Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...
Top Performing

Telangana State GK MCQs Questions And Answers in Telugu,13 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 09 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. కింది ప్రకటనలను పరిగణించండి.

  1. 1828 లో రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసభ 1861 లో దేవేంద్రనాథ్ ఠాకూర్ మొదలైన వారి కృషితో బ్రహ్మసమాజంగా ప్రసిద్ధిగాంచింది.
  2. హైదరాబాద్ ప్రభుత్వం 1872 లో బ్రహ్మసమాజ ఆచారాల ప్రకారం చేసుకొన్న వివాహాలకు చట్టబద్ధత కల్పించింది. 
  3. 1899-1904 వరకు సికింద్రాబాద్ లోని మహబూబియా కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన రఘుపతి వెంకటరత్నం నాయుడు హైదరాబాద్లో వివిధ సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నారు.

పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏవి సరైనవి?

(a) 1 మాత్రమే

(b) 2 మాత్రమే

(c) పైనపేర్కొన్నవన్ని సరైనవి

(d) పైన పేర్కొన్నవన్ని సరైనవి కావు

 

Q2. సాహిత్యం, సంగీతం, నృత్యం, అభినయం, గానం, వాచకం, అలంకరణ, దుస్తులవంటి వేషధారణే కాకుండా ఇంకా ఎన్నో ప్రక్రియలను తనలో విలీనం చేసుకొని సర్వకళల సమాహారంగా పరిపూర్ణతను సాధించిన జానపద దృశ్య ప్రక్రియ ?

  1. యక్షగానం.
  2. ఒగ్గుకథ
  3. కోలాటం
  4. బుర్రకథ

 

Q3. వినోబాభావే భూదానోద్యమ విజయానికి కలిసి వచ్చిన అంశాలు ఈ కింది వాటిలో ఏవి?

  1. వినోబాభావే గాంధీజీ శిష్యుడు కావడం 
  2. తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేయడం
  3. ఆయన ఆధ్యాత్మికత్వం, ఆయన పాదయాత్ర 

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

 

Q4.కొండవీటి సామ్రాజ్యంలో, విప్రవినోదుల జన్మ వృత్తాంతం గురించి ఒక కథను వివరించినది ఎవరు? 

  1. విద్యారణ్యుడు
  2. పాల్కురికి సోమనాధుడు
  3. కొరవి గోపరాజు
  4. మందులపల్లి గురుబ్రహ్మశర్మ

 

Q5. కింది వాటిని జతపరుచుము.

జాబితా – I జాబితా – II 

A.1930 నుంచి 1940 1.  శాంతియుత రైతాంగ తిరుగుబాట్లు.

  1. 1940 నుంచి 1946 2. వ్యక్తిగతమైన ఆందోళనలు.
  2. 1946 నుంచి 1948 3. ప్రజా సాయుధ పోరాటాలు.
  3. 1948 నుంచి 1951 4. రైతాంగ సాయుధ పోరాటాలు.

(a) A 2, B 1, C 4, D 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A 3, B 4, C 1, D 2

(d) A 4, B 3, C 2, D 1

 

Q6. పురాణ పట్టికల ప్రకారం శాతవాహన రాజుల్లో మొదటివాడు ఎవరు?

  1. కృష్టుడు(కన్హుడు)
  2. గౌతమీపుత్ర శాతకర్ణి
  3. శ్రీముఖుడు
  4. వాసిష్టిపుత్ర

 

Q7. ‘కాకతీయ రాజ్య భార ధౌరేయుఅని పేరొందింది ఎవరు?

  1. రేచర్ల రుద్రారెడ్డి
  2. రేచర్ల చెవిరెడ్డి
  3. రేచర్ల కాటిరెడ్డి
  4. రేచర్ల లోకిరెడ్డి

 

Q8. హైదరాబాదులో క్విట్ ఇండియా ఉద్యమం 1942 ను వ్యాప్తి చేయడంలో ఎవరు కీలక పాత్ర పోషించారు?

  1. గోవిందరావు నానల్
  2. కార్వే
  3. డా.మెల్కోటే
  4. స్వామి రామానంద తీర్థ

 

Q9. చందా రైల్వే స్కీమ్ ఆందోళన లో ప్రముఖ పాత్ర వహించినది ఎవరు?

(a) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ

(b) ముల్లా అబ్దుల్ ఖయ్యుం

(c) a మరియు b రెండూ

(d) పైనవేవి కావు

 

Q10. ప్రతిపాదన (A): వలస వచ్చిన గిరిజనేతరులు, గిరిజనులకు చెందిన భూములను ఆక్రమించుకొని వాటికి పట్టాలు కూడా పొందగలిగారు. విశాలమైన అటవీభూభాగాల నుంచి జనవాసాలను, తరతరాలుగా స్థిరపడ్డ మాలను కూడా తొలగించడం సాయుధపోరాటాలకు దారితీసింది.

కారణము (R) : మద్రాస్ రాష్ట్ర ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో చెలరేగిన తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం 1917లో ఏజెన్సీప్రాంత భూమి బదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఏజెంటు లేదా నిర్ణీత అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా గిరిజన తెగలకు, గిరిజనేతరులకు మధ్య జరిగే భూబదలాయింపులను ఈ చట్టం నిషేధించింది.

సమాధానం :

(a) (A) మరియు (R) నిజం (R). (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

Solutions:

S1. Ans (c)

Sol: 

  • 1828 లో రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసభ 1861 లో దేవేంద్రనాథ్ ఠాకూర్ మొదలైన వారి కృషితో బ్రహ్మసమాజంగా ప్రసిద్ధిగాంచింది.
  • హైదరాబాద్ ప్రభుత్వం 1872 లో బ్రహ్మసమాజ ఆచారాల ప్రకారం చేసుకొన్న వివాహాలకు చట్టబద్ధత కల్పించింది. 
  • 1899-1904 వరకు సికింద్రాబాద్ లోని మహబూబియా కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన రఘుపతి వెంకటరత్నం నాయుడు హైదరాబాద్లో వివిధ సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నారు

 

S2. Ans (a)

Sol: సాహిత్యం, సంగీతం, నృత్యం, అభినయం, గానం, వాచకం, అలంకరణ, దుస్తులవంటి వేషధారణే కాకుండా ఇంకా ఎన్నో ప్రక్రియలను తనలో విలీనం చేసుకొని సర్వకళల సమాహారంగా పరిపూర్ణతను సాధించిన జానపద దృశ్య ప్రక్రియ యక్షగానం.

 

S3. Ans(d)

Sol: వినోబాభావే భూదానోద్యమ విజయానికి కలిసి వచ్చిన అంశాలు. వినోబాభావే గాంధీజీ శిష్యుడు కావడం, తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేయడం, ఆయన ఆధ్యాత్మికత్వం, ఆయన పాదయాత్ర. భారతదేశ వ్యాప్తంగా వినోబాభావే 13 సంవత్సరాల్లో 36,500 మైళ్ళ పాదయాత్ర చేసి 40.4 మిలియన్ ఎకరాల భూమిని దానంగా పొందాడు. ప్రభుత్వం భూ సంస్కరణల ద్వారా సాధించిన భూమి కంటే భూదానోద్యమం ద్వారా సేకరించిన భూమే ఎక్కువ.

 

S4. Ans (d)

Sol: విప్రవినోదులు బ్రాహ్మణ కులంపై ఆధారపడి, వారిని మాత్రమే యాచించి, జీవించే ఒక తెగవారు. విప్రులు అంటే బ్రాహ్మణులు, వినోది అంటే గారడీ విద్యను ప్రదర్శించి వినోదింపచేసేవారు. మందులపల్లి గురుబ్రహ్మశర్మ తన కొండవీటి సామ్రాజ్యంలో, విప్రవినోదుల జన్మ వృత్తాంతం గురించి ఒక కథను వివరించారు. విద్యారణ్యుని శంకర విజయంలో కూడా విప్రవినోదుల పుట్టు పూర్వోత్తరాలు గురించి వివరించబడింది.

 

S5. Ans (a)

Sol: తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని సరళంగా అర్థంచేసుకోవడానికి వీలుగా దాన్ని నాలుగు విధాలుగా విభజించడం జరిగింది. అవి

  • 1930 నుంచి 1940 వరకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన వ్యక్తిగతమైన ఆందోళనలు.
  • నుంచి 1946 వరకు భూస్వాములకు, దేశముఖకు, గ్రామాధికారులకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత రైతాంగ తిరుగుబాట్లు.
  • 1946 నుంచి 1948 వరకు భూస్వాములకు, దేశ్ముఖ్ కు, రజాకర్లకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వారు జరిపిన రైతాంగ సాయుధ పోరాటాలు.
  • 1948 నుంచి 1951 వరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, తెలంగాణా ప్రజానీకం సాగించిన ప్రజా సాయుధ పోరాటాలు.

 

S6. Ans(c)

Sol: పురాణ పట్టికల ప్రకారం శాతవాహన రాజుల్లో శ్రీముఖుడు మొదటివాడు. ఇతడే శాతవాహన రాజ్య స్థాపకుడు. కోటిలింగాల వద్ద దొరికిన శ్రీముఖునికి సంబంధించిన 8 నాణేల్లో ఒకటి మాత్రమే పోటెన్ అనే మిశ్రమ నాణెం, మిగిలినవన్నీ రాగి నాణేలు. ఈ నాణేలపై శ్రీముఖుని పేరు చీముకుడని ముద్రించి ఉంది. శాసనాల్లో సిముకుడిగా, పురాణాల్లో చిస్మకుడుగా, నాణేలపై చీమకుడుగా ముద్రించారు.

 

S7. Ans (A)

Sol: ముదిగొండ చాళుక్యులు, వెలనాటి చోళ పృథ్వీశ్వరుడు, కులోత్తుంగ చోళుడు కాకతీయ రాజ్య భూభాగాలనాక్రమించినారు. ఈ విపత్కర పరిస్థితులలో వీళ్లందరినీ ఓడించి, అంతరంగిక శత్రువులను అణచి కాకతీయ సింహాసనాన్ని భద్రంగా గణపతి దేవునికి అప్పగించి (1199) రేచర్ల రుద్రారెడ్డి కాకతి రాజ్య భార ధౌరేయుదుగా కాకతి రాజ్య సమర్థుడుగా పేరు పొందినాడు.

 

S8. Ans: (c)

Sol: హైదరాబాదులో క్విట్ ఇండియా ఉద్యమం 1942. దీనిని వ్యాప్తి చేయడంలో డా.మెల్కోటే కీలక పాత్ర పోషించాడు. స్వామి రామానంద తీర్థ ఉత్తరం ఆధారంగా ఉద్యమ వ్యాప్తి జరిగింది. పద్మజా నాయుడు హైదరాబాదులోని రెసిడెన్సి భవనంపై కాంగ్రెస్ పతకం ఎగురవేసింది

 

S9. Ans(c)

Sol: సామాజిక సంస్కరణల ప్రభావంతో హైద్రాబాద్లో తమ వంతు పాత్రవహించి హైద్రాబాద్లో సంస్కరణలకు నాందిపలికిన ఆధునిక భావాలు గల నాయకులు, తొలి కాంగ్రెస్ వాదులైన ముల్లా అబ్దుల్ ఖయ్యుం, అఘోరనాథ్ ఛటోపాధ్యాయ లాంటి వారు హైద్రాబాద్లో తొలి ప్రజాబాహుళ్య ఉద్యమానికి నాయకత్వం వహించి స్థానిక ప్రజలలో స్వాతంత్ర్య సమరానికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. అదే చాందానగర్ రైల్వే సంఘటన‘.

 

S10. Ans( a)

Sol:  ముఖ్యంగా మద్రాస్ రాష్ట్ర ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో చెలరేగిన తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం 1917లో ఏజెన్సీప్రాంత భూమి బదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఏజెంటు లేదా నిర్ణీత అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా గిరిజన తెగలకు, గిరిజనేతరులకు మధ్య జరిగే భూబదలాయింపులను ఈ చట్టం నిషేధించింది.  వలస వచ్చిన గిరిజనేతరులు, గిరిజనులకు చెందిన భూములను ఆక్రమించుకొని వాటికి పట్టాలు కూడా పొందగలిగారు. హద్దులేర్పర్చే సమయానికి డుగా పడిఉన్న భూములను, అంతకుముందు వాటిని శివాయి జమాబంది‘ (ఆక్రమణ) పద్ధతిలో గిరిజనులు సాగుచేస్తూ న్నప్పటికీ, రిజర్వ్ ఫారెస్ట్ కలిపేశారు. విశాలమైన అటవీభూభాగాల నుంచి జనవాసాలను, తరతరాలుగా స్థిరపడ్డ మాలను కూడా తొలగించడం సాయుధపోరాటాలకు దారితీసింది.

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu, 09 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II |_70.1

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana State GK MCQs Questions And Answers in Telugu,13 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II_5.1