Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...
Top Performing

Telangana State GK MCQs Questions And Answers in Telugu,16 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu,13 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. ముసునూరి రాజ్య స్థాపకుడు?

  1. కాపయ నాయకుడు
  2. ప్రోలయ నాయకుడు
  3. వెంగ భూపాలుడు
  4. రేచర్ల సింగమ నాయకుడు

 

Q2. ఉండవల్లి గుహాలయాలను నిర్మించింది ఎవరు?

  1. గోవిందవర్మ 
  2. రెండో మాధవ వర్మ
  3. మంచన భట్టారికుడు
  4. 4వ మాధవవర్మ

 

Q3. క్రీ. 350 నాటిఅత్తివర్మ గోరంట్లతామ్ర శాసనం కన్నా ప్రాచీనమైన శాసనం ____ దగ్గర ఉన్నదని ఇటీవల పరిశోధకులంటున్నారు?

  1. నాగార్జున కొండ
  2. జగ్గయ్య పేట
  3. నల్గొండ
  4. నెల్లూరు

 

Q4. ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఇక్ష్వాకు సంతతివారు అని కింది చరిత్రకారులు పేర్కొన్నారు?

  1. రాప్సన్
  2. బూలర్
  3. (a) మరియు (b)
  4. కాల్వేల్

 

Q5. అద్దంకి గంగాధర కవి, మరింగంటి సింగరాచార్యులు, కందుకూరి రుద్రకవి తదితర తెలుగు కవులను పోషించిన కుతుబ్షాహీ పాలకుడు ఎవరు?

  1. తానీషా  
  2. ఇబ్రహీం కుతుబ్షా
  3. కులీ కుతుబ్షా
  4. అబ్దుల్లా కుతుబ్షా

 

Q6. మహమ్మద్ కులీ కుతుబ్షా రాజ్యాధికారం చేపట్టడానికి సహాయపడినవారు?

  1. మాదన్న
  2. అక్కన్న
  3. అశ్వారావు
  4. ముజఫర్

 

Q7. చరిత్రకారులుపాశ్చాత్యీకరణప్రారంభానికి సాక్షీభూతంగా ఎవరిని పేర్కొంటారు?

  1. జంషీద్ కుతుబ్షా
  2. ఇబ్రహీం కుతుబ్షా
  3. హైదర్ కుతుబ్షా
  4. మహమ్మద్ కుతుబ్షా

 

Q8. చందూలాల్ తరువాత నిజాం యొక్క ప్రధాని ఎవరు?

  1. సిరాజ్ ఉల్ ముల్క్ 
  2. గులాం రసూల్ ఖాన్ 
  3. మీరు తురబ్ అలీ ఖాన్
  4. పైనవేవి కావు

 

Q9. ‘ది రెబెలియన్ ఇన్ ఇండియాఅనే పుస్తకం రచించినది ఎవరు 

  1. మీరు తురబ్ అలీ ఖాన్
  2. డూప్లే
  3. హెన్రీ రస్సెల్
  4. బ్రూస్ నార్తజ్

 

Q10. ఉత్తర భారతదేశంలో ముస్లింలలో సాంఘిక సంస్కరణను తీసుకురావటానికి ప్రారంభమైన ఉద్యమం?

  1. ముస్లిం జాతీయోద్యమం
  2. సిపాయి తిరుగుబాటు
  3. వహాబీ ఉద్యమం
  4. స్వదేశి ఉద్యమం

Solutions:

S1. Ans (B)

ప్రోలయ నాయకుడు (క్రీ.. 1325-1330) ముసునూరి నాయక రాజుల్లో మొదటివాడు. ఇతడు రాజమహేంద్ర వరం నుంచి ముస్లింలను పారద్రోలి గోదావరికృష్ణ నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించాడు. ‘రేఖపల్లికేంద్రంగా పరిపాలించాడు. ముస్లింలను ఎదుర్కోడానికి గెరిల్లా దాడులు నిర్వహించాడు. బ్రాహ్మ ణులకు అగ్రహారాలను కేటాయిం చి, వైదిక మత ధర్మ పునరుద్ధరణకు పాటుపడ్డాడు

 

S2. ANS (a)

Sol: ఉండవల్లి గుహాలయాలు: ఇవి నాలుగు అంతస్తుల్లో ఉన్నాయి. వీటిని గోవిందవర్మ నిర్మించాడు. ఇందులో మొత్తం 64 గుహలు ఉన్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులోఅనంతశయనవిష్ణువు దేవాలయం, మూడో అంతస్తులోత్రికూఠ ఆలయంఉన్నాయి. నాలుగో అంతస్తులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. గుహల్లోపూర్ణకుంభంఉంది.

 

S3. ANS (C)

Sol: క్రీ.. 370-400 నాటి గోవిందరాజ విహార (చైతన్యపురి) శాసనం తెలంగాణాలో లభిస్తున్న మొదటి ప్రాకృతశాసనం అయితే శాసనం కన్నా, క్రీ. 350 నాటిఅత్తివర్మ గోరంట్ల తామ్ర శాసనం కన్నా ప్రాచీనమైన శాసనం నల్లగొండ జిల్లా ఏలేశ్వరం దగ్గర ఉన్నదని ఇటీవల పరిశోధకులంటున్నారు

 

S4. ANS.(c)

Sol: ఇక్ష్వాకులు దాదాపు వందేళ్లు పాలించారు. వీరు ఐదుగురు రాజుల శాసనాల ద్వారా తెలుస్తుండగా, ఏడుగురు రాజులని పురాణాలు తెలుపుతున్నాయి. జన్మస్థలంపై ఎన్నో వాదాలు ఉండగా చరిత్రకారులు రాప్సన్, బూలర్ ప్రకారం: ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఇక్ష్వాకు సంతతివారు.

 

S5. Ans: (B) 

అద్దంకి గంగాధర కవి, మరింగంటి సింగరాచార్యులు, కందుకూరి రుద్రకవి, పొన్నెగంటి తెలగనార్యుడు తదితర తెలుగు కవులను పోషించిన కుతుబ్షాహీ పాలకుడు ఇబ్రహీం కుతుబ్షా. కవి పండిత పోషకుడు. ఆంధ్ర కవులను ఆదరాభిమానంతో పోషించినందువల్లమల్కిభరాముడుగా పేరుగాంచాడు

 

S6. Ans: (C)

ఇబ్రహీం మరణానంతరం మహమ్మద్ కులీ కుతుబ్షా (1580-1612) అతి పిన్న వయసులో(14 ఏట) రాజ్యానికొచ్చినాడు. ఇబ్రహీం ఆరుగురు మగసంతానంలో ఇతడు మూడోవాడు, ఇబ్రహీం ప్రేమించి పెళ్లి చేసుకున్న భాగీరథి అనే తెలుగు స్త్రీకి ఇతడు జన్మించినాడు. ఇంతమంది సంతానంలో కులీ అధికారంలోకి రావడానికి దక్కన్ ముస్లింల సహకారంతో అశ్వారావు చేసిన కృషి కారణం.

 

Q7. Ans: (D)

మహమ్మద్ కుతుబ్షా గోల్కొండ రాజ్యంలో అస్థిరత నెలకొనకుండా చేసుకున్నాడు. చచ్చివారు ఇంగ్లీషు వారు తీరాంధ్ర వెంట వర్తక స్థావరాల్ని నెలకొల్పుకొని పాశ్చాత్యీకరణ ప్రారంభానికి సాక్షీ భూతమితడు

 

S8. Ans: (A)

1843లో చందూలాల్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో సిరాజ్ ఉల్ ముల్క్ హైదరాబాద్ కు ప్రధాని అయ్యాడు.

 

Q9. Ans: (D) 

బ్రూస్  నార్తజ్ తనది రెబెలియన్ ఇన్ ఇండియాఅనే పుస్తకంలో బీరార్ ఒప్పదం గురించిన్యాయ దేవత చెవుల్లో దూది పెట్టి ఆమెను ఆంగ్లేయులు చెవిటిదాన్ని , గుడ్డిదాన్ని చేశారుఅని పేర్కొన్నాడు. ఒప్పందాన్ని అవమానకరంగా భావించిన సిరాజ్ ఉల్ ముల్క్ అస్వస్థతకు గురై మరణించాడు.

 

S10. Ans : (C)

ఉత్తర భారతదేశంలో ముస్లింలలో సాంఘిక సంస్కరణను తీసుకురావటానికి వారి రాజకీయ ప్రయోజనాలు సాధించడానికి ప్రారంభమైన గొప్ప ఉద్యమం వహాబీ ఉద్యమం

 

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu,13 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II |_70.1

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana State GK MCQs Questions And Answers in Telugu,16 August 2022, For TSPSC Groups and Telangana Police and Singareni JA Grade- II_5.1