Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Q1. చాళుక్యుల కాలం నాటి గ్రామాధికారులు కు సంబంధించి కింది ప్రకటనలను పరిశిలించండి.
1) గ్రన్తి – నీటి నిల్వలపై అధికారి
2) కరణం – భూమి శిస్తు లెక్కలను చూసేవాడు
3) తలారి – గ్రామ రక్షణకు బాధ్యత వహించేవాడు
4) గ్రామోపాధ్యాయుడు – గ్రామ విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు
పైన పేర్కొన్న ప్రకటనలో సరైనది ఏది?
(a) 2 మరియు 4 మాత్రమే
(b) 1 మరియు 3 మాత్రమే
(c) 1, 2, 4 మాత్రమే
(d) పైవన్నీ
Q2. కింది ప్రకటనలను పరిగణించండి.
- 1828 లో రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసభ 1861 లో దేవేంద్రనాథ్ ఠాకూర్ మొదలైన వారి కృషితో బ్రహ్మసమాజంగా ప్రసిద్ధిగాంచింది.
- హైదరాబాద్ ప్రభుత్వం 1872 లో బ్రహ్మసమాజ ఆచారాల ప్రకారం చేసుకొన్న వివాహాలకు చట్టబద్ధత కల్పించింది.
- 1899-1904 వరకు సికింద్రాబాద్ లోని మహబూబియా కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన రఘుపతి వెంకటరత్నం నాయుడు హైదరాబాద్లో వివిధ సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నారు.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏవి సరైనవి?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) పైనపేర్కొన్నవన్ని సరైనవి
(d) పైన పేర్కొన్నవన్ని సరైనవి కావు
Q3. 2022–23 బడ్జెట్ వివిదా కేటాయింపులకు సంబంధించి కింది వాటిని జతపరుచుము
పధకం కేటాయింపు
(A) తొలి మహిళా వర్సిటీ 1. రూ.2,750 కోట్లు
(B) డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం 2. రూ.100 కోట్లు
(C) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు 3. రూ.12 వేల కోట్లు
(D) అటవీ విశ్వ విద్యాలయం 4. రూ.100 కోట్లు
A B C D
(a) 1 2 4 3
(b) 3 2 4 1
(c) 2 3 1 4
(d) 1 2 3 4
Q4. వినోబాభావే భూదానోద్యమ విజయానికి కలిసి వచ్చిన అంశాలు ఈ కింది వాటిలో ఏవి?
- వినోబాభావే గాంధీజీ శిష్యుడు కావడం
- తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేయడం
- ఆయన ఆధ్యాత్మికత్వం, ఆయన పాదయాత్ర
(a) 1 మరియు 3
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 3 మాత్రమే
(d) 1, 2, 3
Q5. ‘కొండవీటి సామ్రాజ్యం’లో, విప్రవినోదుల జన్మ వృత్తాంతం గురించి ఒక కథను వివరించినది ఎవరు?
- విద్యారణ్యుడు
- పాల్కురికి సోమనాధుడు
- కొరవి గోపరాజు
- మందులపల్లి గురుబ్రహ్మశర్మ
Q6. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
A.1930 నుంచి 1940 1. శాంతియుత రైతాంగ తిరుగుబాట్లు.
- 1940 నుంచి 1946 2. వ్యక్తిగతమైన ఆందోళనలు.
- 1946 నుంచి 1948 3. ప్రజా సాయుధ పోరాటాలు.
- 1948 నుంచి 1951 4. రైతాంగ సాయుధ పోరాటాలు.
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q7. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏ సంస్థ వరంగల్‌లో జనపనార పరిశ్రమల ఏర్పాటు చేయనున్నది?
- కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్
- గ్లోస్టర్ లిమిటెడ్
- ఎంబీజీ కమాడిటీస్ లిమిటెడ్
- తెలంగాణ టెక్స్ట్ టైల్ శాఖ
Q8. శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్ సెంటర్’ను ఎక్కడ ప్రారంభించారు?
- వరంగల్
- హైదరాబాద్
- రంగారెడ్డి జిల్లా
- నిజామాబాద్
Q9. మహిళల పారిశ్రామిక పార్కు సంబంధించి ఈ కింది వాటిలో ఏది సరైనది?
- మెదక్ జిల్లాలోని సుల్తాన్పూర్ వద్ద మహిళా పారిశ్రామిక పార్కుల స్థాపనకు టిఎస్ఐఐసి 50 ఎకరాల మేరకు భూమిని కేటాయించింది.
- గ్రీన్ లైన్ ఆఫ్ యాక్టివిటీస్ కోసం తెలంగాణలోని ప్రతి జిల్లాలో మహిళా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని టిఎస్ఐఐసి నిర్ణయిం తీసుకుంది.
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 2 మరియు 1
(d) 1 మరియు 2 కాదు
Q10. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది సరైనది?
- భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్ వర్కను జూన్ 2020లో ప్రారంభించింది.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అభివృద్ధి చేయడానికి మరియు 2025 సంవత్సరం లోపు ప్రపంచంలో టాప్ 25వ స్థానంలో హైదరాబాదు ఉంచడం దీని ఉద్దేశ్యం.
(a) A మాత్రమే
(b) A మరియు B
(c) B మాత్రమే
(d) A మరియు B కాదు
Solutions:
S1. Ans (d)
Sol: చాళుక్యుల కాలం నాటి గ్రామాధికారులు:
1) గ్రన్తి – నీటి నిల్వలపై అధికారి
2) కరణం – భూమి శిస్తు లెక్కలను చూసేవాడు
3) తలారి – గ్రామ రక్షణకు బాధ్యత వహించేవాడు
4) గ్రామోపాధ్యాయుడు – గ్రామ విద్యార్థులకు విద్యాబోధన చేసేవాడు
S2. Ans (c)
Sol:
- 1828 లో రామ్మోహన్రాయ్ స్థాపించిన బ్రహ్మసభ 1861 లో దేవేంద్రనాథ్ ఠాకూర్ మొదలైన వారి కృషితో బ్రహ్మసమాజంగా ప్రసిద్ధిగాంచింది.
- హైదరాబాద్ ప్రభుత్వం 1872 లో బ్రహ్మసమాజ ఆచారాల ప్రకారం చేసుకొన్న వివాహాలకు చట్టబద్ధత కల్పించింది.
- 1899-1904 వరకు సికింద్రాబాద్ లోని మహబూబియా కళాశాల అధ్యాపకులుగా పనిచేసిన రఘుపతి వెంకటరత్నం నాయుడు హైదరాబాద్లో వివిధ సంస్కరణోద్యమాల్లో పాల్గొన్నారు
S3. Ans (c)
Sol:
- రాష్ట్రంలో తొలి మహిళా వర్సిటీ కోసం రూ.100 కోట్లు,
- అటవీ విశ్వ విద్యాలయం కోసం రూ.100 కోట్లు
- డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు.
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.2,750 కోట్లు
S4. Ans(d)
Sol: వినోబాభావే భూదానోద్యమ విజయానికి కలిసి వచ్చిన అంశాలు. వినోబాభావే గాంధీజీ శిష్యుడు కావడం, తన జీవితాన్ని దేశసేవకు అంకితం చేయడం, ఆయన ఆధ్యాత్మికత్వం, ఆయన పాదయాత్ర. భారతదేశ వ్యాప్తంగా వినోబాభావే 13 సంవత్సరాల్లో 36,500 మైళ్ళ పాదయాత్ర చేసి 40.4 మిలియన్ ఎకరాల భూమిని దానంగా పొందాడు. ప్రభుత్వం భూ సంస్కరణల ద్వారా సాధించిన భూమి కంటే భూదానోద్యమం ద్వారా సేకరించిన భూమే ఎక్కువ.
S5. Ans (d)
Sol: విప్రవినోదులు బ్రాహ్మణ కులంపై ఆధారపడి, వారిని మాత్రమే యాచించి, జీవించే ఒక తెగవారు. విప్రులు అంటే బ్రాహ్మణులు, వినోది అంటే గారడీ విద్యను ప్రదర్శించి వినోదింపచేసేవారు. మందులపల్లి గురుబ్రహ్మశర్మ తన ‘కొండవీటి సామ్రాజ్యం’లో, విప్రవినోదుల జన్మ వృత్తాంతం గురించి ఒక కథను వివరించారు. విద్యారణ్యుని ‘శంకర విజయం’లో కూడా విప్రవినోదుల పుట్టు పూర్వోత్తరాలు గురించి వివరించబడింది.
S6. Ans (a)
Sol: తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని సరళంగా అర్థంచేసుకోవడానికి వీలుగా దాన్ని నాలుగు విధాలుగా విభజించడం జరిగింది. అవి
- 1930 నుంచి 1940 వరకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన వ్యక్తిగతమైన ఆందోళనలు.
- నుంచి 1946 వరకు భూస్వాములకు, దేశముఖకు, గ్రామాధికారులకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత రైతాంగ తిరుగుబాట్లు.
- 1946 నుంచి 1948 వరకు భూస్వాములకు, దేశ్ముఖ్ కు, రజాకర్లకు, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వారు జరిపిన రైతాంగ సాయుధ పోరాటాలు.
- 1948 నుంచి 1951 వరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, తెలంగాణా ప్రజానీకం సాగించిన ప్రజా సాయుధ పోరాటాలు.
S7. Ans (b)
Sol: పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ఇప్పటివరకూ జనపనార (జూట్) పరిశ్రమలు లేవు. మరోవైపు ధాన్యం సేకరణ, నిల్వ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 30 కోట్లకు పైగా జనపనార గోనె సంచులను ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఒక్కోసారి సంచుల కొరతతో ధాన్యం సేకరణకు సమస్యలూ ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోనే గోనె సంచుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మూడు సంస్థలు జూట్ మిల్లుల ఏర్పాటుకు ముందుకురాగా, వాటితో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా గ్లోస్టర్ లిమిటెడ్ సంస్థ వరంగల్‌లో, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఎంబీజీ కమాడిటీస్ లిమిటెడ్ కామారెడ్డిలో ఈ మిల్లులను ఏర్పాటు చేయనున్నాయని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు.
S8. Ans (b)
Sol: శాస్త్ర, సాంకేతిక పరికరాల తయారీలో దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన థర్మో ఫిషర్ సైంటిఫిక్ ఏర్పాటు చేసిన నూతన పరిశోధన, అభివృద్ధి కేంద్రం ‘ఇండియా ఇంజనీరింగ్ సెంటర్’ను ఏప్రిల్ 28న హైదరాబాద్‌లోని నాలెడ్జి సిటీలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ. థర్మో ఫిషర్ ఆర్ అండ్ డీ కేంద్రం కొత్త ఉత్పత్తులు, విశ్లేషణాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉండనుందన్నారు. ఈ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూనీటి వనరులపై పరిశోధన చేస్తోందని చెప్పారు. 2022, ఫిబ్రవరి నెల తాను చేపట్టిన అమెరికా పర్యటనలో భాగంగా బోస్టన్‌లో థర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులను కలిసినట్లు వివరించారు.
S9. Ans(c)
Sol: మహిళల పారిశ్రామిక పార్కు:
- మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, మెదక్ జిల్లాలోని సుల్తాన్పూర్ వద్ద మహిళా పారిశ్రామిక పార్కుల స్థాపనకు టిఎస్ఐఐసి 50 ఎకరాల మేరకు భూమిని కేటాయించింది.
- గ్రీన్ లైన్ ఆఫ్ యాక్టివిటీస్ కోసం తెలంగాణలోని ప్రతి జిల్లాలో మహిళా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని టిఎస్ఐఐసి నిర్ణయిం తీసుకుంది.
S10. Ans(b)
Sol: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి :
- భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్ వర్కను జూన్ 2020లో ప్రారంభించింది.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అభివృద్ధి చేయడానికి మరియు 2025 సంవత్సరం లోపు ప్రపంచంలో టాప్ 25వ స్థానంలో హైదరాబాదు ఉంచడం దీని ఉద్దేశ్యం.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |