫ్టినెంట్ జనరల్ మహరాజ్ సింగ్. 
  3. ఈ పోలీస్ చర్యకు షోలాపూర్ నుండి నేతృత్వం వహించినది –  జనరల్ ‘రుద్ర’  
  4. ఈ పోలీస్ చర్యకు విజయవాడ నుండి నేతృత్వం వహించినది – లెఫ్టినెంట్ జనరల్ ఇ.ఎన్. గోదార్

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) 1, 2, 3 & 4

Solutions:

S1. Ans(c)

Sol: 

  • వావిలాల గోపాల కృష్ణయ్య విశాలాంధ్ర పుస్తకాన్ని (1940) రాశారు
  • మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్‌లో 1950లో జరిగింది
  • 1937లో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఆంధ్ర యూనివర్సిటీ వార్షికోత్సవ సంచికలో ఒక వ్యాసం రాశారు

 

S2. Ans(d)

Sol: 

  • తెలంగాణ తిరుపతి-జమలాపురం
  • పేదవాడి తిరుపతి – కనుమర్తి వేంకటేశ్వర స్వామి దేవాలయం
  • తెలంగాణ మైసూర్‌- కొల్లాపూర్‌
  • సిల్క్ సిటీ ఆఫ్‌ ఇండియా- పోచంపల్లి

 

S3. Ans(c)

Sol: పెద్ద మనుషుల ఒప్పందం:

ఈ ఒప్పందం ఢిల్లీలోని హైద్రాబాద్ హౌజ్ (ప్రస్తుత ఆంధ్రభవన్)లో 1956 ఫిబ్రవరి 20న జరిగింది. ఈ ఒప్పందంనే పెద్దమనుషుల ఒప్పందం (లేదా) జెంటిల్మెన్ అగ్రిమెంట్ అందురు.

ఈ ఒప్పందంపై ఆంధ్రానుండి – నలుగురు నాయకులు. తెలంగాణా నుండి 4గురు నాయకులు సంతకం చేశారు.

పెద్ద మనుషుల ఒప్పందంలోని ఉర్దూ-దాని స్థానం:

భారత ప్రభుత్వం ప్రస్తుతం పాలనా, న్యాయవ్యవస్థల గల ఉర్దూ స్థానాన్ని రాబోయే ఐదు సంవత్సరాలపాటు పదిలంగా ఉంచేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా సూచనలిస్తుందిS1. Ans ()

 

S4. Ans(a)

Sol: 1969 ఉద్యమ అనంతర కాలంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది.తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు మరియు అవస్థాపన సౌకర్యాలను కూడా కేంద్ర ప్రభుత్వం విస్తృత పరిచింది. 1972 అక్టోబరు 3 న సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆంధ్ర పెట్టుబడిదారులు జై ఆంధ్ర ఉద్యమంను లేవదీసి తెలంగాణకు ఉన్న ప్రత్యేక రక్షణలను పూర్తిగా తొలిగించి వేశారు. దాంతో తెలంగాణ వారికి ప్రత్యేక రక్షణలు లేవు (తెలంగాణలో భూములు కొనాలంటే రీజినల్ కమిటీ అనుమతి అవసరం లేదు) కావున తమ పెట్టుబడులకు భద్రత ఉందని ఆంధ్రప్రాంతం వారు భావించారు. ఆంధ్రప్రాంత ఉన్నత వర్గాలు మాత్రం తెలంగాణ డిమాండ్ ఇక పూర్తిగా సమసిపోయిందని భావించారు.

 

S5. Ans(b)

Sol: ప్రథమ వార్షికోత్సవ సభ:

  • 2002 ఏప్రిల్ 27న టి.ఆర్.ఎస్. ప్రథమ వార్షికోత్సవ సభ నల్గొండలో జరిగింది.
  • ఈ వార్షికోత్సవ సభకు హాజరైన నాయకులు: శిబూసోరెన్, అజిత్సింగ్, భీంసింగ్
  • వాస్తవానికి 1990 వ దశకం చివరిభాగంలో ప్రత్యేక తెలంగాణ భావనను విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, పట్టణ మధ్యతరగతి వర్గాలు ఒక మేధోపరమైన భావనగా రూపకల్పన చేశాయి. 

 

S6. Ans(c)

Sol: 

  • వట్టికోట అళ్వారుస్వామి ప్రజల మనిషి
  • దేవులపల్లి రామానుజరావువేగుచుక్కలు 
  • వెల్దూర్తి మాణిక్యరావ్ మాడపాటి వారి జీవితం  
  • గడియారం రామకృష్ణశర్మమాధ విద్యారణ్య

 

S7. Ans (d)

Sol: మౌంట్ బాటన్ తన పత్రికల వ్యవహారాల కార్యదర్శి అయిన ఆలెన్ క్యాంప్బల్ను హైదరాబాదు పంపి రెండు ప్రభుత్వాల మధ్య శాంతి నెలకొల్పుటకు ప్రయత్నించారు. క్యాంప్ బెల్ మరియు లాయక్ అలీల మధ్య ఈ క్రింది అంశాలపై చర్చ జరిగింది.

  • హైదరాబాద్లో చట్టబద్ద లేని సాయుధదళాలలను రద్దు చేయాలి.
  • విదేశాలకు రాజకీయ దూతలను పంపకూడదు. కానీ ఆర్థిక సంబంధాల కొరకు విదేశాలకు దూతలను పంపవచ్చు. 
  • 1949, జనవరి 1 లోపు హైదరాబాద్ రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలి. 

 లాయక్అలీపై అంశాలను అంగీకరించినప్పటికి వాటిని అమలు చేయలేదు.

రజాకారు నాయకుడైన ఖాసీం రజ్వీ హైదరాబాద్లో ఉత్తేజభరితమైన ప్రసంగాలు చేస్తూ ఢిల్లీలోని ఎర్రకోటపై అసఫ్జాహీల పతాకాన్ని ఎగురవేస్తానని ప్రకటించాడు.

 

S8. Ans (c)

Sol: 

  • సినీరంగంలో తెలంగాణ హక్కుల పరిరక్షణ సమితిని 1999లో ఉదయకుమార్ ప్రారంభించారు. దీనికి గౌరవ సలహాదారులుగా వి. ప్రకాశ్ గారున్నారు.
  • 2013లో అల్లాణి శ్రీధర్ అధ్యక్షునిగా ‘తెలంగాణ సినిమా దర్శకుల సంఘం’ ఏర్పాటయింది. 
  • విజయేందర్ రెడ్డి నేతృత్వంలో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఏర్పడింది. ఈ సంస్థ 2009 డిసెంబర్ 24న ఏర్పాటయిన రాజకీయ జెఎసిలో భాగంగా ఉంటూ తన పాత్ర నిర్వహించింది.
  • సానా యాదిరెడ్డి అధ్యక్షునిగా ‘తెలంగాణ ప్రొడ్యుసర్స్ అండ్ మినీ థియేటర్ ఓనర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ’ కొనసాగుతోంది.

 

S9. Ans (a)

Sol: ముల్కీల ఆందోళనల నేపథ్యంలో 1901లో మీర్ మహబూబ్ అలీఖాన్ ముల్కీ హిందువు అయిన కిషన్ పర్షాద్ను ప్రధానిగా నియమించింది. నానముల్కీలపై ఇతను రాసిన కవిత: ‘మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి… నీ అంతిమ ప్రయాణానికి సిద్ధంగా ఉండు’.. ఈ కవితను రాసినందుకు అతనిని దూరప్రాంతాలకు బదిలీ చేయడం జరిగింది. మహారాజ కిషన్ పర్షాద్ వలన ఈ ఉద్యమం పాక్షికంగా విజయం సాధించారు. ముల్కీలకు కొన్ని రక్షణలను కల్పిస్తూ 1910లో ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అందుకే కిషన్ పర్షాద్ గారిని ముల్కీ ఉద్యమ గాడ్ఫాదర్ అని పేర్కొంటారు.

 

S10. Ans (c)

Sol: తదనంతరం సెప్టెంబర్ 13న హైదరాబాద్ రాజ్యంపై భారతప్రభుత్వం పోలీస్ చర్యను ప్రారంభించింది. 

  • ఈ పోలీస్ చర్య సమయంలో కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సదరన్ కమాండ్  గా ఉన్న ఆఫీసర్  – లెఫ్టినెంట్ జనరల్ ఇ.ఎన్. గోదార్ 
  • హైదరాబాద్ పోలీస్ చర్యకు నేతృత్వం వహించినది – లెఫ్టినెంట్ జనరల్ మహరాజ్ సింగ్. 
  • ఈ పోలీస్ చర్యకు షోలాపూర్ నుండి నేతృత్వం వహించినది – మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి
  • ఈ పోలీస్ చర్యకు విజయవాడ నుండి మేజర్ జనరల్ ‘రుద్ర’ నేతృత్వంలో యూనియన్ సైన్యాలు దాడిని ముమ్మరం చేశాయి

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 04 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II |_70.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 06 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II_5.1