Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Telangana State GK – ప్రశ్నలు
Q1. 1969 లో నియమించబడిన వశిష్ట భార్గవ కమిటీని ఏ కాలపు తెలంగాణ అభివృద్ధి కొరకు బడ్జెటరీ మిగులు ఉపయోగాన్ని పరిశీలించింది?
- నవంబర్ 1 , 1955 నుండి మార్చి 3, 1969 వరకు
- నవంబర్ 1 , 1956 నుండి మార్చి 3, 1968 వరకు
- నవంబర్ 1 , 1954 నుండి మార్చి 3, 1969 వరకు
- నవంబర్ 1, 1956 నుండి జనవరి 1, 1969 వరకు
Q2. క్రింది వాటిలో సరికాని జతలను ఎంపిక చేయండి.
- ఇలఖాలు: అత్యంత పలుకుబడి కలిగిన అధికారుల అధీనంలో ఉండేవి.
- మష్ రుది: కవులు , కళాకారులూ, పండితులకు జీతాలకు బదులు ఇచ్చే భూములు
- ఇనాం దార్లు : మతసైనిక పౌరసంబంధ సేవకి షరతులపై ఇచ్చే భూములు.
- సర్ఫ్-ఎ-ఖాస్ : నిజాం తన వ్యక్తిగత ఖర్చుల కోసం తన వద్దే ఉంచుకున్న భూములు
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి.
- 1,2 మాత్రమే
- 2,3 మాత్రమే
- 3,4 మాత్రమే
- ఏదీ కాదు
Q3. ఈ క్రింది వానిలో సరియైన సమాధానాన్ని ఎంచుకోండి.
- 1961 చట్టంలో కుటుంబాన్ని యూనిట్ గా కాకుండా ఒక్కొక్క సభ్యుణ్ణి యూనిట్ గా తీసుకున్నారు.
- 1973 భూ గరిష్ట పరిమితి చట్టంలో 5గురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు.
- 1973 భూ గరిష్ట పరిమితి చట్టం 1975లో అమలులోకి వచ్చింది.
- అన్నీ సరైనవే
Q4. క్రింది వాటిని జతపరచండి.
- హైదరాబాద్ జాగిర్దారుల రద్దు క్రమబద్దీకరణ చట్టం a. 1950
- హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం b. 1949
- ఆంధ్రప్రదేశ్ ఇనాముల రద్దు చట్టం c. 1973
- ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టం d. 1955
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
- 1-a,2-b,3-c,4-d
- 1-c,2-d,3-b,4-a
- 1-b,2-a,3-d,4-c
- 1-c,2-a,3-d,4-b
Q5. రైతుబంధు పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యలను గుర్తించండి?
- 2020-21 సంవత్సరంలో ఈ పథకం ద్వారా 59.3 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.
- 2018-19 నుండి 2020-21 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పథకం ద్వారా 35,671 కోట్ల రూపాయల్ని పంపిణి చేయడం జరిగింది.
- a మాత్రమే
- రెండూ సరైనవే
Q6. క్రింది వాటిని జతపరచండి.
- రాజోలు బండ మళ్లింపు పథకం a. కరీంనగర్
- శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ b. ఆదిలాబాద్
- లోయర్ మానేర్ డ్యాం c. మహబూబ్ నగర్
- కడెం రిజర్వాయర్ d. నిజామాబాదు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
- 1-a,2-b,3-c,4-d
- 1-c,2-d,3-b,4-a
- 1-b,2-a,3-d,4-c
- 1-c,2-d,3-a,4-b
Q7. రైతుబంధు పథకాన్ని స్పూర్తిగా తీసుకొని వివిధ రాష్ట్రాలలో అమలు చేయబడుతున్న పథకాలను వాటి రాష్ట్రాలతో జతపరచండి.
- కాలియా a. పశ్చిమ బెంగాల్
- కృషక్ బంధు b. ఒడిషా
- ముఖ్యమంత్రి కృషి ఆశిర్వాద్ యోజన c. ఆంధ్రప్రదేశ్
- రైతు భరోసా d. ఝార్ఖండ్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి
- 1-a,2-b,3-c,4-d
- 1-c,2-d,3-b,4-a
- 1-b,2-a,3-d,4-c
- 1-c,2-a,3-d,4-b
Q8. 2021-22లో ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ జోడింపులో (GSVA) సేవా రంగం వాటా ఎంత?
- 61%
- 65%
- 55%
- 71%
Q9. TS- iPASS కింద వచ్చిన పెట్టుబడుల ద్వారా అత్యధిక ఉపాధి కల్పన సాధించిన జిల్లా ఏది?
- రంగారెడ్డి
- వరంగల్ అర్బన్
- హైదరాబాద్
- సంగారెడ్డి
Q10. 2020-21లో తెలంగాణలో స్థూల సాగునీటి విస్తీర్ణం ఎంత?
- 137 లక్షల ఎకరాలు
- 101 లక్షల ఎకరాలు
- 119 లక్షల ఎకరాలు
- 62.5 లక్షల ఎకరాలు
Solutions:
S1. Ans(b)
Sol: 1969 ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అష్టసూత్ర పథకంలో భాగంగా తెలంగాణా మిగులు నిధులు లెక్కించడానికి సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి వశిష్ట భార్గవ అధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది.
ఆచార్య ముకుట్ విహారీ మాధుర్, హరిభూషణ్ భార్, టి.ఎస్. కృష్ణస్వామి ఈ కమిటీలో సభ్యులు. ఈ కమిటీ నవంబర్ 1, 1956 నుండి మార్చి 3, 1968 వరకు తెలంగాణా మిగులు నిధులను లెక్కించింది. ఈ కమిటీ తెలంగాణా మిగులు నిధులు రూ. 28.34 కోట్లని ప్రకటించింది.
S2. Ans(b)
Sol: ఇలఖాలు: అత్యంత పలుకుబడి కలిగిన అధికారుల అధీనంలో ఉండేవి.
ఇనాం దార్లు: కవులు , కళాకారులూ, పండితులకు , మదర్సాలు, మసీదులకు కింది స్థాయి ఉద్యోగులకు వేతనాలకు బదులుగా నిజాం ఇచ్చిన భూములు ఇనాం భూములు, లబ్దిదారులు ఇనాందార్లు.
మష్ రుది : మతసైనిక పౌరసంబంధ సేవకి షరతులపై ఇచ్చే భూములు.
సర్ఫ్-ఎ-ఖాస్ : నిజాం తన వ్యక్తిగత ఖర్చుల కోసం తన వద్దే ఉంచుకున్న భూములు
S3. Ans(d)
Sol: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల పరిమితి చట్టం,1961 లో కుటుంబాన్ని యూనిట్ గా కాకుండా ఒక్కొక్క సభ్యుణ్ణి యూనిట్ గా తీసుకున్నారు. రూ. 3600 నికర ఆదాయం ఇచ్చే భూపరిమాణాన్ని గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి 27 నుంచి 324 ఎకరాలు పరిమితిని ఈ చట్టం నిర్దారించింది.
1973 భూ గరిష్ట పరిమితి చట్టంలో 5గురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు. ఐదుగురు సభ్యుల కన్నా ఎక్కువ ఉన్నపుడు ప్రతి సభ్యుడిని ప్రత్యేక యూనిట్ గా పరిగణించి అదనంగా భూమి కేటాయించవచ్చు. ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టం, 1973 న్యాయవ్యవస్థ పరిధి నుండి భూ పరిమితి చట్టానికి మినహాయింపు ఇవ్వడంతో వాస్తవంగా 1975 జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది.
S4. Ans(d)
Sol: హైదరాబాద్ రాష్ట్రం(తెలంగాణ)లో భూసంస్కరణలు 1948 -73మధ్య కాలంలో జరిగాయి. మొదట హైదరాబాద్ రాష్ట్రంలో అటు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జమిందారీ, జాగిర్దారి, ఇనాందారీ భూస్వామ్య వ్యవస్థలను రద్దు చేసి నిజమైన రైతులకు (భూమి దున్నేవానికి) యాజమాన్య హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో అమలులోకి తెచ్చిన చట్టాలు;
హైదరాబాద్ జాగిర్దారుల రద్దు క్రమబద్దీకరణ చట్టం – 1949
హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం – 1950
ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ప్రాంతం) ఇనాముల రద్దు చట్టం – 1955
ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టం – 1973
S5. Ans(d)
Sol: 2020-21 సంవత్సరంలో ఈ పథకం ద్వారా 59.3 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.
2018-19 నుండి 2020-21 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పథకం ద్వారా 35,671 కోట్ల రూపాయల్ని పంపిణి చేయడం జరిగింది. రైతుబంధు పథకం 2018 మే 10న కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం శాలపల్లి -ఇందిరానగర్ లో ప్రారంభించబడింది. మొత్తంగా గత ఎనిమిది వ్యవసాయ కాలాల్లో రైతుబంధు పథకం కింద 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది.
2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు విడుతలలో ప్రతీ రైతుకు రూ. 10వేలు ఆర్థిక సహాయంగా అందిస్తారు.
S6. Ans(d)
Sol: రాజోలు బండ మళ్లింపు పథకం మహబూబ్ నగర్
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిజామాబాదు
లోయర్ మానేర్ డ్యాం కరీంనగర్
కడెం రిజర్వాయర్ ఆదిలాబాద్
S7. Ans(c)
Sol: కాలియా – ఒడిషా
కృషక్ బంధు – పశ్చిమ బెంగాల్
ముఖ్యమంత్రి కృషి ఆశిర్వాద్ యోజన – ఝార్ఖండ్
రైతు భరోసా – ఆంధ్రప్రదేశ్
S8. Ans(a)
Sol: 2021-22లో ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ జోడింపులో (GSVA) సేవా రంగం వాటా 61%, వ్యవసాయరంగం వాటా – 18% మరియు పారిశ్రామిక రంగం వాటా – 20%
S9. Ans(c)
Sol: TS-iPASS రిపోర్ట్ ప్రకారం మొత్తం ఉద్యోగిత (7,54,745 కార్మికులు)లో వరంగల్ జిల్లా 11.68%తో రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది. 2015 నుండి 2021 కాలంలో రాష్ట్రంలో వివిధ జిల్లాలలో 17,097 పారిశ్రామిక యూనిట్లకు అనుమతి లభించింది. 2015 నుండి అనుమతి పొందిన మొత్తం సంస్థలలో 95.6% MSME యూనిట్లు కాగా 4.4% యూనిట్లు మెగా వ్యాపారసంస్థలు.
S10. Ans(a)
Sol: పంటలకు సంవత్సరంలో ఒకసారి లేదా ఒకటి కంటే ఎక్కువసార్లు సాగు నీరందే ప్రాంతం. తెలంగాణలో స్థూల నీటిపారుదల గల భూమి 2014-15 లో 62.48 లక్షల ఎకరాలుంటే , 2018-19లో 77.37 లక్షల ఎకరాలు. 2019-20, 2020-21లలో వరుసగా 113.37, 136.86 లక్షల ఎకరాలకు పెరిగింది. దీనితో 2014-15తో పోలిస్తే 2020-21లో స్థూల సాగు నీరందే భూమి 119% పెరిగింది. వ్యవసాయోత్పత్తి కూడా 2018-19, 2020-21 మధ్య 234 లక్షల టన్నుల నుంచి 353.33 లక్షల టన్నులకు పెరిగింది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |