Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Telangana State GK – ప్రశ్నలు
Q1. క్వాల్కమ్ నూతన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు కానుంది?
(a) ఆంధ్రప్రదేశ్
(b) తెలంగాణ
(c) మహారాష్ట్ర
(d) కర్ణాటక
Q2. కెమ్ వేద పరిశోధన కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
(a) ఆంధ్రప్రదేశ్
(b) మహారాష్ట్ర
(c) కర్ణాటక
(d) తెలంగాణ
Q3. రాష్ట్రంలోని ఏ నగరంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) నిర్మాణానికి భూమిపూజ చేశారు?
(a) ఖమ్మం
(b) వరంగల్
(c) హైదరాబాద్
(d) రంగారెడ్డి
Q4. ఖమ్మం జిల్లా వైరాలో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని, వైరా రిజర్వాయర్ వద్ద తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు స్పీడ్ బోట్లను ఎవరు ప్రారంభించారు?
(a) వి.శ్రీనివాస్‌గౌడ్
(b) కె.తారక రామా రావు
(c) మహమ్మద్ అలీ
(d) సబితా ఇంద్ర రెడ్డి
Q5. 2020-21 బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం ఎన్ని కోట్లను ప్రభుత్వం కేటాయించింది?
(a) రూ. 1000 కోట్లు
(b) రూ. 2000 కోట్లు
(c) రూ. 350 కోట్లు
(d) రూ. 1141 కోట్లు
Q6. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి 2020-21 ఏడాది బడ్జెట్‌లో ఎన్ని కోట్లను కేటాయించారు?
(a) రూ.16,534.97 కోట్లు
(b) రూ.9,771.28 కోట్లు
(c) రూ.26,306.25 కోట్లు
(d) రూ.6,721.17 కోట్లు
Q7. తెలంగాణ, జార్ఖండ్ ముఖ్యమంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?
(a) హైదరాబాద్
(b) ఢిల్లీ
(c) జార్ఖండ్
(d) రాంచీ
Q8. దేశంలో తొలిసారిగా మహిళల కోసం Dovely Bike Taxi Services ఎక్కడ ప్రారంభమైనది
(a) హైదరాబాద్
(b) ఢిల్లీ
(c) బెంగుళూరు
(d) ముంబై
Q9. మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం పేరు ఏమిటి?
(a) మహిళా శక్తి
(b) ఉద్యమిక
(c) వి – హబ్
(d) మహిళా భారోషా
Q10. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఫ్లో(ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్) ఇండస్ట్రియల్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ఎక్కడ ప్రారంభించారు.
(a) సంగారెడ్డి
(b) రంగారెడ్డి
(c) హైదరాబాద్
(d) మెదక్
Solutions:
S1. Ans (b)
Sol: సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల రంగంలో క్వాల్కమ్, గోల్ఫ్ బ్రాండ్‌లలో ‘కాల్‌అవే గోల్ఫ్’తోపాటు ఎలక్ట్రిక్ వాహన రంగంలోని ఫిస్కర్ కంపెనీ తమ కార్యాలయాలను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో మార్చి 22న శాండియాగోలోని క్వాల్కమ్, కాల్‌అవే గోల్ఫ్, లాస్ ఏంజెలిస్‌లోని ఫిస్కర్ ప్రధాన కార్యాలయాల్లో ఆ సంస్థల ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారు. క్వాల్కమ్ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో 2022, అక్టోబర్ నాటికి ప్రారంభించనుంది. వచ్చే ఐదేళ్లలో దశలవారీగా రూ.3,904 కోట్లు పెట్టనుంది.
S2. Ans (d)
Sol: ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ ‘కెమ్ వేద’ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.150 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ నగరంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికా పర్యటనలో భాగంగా మార్చి 21న శాండియాగోలోని కెమ్ వేద కార్యాలయానికి వెళ్లారు.
S3. Ans (c)
Sol: అంతర్జాతీయ వాణిజ్య వివాదాల సత్వరం పరిష్కారం కోసం ఉద్దేశించిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐకియా వెనుక భాగంలో ఐఏఎంసీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో కలిసి జస్టిస్ రమణ మార్చి 12న భూమిపూజ చేశారు. ఐఏఎంసీకి విలువైన భూమితో పాటు నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు.
S4. Ans (a)
Sol: ఖమ్మం జిల్లా వైరాలో రూ.89 లక్షలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని, వైరా రిజర్వాయర్ వద్ద తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు స్పీడ్ బోట్లను మార్చి 13న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వైరా రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
S5. Ans (a)
Sol: 2020-21 బడ్జెట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం ఏకంగా రూ. 1000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటల కొనుగోలుకు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సరైన ధర వచ్చేలా చేయాలనేది సర్కారు ఉద్దేశం.
S6. Ans (c)
Sol: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి 2020-21 ఏడాది బడ్జెట్‌లో రూ.26,306.25 కోట్లు కేటాయించారు. 2019-20 ఏడాదితో పోల్చితే తాజా కేటాయింపుల్లో ఏకంగా 6,721.17 కోట్లు అధికంగా సర్కారు కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్) చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన ఈ నిధులు కేటాయించారు. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,534.97 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,771.28 కోట్లు వంతున బడ్జెట్ ప్రవేశపెట్టారు.
S7. Ans (d)
Sol: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. మార్చి 4న జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జరిగిన ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పొరుగున ఉన్న చైనా సహా ఎన్నో ఆసియా దేశాలు అభివృద్ధి చెందగా.. మన దేశం చాలా విషయాల్లో వెనుకబడిపోయిందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదని, దీనిని సరిచేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ఆ దిశగానే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. హేమంత్ సోరెన్‌తో జాతీయ రాజకీయాల గురించి చర్చించానని, ఫలవంతంగా చర్చలు జరిగాయని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అమర జవాన్ కుందన్ కుమార్ ఓఝా భార్య నమ్రతాకుమారికి మరో అమర జవాన్ గణేశ్ కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను సీఎం కేసీఆర్ అందజేశారు.
S8. Ans (a)
Sol: అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం హైదరాబాద్‌లో డోవ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళ సేఫ్టీకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు. నగరానికి చెందిన జైనాబ్ కాతూన్, ఉజ్మా కాతూన్, మసరట్ ఫాతిమాలు డోవ్లీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వీరికి ఓబైదుల్లా ఖాన్ సహకారం అందించారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్ బైక్ (బైక్ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీ అందిస్తుంది. అయితే డోవ్లీలో రైడర్‌గా మహిళలే ఉండగా ఇందుగా కస‍్టమర్లకు కూడా కేవలం మహిళలే కావడం డోవ్లీ ప్రత్యేకత. అంటే మహిళల కోసం మహిళల చేత ఇక్కడ సేవలు అందివ్వబడతాయి.
S9. Ans (b)
Sol: మహిళా పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఉద్యమిక ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో పనిచేసే ఈ విభాగం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించి వారికి అండగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే మహిళా పారిశ్రామికవేత్తలకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
S10. Ans (a)
Sol: సంగారెడ్డి పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఫ్లో(ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్) ఇండస్ట్రియల్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ ఫ్లో ఇండస్ట్రియల్ పార్కులో 50 ఎకరాలను 25 మంది మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం కేటాయించింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం పార్క్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొట్టమొదటిసారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |